‘కేసీఆర్ మొక్కుపై హైకోర్టుకు వెళతాం’
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుపతి వెంకన్నకు మొక్కుగా ఆభరణాలు చెల్లించడం చట్టవిరుద్ధమని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి విమర్శించారు. ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..‘ఆదాయం ఎక్కువగా ఉండే ఆలయాల నుంచి సేకరించే కామన్ గుడ్ ఫండ్ ను శిధిలావస్థలో వున్న ఆలయాలు.. దూపదీప నైవేద్యాలకు నోచుకోని దేవాలయాలకు ఉపయోగించాలి. అంతేకానీ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి కామన్ గుడ్ ఫండ్ నుంచి ఆభరణాలు చెల్లించడం చట్ట విరుద్ధం. ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయిస్తాం. ఇందిరాపార్కు నుంచి ధర్నా చౌక్ తరలించాలని ప్రభుత్వం ఆలోచించడం సరికాదు. ఇది నిరంకుశ చర్య.. నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు’’ అని అన్నారు.