సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ పదవికి మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా, రాహుల్‌గాంధీలకు ఫ్యాక్స్ ద్వారా పంపారు. తనను ఈ పదవిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియమించారని, ఇప్పుడు టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఎన్నికైనందున ఆయన స్వేచ్ఛగా వ్యవహరించే ఉద్దేశంతోనే తాను రాజీనామా చేస్తున్నానని లేఖలో తెలిపారు. అయితే తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని శశిధర్ రెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment