
సొంత రాష్ట్రాలకు వెళ్లాలి...
ప్రజలకు దూరంగా ఉంటూ, ఢిల్లీలో పాతుకుపోయిన కాంగ్రెస్ సీనియర్లంతా వారి సొంత రాష్ట్రాలకు వెళ్లాలని, పార్టీలో సమర్థులైనవారికి అవకాశం కల్పించాలని ఎన్‌డీఎంఏ మాజీ వైస్‌చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి
ఢిల్లీలోని కాంగ్రెస్ సీనియర్లపై మర్రి
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు దూరంగా ఉంటూ, ఢిల్లీలో పాతుకుపోయిన కాంగ్రెస్ సీనియర్లంతా వారి సొంత రాష్ట్రాలకు వెళ్లాలని, పార్టీలో సమర్థులైనవారికి అవకాశం కల్పించాలని ఎన్‌డీఎంఏ మాజీ వైస్‌చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లా డుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కామరాజ్ ప్లాన్–2ను అమలుచేయాలని సూచించారు. పార్టీ పునర్‌వ్యవస్థీకరణ కోసం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పూర్తి స్వేచ్ఛ ఉండాలంటే సీనియర్లంతా ఏఐసీసీ, సీడబ్లు్యసీ పదవులకు రాజీనామా చేయాలన్నారు. ఏఐసీసీని పూర్తిగా ప్రక్షాళన చేస్తేనే పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్నారు. ప్రక్షాళనలో భాగంగా రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జీ దిగ్విజయ్ సింగ్‌ను కూడా మార్చాల్సిందేనన్నారు. రాష్ట్రంలో 2019లో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని శశిధర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.