
సాక్షి, న్యూఢిల్లీ: సనత్‌నగర్‌ను మిత్రపక్షాలకు ఇవ్వకుండా కాంగ్రెస్సే పోటీచేయాలని, అభ్యర్థిగా తననే ప్రకటించాలని ఆ పార్టీ సీని యర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తిచేశారు. శనివారం ఆయన ఇక్కడ పార్టీ కోర్ కమిటీ సభ్యుడు అహ్మద్ పటేల్, ఇతర నేతలను కలిశారు.
‘సనత్‌నగర్‌ను కాంగ్రెస్ వదులుకోరాదని, అభ్యర్థిగా నన్ను ప్రకటించాలని కోరా ను. సికింద్రాబాద్ టీడీపీకి ఇవ్వొచ్చని చెప్పాను. సికింద్రాబాద్‌కు నేను బదిలీకాను. ఒకవేళ నాకు సనత్‌నగర్ నుంచి ఇవ్వకపోయినా నేనేమీ పార్టీని వీడను. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగను. రాజకీయాల నుంచి వైదొలగను’ అని మర్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment