సాక్షి, నల్గొండ : కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుందన్న మాటల్లో వాస్తవం లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఈరోజు (శనివారం) హుజూర్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సాక్షి టీవీతో మాట్లాడారు. టికెట్ల కేటాయింపు విషయంలో తనపై వస్తున్న ఆరోపణలను ఉత్తమ్ కొట్టిపారేశారు. ఒకే సామాజిక వర్గానికి, కుటుంబానికి టికెట్లు ఇచ్చామన్నది వాస్తవం కాదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాలకు లైన్ క్లియర్ అయిందనీ, ఇక మర్రి శశిధర్‌రెడ్డి విషయంలో ఇబ్బంది ఉన్న సమిసిపోతుందని ఉత్తమ్ తెలిపారు. డిసెంబరు 12న గడ్డం తీసేస్తానని, సోనియా, రాహుల్ గాంధీలతో సభలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతానని పేర్కొన్నారు. కేసీఆర్ సభలకు దీటుగా కాంగ్రెస్ పార్టీ సభలు ఉంటాయని తెలిపారు. అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టీఆర్‌ఎస్‌లో న్యాయం జరగలేదని, అందుకే ఆమెను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నామని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment