సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 24న ఎన్నికలు జరుగుతాయని ఓ ఆంగ్ల దిన పత్రికలో వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. అలాగే టీఆర్‌ఎస్ అభ్యర్థులు కూడా నవంబర్‌లోనే ఎన్నికలు వస్తున్నాయని చెబుతున్నారని, ఇది అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ లీక్ చేసిన సమాచారమేనని ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం చెప్పాల్సిన విషయాలు మాటలు కేసీఆర్ ఎలా వెల్లడిస్తారని మండిపడ్డారు.
కేసీఆర్ చెప్పినట్లుగానే ఓటర్ లిస్ట్ తయారు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో తొలగించిన, కొత్తగా నమోదు చేసుకున్న ఓట్ల డ్రాప్ట్ ఇవ్వలేదన్నారు. నవీన్ మిట్టల్‌ను రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లా ఎలక్ట్రోలర్ అబ్జర్వర్‌గా నియమించినట్లు తమకు సమాచారం లేదన్నారు. నవీన్ మిట్టల్ మీద పలు ఆరోపణలు ఉన్నాయని, అలాంటి వ్యక్తిని అబ్జర్వర్‌గా పెట్టుకుని పనులు చేయించుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు. మార్చి నుంచి నుంచి ఏప్రిల్ వరకు బోగస్ ఓట్ల ఏరివేత జరిగిందని, మళ్లీ ఇప్పుడెలా బోగస్ ఓట్లు వచ్చాయని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment