ఎన్నికలపై కోర్టునాశ్రయించిన శశిధర్ రెడ్డి | Marri sasidhar Reddy litigate on the GHMC elections | Sakshi
Sakshi News home page

ఎన్నికలపై కోర్టునాశ్రయించిన శశిధర్ రెడ్డి

Published Tue, Jan 5 2016 5:57 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఎన్నికలపై కోర్టునాశ్రయించిన శశిధర్ రెడ్డి - Sakshi

ఎన్నికలపై కోర్టునాశ్రయించిన శశిధర్ రెడ్డి

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియకు 45 రోజుల గడువు ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ రిజర్వేషన్లు కుట్ర పూరితంగా ఉన్నాయని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండేలా కేసీఆర్ సర్కార్ నిర్వహిస్తోందని చెప్పారు.  ఒక అన్యాయమైన.. కుట్రపూరిత వాతావరణంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని వివరించారు. ఇది అన్యాయం. ఓటమి భయంతోనే ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఎన్నికల చట్టాన్ని సవరించిందని ఆయన ఆరోపించారు. కాగా.. ఈ పిటిషన్ పై విచారణ బుధవారం జరగనుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement