సీఎం కేసీఆర్‌ సోదరి కన్నుమూత | CM KCR Sister Leelamma passes away | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌ సోదరి కన్నుమూత

Published Mon, Aug 6 2018 11:27 AM | Last Updated on Tue, Sep 4 2018 5:53 PM

CM KCR Sister Leelamma passes away - Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోదరి లీలమ్మ కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. లీలమ్మ మృతి వార్త తెలుసుకున్న హరీష్‌ రావు, కేటీఆర్‌లు యశోదా ఆస్పత్రికి చేరుకున్నారు. సోదరి లీలమ్మ మృతితో ఢిల్లీ పర్యటనను సీఎం కేసీఆర్ మధ్యలోనే రద్దు చేసుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరేందుకు  సిద్ధమయ్యారు.

వైఎస్‌ జగన్‌ సంతాపం
కేసీఆర్‌ సోదరి లీలమ్మ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంతాపం ప్రకటించారు. లీలమ్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement