అసదుద్దీన్‌పై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు  | Municipal elections:Congress lodges complain to EC against Asaduddin Owaisi | Sakshi
Sakshi News home page

అసదుద్దీన్‌పై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు 

Published Thu, Jan 16 2020 8:00 PM | Last Updated on Thu, Jan 16 2020 8:13 PM

Municipal elections:Congress lodges complain to EC against Asaduddin Owaisi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ కోరింది. ఈ మేరకు తెలంగాణ పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి గురువారం ఈసీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలో అసద్‌ మాట్లాడుతూ.. ఎవరు డబ్బులిచ్చినా తీసుకుని ఎంఐఎంకు ఓటేయాలని చెప్పడం ద్వారా ఎన్నికల్లో డబ్బు సంస్కృతిని ప్రోత్సహించేలా మాట్లాడారన్నారు. అలా మాట్లాడటం ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తుందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

చదవండి:

పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికగ్నైజ్ కెమెరాలు

మున్సిపల్ పోరు: అభ్యర్థులకు కేటీఆర్ దిశానిర్దేశం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement