
కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : ఈ గురువారం కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం అపాయింట్‌మెంట్ కోరారు. ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో శశిధర్ రెడ్డి ఈసీ అపాయింట్‌మెంట్ కోరటం చర్చనీయాంశంగా మారింది. జాబితాలో జరిగిన అవకతవకలను సాక్ష్యాలతో సహా నిరూపిస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
దాదాపు 30లక్షల ఓటర్ల నమోదులో అనేక అవకతవకలు జరిగాయని వారు ఆరోపిస్తున్నారు. పాత షెడ్యూల్ ప్రకారమే ఓటర్ల జాబితాను సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. జనవరి తర్వాతే ఎన్నికలకు వెళతామంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment