సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని కాపాడే బాధ్యతలను తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియాగాంధీని కోరారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, వి.హనుమంతరావు, ఎం.కోదండరెడ్డి, ఎస్. చంద్రశేఖర్, బి.కమలాకర్, ఎ.శ్యాంమోహన్, జి.నిరంజన్‌లు బుధవారం ఆమెకు లేఖ రాశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసినప్పటికీ వరుసగా రెండుసార్లు పార్టీ ఓటమి పాలైందని లేఖలో తెలిపారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 3 స్థానాల్లో విజయం సాధించినా, బీజేపీ కూడా నాలుగు చోట్ల విజయం సాధించడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడినట్లు శ్రేణులు భావించడం లేదన్నారు. ఈ దశలోనే పార్టీ చీఫ్‌గా రాహుల్‌గాంధీ వైదొలగడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాత్కాలికంగా పార్టీ అధ్యక్షుడిని నియ మించాలని, యూపీఏ చైర్‌పర్సన్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన సోనియానే పార్టీ రక్షించే చర్యలకు పూనుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment