సీఈసీకి మర్రి శశిధర్‌రెడ్డి విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: గ్రేటర్ పరిధిలో ఓటర్ల తొలగింపుపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్‌కు పంపాలని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) నసీం జైదీకి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మాజీ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తొలగించిన దాదాపు 6.3 లక్షల ఓట్ల విషయంలో అక్రమాలు జరిగాయ న్నారు. శుక్రవారం జైదీని కలసి ఓటర్ల తొలగింపులో అక్రమాలపై ఆధారాలు అందజేశారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్, జిల్లా ఎన్నికల అధికారి సోమేశ్‌కుమార్‌ను విధుల నుంచి తొలగించాలని కోరారు. అనంతరం మర్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భన్వర్‌లాల్, సోమేశ్ నడుచుకుంటున్నారని ఆరోపించారు.