
న్యూఢిల్లీ: దేశ ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ)గా పదవీ విరమణ చేసిన రాజీవ్‌కుమార్ తన హయంలో కొంత మేర వివాదాస్పదమయ్యారు. లోక్‌సభ ఎన్నికలతో సహా పలు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజీవ్‌కుమార్ పక్షపాత ధోరణితో వ్యవహరించారన్న విమర్శలొచ్చాయి.
ముఖ్యంగా కీలక ఎన్నికల సమయాల్లో అధికార బీజేపీకి మేలు జరిగేలా వ్యవహిరించారని ప్రతిపక్షాలు పలు సందర్భాల్లో ఆయనపై ఆరోపణలు చేశాయి.దీంతో రాజీవ్‌కుమార్ హయంలో ఎన్నికల కమిషన్(ఈసీ) స్వయం ప్రతిపత్తిపై అనుమానాలు తలెత్తాయి.ఔ
ఎన్నికలప్పుడు పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికల హింసను అదుపు చేయడంలో విఫలమయ్యారన్న అపఖ్యాతిని రాజీవ్‌కుమార్ మూటకట్టుకున్నారనేది పలువురి వాదన. ముఖ్యంగా ఎన్నికల్లో ఈవీఎంల వాడకంపై చర్చ జరుగుతున్న వేళ రాజీవ్‌కుమార్ ఈవీఎంలు,వీవీప్యాట్‌లను మీడియా ఎదుటే ఏకపక్షంగా సమర్థించడం ప్రతిపక్షాల ఆగ్రహానికి కారణమైంది.
రాజీవ్‌కుమార్ హయాంలో పలువురు ఎన్నికైన ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు పడ్డ టైమింగ్ వివాదాస్పదమైంది. సీఈసీగా వీడ్కోలు వేళ రాజీవ్‌కుమార్ కామెంట్లు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల కమిషన్ చుట్టూ అలుముకున్న వివాదాలపై మీడియా దృష్టి ఎక్కువైందని, ఇలాంటి తరుణంలో ఎన్నికల కమిషన్ తన హుందాతనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాజీవ్‌కుమార్ అనడం చర్చకు దారి తీసింది.
మొత్తంగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌కుమార్ హాయంలో ఎన్నికల కమిషన్‌తో పాటు ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపై దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. సాధారణ ప్రక్రియలో భాగంగా రాజీవ్‌కుమార్ రిటైర్ అయి వెళ్లిపోయినప్పటికీ దేశంలో ఎన్నికల కమిషన్,ఎన్నికల నిర్వహణపై తలెత్తిన అనుమానాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment