Controversies
-
వివాదాల నడుమ ‘రాజీవ్’కు వీడ్కోలు
న్యూఢిల్లీ: దేశ ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ)గా పదవీ విరమణ చేసిన రాజీవ్‌కుమార్ తన హయంలో కొంత మేర వివాదాస్పదమయ్యారు. లోక్‌సభ ఎన్నికలతో సహా పలు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజీవ్‌కుమార్ పక్షపాత ధోరణితో వ్యవహరించారన్న విమర్శలొచ్చాయి. ముఖ్యంగా కీలక ఎన్నికల సమయాల్లో అధికార బీజేపీకి మేలు జరిగేలా వ్యవహిరించారని ప్రతిపక్షాలు పలు సందర్భాల్లో ఆయనపై ఆరోపణలు చేశాయి.దీంతో రాజీవ్‌కుమార్ హయంలో ఎన్నికల కమిషన్(ఈసీ) స్వయం ప్రతిపత్తిపై అనుమానాలు తలెత్తాయి.ఔఎన్నికలప్పుడు పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికల హింసను అదుపు చేయడంలో విఫలమయ్యారన్న అపఖ్యాతిని రాజీవ్‌కుమార్ మూటకట్టుకున్నారనేది పలువురి వాదన. ముఖ్యంగా ఎన్నికల్లో ఈవీఎంల వాడకంపై చర్చ జరుగుతున్న వేళ రాజీవ్‌కుమార్ ఈవీఎంలు,వీవీప్యాట్లను మీడియా ఎదుటే ఏకపక్షంగా సమర్థించడం ప్రతిపక్షాల ఆగ్రహానికి కారణమైంది.రాజీవ్‌కుమార్ హయాంలో పలువురు ఎన్నికైన ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు పడ్డ టైమింగ్ వివాదాస్పదమైంది. సీఈసీగా వీడ్కోలు వేళ రాజీవ్‌కుమార్ కామెంట్లు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల కమిషన్ చుట్టూ అలుముకున్న వివాదాలపై మీడియా దృష్టి ఎక్కువైందని, ఇలాంటి తరుణంలో ఎన్నికల కమిషన్ తన హుందాతనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాజీవ్‌కుమార్ అనడం చర్చకు దారి తీసింది.మొత్తంగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌కుమార్ హాయంలో ఎన్నికల కమిషన్‌తో పాటు ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపై దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. సాధారణ ప్రక్రియలో భాగంగా రాజీవ్‌కుమార్ రిటైర్ అయి వెళ్లిపోయినప్పటికీ దేశంలో ఎన్నికల కమిషన్,ఎన్నికల నిర్వహణపై తలెత్తిన అనుమానాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. -
మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కరించుకోవాలి
ముంబై: అన్ని రకాల వివాదాలను కోర్టురూమ్ల దాకా తీసుకురావాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా చెప్పారు. కొన్ని వివాదాలు కోర్టురూమ్ల్లో విచారణకు సరిపడవని అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. మధ్యవర్తులతో చాలాసార్లు అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో సృజనాత్మక పరిష్కారాలు లభిస్తాయని, మనుషుల మధ్య బంధాలు బలపడతాయని వెల్లడించారు. వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం కూడా ఒక చక్కటి మార్గమని పేర్కొన్నారు. శనివారం నాగపూర్‌లో మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ(ఎంఎన్‌ఎల్‌యూ) మూడో స్నాతకోత్సవంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడారు. ప్రతి కేసునూ చట్టపరమైన అంశం అనే కోణంలో చూడొద్దని, వాటిని మానవీయ కథనాలుగా పరిగణించాలని చెప్పారు. మన దేశంలో కక్షిదారులకు న్యాయ సహాయం అందించే వ్యవస్థ చాలా బలంగా ఉందన్నారు. ప్రపంచంలో ఇలాంటిది బహుశా ఎక్కడా లేకపోవచ్చని వ్యాఖ్యానించారు. మన దగ్గర కక్షిదారులందరికీ ఏదోరకంగా న్యాయ సహాయం లభిస్తోందన్నారు. ఏవైనా వివాదాలు తలెత్తగానే కోర్టుల్లో వ్యాజ్యాలు, విచారణల వరకూ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమం అని వివరించారు. అక్కడ కొన్నిసార్లు అవును లేదా కాదు అనే మాటలతోనే వివాదాలు పరిష్కారమవుతుంటాయని గుర్తుచేశారు. మధ్యవర్తిత్వం అనే మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా మనుషుల మధ్య, వ్యాపార సంస్థల మధ్య సంబంధాలు బలపడతాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉద్ఘాటించారు. -
చిరంజీవిని చుట్టుముట్టిన వివాదాలివే.. (ఫోటోలు)
-
వైద్య సదస్సులను కమ్మేస్తున్న ‘ఫార్మా’
తెనాలి: వైద్య రంగంలో నూతనంగా వచ్చిన ఆవిష్కరణలు, కొత్త ఔషధాలు, రోగనిర్ధారణలో నవీన విధానాలపై అవగాహన కోసం నిర్వహిస్తున్న సదస్సులు గతి తప్పుతున్నాయి. ఫార్మా కంపెనీల “స్పాన్సర్షిప్’లతో వైద్య సదస్సులు వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. విలాసవంతమైన ఆఫర్లతో వైద్యులను ఆకట్టుకునేందుకు ఆయా కంపెనీలు చేస్తున్న ప్రయత్నాలు.. చివరకు రోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. విలాసవంతంగా.. వైద్యులపై వలవైద్యుల సదస్సుల నిర్వహణలో ఫార్మ కంపెనీలు భాగం కాకూడదని నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధన ఉంది. అలాగే వైద్యులు, వారి అసోసియేష¯న్లతో ఎటువంటి లావాదేవీలు జరపకూడదని స్పష్టం చేసింది. కానీ ఈ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. సదస్సులకు వైద్యులు హాజరయ్యేందుకు అవసరమైన విమాన టికెట్ల నుంచీ ఆయా ప్రాంతాల్లో తిరిగేందుకు లగ్జరీ కార్లు, బస చేసేందుకు విలాసవంతమైన హోటళ్లు తదితర సకల సదుపాయాలన్నీ ఫార్మా కంపెనీలే స్పాన్సర్ చేస్తున్నాయి. వైద్య సదస్సు జరిగే ప్రాంగణమంతటినీ తమ బ్రాండ్లు కనపడేలా పోస్టర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లతో నింపేస్తున్నాయి. తమ స్టాల్‌కు విచ్చేసినందుకు ఖరీదైన బహుమతులు, వివిధ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లతో వైద్యులను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో గుంటూరులో కొద్ది నెలల కిందట జరిగిన వైద్యుల సదస్సులో ఫార్మా కంపెనీ ప్రతినిధి ఒకరు వైద్యురాలిపై అనుచితంగా ప్రవర్తించటంతో అతడికి దేహశుద్ధి చేశారు. చెన్నైలో కొద్దిరోజుల కిందట జరిగిన మరో సదస్సు అశ్లీల నృత్యాలకు వేదికైంది. విజ్ఞానం పెంచాల్సిన వైద్య సదస్సులను ఇలా వివాదాలకు కేంద్ర బిందువుగా చేస్తున్నాయి.‘క్రెడిట్ అవర్స్’పైనా ఫార్మా కంపెనీలదే పెత్తనంవైద్యవిజ్ఞాన సదస్సులకు హాజరయ్యే వైద్యులకు మెడికల్ కౌన్సిల్.. క్రెడిట్ అవర్స్‌ను కేటాయిస్తుంది. ప్రతి వైద్యుడు వివిధ సదస్సుల్లో పాల్గొని సంవత్సరానికి ఆరు క్రెడిట్ అవర్స్ చొప్పున ఐదేళ్లలో 30 క్రెడిట్ అవర్స్ సంపాదించాల్సి ఉంటుంది. మెడికల్ కౌన్సిల్లో తమ వైద్య సర్టిఫికెట్లు రెన్యువల్ చేసుకునేందుకు ఈ క్రెడిట్ అవర్స్ దోహదపడతాయి. ఈ సదస్సులకు ఆయా రాష్ట్రాల మెడికల్ కౌన్సిల్ సభ్యులు, ప్రతినిధులు హాజరై సదస్సు జరిగే తీరును పరిశీలించాల్సి ఉంటుంది. ప్రతి సర్టిఫికెట్‌పైనా మెడికల్ కౌన్సిల్ సభ్యుల సంతకాలు ఉంటాయి. ఇన్ని నియమ నిబంధనలున్నా పలు ఫార్మా కంపెనీలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాయి. వైద్యుల పేర్ల నమోదు నుంచి సదస్సు తర్వాత ఇచ్చే క్రెడిట్ అవర్స్ సర్టిఫికెట్ల జారీ వరకు.. అన్నింటిలోనూ ఫార్మా కంపెనీలదే పెత్తనం. సదస్సుకు హాజరుకాని వైద్యుల పేర్లను కూడా ఫార్మా కంపెనీల ప్రతినిధులే నమోదు చేసి.. సర్టిఫికెట్లను తీసుకెళ్లి మరీ వైద్యులకు అందజేస్తుంటారు. తమ ఉత్పత్తులను రోగులకు సూచించేలా వైద్యులను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తగ్గిన మందుల నాణ్యతఫార్మా కంపెనీలు, కొందరు వైద్యుల వల్ల రోగులపై మందుల అధికభారం పడుతోంది. అలాగే నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేని మందులు రోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. కేంద్ర ఔషధాల ప్రమాణాల నియంత్రణ సంస్థ తాజాగా చేసిన పరీక్షల్లో పారాసిటమాల్ సహా 53 రకాల మందుల్లో నాణ్యత లేదని తేలింది. గత ఆగస్టులో 156 కాంబినేషన్ ఔషధాలు హానికరమంటూ నిషేధం విధించింది. -
పూజా ఖేద్కర్‌పై మరొకటి! ఆరోపణలు నిజమని తేలితే..
ముంబై: వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కెరియర్ చిక్కుల్లో పడింది. అధికార దుర్వినియోగానికి పాల్పడటంతోపాటు, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న ఆరోపణలు రావడంతో కేంద్రం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఆ ఆరోపణలు నిజమని తేలితే పూజా ఖేద్కర్‌ను సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉంది.డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అదనపు కార్యదర్శి మనోజ్ ద్వివేదీ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. రెండు వారాల్లో ఆయన ఆమె వ్యవహారంపై ఓ నివేదిక ఇవ్వనున్నారు. ఒకవేళ ఆ దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలితే పూజా ఖేద్కర్‌ను సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా నిజాలు దాచిపెట్టి, తప్పుడు మార్గంలో ఉద్యోగంలో చేరినందుకు ఆమెపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చని తెలిపాయి. మరోవైపు.. తాజాగా ఆమెపై మరో ఆరోపణ వెలుగులోకి వచ్చింది. తన విచారణలో మనోజ్ ద్వివేదీ, నవీ ముంబై పోలీసుల నుంచి ఓ నివేదిక తీసుకున్నారు. ఓ దొంగతనం కేసులో నిందితుడ్ని విడిచిపెట్టాలంటూ ఆమె పోలీసులకు హుకుం జారీ చేశారామె. మే 18వ తేదీన నవీ ముంబై డీసీపీకి ఫోన్ చేసిన ఖేద్కర్.. తాను ఫలానా అని పరిచయం చేసుకున్నారు. ఇనుప సామాన్లు దొంగిలించిన కేసులో పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని విడుదల చేయాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఆ నిందితుడు అమాయకుడని, పైగా అతనిపై ఆరోపణలు తీవ్ర స్థాయివేం కాదని ఆమె ఫోన్లో చెప్పారు. అయినప్పటికీ ఆ పోలీసులు ఆ కాల్‌ను పట్టించుకోలేదు. అయితే ఆ ఫోన్ కాల్ పూజా ఖేద్కర్ నుంచే వచ్చిందా? లేదంటే ఆమె పేరుతో ఎవరైనా అలా చేశారా? అనేది ద్వివేదీ కమిటీ నిర్ధారించుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే..పుణేలో సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఖేద్కర్‌పై ఆరోపణలు రావడంతో ఆమెను వాసిమ్కు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడటంతో మొదలైన వివాదం.. తీగ లాగితే డొంక కదిలినట్లుగా ట్రాఫిక్ ఉల్లంఘనలు, సెటిల్మెంట్లు, ఇతర అధికారులపై ఒత్తిడి చేయడం ఇలా ఒక్కొక్కటీ బయటపడ్డాయి. చివరికి ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వంపైనా అనుమానాలు రేకెత్తాయి. తనకు కంటితో పాటు మానసిక సమస్యలు ఉన్నట్లు యూపీఎస్సీకి సమర్పించిన అఫిడవిట్లో ఖేద్కర్ పేర్కొన్నారు. 2022 ఏప్రిల్‌లో తొలిసారి దిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు వైద్య పరీక్షలకు హాజరుకాలేదు. చివరికి ఆరోసారి పిలుపురాగా.. పాక్షికంగా పరీక్షలు చేయించుకున్నారు. దృష్టి లోపాన్ని అంచనా వేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరు కాలేదు. కానీ, ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్‌లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా.. తన నియామకాన్ని కన్ఫర్మ్ చేసుకుంది. ఇక పూజా ఓబీసీ ధ్రువీకరణ పత్రాలపైనా వివాదాలున్నాయి. దాని ఆధారంగానే ఆమెకు 841వ ర్యాంక్ వచ్చినా ఐఏఎస్ హోదాను పొందగలిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఏర్పాటుచేసిన దర్యాప్తు కమిటీ నివేదిక కీలకంగా మారింది. ఆ నివేదికను బట్టే ఖేద్కర్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
రాజ్‌భవన్‌లో నాకు భద్రత లేదు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రభుత్వంతో ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ విభేదాలు మరోసారి తెరమీదకొచ్చాయి. గవర్నర్ అధికార నివాసం రాజ్‌భవన్‌లో విధులు నిర్వర్తిస్తున్న బెంగాల్ పోలీసు బృందంతో మనకు ముప్పు ఉందని గవర్నర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌లో డ్యూటీలో ఉన్న పోలీసులంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆయన ఆదేశించిన కొద్దిరోజులకే ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. ‘‘ ప్రస్తుత ఆఫీసర్–ఇన్చార్జ్, ఆయన బృందం వల్ల నా వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉంది. ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తెలియజేశా. అయినా ఆమె ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చుట్టూ ఉన్న కోల్‌కతా పోలీసులతో నాలో అభద్రతా భావం గూడుకట్టుకుపోయింది’’ అని గవర్నర్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఇక్కడి పోలీసులు ప్రవర్తిస్తున్నారు. రాజ్‌భవన్‌కు వ్యతిరేకంగా వాళ్లు పనిచేస్తున్నట్లు నా వద్ద విశ్వసనీయ సమాచారం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న పోలీసులు గతంలో రాష్ట్ర సచివాలయం ‘నబన్నా’లో పనిచేశారు. ఒకరి కోసం వీళ్లు పనిచేస్తున్నారు. వాళ్ల పేరు నేను చెప్పదల్చుకోలేదు’’ అని గవర్నర్ వ్యాఖ్యానించారు. -
ఢిల్లీలో దాహం.. దాహం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తీవ్ర జల సంక్షోభం నెలకొంది. పొరుగు రాష్ట్రాల నుంచి నీటి సరఫరా తగ్గడంతో ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి దారుణంగా పెరిగింది. యమునా నదీ జలాల సరఫరా విషయంలో ఢిల్లీ, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్ మధ్య వివాదాలు తారాస్థాయికి చేరడంతో నీటి కష్టాలు తీవ్రమయ్యే ప్రమాదకర పరిస్థితి దాపురించింది. మండుతున్న ఎండలకు తోడు నీటి కొరతతో ప్రజలు అల్లాడుతుంటే ట్యాంకర్ మాఫియా, రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం ఈ సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి. ఆగిన సరఫరా.. తగ్గిన నిల్వలుఢిల్లీ తాగునీటి అవసరాల్లో 90 శాతం యమునా నదీ మునాక్ కాలువ ద్వారా తీరుతోంది. మరికొంత ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎగువ గంగ కాల్వల ద్వారా వచ్చే నీటితో ఢిల్లీ నీటి కష్టాలు తీరుతున్నాయి. యమునా నదిపై ఉన్న చంద్రవాల్, వజీరాబాద్, ఓక్లా నీటి శుద్ధి కర్మాగారాలుసహా మరో నాలుగు ప్లాంట్ల ద్వారా ఢిల్లీకి అవసరమైన నీటి సరఫరా జరుగుతోంది. ఢిల్లీకి ప్రతి రోజూ 1,200 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం ఉండగా ఢిల్లీ జల్ బోర్డు 950 మిలియన్ గ్యాలన్ల నీటినే సరఫరా చేస్తోంది. హరియాణా ప్రభుత్వం మునాక్ ఉప కాల్వల ద్వారా 683 క్యూసెక్కులు, ఢిల్లీ చిన్న కాల్వల ద్వారా మరో 330 క్యూసెక్కుల నీటిని వజీరాబాద్ నీటి శుద్ధి రిజర్వాయర్‌కు సరఫరా చేయాల్సి ఉంది. మొత్తంగా రోజుకి 1,013 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉన్నా హరియాణా ప్రభుత్వం కేవలం 840 క్యూసెక్కుల నీటినే విడుదల చేస్తోందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. హరియాణా నీటి సరఫరాను తగ్గించడంతో ఉత్తర, పశ్చిమ ఢిల్లీకి నీటిని సరఫరా చేసే వజీరాబాద్ రిజర్వాయర్‌లో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. రిజర్వాయర్‌లో సగటు నీటి మట్టం 674.5 అడుగులు కాగా ప్రస్తుతం 669 అడుగులకు పడిపోయింది. దీంతో రిజర్వాయర్ నుంచి రోజుకు 70 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే విడుదల అవుతోందని ఢిల్లీ జల వనరుల మంత్రి అతిశి ఆరోపించారు. దీంతో చాలా ప్రాంతాల్లో నీటి సరఫరా తగ్గి ట్యాంకర్లపై జనం ఆధారపడుతున్నారు. ఇదే అదునుగా ట్యాంకర్ మాఫియా రెచ్చిపోయింది. ఇష్టారీతిగా డబ్బులు వసూలు చేస్తోంది. నీటి ఎద్దడి అంశంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా హరియాణా ముఖ్యమంత్రి నయాబ్‌సింగ్ షైనీతో మాట్లాడి, నీటి సరఫరా పెంచే విషయమై చర్చలు జరుపుతున్నారు. మునాక్ కాలువ, ఇతర కాల్వల నుంచి ట్యాంకర్ మాఫియా నీటి దోపిడీపై ప్రత్యేక దర్యాప్తు బృందంచే విచారణ చేపట్టాలని బుధవారం బీజేపీ రాష్ట్ర శాఖ డీజీపీకి విజ్ఞప్తి చేసింది. నీటి ఎద్దడికి రాజధానిలా మారుతున్న ఢిల్లీలో చాలా కాలనీల్లో ఎటు చూసినా మహిళలు, చిన్నారులు బిందెలు, బకెట్లు పట్టుకుని పెద్దపెద్ద క్యూ లైన్లలో నిల్చున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. మాట మార్చిన హిమాచల్ప్రదేశ్ఇన్నాళ్లూ నీటిని సరఫరా చేసిన హిమాచల్ ప్రదేశ్ మాట మార్చింది. తమ వద్ద 135 క్యుసెక్కుల మిగులు జలాలు లేవని, కావాలంటే యమునా బోర్డును ఆశ్రయించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. హిమాచల్ నుంచి హరియాణాకు వచ్చిన మిగులు జలాలను ఢిల్లీ కోసం విడుదల చేయాలంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసిన నేపథ్యంలో ప్రతిగా హిమాచల్ సర్కార్ కోర్టులో అఫిడవిట్ సమర్పించింది. ఈ కేసును గురువారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రసన్న బి.వరాలేల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ‘‘ నీటి నిర్వహణలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైంది. కాల్వల ద్వారా నీటి పంపిణీ నష్టాలను తగ్గించడంలో, నీటి చౌర్యాన్ని నియంత్రించడం, తలసరి నీటి వినియోగాన్ని నియంత్రించడంలో ఢిల్లీ వైఫల్యం చెందింది. అభివృధ్ధి చెందుతున్న దేశాల్లో పంపిణీ నష్టాలు 10శాతం ఉంటే ఢిల్లీలో ఏకంగా 52.35 శాతం నష్టాలు ఉన్నాయి. కేంద్ర పట్టణాభివృధ్ధి శాఖ నిర్దేశకాల ప్రకారం పట్టణ నీటి తలసరి సరఫరా 135 లీటర్లుగా ఉంటే ఢిల్లీలో అతిగా 172 లీటర్లు సరఫరాచేస్తున్నారు. హిమాచల్ వద్ద వాస్తవానికి మిగులు జలాలు లేవు. ఉన్నాయంటూ గతంలో ఇచ్చిన ప్రకటనను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వండి’ అని హిమాచల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు విన్నవించుకున్నారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ ఇదెంత తీవ్రమైన అంశమో మీకు తెలియట్లేదు. మీపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలో వద్దో తర్వాత తేలుస్తాం’ అని ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో గత ప్రకటన ఉపసంహరణకు పద్దతి ప్రకారం అఫిడవిట్ సమర్పిస్తానని అడ్వకేట్ జనరల్ చెప్పారు.మాకంత నైపుణ్యం లేదుహిమాచల్ వాదనలు విన్నాక మానవతా దృక్పథంతో నీటిని సరఫరా చేయాలని సాయంత్రంకల్లా ఎగువ యమునా జలబోర్డ్ వద్ద దరఖాస్తు పెట్టుకోవాలని ఢిల్లీ సర్కార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘‘ యమునా నదీ జలాల పంపకం అనేది సంక్లిష్టమైన వ్యవహారం. ఇప్పటికిప్పుడు మధ్యేమార్గంగా నదీజలాల పంపకం సమస్యను తీర్చేంత స్థాయిలో మాకు సాంకేతిక నైపుణ్యం లేదు. 1994 అవగాహనా ఒప్పందం ద్వారా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్న యమునా బోర్డే ఈ సమస్యకు పరిష్కారం చూపగలదు. అదనంగా 150 క్యూసెక్కుల కోసం ఢిల్లీ గతంలోనే దరఖాస్తు చేసుకుంది. దానిపై జలబోర్డ్ త్వరగా నిర్ణయం వెలువర్చాలి. లేదంటే శుక్రవారం నుంచి రోజువారీగా బోర్డ్ సమావేశమై సమస్యను పరిష్కరించాలి’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.ఢిల్లీ ప్రభుత్వ వాదనేంటి?నీటి ట్యాంకర్ల మాఫియాపై ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు బుధవారం తలంటిన నేపథ్యంలో గురువారం కేజ్రీవాల్ సర్కార్ అఫిడవిట్ సమర్పించింది. ‘‘ ట్యాంకర్ల మాఫియా హరియాణా వైపు ఉన్న యమునా నది వెంట రెచ్చిపోతోంది. ఆ ప్రాంతం ఢిల్లీ జలబోర్డ్ పరిధిలోకి రాదు. అసలు అక్కడ చర్యలు తీసుకునే అధికారం ఎవరికి ఉందో తేల్చాలని ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం. స్పందన శూన్యం. హరియాణా నుంచి ఢిల్లీకి నీటి సరఫరా వృథాను 30 శాతం ఉంచి ఐదు శాతానికి తగ్గించాం’’ అని అఫిడవిట్లో పేర్కొంది. గురువారం ఢిల్లీ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ కోర్టులో వాదించారు. ‘‘ జలబోర్డులు ప్రభుత్వ అనుకూల అధికారులతో నిండిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కమిటీ వేసి సుప్రీంకోర్టే సమస్యను పరిష్కరించాలి’ అని అన్నారు. ఈ వాదనతో హరియాణా విభేధించింది. ‘‘ ఢిల్లీకి నీటిని సరఫరా చేసే వజీరాబాద్ బ్యారేజీలో కనీస నీట నిల్వలు ఉండాల్సిందే. అతి సరఫరా కుదరదు. ఈ అంశాన్ని యమునా బోర్డ్‌కు వదిలేస్తే మంచిది’ అని హరియాణా తరఫున లాయర్ శ్యామ్ దివాన్ వాదించారు. ఈ అంశాన్ని ఇకపై జలబోర్డే చూసుకుంటుందని అదననపు సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జీత్ బెనర్జీ చెప్పారు. దీంతో జలబోర్డులో తేల్చుకోండంటూ ఢిల్లీ సర్కార్ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. మరోవైపు రోజుకు 5 కోట్ల గ్యాలెన్ల నీటి సరఫరా తగ్గడంతో నీటిని వృథా చేయకండని ఢిల్లీవాసులకు ప్రభుత్వం సూచనలు చేసింది. -
BJP: వివాదాస్పదులకు మొండిచేయి
నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఏం జరుగుతుందో బీజేపీ సిట్టింగ్ ఎంపీలకు బాగా తెలిసొస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సొంతంగా 370, ఎన్డీఏకు 400 పై చిలుకు లోక్‌సభ స్థానాలను కమలనాథులు లక్ష్యంగా పెట్టుకోవడం తెలిసిందే. ఆ క్రమంలో ప్రతి లోక్‌సభ స్థానాన్నీ బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ‘టార్గెట్ 400’ లక్ష్యసాధనకు అడ్డొస్తారనుకుంటే సొంత పార్టీ నేతలను కూడా క్షమించడం లేదు. ఆ క్రమంలో ఎంతటి సీనియర్లనైనా సరే, సింపుల్‌గా పక్కన పెట్టేస్తోంది. దాని ఫలితమే... వివాదాస్పదులుగా పేరుబడ్డ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, రమేశ్ బిదురి, అనంత్‌కుమార్ హెగ్డే వంటి సిట్టింగ్ ఎంపీలకు ఈసారి టికెట్ల నిరాకరణ! రమేశ్ బిదురి ఈ సౌత్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ ఏకంగా పార్లమెంటులోనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు. నిండు సభలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని బిదురి అసభ్య పదజాలంతో దూషించడం పెను దుమారానికి దారి తీసింది. ఆయన్నూ సస్పెండ్ చేయాల్సిందేనంటూ విపక్షాలు హోరెత్తించాయి. దాంతో రెండుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన బిదురికి టికెట్ నిరాకరించింది. అనంత్‌కుమార్ హెగ్డే కర్ణాటకలో సీనియర్ బీజేపీ నేత. ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడు. కేంద్ర మంత్రిగానూ చేశారు. రాజ్యాంగంలో చాలా అంశాలను మార్చాల్సి ఉందని, అందుకు బీజేపీకి ప్రజలు 400కు పైగా సీట్లు కట్టబెట్టాలని ఎన్నికల వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. విపక్షాలన్నీ వాటిని అందిపుచ్చుకుని బీజేపీని దుయ్యబట్టాయి. హెగ్డే వ్యాఖ్యలతో పారీ్టకి సంబంధం లేదని బీజేపీ వివరణ ఇచ్చుకోవాల్సి వచి్చంది. దాంతో ఆయన నాలుగుసార్లు వరుసగా నెగ్గిన ఉత్తర కన్నడ స్థానాన్ని మాజీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డేకు కేటాయించింది. పర్వేష్ సాహిబ్‌సింగ్ ముస్లిం చిరు వ్యాపారులను పూర్తిగా బాయ్‌కాట్ చేయాలంటూ ఏకంగా ఢిల్లీలోనే బహిరంగ సభలో పిలుపునిచ్చి కాక రేపారు. సభికులతోనూ నినాదాలు చేయించారు. దాంతో పశి్చమ ఢిల్లీ సిట్టింగ్ బీజేపీ ఎంపీ ఆయనకు కూడా ఈసారి టికెట్ గల్లంతైంది. వీరేగాక ఇతరేతర కారణాలతో ఈసారి చాలామంది సీనియర్లు, సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ టికెట్లు నిరాకరించింది. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత దిగి్వజయ్‌సింగ్‌ను 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 3.5 లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో మట్టికరిపించిన చరిత్ర ఆమెది. . కాకపోతే మంటలు రేపే మాటలకు సాధ్వి పెట్టింది పేరు. నాథూరాం గాడ్సేను దేశభక్తునిగా అభివరి్ణంచినా, ముంబై ఉగ్ర దాడు ల్లో అమరుడైన పోలీసు అధికారి హేమంత్ కర్కరేకు తన శాపమే తగిలిందంటూ అభ్యంతకర వ్యాఖ్యలు చేసి ఈసీ నుంచి షోకాజ్ నోటీసు అందుకున్నా ఆమెకే చెల్లింది. 195 మందితో బీజేపీ విడుదల చేసిన తొలి విడత జాబితాలో ప్రజ్ఞకు మొండిచేయి చూపారు. తాను పలు సందర్భాల్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు కారణమని ఆమే స్వయంగా అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Rajasthan Election Result 2023: గహ్లోత్ మేజిక్కు తెర!
రాజస్తాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఈసారి ‘మేజిక్’ చేయలేకపోయారు. మెజీíÙయన్ల కుటుంబం నుంచి వచి్చన ఆయన, ఈసారి కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపించేందుకు శాయశక్తులా ప్రయతి్నంచారు. ఆ క్రమంలో సంక్షేమ, ప్రజాకర్షక పథకాలతో సహా అందుబాటులో ఉన్న ట్రిక్కులన్నీ ప్రయోగించినా లాభం లేకపోయింది. అధికార పార్టీని ప్రజ లు ఇంటికి సాగనంపే 30 ఏళ్ల ఆనవాయితీ అప్రతిహతంగా కొనసాగింది. దాంతో కాంగ్రెస్ పరా జయం చవిచూసింది. ‘‘సీఎం పదవిని వదిలేయా లని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. కానీ సీఎం పదవే నన్ను వదలడం లేదు’’ అని పదేపదే గొప్ప గా చెప్పుకున్న 72 ఏళ్ల గహ్లోత్ చివరికి ఓటమిని అంగీకరించి ఆ పదవిని వీడాల్సి వచ్చింది. ఏ పథకమూ ఆదుకోలేదు... గతేడాది కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలు గహ్లోత్ రాజకీయ జీవితానికి పెద్ద అగి్నపరీక్షగా మారాయి. సీఎంగిరీని విడిచి పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించాలన్న అధిష్టానం ఆదేశాలను ధిక్కరించడం ద్వారా పెను సాహసమే చేశారాయన. ఆ క్రమంలో సోనియా, రాహుల్‌గాంధీ ఆగ్రహానికి గురైనా వెనకాడలేదు. చివరికి అధిష్టానమే వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి కలి్పంచారు. ఈ దృష్ట్యా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎలాగైనా గెలిపించకపోతే తన రాజకీయ జీవితమే ప్రమాదంలో పడుతుందని గ్రహించి దూకుడు ప్రదర్శించారు. అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ వాడుకున్నారు. ఎన్నికలకు ఏడాది ముందునుంచే పుంఖానుపుంఖాలుగా పలు సంక్షేమ, ప్రజాకర్షక పథకాలకు తెర తీశారు. పేదలకు కారుచౌకగా వంట గ్యాస్ మొదలుకుని ప్రజలకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా దాకా ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నింటికీ మంచి పేరే వచి్చంది. ఏం చేసినా చివరికి ప్రజల మనసును మార్చలేక, అధికార పార్టీని ఓడించే ‘ఆనవాయితీ’ని తప్పించలేక చతికిలపడ్డారు. దెబ్బ తీసిన విభేదాలు...? యువ నేత సచిన్ పైలట్‌తో విభేదాలు కూడా రాజస్థాన్‌లో కాంగ్రెస్ అవకాశాలను దెబ్బ తీశాయనే చెప్పాలి. ముఖ్యంగా 30కి పైగా అసెంబ్లీ స్థానాల్లో నిర్ణాయక శక్తిగా ఉన్న గుజ్జర్లు తమ వర్గానికి చెందిన పైలట్‌కు కాంగ్రెస్‌లో అన్యాయం జరుగుతోందన్న భావనకు వచ్చారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా కూడా పార్టీని దెబ్బ తీసిన అంశాల్లో ఒకటని పరిశీలకులు చెబుతున్నారు. ఎన్నికల వేళ గహ్లోత్‌కు పైలట్ నిజానికి పెద్దగా సహాయ నిరాకరణ చేయలేదు. పైపెచ్చు స్నేహ హస్తమే సాచారు. కానీ గహ్లోత్ మాత్రం తానేంటో అధిష్టానానికి నిరూపించుకోవాలన్న ప్రయత్నంలో పైలట్‌కు ప్రాధాన్యం దక్కకుండా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించి కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చిన పైలట్‌ను అలా పక్కన పెట్టడం కూడా పార్టీకి చేటు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇక ఎన్నికల్లో పోటీ చేయను: కర్ణాటక ఈశ్వరప్ప
బెంగళూరు: కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, శివమొగ్గ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప(74) అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని మంగళవారం అధికారికంగా ప్రకటించారాయన. మే నెలలో జరగబోయే ఎన్నికలతో పాటు ఇకపై ఏ ఎన్నికల్లోనూ పార్టీ తరపున పోటీ చేయబోనని, ఎన్నికల రాజకీయానికి దూరంగా ఉంటానని ప్రకటించారు ఈశ్వరప్ప. ఈ మేరకు పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆయన లేఖ రాశారు. ఫార్టీ ఇయర్స్ పాలిటిక్స్‌గా చెప్పుకునే ఈశ్వరప్ప.. వివాదాలకు కేరాఫ్. ఈ వివాదాల నడుమే ఆయన మంత్రి పదవిని సైతం పొగొట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాదు.. అందువల్లే ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంపై పార్టీ జాప్యం చేస్తూ వస్తోందని గత కొంతకాలంగా కర్ణాటక రాజకీయంగా చర్చ కూడా నడుస్తోంది. ఈ తరుణంలో.. అధిష్టానం టికెట్ తిరస్కరించడం కంటే ముందే తానే గౌరవప్రదంగా తప్పుకోవాలని ఆయన భావించినట్లు అనుచరులు చెప్తున్నారు. పార్టీ గత నలభై ఏళ్లుగా ఎన్నో బాధ్యతలు అప్పజెప్పింది. బూత్ ఇంఛార్జి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సముచిత స్థానం కల్పించింది. డిప్యూటీ సీఎంగా పని చేయడం కూడా నాకు గౌరవానిచ్చింది అని లేఖలో పేర్కొన్నారాయన. ఈశ్వరప్ప వివాదాలకు కేరాఫ్. వివాదాల నడుమే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు కూడా. సంతోష్ పాటిల్ అనే ఓ కాంట్రాక్టర్‌ను కమీషన్ కోసం వేధించిన ఆరోపణలపై కన్నడనాట పెద్ద రాజకీయ దుమారమే రేగింది. ఫలితంగా.. ఆయన కిందటి ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో కేవలం రాజీనామా మాత్రమే కాదని.. ఈశ్వరప్పను అరెస్ట్‌చేయాలంటూ విపక్షాలు బలంగా డిమాండ్ చేశాయి. అంతకు ముందు.. జాతీయ జెండా స్థానంలో ఏదో ఒకరోజు కాషాయపు జెండా ఎర్రకోటపై ఎగిరి తీరుతుందని కే.ఎస్.ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు ఊహించని పరిణామాలకు దారి తీశాయి. కాంగ్రెస్ పార్టీ ఏకంగా విధానసౌధ(విధాన సభ)లో ధర్నాకు దిగింది. ఇంతేకాదు.. మధుర, కాశీలలో ఆలయాలను కూల్చేసి మరీ మసీదులను నిర్మించారంటూ వ్యాఖ్యలు చేసి పెనుదుమారమే రేపారాయన. ప్రధాని మోదీ సారథ్యంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అయోధ్యలో బాబ్రీ మసీదులాగే అన్నింటినీ కూల్చేసి.. ఆలయాలను పునర్మిస్తామంటూ ప్రకటించాడాయన. ఇది ఇంతటితోనే ఆగలేదు.. ముస్లింల నమాజ్పైనా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదంలోకి నెట్టాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించిందన్న ప్రచారమూ అక్కడ నడిచింది. కూలీ పనులు చేసుకునే కుటుంబంలో పుట్టిన ఈశ్వరప్ప.. సామాజిక ఉద్యమకారుడిగా, అటుపై ఆరెస్సెస్‌తో అనుబంధం కొనసాగించారు. వీహెచ్‌పీ, ఏబీవీపీలో పని చేసి.. అటుపై రాజకీయాల్లో అడుగుపెట్టి ప్రతిపక్ష నేతగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, మంత్రిగా పలు బాధ్యతలు చేపట్టారు. -
Hyderabad: హెచ్‌సీయూలో బీబీసీ నిషేధిత డాక్యుమెంటరీ ప్రదర్శన..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వివాదాస్పద డాక్యుమెంటరీ ప్రదర్శన చర్చనీయాంశంగా మారింది. హెచ్‌సీయూలో బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ఇటీవల రెండు సంఘాలు కలిసి ప్రదర్శించినట్లు తెలిసింది. 2002 గోద్రా అల్లర్లు, రామమందిర నిర్మాణ ఘర్షణపై బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించగా దానిపై భారతదేశంలో నిషేధం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. విషయం తెలుసుకున్న ఏబీవీపీ విద్యార్థి సంఘం వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రదర్శించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. డాక్యుమెంటరీని ప్రదర్శించిన, తిలకించిన వారిపై చర్యలు తీసుకోవాలని యూనివర్సి'rటీ అధికారులకు వారు ఫిర్యాదు చేశారు. దేశంలో మళ్లి అల్లర్లు సృష్టించడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. ఈ డాక్యుమెంటరీపై ఎలాంటి నిషేధం లేదని, సెన్సార్ మాత్రమే చేశారని, బీబీసీ నుంచి అనుమతి పొంది ప్రదర్శించుకోవచ్చని కొందరు వాదిస్తున్నట్లు తెలిసింది. అధికారికంగా ఫిర్యాదు రానిదే దీనిపై విచారణ చేయడం, కేసులు నమోదు చేయడం ఉండదని పోలీసులు స్పష్టం చేసినట్లు తెలిసింది. -
2022లో టాలీవుడ్లో వివాద పర్వం
-
నాలాంటి వారు ఎప్పుడూ సజీవులే: షారూక్ ఖాన్
కోల్‌కతా: తనవంటి సానుకూల దృక్పథం కలిగిన వారు ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటారని బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ అన్నారు. గురువారం ఆయన కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్(కేఐఎఫ్ఎఫ్)కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రేక్షకులనుద్దేశించి మాట్లాడారు. కొన్ని సంకుచిత ధోరణుల కారణంగా సామాజిక మాధ్యమం ఒక్కోసారి విభేదాలకు, విధ్వంసాలకు కారణమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో రానున్న పథాన్ సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ పాటపై వీహెచ్‌పీ వంటి సంస్థలు ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో షారూక్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
వివాదంలో.. గవర్నర్ గిరీ..! న్యాయ నిపుణులు చెప్తున్నదేంటి?
కె.శ్రీకాంత్‌రావు, సాక్షి ప్రత్యేక ప్రతినిధి దేశంలో గవర్నర్ల వ్యవస్థ వివాదాస్పదం అవుతోంది. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోని వ్యక్తులను గవర్నర్లుగా నియమిస్తుండటంతో.. వారు తమ పూర్వాశ్రమ వాసనలు వదిలిపెట్టలేక పోతున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాలనా వ్యవహారాల్లో తలదూరుస్తుండటంతో గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమ నాయకులను గవర్నర్లుగా నియమిస్తుండటం, తద్వారా రాష్ట్రాలపై పెత్తనం ఉండేలా చూసుకోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలోని ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం ఏవీ కూడా దీనికి అతీతం కాదు. మరీ గతంలో మాదిరిగా గవర్నర్లు ఆర్టికల్ 356ను వినియోగించి ప్రభుత్వాలను రద్దు చేయకున్నా.. అడ్డంకులు సృష్టించడం, బహిరంగంగా ప్రభుత్వ విధానంపై వ్యాఖ్యానాలు చేయడం జరుగుతోంది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా తాత్సారం చేయడమూ కనిపిస్తోంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు గవర్నర్లు తమకు లేని అధికారాన్ని పాలనలో చూపించాలని యత్నించినప్పుడు వివాదాలు వస్తున్నాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల నిర్ణయాలను గవర్నర్లు విచక్షణాధికారం పేరిట మోకాలడ్డుతుండటంతో అసలు గవర్నర్ల వ్యవస్థపైనే విమర్శలు వస్తున్నాయి. గవర్నర్ల వ్యవస్థ హద్దులు దాటనంత వరకు మంచిదేనని, రాజ్యాంగ పరిరక్షణకు వారు పరిమితమైతే మంచిదని న్యాయ నిపుణులు అంటున్నారు. గవర్నర్ల మితిమీరిన జోక్యమే ఆ వ్యవస్థ నష్టమని ప్రతిపక్షాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. గవర్నర్లను నియమించే వ్యవస్థలో పారదర్శకత కోసం ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఎంపిక కమిటీ ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాలూ ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, గవర్నర్ల వ్యవస్థకు సంబంధించి సర్కారియా కమిషన్ చేసిన సిఫార్సులను అమలు చేస్తే ప్రయోజనం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎప్పటి నుంచో వివాదాలు 1984లో నాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను గవర్నర్ రామ్‌లాల్ అనైతికంగా పదవీచ్యుతుడిని చేసి నాదెండ్ల భాస్కర్‌రావును సీఎంగా చేసిన సందర్భంలో గవర్నర్ల వ్యవహారశైలిపై తీవ్ర దుమారం చెలరేగింది. అప్పట్లో పెద్దఎత్తున జరిగిన ఆందోళనతో దిగివచ్చిన కేంద్రం తిరిగి ఎన్టీఆర్‌ను సీఎంగా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా గవర్నర్ల వ్యవస్థపై రద్దు కోసం పోరాటం చేశారు. 2013లో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ కూడా ఆ రాష్ట్ర గవర్నర్‌ను రీకాల్ చేయాలని, ఢిల్లీ సుల్తాన్ల మనిషిగా గవర్నర్ ఇక్కడ ఉన్నారని డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లపాటు ఖాళీగా ఉన్న గుజరాత్ లోకాయుక్తను అప్పటి గవర్నర్ కమలా బెనీవాల్ నియమించడంతో వివాదం రేగింది. దానితో ఆగ్రహించిన మోదీ.. లోకాయుక్త నియామకంలో గవర్నర్ పాత్ర లేకుండా ముఖ్యమంత్రి, మంత్రివర్గమే తుది నిర్ణయం తీసుకునేలా బిల్లు పాస్ చేయించారు. ఆర్టికల్ 163 ప్రకారం గవర్నర్ ఏ నిర్ణయమైనా ముఖ్యమంత్రి, మంత్రివర్గం చేసిన సలహా మేరకే తీసుకోవాలని స్పష్టం చేశారు. గవర్నర్లు ఆనవాయితీ పాటిస్తేనే మంచిది రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన అధికార కేంద్రాలు రెండు ఉండవు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే పూర్తి అధికారం. గవర్నర్‌ది రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత మాత్రమే. దానిని అర్థం చేసుకొని మెలగాలి. గవర్నర్ ప్రమాణ స్వీకార ప్రతిజ్ఞకు, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ప్రతిజ్ఞకు మధ్య తేడాను గుర్తించాలి. రాజ్యాంగాన్ని, న్యాయాన్ని ప్రిజర్వింగ్, డిఫెండింగ్, ప్రొటెక్టింగ్ అన్నది మాత్రమే గవర్నర్ విధి. ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే సలహాలు ఇచ్చి సరిచేయాలి. ఏవైనా అనుమానాలుంటే ముఖ్యమంత్రిని పిలిచి క్లోజ్డ్ డోర్లో నివృత్తి చేసుకోవాలి. అనుమానాలను నివృత్తి చేయడం ముఖ్యమంత్రి బాధ్యత కూడా. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు హద్దులు దాటుతున్నారు. ఇది మంచి పరిణామం కాదు. పాలనాపరంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా మంత్రి వర్గమే అసెంబ్లీకి, ప్రజలకు జవాబుదారీ. గవర్నర్‌కు ఎలాంటి జవాబుదారీతనం లేదు. ఇటీవలికాలంలో ప్రభుత్వాలకు, గవర్నర్ వ్యవస్థకు మధ్య జరుగుతున్న వివాదాలు చూస్తుంటే.. రెండువైపులా పెద్దరికం అనేది లేకుండా పోయింది. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై గవర్నర్లు బహిరంగంగా వ్యాఖ్యానాలు చేయడం సరికాదు. రాజ్యాంగం, సంప్రదాయాలు, ఆనవాయితీలను ఇరువైపులా పాటిస్తే ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. – సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి బిల్లులు ఆపడం సరికాదు రాజ్యాంగ బద్ధమైన ఒకటి రెండు అంశాల్లో తప్ప రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. కేబినెట్ ఆమోదం తెలిపిన బిల్లులను ఆపడం, మంత్రులను పిలిచి వివరణ కోరడం సరికాదు. అసెంబ్లీ ప్రొరోగ్ అనేది స్పీకర్‌కు సంబంధించిన అంశం. గవర్నర్లు సమస్యలపై ప్రభుత్వం నుంచి నివేదిక కోరవచ్చు. అధికారులను అడిగి తెలుసుకోవచ్చు. కానీ నేరుగా అధికారులకే ఆదేశాలు జారీ చేయకూడదు. ఇది సమాంతర ప్రభుత్వాన్ని నడిపినట్లే అవుతుంది. – కె.రామకృష్ణారెడ్డి, హైకోర్టు సీనియర్ న్యాయవాది గవర్నర్ కేబినెట్ నిర్ణయాల మేరకే నడుచుకోవాలి ప్రజాస్వామ్యంలో పరిపాలనకు సంబంధించి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే తుది నిర్ణయం. కేబినెట్ నిర్ణయాలను ఆపడానికి, రద్దు చేయడానికి గవర్నర్‌కు అధికారం లేదు. నేరుగా పాలనలో కలగజేసుకోకూడదు. సభ జరగనప్పుడు మాత్రమే కొన్ని నిర్ణయాలను తీసుకోవచ్చు. అదీ అప్పుడున్న కేబినెట్ అనుమతితోనే తీసుకోవాలి. గతంలో ఏర్పాటైన ఓ కమిషన్ కూడా తన నివేదికలో ఇదే అంశాన్ని చెప్పింది. ఇక అసెంబ్లీని ప్రోరోగ్ చేయకుండా నడపడం అనేది స్పీకర్‌కు సంబంధించిన అంశం. అందులోనూ గవర్నర్ పాత్ర ఉండదు. – సత్యప్రసాద్, హైకోర్టు సీనియర్ న్యాయవాది తాజా సంఘటనలకు వస్తే.. ►కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ యూనివర్సిటీల వైస్ చాన్సలర్లను మూకుమ్మడిగా తొలగించడం ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌కు ఆగ్రహం తెప్పించింది. గవర్నర్‌కు వర్సిటీల చాన్సలర్ హోదాను తొలగిస్తూ మంత్రివర్గం ఆర్డినెన్స్‌ను ఆమోదించి గవర్నర్‌కు పంపింది. చిత్రమేమిటంటే ఆర్డినెన్స్‌పై గవర్నర్ సంతకం చేస్తే తప్ప అది అమల్లోకి రాదు. తనను తాను చాన్స్‌లర్ పదవి నుంచి తొలగించుకోవడం ఇష్టం లేని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ దానిని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. ఆ రాష్ట్రంలో తరచూ గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య ఏదో ఒక అంశంపై వివాదం రగులుతూనే ఉంది. ►పశ్చిమబెంగాల్లో కొంతకాలం కిందటి వరకు మమత సర్కారుకు, నాటి గవర్నర్ జగదీప్ ధన్కర్కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే సాగింది. బహిరంగంగానే విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగింది. ►తమిళనాడు విషయానికి వస్తే.. అక్కడి శాసనసభ ‘నీట్’ నుంచి తమ రాష్ట్ర విద్యార్థులకు మినహాయింపు ఇవ్వాలంటూ బిల్లును పాస్ చేసింది. దానిని రాష్ట్రపతికి పంపకుండా గవర్నర్ ఆర్ఎన్ రవి ఆపి.. తిరిగి శాసనసభకు పంపారు. దీనిపై ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక గవర్నర్ సనాతన ధర్మాన్ని పొగడటంపైనా స్టాలిన్, డీఎంకే పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయనను తక్షణమే రీకాల్ చేయాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు. స్టాలిన్‌కు, గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ►తెలంగాణలో రాజ్‌భవన్‌కు, ప్రగతిభవన్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించకుండా గవర్నర్ తమిళిసై ఆపడంతో మొదలైన వివాదం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా తనకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదని గవర్నర్ చాలాసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. గణతంత్ర వేడుకల సమయంలో రాజ్‌భవన్‌కు సీఎం, మంత్రులు రాకపోవడం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా చేయడం, అసెంబ్లీ ప్రోరోగ్ చేయకుండా కొనసాగించడం వంటివాటితో వివాదాలు కొనసాగాయి. గత వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ఆమోదిస్తే.. అందులో ఒక్క జీఎస్టీ బిల్లు మినహా మిగతా ఏడు బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు. యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియమకాలకు సంబంధించి ‘తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బిల్లు’పై గవర్నర్ అనుమానాలు వ్యక్తం చేయడంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులు వెళ్లి వివరణ ఇచ్చారు. ఆ బిల్లుకు ఇంకా ఆమోదం తెలపలేదు. గవర్నర్ విలేకరుల సమావేశంలోనే ప్రగతిభవన్ (సీఎం) గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ►మహారాష్ట్రలో మహావికాస్ అగాడి (ఎంవీఏ) కూటమి అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీతో విభేదాలు కొనసాగాయి. ఆయన మంత్రివర్గం సిఫార్సు చేసిన అంశాలను ఆమోదించకుండా విచక్షణాధికారం పేరిట కాలయాపన చేశారు. ఏ సభలోనూ సభ్యుడు కాని ఉద్ధవ్‌ఠాక్రే ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసనమండలికి నామినేట్ చేయాలని మంత్రివర్గం సిఫార్సు చేసింది. కానీ దీనిని నాలుగు నెలల పాటు ఆమోదించకుండా వివాదం రేపారు. -
వెనక్కి తగ్గిన షకీబ్.. బెట్విన్నర్ న్యూస్‌తో ఒప్పందం రద్దు!
ఢాకా: బంగ్లాదేశ్ టాప్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌కు వివాదాలు కొత్త కాదు. తాజాగా ఒక స్పాన్సర్షిప్ ఒప్పందానికి సంబంధించి షకీబ్ చర్య వివాదంగా మారింది. అయితే చివరి నిమిషంలో షకీబ్ దానిని సరిదిద్దుకోవడంతో అతను వేటు తప్పించుకున్నాడు. పది రోజుల క్రితం ‘బెట్విన్నర్ న్యూస్’తో తాను ఒప్పందం చేసుకున్న విషయాన్ని షకీబ్ ఇన్‌స్టగ్రామ్ ద్వారా ప్రకటించాడు. అయితే బెట్విన్నర్ అనేది బెట్టింగ్‌కు సంబంధించిన సంస్థ కావడంతో అతను ఒప్పందం చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నిబంధనల ప్రకారం ఏ బంగ్లా క్రికెటర్ అయినా బెట్టింగ్ సంస్థతో ఒప్పందాలు చేసుకోరాదు. దాంతో షకీబ్‌పై చర్య తీసుకునేందుకు బీసీబీ సిద్ధమైంది. చివరి హెచ్చరికగా గురువారంలోగా దానిని రద్దు చేసుకోకపోతే బోర్డు కాంట్రాక్ట్ రద్దు చేయడంతో పాటు నిషేధం విధిస్తామని హెచ్చరించింది. దాంతో షకీబ్ వెనక్కి తగ్గాడు. తన ఒప్పందాన్నివదిలేస్తున్నట్లు ప్రకటించాడు. చదవండి: AFG vs IRE: ఆఫ్ఘనిస్తాన్‌కు మరో షాకిచ్చిన ఐర్లాండ్.. వరుసగా రెండో విజయం! -
రాజ్యాంగ పీఠిక.. వాద వివాదాలు
రాజ్యాంగం తొలి ప్రతిని 1948 నవంబర్ 4వ తేదీన రాజ్యాంగ సభలో ప్రవేశ పెట్టారు. పశ్చిమ బెంగాల్ నుంచి ఎన్నికైన సభ్యుడు నజీరుద్దీన్ అహ్మద్ మొదటినుంచీ రాజ్యాంగం చిత్తుప్రతిలో లోపాలను ఎత్తిచూపుతూ ఉండేవారు. ఆయన మాత్రమే కాదు, కె. సంతానం (మద్రాస్), ఆర్ ఆర్ దివాకర్ (బాంబే), మౌలానా హస్రత్ మోహానీ (యునైటెడ్ ప్రావిన్సెస్) కూడా రాజ్యాంగ రచనను పదే పదే విమర్శించేవారు. రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ... చట్ట వ్యతిరేకంగా తనను తాను రాజ్యాంగ సంఘం (కానిస్టి ట్యూషన్ కమిటీ)గా మార్చుకున్నదని వ్యాఖ్యానించారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ రాజ్యాంగ సభ నిర్ణయాలను రచనలో పొందుపర్చడమే కాకుండా... ఆ నిర్ణయాలను సమీక్షించారనీ, కొన్ని చోట్ల వాటికి కొత్తరూపం ఇచ్చారనీ దివాకర్ విమర్శిం చారు. తర్వాతి రోజుల్లో రాజ్యంగ ‘పీఠిక’గా మారిన ‘రాజ్యాంగ లక్ష్య తీర్మానం’ (ఆబ్జెక్టివ్ రిజల్యూషన్) పైనా మోహానీ విమర్శలు కురిపించారు. ఇదంతా ఎందుకంటే ఈ పీఠిక (ప్రియాంబుల్) రాసిం దెవరు అనే ప్రశ్న కోసం. నిజంగా వెంటనే సమాధానం ఇవ్వడానికి వీలుకాని ప్రశ్న ఇది. రాజ్యాంగ సభలో జరిగిన చర్చలు, మార్పులు, చేర్పులు, ప్రసంగాల వివరాలు ఉన్నాయి కానీ... రాజ్యాంగ రచనా సంఘంలో సభ్యుల మధ్య జరిగిన చర్చలు, సవరణ ప్రతిపాదనలు; చేసిన మార్పులు, చేర్పులు; తుది రూపం ఇచ్చేముందు జరిపిన సంప్రదింపులకు సంబం ధించిన సమాచారం లేదు. ఆ వివరాలు ఎక్కడా రాసిలేవు. రాజ్యాంగ సభలో ఈ పీఠికకు తుది రూపంపై చర్చకు ముందు జరిగిన వివరాలూ లేవు. యూపీఎస్సీ పరీక్షలకు తయారయ్యే విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేవారంతా పీఠిక ఎవరు రాశారు అనగానే జవ హర్లాల్ నెహ్రూ అని జవాబు ఇస్తారు. దానికి కారణ మేమంటే.... నెహ్రూ ప్రతిపాదించిన ‘లక్ష్య తీర్మాన’మే భావి భారత రాజ్యాంగానికి లక్ష్య, ఉద్దేశ్య ప్రకటనగా రూపొందింది. రాజ్యాంగ రచనాసభలో చర్చించిన వివరాలు లేకపోవడం మోహానీ వంటివారు కొందరు విమర్శించడానికి కారణమైంది. ఇక్కడే అసలు రాజ్యాంగం మొదటి చిత్తు ప్రతి సేకరించి, అన్ని నియమాలు ఒకచోట గుమిగూర్చి, చర్చకు ప్రాతిపదికగా రూపొందించిన ఘనత రాజ్యాంగ సభ సలహాదారుడైన బిఎన్ రావ్‌కు దక్కుతుందనేవారు ఉన్నారు. తొలి చిత్తు ప్రతి రూప కల్పనలో రావ్ పాత్ర నిర్వివాదాంశం. అయితే పీఠిక కూడా ఆయనే రాశారనడానికి వీలు లేదు. ప్రతి సభ్యుడి ప్రతిస్పంద నను ఆధారంగా చేసుకుని, చాలా జాగ్రత్తగా రాజ్యాంగ వాక్యా లను రచనా సంఘం... ముఖ్యంగా అంబేడ్కర్ నిర్మించారనేది నిర్వివాదాంశం. అయినా వివాదం చేయదలచుకున్న వారికి వివాదం కావచ్చు కూడా! రాజ్యాంగ రచన ఉపసంఘం సమావేశాల కాలంలో చాలా సందర్భాలలో అందరు సభ్యులూ హాజరు కాలేదు. పీఠికా నిర్మాణ సమయంలో రాజ్యాంగ రచనా ఉపసంఘానికి చెందిన నలుగురు మాత్రమే తొలి సమావేశాల్లో పాల్గొన్నారు. ఏ రోజూ వదలకుండా మొత్తం రచనా ఉపసంఘం సమావేశా లన్నింటికీ వచ్చిన ఏకైక వ్యక్తి అంబేడ్కర్ మాత్రమే. కనుక రాజ్యాంగం నిర్మించిన రచనా ఉపసంఘం అధ్యక్షుడు అంబే డ్కర్కే పీఠిక నిర్మాణం ఘనత కూడా చెందుతుంది. అయితే రాజ్యాంగ రచన, పీఠిక రచన రెంటికీ మధ్య సారూప్యత ఉన్నా.. కొన్ని తేడాలు కూడా ఉన్నాయి. ‘ముఖ్య నిర్మాత’ అన్నంత మాత్రాన అన్ని భాగాల రచయిత వారే అవుతారని అనడానికి వీలుండదు. అంబేడ్కర్ రాజ్యాంగ రచన పూర్తయిన తర్వాత చేసిన ప్రసంగం, నెహ్రూ లోక్‌సభలో 6 డిసెంబర్, 1956 (అంబేడ్కర్ నిర్యాణ దినం) నాడు ఇచ్చిన ఉపన్యాసం... రాజ్యాంగ ముఖ్య నిర్మాత అంబేడ్కర్ అనే విషయాన్ని ధృవీ కరిస్తాయి. ‘‘సాధారణంగా రాజ్యాంగ నిర్మాతలలో అంబేడ్కర్ ఒకరు అంటారు. కానీ రాజ్యాంగ నిర్మాణంలో అంబేడ్కర్ కన్న ఎక్కువ శ్రద్ధచూపిన వారుగానీ, కష్టపడ్డవారు గానీ మరొకరు లేరు’’ అని నెహ్రూ చాలా స్పష్టంగా ప్రకటించారు. అయితే అంబేడ్కర్ తన చివరి ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాణ ఘనత తనకొక్కడికే ఇవ్వడం సరికాదని ప్రకటించారు. డ్రాఫ్టింగ్ కమిటీలో, రాజ్యాంగ సభలో కూడా అనేక మంది రాజ్యాంగ రచనలో కీలకపాత్ర పోషించారని ఆయన వివ రంగా చెప్పారు. ఈ రకరకాల చర్చల మధ్య రాజ్యాంగ పీఠికకు కర్త ఎవరు అనే విషయం మరుగున పడిపోయింది. ఆకాశ్ సింగ్ రాథోర్ మాత్రం తన పుస్తకానికి ‘‘అంబేడ్కర్స్ ప్రియాం బుల్’’ అని పేరు పెట్టారు. ‘రాజ్యాంగ రహస్య చరిత్ర’ అని కూడా ఉపశీర్షిక తగిలించారు. -మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త స్కూల్ ఆఫ్ లా డీన్, మహీంద్రా వర్సిటీ -
నాన్నకు బాగా లేకపోవడం వల్లే...
ముంబై: రోహిత్ శర్మ తన సహరులతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్లకపోవడానికి ఫిట్నెస్ సమస్య కారణం కాదని బీసీసీఐ కొత్తగా తేల్చి చెప్పింది. రోహిత్ విషయంలో వరుస వివాదాలు, కోహ్లి వ్యాఖ్యల నేపథ్యంలో బోర్డు బోర్డు ఇచ్చిన వివరణ ఆసక్తకరంగా మారింది. ‘తన తండ్రి అనారోగ్యంగా ఉన్న కారణంగానే రోహిత్ ఐపీఎల్ తర్వాత నేరుగా ముంబైకి వచ్చింది. ఇప్పుడు ఆయన కోలుకున్నారు కాబట్టి రోహిత్ ఎన్సీఏకు వెళ్లి తన రీహాబిలిటేషన్‌ను ప్రారంభించాడు’ అని బోర్డు స్పష్టం చేసింది. డిసెంబర్ 11న రోహిత్ ఫిట్నెస్ను మరోసారి సమీక్షిస్తామని పేర్కొంది. ఇషాంత్ పూర్తిగా దూరం... గాయంతో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన ఇషాంత్ శర్మ మిగిలిన రెండు టెస్టులనుంచి కూడా తప్పుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. పక్కటెముకల గాయంనుంచి పూర్తిగా కోలుకున్నా...టెస్టు మ్యాచ్‌లు ఆడే ఫిట్నెస్ స్థాయిని అతను ఇంకా అందుకోలేదని బోర్డు వెల్లడించింది. -
‘ఆయన కావాలనే చేస్తున్నారు’
ముంబై: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా ఉన్న శశాంక్ మనోహర్‌కు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి చాలా కాలంగా ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. టి20 ప్రపంచకప్‌ను ఈ ఏడాది నిర్వహించే అవకాశం లేదని ఐసీసీ ఇప్పటికీ అధికారికంగా ప్రకటించకపోవడానికి ఆయనే కారణమని బీసీసీఐ భావిస్తోంది. భారత బోర్డు ఐపీఎల్ నిర్వహించుకోవడం లేదా ఇతర ద్వైపాక్షిక సిరీస్‌ల ప్రణాళికలు రూపొందించుకునే అవకాశం లేకుండా కావాలనే మనోహర్ ఇబ్బంది పెడుతున్నారని సీనియర్ అధికారి ఒకరు ఆరోపించారు. భారతీయుడై ఉండి ఇప్పటికీ భారత్‌కు వ్యతిరేకంగానే ఆయన పని చేస్తున్నారని విమర్శించారు. ‘త్వరలో పదవీకాలం ముగిసిపోయే శశాంక్ మనోహర్ లేని గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారు. టి20 ప్రపంచ కప్ నిర్వహించడం తమ వల్ల కాదని ఆస్ట్రేలియా చేతులెత్తేసిన తర్వాత దానిని ప్రకటించేందుకు నెల రోజులు కావాలా. ఏదో ఒకటి తేల్చేయవచ్చు కదా. ఇది ఒక్క ఐపీఎల్ గురించే కాదు. ఈ ఆలస్యం అన్ని దేశాలకు సమస్యగా మారింది. బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా పని చేసిన మనోహర్ ఐసీసీలో మన ఆర్థిక ప్రయోజనాలు దెబ్బ తినేలా పని చేశారు. అయినా ఐసీసీ సమావేశాల్లో చైర్మన్ ఎన్నిక గురించి ఇంకా ఎందుకు ప్రకటించడం లేదు’ అని సదరు అధికారి అన్నారు. -
పాన్ షాపుకన్నా అధ్వానం!!
న్యూఢిల్లీ: దేశీ విమానయాన సంస్థ ఇండిగోలో ప్రమోటర్ల మధ్య వివాదాలు మరింతగా ముదిరాయి. కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని పరిస్థితులు చక్కదిద్దాలని కోరుతూ కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన రాకేష్ గంగ్వాల్ తాజాగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి లేఖ రాశారు. ఇండిగోలో గవర్నెన్స్ లోపాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని, దానితో పోలిస్తే కనీసం పాన్ షాపు నిర్వహణైనా మెరుగ్గా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. సంస్థను నేడు అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన విలువలకు తిలోదకాలిచ్చి.. కంపెనీ పక్క దారి పడుతోందని గంగ్వాల్ ఆరోపించారు. మరో ప్రమోటరు రాహుల్ భాటియా, ఆయన సంస్థలు సందేహాస్పద లావాదేవీలు జరిపినట్లు పేర్కొన్నారు. చిరకాల మిత్రుడైన భాటియాకు కంపెనీపై అసాధారణ నియంత్రణాధికారాలు కట్టబెట్టేలా షేర్‌హోల్డర్ల ఒప్పందం ఉందని గంగ్వాల్ ఆరోపించారు. ‘సందేహాస్పద లావాదేవీలతో పాటు కనీసం ప్రాథమికమైన గవర్నెన్స్ నిబంధనలు, చట్టాలను కూడా పాటించడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే దురదృష్టకర పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణం సరిదిద్దే చర్యలు తీసుకోవాలి‘ అని లేఖలో పేర్కొన్నారు. దీని కాపీని అటు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌కు కూడా పంపారు. 19లోగా వివరణివ్వండి..: రాకేష్ గంగ్వాల్ చేసిన ఫిర్యాదులపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో కీలక వివరాలు ఇవ్వాలంటూ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌ను ఆదేశించింది. దీనికి జూలై 19 గడువు విధించింది. స్టాక్ ఎక్సే్చంజీలకు ఇండిగో ఈ విషయాలు తెలిపింది. సెబీకి గంగ్వాల్ రాసిన లేఖ ప్రతి తమకు కూడా అందినట్లు వివరించింది. తాజా పరిణామాల నేపథ్యంలో బీఎస్ఈలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేరు స్వల్పంగా నష్టపోయి రూ. 1,565.75 వద్ద క్లోజయ్యింది. వివాదం ఇదీ.. ఇండిగో సహవ్యవస్థాపకుడు అయిన గంగ్వాల్‌కు కంపెనీలో 37% వాటాలు ఉన్నాయి. మరో సహవ్యవస్థాపకుడు రాహుల్ భాటియా, ఆయన సంబంధ సంస్థల (ఐజీఈ గ్రూప్)కు 38% వాటాలున్నాయి. సంబంధ పార్టీల మధ్య సందేహాస్పద లావాదేవీలపై ఇద్దరు ప్రమోటర్ల మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో అత్యవసర షేర్‌హోల్డర్ల సమావేశం నిర్వహించాలంటూ గంగ్వాల్ గతంలో ప్రతిపాదించగా భాటియా దాన్ని తిరస్కరించారు. అసమంజసమైన ఆయన డిమాండ్లను కంపెనీ బోర్డు ఒప్పుకోనందున గంగ్వాల్ ఇలాంటివన్నీ చేస్తున్నారంటూ భాటియా ఆరోపించారు. దేశీయంగా అతి పెద్ద ఎయిర్‌లైన్ అయిన ఇండిగోకు దాదాపు 49%మార్కెట్ వాటా ఉంది. 200 పైచిలుకు విమానాలతో రోజూ 1,400 ఫ్లయిట్స్ నడుపుతోంది. భాటియాకు అసాధారణ అధికారాలు కట్టబెట్టేలా షేర్‌హోల్డరు ఒప్పందం ఉన్నప్పటికీ.. సుదీర్ఘ మిత్రత్వం దృష్టిలో ఉంచుకుని, కంపెనీపై నియంత్రణాపేక్ష పెట్టుకోకుండా అగ్రిమెంటు తాను అంగీకరించానని గంగ్వాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం భాటియాకు చెందిన ఐజీఈ గ్రూప్‌నకు ఆరుగురిలో ముగ్గురు డైరెక్టర్లను, చైర్మన్, సీఈవో, ప్రెసిడెంట్‌ను నియమించే అధికారాలు ఉంటాయి. ప్రస్తుత చైర్మన్ స్వతంత్రతను తాను ప్రశ్నించడం లేదని కానీ స్వతంత్ర చైర్మన్ పేరిట జరిపే నియామక ప్రక్రియే సెబీ నిబంధనలను తుంగలో తొక్కేలా ఉందని గంగ్వాల్ ఆరోపించారు. -
ఆటను కుదిపేసిన వివాదాలు!
సాక్షి, వెబ్‌డెస్క్ : నిన్న జరిగింది.. రేపు గుర్తొస్తే జ్ఞాపకం. ఈ ఏడాదంతా జరిగింది ఒక్కరోజు గుర్తుచేసుకుంటే మననం. 365 రోజులు.. ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత. ఒక్కో ఘటనకు ఒక్కో విశిష్టత. ఇందులో మంచి ఉంది.. చెడు ఉంది. ఒక్కో ఘటన ఓ గుణపాఠం. మంచి మరిచిపోయినా పర్వాలేదు కానీ చేసిన తప్పును.. దాని నుంచి నేర్చుకున్న గుణపాఠాన్ని మరవద్దు. ఇలా మనదేశంలో ఓ మతంలా ఆరాదించే క్రికెట్లో అంతర్జాతీయంగా 2018లో చోటు చేసుకున్న వివాదాలు.. వాటి పర్యవసనాలపై ఓ లుక్కెద్దాం! 1.బాల్ ట్యాంపరింగ్.. యావత్ క్రీడా ప్రపంచం నివ్వెరపోయిన ఘటన. ప్రపంచ క్రికెట్ ముందు ఆస్ట్రేలియా ఆటగాళ్లను దోషులుగా నిలబెట్టిన సంఘటన. క్రీడాస్పూర్తిని దెబ్బతీసిన ఈ వ్యవహారంతో ఆ ఆటగాళ్లు తమ ఇష్టమైన ఆటకే దూరమయ్యేలా చేసిన వివాదం. చివరకు తాము చేసింది ఘోర తప్పిదమని మీడియా ముందు కన్నీళ్లతో పశ్చాతాపం వ్యక్తం చేసేలా చేసిన అతిపెద్ద వివాదస్పద ఘటన. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా యువ ఆటగాడు కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, వైస్ కెప్టెన్ డెవిడ్ వార్నర్ సూచనల మేరకు సాండ్ పేపర్‌తో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడటం.. దీనికి కెప్టెన్ స్టీవ్ స్మిత్ వత్తాసు పలకడం వివాదానికి దారితీసింది. టీవీ కెమెరాల్లో రికార్డైన ఈ వ్యవహారం బయటకు రావడంతో ఆసీస్ ఆటగాళ్ల బండారం బయట పడింది. ఈ ఘటనతో కెప్టెన్ స్టీవ్‌స్మిత్, వైస్ కెప్టెన్ డెవిడ్ వార్నర్‌లపై ఏడాది నిషేధం పడగా.. యువ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్‌ను 9 నెలలు ఆటకు దూరం చేసింది. చివరకు ఐపీఎల్ లీగ్‌లో కూడా ఆడకుండా చేసింది. 2018లో చోటు చేసుకున్నఅతిపెద్ద వివాదం బాల్ ట్యాంపరింగే అనడంలో అతిశయోక్తి లేదు. 2. డేవిడ్ వార్నర్-డికాక్‌ల మాటల యుద్దం బాల్ ట్యాంపరింగ్ వివాదానికి కారణమైన ఘటన. దక్షిణాఫ్రికాతో నాలుగు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో చోటు చేసుకున్న వాడివేడి వాగ్వాదం. ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో టీ బ్రేక్ సమయంలో ప్రొటీస్ ఆటగాడు డికాక్ వ్యక్తిగత దూషణలకు దిగడంతో సహనం కోల్పోయిన వార్నర్ అతనిపై నోరుపారేసుకుంటూ దూసుకెళ్లాడు. ఇది అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డవ్వడంతో వ్యవహారం బయటకు వెలుగు చూసింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన మ్యాచ్ రిఫరీ వార్నర్‌కు 75 శాతం మ్యాచ్ ఫీజు కోతతో పాటు మూడు డీమెరిట్ పాయింట్స్ విధించారు. ఈ ఘటనతో ఆ సీరిస్‌లో ఆటగాళ్ల మధ్య మొదలైన మాటల యుద్దం చివరకు బాల్ ట్యాంపరింగ్ వివాదానికి దారితీసింది. 3. స్మిత్‌ను నెట్టేసిన రబడా ఈ ఏడాది అత్యంత వివాదాస్పద ద్వైపాక్షిక సిరీస్ ఏదైనా ఉందంటే.. అది ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా సిరీసే అని చెప్పాలి. తొలి టెస్ట్‌లో వార్నర్-డికాక్‌ల తిట్టుకోగా.. రెండో టెస్ట్‌లో స్మిత్- కగిసో రబడాలు కలియబడ్డారు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ ఔటవ్వడంతో.. అత్యుత్సాహం ప్రదర్శిన రబడా స్మిత్‌కు ఎదురుగా వెళ్తూ భుజంతో ఢీకోట్టి పెవిలియన్ వైపు వెళ్లూ అంటూ సూచించాడు. ఇది వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంలో రబడాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మ్యాచ్ రిఫరీ మూడు డీమెరిట్ పాయింట్లతో పాటు మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. దీంతో రబడా రెండు టెస్ట్ మ్యాచ్‌లకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై పశ్చాతాపం వ్యక్తం చేసిన రబడా అప్పీల్‌కు వెళ్లడంతో విచారణ జరిపిన ఐసీసీ డీమెరిట్ పాయింట్లను మూడు నుంచి ఒకటి తగ్గించింది. దీంతో అతను మ్యాచ్లాడెందుకు మార్గం సుగుమమైంది. మ్యాచ్ ఫీజు విషయంలో కూడా 50 శాతం నుంచి 25 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయంపై అప్పట్లో స్మిత్ అసహనం వ్యక్తం చేశాడు. 4. మహ్మద్ షమీపై లైంగిక ఆరోపణలు టీమిండియా పేసర్ మహ్మద్ షమీ స్త్రీలోలుడని అతని భార్య హసీన్ జహాన్ చేసిన సంచలన ఆరోపణలు అతని కెరీర్‌ను ప్రశ్నార్థకంలో నెట్టాయి. అతను పలువురి అమ్మాయిలతో అక్రమ సంబంధాలు కొనసాగించాడని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని మీడియా ముందే బహిరంగంగా ప్రకటించడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. చివరకు బీసీసీఐ కాంట్రాక్టు ఇవ్వకుండా పునరాలోచనలో పడేలా చేశాయి. హసీన్ జహాన్ వ్యవహారంతో విచారణ జరిపిన బీసీసీఐ.. షమీ ఎలాంటి తప్పిదం చేయలేదని క్లీన్‌చీట్ ఇచ్చింది. ఇక తనను షమీ మానిసికంగా.. లైంగికంగా వేధించాడని, చంపాలని ప్రయత్నించాడని కూడా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2014లో జహాన్‌ను షమీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ పాప కూడా ఉంది. ప్రస్తుతం షమీకి దూరంగా ఉంటున్న జహాన్.. కూతురు పోషణ కోసం భరణం చెల్లించాలని కోర్టులో పోరాడుతోంది. 5. నాగిని డ్యాన్స్ వివాదం.. నిదహాస్ ముక్కోణపు టోర్నీలో నాగిని డ్యాన్స్ వివాదం చర్చనీయాంశమైంది. శ్రీలకం-బంగ్లాదేశ్ ఆటగాళ్లు మైదానంలో గెలిచినప్పుడు నాగిని డ్యాన్స్, వికెట్ తీసినప్పుడు నాదస్వరం ఊదినట్లు హావభావాలు వ్యక్తపరచడం అభిమానులను ఆకట్టుకుంది. కానీ ఇది చివరకు వివాదానికి దారి తీసింది. ఈ టోర్నీలో బంగ్లా-శ్రీలంక మధ్య జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో షార్ట్ పిచ్ బంతుల వివాదం చోటు చేసుకుంది. చివరి ఓవర్ బంగ్లా గెలవాలంటే 12 పరుగులు చేయాలి. ఎవరు గెలిస్తే వారు ఫైనల్‌కు వెళ్తారు. క్రీజులో ముస్తఫిజుర్. బౌలర్ ఉదాన. తొలి బంతి భుజం కంటే ఎత్తులో వెళ్లినా ‘నో బాల్’ ఇవ్వలేదేమని మహ్ముదుల్లా అంపైర్లను అడిగాడు. మరోవైపు ఇదే తరహాలో వచ్చిన రెండో బంతిని పుల్ చేయలేకపోయిన ముస్తఫిజుర్ పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. ఈ సమయంలో మైదానంలోకి వచ్చిన బంగ్లా సబ్‌స్టిట్యూట్ ఆటగాడు నురుల్ శ్రీలంక కెప్టెన్ తిసారా పెరిరాతో వాగ్వాదానికి దిగాడు. అంపైర్లు కలగజేసుకుని సర్ది చెప్పారు. ఈలోగా కెప్టెన్ షకీబ్ సహా బంగ్లా ఆటగాళ్లంతా బౌండరీ దగ్గరకు వచ్చేశారు. షకీబ్ అంపైర్లతోనూ తీవ్ర వాదులాటకు దిగాడు. మైదానం వీడి వచ్చేయాల్సిందిగా తమ బ్యాట్స్‌మెన్‌ను పదేపదే ఆదేశించాడు. అయితే.. బంగ్లా జట్టు మేనేజర్ ఖాలెద్ మెహమూద్ శాంతపర్చడంతో మహ్ముదుల్లా తిరిగి బ్యాటింగ్‌కు వెళ్లాడు. మ్యాచ్ ముగిశాక బంగ్లా ఆటగాళ్లు నాగిని డ్యాన్స్‌లతో ప్రత్యర్థి ఆటగాళ్లను రెచ్చగొట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ వ్యవహారంలో షకీబ్ అల్ హసన్, రిజర్వ్ ప్లేయర్ నురుల్ హసన్లపై మ్యాచ్ రిఫరీ వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడమే కాకుండా ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించాడు. 6. దేశం విడిచి వెళ్లిపో కామెంట్.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన ఓ కామెంట్ వివాదానికి దారి తీసింది. నవంబర్ 5న పుట్టిన రోజు సందర్భంగా కోహ్లి తన పేరుతో ఉన్న యాప్‌ను ప్రారంభించాడు. ఈ యాప్‌లో ‘కోహ్లి ఆటలో ప్రత్యేకత ఏం లేదు. ఇలాంటి భారత క్రికెటర్ల కన్నా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రీడాకారుల ఆటతీరే నాకు ఎంతో ఇష్టం’ అని సదరు అభిమాని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై చిర్రెత్తుకొచ్చిన విరాట్ .. ‘నువ్వు భారత్‌లో ఉండాల్సిన వాడివి కాదు. ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియాలు మాత్రమే నీకు సరైనవి. దేశం విడిచి వెళ్లిపో.’ అని ఘాటుగా బదులిచ్చాడు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. 7. మిథాలీ ఆవేదన.. మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత సీనియర్ క్రికెటర్, వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్, హెడ్ కోచ్ రమేశ్ పవార్ల మధ్య నెలకొన్న వివాదం మహిళా క్రికెట్లో సంచలనం సృష్టించింది. ఈ ఆధిపత్య పోరు చివరకు భారత మహిళలు ప్రపంచకప్ గెలిచే సువర్ణావకాశం కోల్పోయేలా చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో తనను అర్థాంతరంగా తప్పించడం వెనుక కోచ్ రమేశ్ పవార్, మాజీ కెప్టెన్, పరిపాలకుల కమిటీ (సీఓఏ) మెంబర్ డయానా ఎడుల్జీల హస్తం ఉందని మిథాలీ రాజ్ ఆరోపించడంతో ఈ వివాదం వెలుగు చూసింది. అయితే సమస్య ఆ ఒక్క మ్యాచ్‌తో మాత్రమే కాదని, తనను లక్ష్యంగా చేసుకొని కోచ్ రమేశ్ పొవార్ వ్యవహరించారని మిథాలీ బీసీసీఐకి రాసిన లేఖలో పేర్కొంది. ఇన్నేళ్లపాటు దేశానికి ఆడిన తన పట్ల అవమానకర రీతిలో ప్రవర్తించారని ఈ హైదరాబాద్ ప్లేయర్ కన్నీటి పర్యంతమైంది. కాగా, ఓపెనర్‌గా పంపకపోతే ప్రపంచకప్ నుంచి తప్పుకొని, రిటైర్మెంట్ ప్రకటిస్తానని మిథాలీ రాజ్ బెదిరించిందని బీసీసీఐకి రాసిన లేఖలో పవర్ తెలపడం మరింత అగ్గి రాజేసింది. అయితే మరొకసారి పొవార్‌నే కోచ్‌గా నియమించాలంటూ టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానలు కోరడంతో ఆటగాళ్ల మధ్య నెలకొన్న లుకలుకలు బయటపడ్డాయి. బీసీసీఐ మాత్రం పొవార్‌ను తప్పించి కొత్త కోచ్‌గా డబ్ల్యూవీ రామన్‌ను నియమించింది. 8. ఇషాంత్-రవీంద్ర జడేజా వాగ్వాదం ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన పెర్త్ టెస్ట్‌లో టీమిండియా ఆటగాళ్లు ఇషాంత్ శర్మ- రవీంద్ర జడేజాలు మైదానంలో గొడవపడటం హాట్ టాపిక్ అయింది. ఒక రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగో రోజు (సోమవారం) ఆటలో భాగంగా ఫీల్డింగ్ మార్పులో తలెత్తిన వివాదం ఇద్దరి ఆటగాళ్ల మధ్య తారస్థాయికి చేరి ఒకరిపై ఒకరు చేయిచేసుకునే వరకు వెళ్లింది. అయితే వీరి వాగ్వాదాన్ని గమనించిన పేస్ బౌలర్ మహ్మద్ షమీ, డ్రింక్స్ అందివ్వడానికి మైదానంలోకి వచ్చిన కుల్దీప్ యాదవ్‌లు వారికి సర్ధిచెప్పారు. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా లేనప్పటికి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చాడు. ఈ సందర్భంగా బౌలింగ్ చేస్తున్న ఇషాంత్ శర్మకి లాంగాన్, లాంగాఫ్‌లో ఫీల్డర్ల కూర్పుపై సలహాలివ్వబోయాడు. దీంతో.. చిర్రెత్తిపోయిన ఇషాంత్ శర్మ అతడిపై నోరుజారాడు. దీంతో.. జడేజా కూడా అదేరీతిలో స్పందించడంతో.. సహనం కోల్పోయిన ఇషాంత్ శర్మ.. అతడిపైకి దూసుకెళ్లాడు. వీరి మాటలు స్టంప్స్‌లో రికార్డవ్వడం.. ఈ దృశ్యాలను సదరు బ్రాడ్‌కాస్టర్ ప్రసారం చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. అయితే ఈ వ్యవహారం అంత పెద్దది కాదని, ఆటగాళ్ల ఎలాంటి హద్దులు దాటలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. 9. విరాట్ కోహ్లి-టిమ్ పైన్ మాటల యుద్దం పెర్త్ టెస్ట్‌ల్లోనే ఇరు జట్ల కెప్టెన్లు మాటల యుద్దానికి దిగారు. మైదానంలో వీరిద్దరు బాగా దగ్గరకు వచ్చి ఒకరినొకరు ఢీకొట్టుకున్నంత పని చేశారు! ఈ సమయంలో కోహ్లి ‘నేను నిన్నేమీ అనడం లేదు కదా. ఎందుకు ఆ అసహనం’ అని పైన్‌తో అన్నాడు. దాంతో ‘నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎందుకు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నావు’ అంటూ పైన్ బదులిచ్చాడు! ఈ వ్యవహారంతో అంపైర్ క్రిస్ గాఫ్నీ జోక్యం చేసుకొని మాట్లాడింది చాలు, మీరిద్దరు కెప్టెన్లు అంటూ సర్దిచెప్పాల్సి వచ్చింది. ‘నేనేమీ తిట్టడం లేదు, మాట్లాడటంలో తప్పేమీ లేదంటూ పైన్ చెప్పే ప్రయత్నం చేసినా అంపైర్ మళ్లీ అడ్డుకున్నారు. కోహ్లి ఔటైన తర్వాత కూడా క్రీజ్‌లో ఉన్న విజయ్‌తో ‘అతను నీ కెప్టెన్ అని నాకు తెలుసు. కానీ వ్యక్తిగా నువ్వు కూడా అతడిని ఇష్టపడవు’ అని పైన్ వ్యాఖ్యానించాడు. అయితే ఈ ఘటనలో ఇరుజట్ల ఆటగాళ్లు హద్దులు దాటలేదని, ఇవి ఆటలో సర్వసాధారణమే అని కొట్టిపారేశారు. కానీ ఆసీస్ మీడియా మాత్రం ఈ ఘటనలో కెప్టెన్ కోహ్లిని విలన్‌గా చూపించే ప్రయత్నం చేసింది. - శివ ఉప్పల -
నీతిమంతమైన నాయకుల్లా ఉండాలి
న్యూఢిల్లీ: సీబీఐ, ఆర్బీఐ వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో ఆయా సంస్థల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు నీతిమంతమైన నాయకుల్లా ఉండాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హితవు పలికారు. విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా కేంద్ర నిఘా కమిషన్ (సీవీసీ) ఏర్పాటు చేసిన సమావేశంలో కోవింద్ బుధవారం మాట్లాడారు. ‘ఇక్కడ ఉన్న వాళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలకు చెందిన అత్యున్నతాధికారులు, ప్రభుత్వాధికారులు కూడా ఉన్నారు. చిత్తశుద్ధి, పారదర్శకత, నిజాయితీ అనే పదాలకు లోతైన అర్థాలను మీరంతా అర్థం చేసుకోవడం ముఖ్యం. మీ ప్రవర్తన మీ సంస్థల్లోని వేలాది మంది ఉద్యోగులకు స్ఫూర్తినివ్వాలి. మీ పని, నైతిక విలువలు కోట్లాది మంది పౌరుల జీవితాలను ప్రభావితం చేస్తాయి. నిజానికి మీరంతా నీతిమంతమైన నాయకుల్లా ఉండాలి’ అని కోవింద్ కోరారు. అలోక్, అస్థానాలకు త్వరలో సమన్లు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాలకు త్వరలోనే సమన్లు జారీచేసే అవకాశముందని కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి బుధవారం తెలిపారు. మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో ముడిపుల స్వీకరణకు సంబంధించి వీరి వాంగ్మూలాలు నమోదుచేయొచ్చని వెల్లడించారు. -
గుమస్తా నుంచి సీఎంగా
సాక్షి,బెంగళూరు: నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన బీఎస్ యడ్యూరప్ప జీవితంలో కూడా ఎన్నో మలుపులు, వివాదాలున్నాయి. సాధారణ ప్రభుత్వ గుమస్తా నుంచి ప్రభుత్వ అధినేతగా ఎదిగిన ఆయన జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. మాండ్యా జిల్లా బూకనకెరె గ్రామంలో లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన సిద్దలింగప్ప, పుట్టతాయమ్మ దంపతులకు 1943, ఫిబ్రవరి 27న యడ్యూరప్ప జన్మించారు. 15 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై హిందుత్వ విధానాలను అనుసరించారు. డిగ్రీ పూర్తయ్యాక కర్ణాటక సాంఘిక సంక్షేమ శాఖలో క్లర్కు ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత ఉద్యోగం వదిలి స్వగ్రామంలోని ఒక రైస్ మిల్లులో పని చేశారు. ఆ మిల్లు యజమాని కుమార్తె మైత్రిదేవిని ప్రేమించి పెళ్లాడారు. 1980లో బీజేపీలో చేరి 1983లో తొలిసారిగా శికారిపుర నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఏడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2007, 2008, 2018లలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. షాకిచ్చిన జేడీఎస్: 2006లో ధరమ్‌సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ సర్కారును కూల్చడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జేడీఎస్‌తో చేతులు కలిపి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. యడ్డీ 2007లో తొలిసారి సీఎంగా ప్రమాణం చేసినా జేడీఎస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో వారంలోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. 2008లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించడంతో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అవినీతి ఆరోపణలు రావడంతో 2011లో రాజీనామా చేయ డంతోపాటు జైలుకెళ్లాల్సి వచ్చింది. జైలు నుంచి విడుదలైన తరువాత బీజేపీని వీడి కర్ణాటక జనతా పక్ష పార్టీ పేరిట సొంత పార్టీని స్థాపించారు. 2013 ఎన్నికల్లో ఆ పార్టీ ఆరు సీట్లే గెలుచుకుంది. 2014 ఎన్నికలకు ముందు తన పార్టీని బీజేపీలో విలీనం చేసి షిమోగా నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. -
వివాదాలకు కేరాఫ్
డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షబరిలో నిలిచేంతవరకు సామాన్యులెవరికీ పెద్దగా తెలియని పేరు.. ఇప్పుడు అనవసర వివాదాలకు, అనూహ్య నిర్ణయాలకు, అర్థంలేని ట్వీట్లకు, ప్రమాదకర విధానాలకు మారుపేరు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ త్వరలో సంవత్సర పాలన పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏడాదిగా ఆయన పాలనా తీరు, చుట్టుముట్టిన వివాదాలు, నిర్ణయాలపై విశ్లేషణ.. కొరియాతో కొరివి అమెరికా, మిత్రపక్షాలపై బెదిరింపులకు పాల్పడితే ఉత్తర కొరియాను ఉనికిలో లేకుండా చేస్తామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలాన్ని సృష్టించాయి. ‘లిటిల్ రాకెట్ మ్యాన్’ అంటూ కిమ్ జోంగ్‌ను రెచ్చగొట్టి.. ఉత్తరకొరియాతో కయ్యానికి కాలు దువ్వారు. అమెరికా ప్రధాన భూభాగంపై క్షిపణి దాడులు చేయగల సామర్థ్యం ఇప్పుడు ఉత్తర కొరియా సొంతం. ఆ దేశంతో జాగ్రత్తగా ఉండాలని గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరికల్ని ట్రంప్ పెడచెవిన పెట్టారు. 2018లో అమెరికాకు ఉత్తరకొరియా, ఇరాన్‌ల నుంచి ప్రమాదం పొంచి ఉందని ఉన్నతాధికారుల నివేదిక కూడా వెల్లడించింది. ఉద్వాసనల పర్వం ప్రభుత్వ వ్యవహారాల్లో ట్రంప్ దుందుడుకు వైఖరి, వివాదాస్పద నిర్ణయాలతో పలువురు ఉన్నతోద్యోగులు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఏడాది కూడా ముగియకుండానే కీలక పదవుల్లోని పలువురు ఉద్వాసనకు గురికాగా.. మరికొందరు ట్రంప్ వ్యవహారశైలి నచ్చక రాజీనామాలు సమర్పించారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమి, జాతీయ భద్రతా సలహాదారు మైక్ ఫ్లిన్ మొదలుకుని, వైట్‌హౌస్ మీడియా ప్రతినిధి షాన్ స్పైసర్ తదితరులు పదవుల నుంచి వైదొలిగారు. మిత్రులపైనా విమర్శలు ఇస్లామిక్ తీవ్రవాదంపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ట్వీటర్లో బ్రిటన్ ప్రధాని థెరెసా మే, జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్లపై ట్రంప్ విమర్శలు చేశారు. పొరుగున ఉన్న కెనడా, మెక్సికోలతో ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (నాఫ్తా) పనికి మాలినదని, దానిని సమీక్షిస్తామని ట్రంప్ ప్రకటించారు. మరోవైపు జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ ట్రంప్ తీసు కున్న నిర్ణయం పెద్ద వివాదానికి తెరతీసింది. దాదాపు ఏడు దశాబ్దాలుగా అమెరికా అనుసరిస్తున్న శాంతియుత వైఖరికి భిన్నంగా తన నిర్ణయంతో అరబ్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశారు. వెంటాడుతున్న రష్యా జోక్యం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు అనుకూలంగా రష్యా జోక్యంపై ఆరోపణల్ని విచారించేందుకు ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ట్రంప్ ప్రచార బృందం మాజీ మేనేజర్ పాల్ మనఫోర్ట్ ప్రమేయంపై ఆధారాలు లభించాయి. మనఫోర్ట్, అతని సహాయకుడు రిక్ గేట్స్లపై దేశ వ్యతిరేక కుట్ర, మనీ ల్యాండరింగ్, ఇతర ఆర్థిక ఆరోపణల్ని నమోదుచేశారు. రష్యా అధికారులతో సంబంధాలపై ఎఫ్‌బీఐకి తప్పుడు సాక్ష్యమిచ్చినట్లు ట్రంప్ ప్రచార బృందం సభ్యుడు జార్జి పపడొపౌలోస్ అంగీకరించారు. రష్యాతో తనకు ఎలాంటి రహస్య ఒప్పందం లేదని ట్రంప్ స్పందించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని పరోక్షంగా ముల్లర్ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మీ టూ’లో లైంగిక ఆరోపణలు రాజకీయాల్లోకి రావడానికి కొన్నేళ్ల ముందు ట్రంప్ తమను లైంగికంగా వేధించారని పలువురు మహిళలు ఆరోపించారు. అమెరికాలో ఉన్నతస్థానాల్లోని వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడటంపై ‘మీ టూ’ పేరిట సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున మహిళలు గళమెత్తారు. జెస్సీకా లీడ్స్, రేచల్ క్రూక్స్, సమంతా హాల్వేలు ట్రంప్‌పై తమ ఆరోపణల చిట్టా విప్పారు. ట్రంప్ రాజీనామా చేయాలని, ఆరోపణలపై పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని అమెరికా కాంగ్రెస్‌లోని 58 మంది డెమొక్రటిక్ సభ్యులు డిమాండ్ చేశారు. ట్రంప్ మాత్రం ఈ ఆరోపణల్ని తోసిపుచ్చారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
స్పైసీ సాంబార్
‘శుభం’ దగ్గరికి వచ్చేసింది 2017. అనడానికి శుభమే కానీ, సౌత్ సినీ ఇండస్ట్రీకి మొత్తమంతా శుభంగా ఏమీ జరగలేదు! పిక్చర్ హిట్లు, ఫట్ల మాట అటుంచండి. మాట జారడం, ముక్కుసూటిగా మాట్లాడ్డం.. ఈ ఏడాది పెద్ద కాంట్రవర్సీలు అయ్యాయి. కొందరు జైలుకు వెళ్లారు. కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. కొందరు ‘సారీ’ చెప్పారు. కొందరు సవాళ్లు విసిరారు. ఇవన్నీ ఇక్కడితో ఆగిపోతే బాగుంటుంది. కొత్త సంవత్సరం హ్యాపీగా మొదలౌతుంది. ఇంతకీ ఏమిటా కాంట్రవర్సీలు? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఆడియెన్స్ టెన్షన్. బాహుబలి 2ని కన్నడిగులు రిలీజ్ చెయ్యనిస్తారా? సత్యరాజ్ టెన్షన్. రాజమౌళి కూల్‌గానే ఉన్నాడు. కూల్ కావలసింది కన్నడ ప్రేక్షకులు. తొమ్మిదేళ్ల క్రితం కావేరీ నీళ్ల గొడవలో సత్యరాజ్ కత్తి బయటికి తీశాడు. కత్తి అంటే కత్తి కాదు. యాంటీ–కన్నడ స్టేట్మెంట్. కావేరీ నీళ్లివ్వకపోతే నీళ్లకు బదులు ఇంకేవో పారతాయన్న అర్థంలో ఏదో అన్నాడు సత్యరాజ్. ఆ వీడియో సడన్‌గా నెట్లో పైకి తేలింది. కన్నడిగులు భగ్గుమన్నారు. టైమ్ చూసి సినిమా గేట్లు బంద్ చేశారు. బాహుబలి 2ని కర్ణాటకలో ఆడనివ్వం అన్నారు. నీళ్లు చల్లితే మంటలు చల్లారతాయి. నీళ్ల వల్లే మంటలు రేగితే? సత్యరాజ్ షాక్‌లోకి వెళ్లిపోయాడు. రాజమౌళి నీళ్లు చల్లి కట్టప్పని కూర్చోబెట్టాడు. ‘పర్లేదు ఏం కాదు’ అన్నాడు. ఇద్దరూ విడివిడిగా వీడియోలు రిలీజ్ చేశారు. ‘అర్థం చేసుకోండి ప్లీజ్’ అని రాజమౌళి రిక్వెస్ట్ చేశాడు. ‘హర్ట్ చేసి ఉంటే సారీ’ అని సత్యరాజ్ ప్లీజ్ చేశాడు. కన్నడిగులు చల్లబడ్డారు. సెన్సార్ కత్తెర తీసింది గవర్నమెంట్‌ని ఏదైనా అనాలంటే గట్స్ ఉండాలి. ఉంటే మాత్రం ఎందుకంటాం చెప్పంyì ? అసలే గవర్నమెంట్! ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తుంది. ‘మెర్సల్’ని కూడా అలాగే కట్ చేయబోయింది. సెన్సార్ బోర్డు కూడా కత్తెరతో రెడీ అయి కూర్చుంది. జీఎస్టీకి యాంటీగా అందులో హీరో డైలాగులు కొడతాడు. వాటిని కట్ చెయ్యాలని పై నుంచి ఆర్డర్స్! లేకపోతే బ్యాన్. ‘కట్ చెయ్యనివ్వం. బ్యాన్ కానివ్వం’ అని తమిళ్ ఆడియన్స్ థియేటర్ల దగ్గరికి గస్తీగా వచ్చి కూర్చున్నారు. పిక్చర్ బతికింది. ‘మెర్సల్’ రిలీజ్‌కు ముందు కూడా.. లోపల జీఎస్టీని చూసి.. సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డ్ ‘నో’ అంది. రోడ్లు బ్లాక్ చేసి, ధర్నాలు చేసి మరీ బాక్సులు విడిపించుకున్నారు. ఈ ఏడాది సౌత్ సినీ ఇండస్ట్రీ మొత్తం మీద అతి పెద్ద కాంట్రావర్శి.. మెర్సల్. దిలీప్ జైలుకెళ్లొచ్చాడు ఫిబ్రవరిలో దిలీప్ సినిమా ఇండస్ట్రీకి పెద్ద షాక్ ఇచ్చాడు. కోలీవుడ్‌కి మాత్రమే ఆ షాక్ లిమిట్ కాలేదు. సౌత్ మొత్తానికీ కొట్టింది. ఆయనేం బ్లాక్ బస్టర్ ఇవ్వలేదు. ‘బ్యాడ్‌మ్యాన్’గా బయటికొచ్చాడు! మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో నటిస్తున్న ఓ బ్యూటిఫుల్ స్టార్లెట్ని కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధించడానికి కుట్ర పన్నాడని పోలీసులు దిలీప్ని అరెస్ట్ చేశారు. రెండు నెలలు జైల్లో ఉండి, బెయిల్‌పై బయటికి వచ్చాడు. హీరోకి విలన్ బుద్ధేమిటి అని అభిమానులు తలవంపుగా ఫీల్ అయ్యారు. మనకీ ఖర్మ ఏమిటి అని ‘రామ్‌లీల’ నిర్మాతలు తలలు పట్టుకున్నారు. అందులో దిలీప్‌ది లీడ్ రోల్. పొలిటికల్ కాన్స్పిరసీ థ్రిల్లర్. సరిగ్గా రిలీజ్‌కి రెడీగా ఉన్నప్పుడు దిలీప్ అరెస్ట్ అయ్యాడు. దిలీప్ మీద కోపం సినిమా పైకి మళ్లింది. మహిళా సంఘాలు, రాజకీయ పక్షాలు సినిమా రిలీజ్‌ను అడ్డుకున్నాయి. దిలీప్ని వేరుగా, సినిమాను వేరుగా చూడండి అని ఇండస్ట్రీ ప్రాధేయపడింది. సినిమా రిలీజ్ అయింది! అవడమే కాదు, బ్లాక్‌బస్టర్ అయింది! దిలీప్ పాత్రను పాత్రగానే చూసింది కోలీవుడ్. అపహరణ కేసులో దిలీప్ పాత్రేమిటో ఇంకా తేల్లేదు. కేసు నడుస్తోంది. ఫొటోలు లీక్ అయ్యాయి సౌత్ సినీ ఇండస్ట్రీలో ఈ ఏడాది మోస్ట్ కంగాళీ వ్యవహారం ‘సుచీలీక్స్’. శుచీ శుభ్రత ఏమాత్రం లేని లీక్స్! తమిళ్ సింగర్, రేడియో జాకీ సుచిత్రా కార్తీక్ తన ట్విట్టర్లో కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. ఎవరెవరో ఎవరెవరితోనో ఉన్న మూవీస్టార్ల ఫొటోలు అవి. వాటిల్లో ధనుష్ కూడా ఉన్నాడు. కొన్ని గంటల తర్వాత సుచిత్ర వాటిని డిలీట్ చేసింది. ఆ తర్వాత మళ్లీ కొత్త ఫొటోలు పెట్టింది. సుచిత్ర భర్త నెత్తీనోరూ బాదుకుంటూ, ‘నా భార్య మెంటల్ కండిషన్ బాగోలేదు’ అంటూ ఓ వీడియో అప్లోడ్ చేశాడు. ‘ఇదేం గొడవ తల్లీ..’ అని పోలీసులు వెళ్లి అడిగితే, ‘నా ట్విట్టర్ అకౌంట్‌ని ఎవరో హ్యాక్ చేశారు’ అంది సుచిత్ర. ‘ఇంకా ఏవైనా లీక్స్ ఉన్నాయా చెప్పు’ అని అడిగారు. ఆ సంగతి హ్యాక్ చేసినవాళ్లకు కదా తెలుస్తుందీ’ అని అమాయకంగా కనురెప్పలు టపటపలాడించింది. మీడియా ఈ వ్యవహారానికి ‘సుచీలీక్స్’ అని పేరు పెట్టింది. వల్గర్‌గా మాట్లాడారు! ధన్యా రాజేంద్రన్ చెన్నై జర్నలిస్ట్. విజయ్ సినిమా ‘సుర’ మీద ట్విట్టర్లో క్యాజువల్‌గా ఆమె పెట్టిన కామెంట్‌కి విజయ్ అభిమానులంతా ఇంతెత్తున లేచారు. నానా మాటలు అన్నారు. రేప్ చేసి చంపుతాం అన్నారు. ఇంతాచేసి ‘సుర’ సినిమాను ఆమె డైరెక్టుగా ఏమీ అనలేదు. ఆ ‘సుర’ కూడా ఇప్పుడు రిలీజ్ అయింది కాదు. ఏడేళ్ల నాటిది! ‘‘షారుక్ ఖాన్ మూవీ ‘వెన్ హ్యారీ మెట్ సెజల్’ని చూశాను తల వాచి పోయింది. ఇంతకన్నా ‘సుర’ మూవీనే నయం. కనీసం ఇంటర్వెల్ వరకైనా చూడగలిగాను’’ అని ధన్య ట్వీట్ చేశాక ఆమెకు నరకం మొదలైంది. ‘‘ఆమె జర్నలిస్టు. విమర్శించే హక్కు ఉంటుంది. కానీ ఆ వెటకారమే మాకు నచ్చడం లేదు’’ అని మాత్రం ఒక మర్యాదపూర్వకమైన ట్వీట్ వచ్చింది ధన్యకు. చివరికి విజయ్ సీన్లోకి వచ్చి.. ‘స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం’’అని స్టేట్మెంట్ ఇచ్చాక గానీ ట్వీట్ల వర్షం ఆగలేదు. మమ్ముట్టీ ఫ్యాన్స్‌కి మండింది మలయాళం మూవీ ‘అంగమలి డైరీస్’తో అన్నా రేష్మా రాజన్ ఈ యేడాదే కొత్తగా ఫీల్డ్‌లోకి వచ్చింది. చాలామందికి నచ్చింది. మీడియావాళ్లక్కూడ. ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో రేష్మా రాంగ్ స్టెప్ వేసింది. నిజానికి అది రాంగ్ స్టెప్ కాదు. మమ్ముట్టీ, ఆయన కొడుకు దుల్కర్ సల్మాన్ల అభిమానులకు రాంగ్ అయింది. ‘‘మమ్ముట్టీ, దుల్కర్ ఇద్దరూ ఒకే సినిమాలో యాక్ట్ చేస్తుంటే.. మీరు ఎవరి పక్కన నటించడానికి ఇష్టపడతారు?’’ అన్నది క్వశ్చన్. వెంటనే రేష్మ.. దుల్కర్ పేరు చెప్పింది. ‘ఎందుకు?’ అనంటే, ‘మమ్ముట్టీ తండ్రి పాత్రకు బాగుంటారు’ అంది. అంతే.. ఆమె మీద ట్రాల్స్ మొదలయ్యాయి. ‘మోహన్‌లాల్ కావాలి కానీ, మమ్ముట్టీ వద్దా నీకు..’ అని వల్గర్ కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. (‘అంగమలి డైరీస్’ తర్వాత ‘వెలిపడింటే పుస్తకం’ అనే సినిమాలో మోహన్‌లాల్ పక్కన యాక్ట్ చేసింది రేష్మ). రేష్మ ఏడ్చేసింది. ఇంట్లో ఒక్కతే కూర్చొని కాదు. ఏడుస్తూ ఫ్యాన్స్‌కి క్షమాపణ చెప్తున్న వీడియోను ఫేస్బుక్లో పెట్టింది. కసాబా కామెంట్‌పై గొడవైంది పార్వతి ఇంకో కేరళ కుట్టి. ముక్కుసూటి నటి. ఏడ్చే టైపు కాదు. ఈ ఏడాది కేరళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్యానెల్ మెంబర్‌గా ఆమె మమ్ముట్టి ‘కసాబా’ మూవీని విమర్శించింది. అందులో మమ్ముట్టీ పోలీస్ ఆఫీసర్. రఫ్ క్యారెక్టర్. ఓ సీన్లో అతడు ఉమన్ పోలీస్ ఆఫీసర్ నడుముకు ఉన్న బెల్టును పట్టి లాగుతూ, స్త్రీల ప్రతిభను తక్కువ చేసే డైలాగులు చెప్తాడు. పార్వతికి అది నచ్చలేదు. బ్యాడ్ క్యారెక్టర్ అంది. మమ్ముట్టిని అనలేదు. మమ్ముట్టి వేసిన క్యారెక్టర్ని అంది. అది అర్థం చేసుకోకండా ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో పార్వతిని ఇష్టం వచ్చినట్లు తిట్టారు. స్టేజీ మీదే తిట్టేశారు సాయి ధన్సిక కన్నీళ్లు పెట్టుకోవడం, అమలాపాల్ బాగా హర్ట్ అవడం కూడా ఏడాది టాక్ ఆఫ్ ది సౌత్ అయింది. నవంబర్‌లో రిలీజ్ అయిన ‘విళిత్తిరు’ మూవీ ప్రెస్మీట్లో డైరెక్టర్ రాజేంద్రన్ (ఆ సినిమా డైరెక్టర్ కాదు)ను సాయి ధన్సిక స్టేజ్ మీదకు ఆహ్వానించడం మర్చిపోవడం ఆయన అభిమానులకు బాగా కోపం తెప్పించింది. అమలాపాల్‌కు జరిగిన ఇన్సల్ట్ వేరే ఇంకో ప్రోగ్రామ్‌లో. అమల లేని ఆ స్టేజ్‌పైన అమలను తిట్టింది ఎడిటర్ లెనిన్. ఒక ఇంటర్వ్యూలో అమల చెప్పిన మాటల్ని అపార్థం చేసుకుని అమలను కించపరిచేలా ఆయన మాట్లాడాడు. ‘తిరుట్టు పాయలే 2’ చిత్రం పోస్టర్లలో అమల నాభి కనిపిస్తుంది. దీనిపై విమర్శలు వచ్చినప్పుడు.. 2017లో కూడా మనం హీరోయిన్ నాభి గురించి మాట్లాడుతున్నాం అని అమల ఆశ్చర్యపోయింది. ఆ మాట లెనిన్‌కి కోపం తెప్పించింది. ‘నాభికేం కర్మ, నాభి లోపలికి కూడా చూపించేస్తారు ఈ హీరోయిన్లు.. ఛీ’ అన్నాడు! నేషనల్ అవార్డు విన్నర్ అయిన లెనిన్ ఇలా సంస్కారం లేకుండా మాట్లాడ్డంతో ఇండస్ట్రీ విస్తుపోయింది. శింబూ తల తెగబోయింది 2017లో ఇంకో పెద్ద కాంట్రవర్శీ... శింబూ షూటింగ్‌లను ఎగ్గొట్టి నిర్మాతలను ఇబ్బంది పెట్టడం. అతని ఇండిసిప్లీన్ బిహేవియర్ వల్ల స్కెడ్యూళ్లు దెబ్బతిని తమకు నష్టాలు వచ్చాయని మరికొందరు నిర్మాతలు బయటికి వచ్చారు. శింబును అసలే ఏ సినిమాలోకీ తీసుకోకూడదని తీర్మానించారు. శింబూ సారీ చెప్పి తప్పించుకున్నాడు. తమిళ్, కన్నడం, మలయాళం అయ్యాయి. ఇక తెలుగు ఒక్కటి మిగిలింది. ఇక్కడేం లేవా? పెద్దగా లేవు. ఉన్న ఒకదాన్నీ పెద్దది చేద్దామని మీడియా చూసింది కానీ, తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. మీకు గుర్తుండే ఉంటుంది. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లో నటుడు చలపతిరావుని మాట్లాడించి, íసినిమాలోని ఒక డైలాగ్‌కి ఆయన చేత ఆన్సర్ చెప్పించడంతో వివాదం మొదలైంది. ఇవండీ.. 2017లో అభిమానుల యాటిట్యూడ్ వల్ల యాక్టర్లకు వచ్చిన తిప్పలు, తలనొప్పులు; యాక్టర్ల బోల్డ్ బిహేవియర్ వాళ్ల అభిమానులకు వచ్చిన కోపాలు, తాపాలు. -
స్మతి ఇరానీ.. వివాదాల మహారాణి..!
న్యూఢిల్లీః కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీపై విదేశీ మీడియా విమర్శనాస్త్రాలు గుప్పించింది. ఆమె ఓ పవర్ ఫుల్ మంత్రే కాదు వివాదాల మహరాణి అంటూ ఛలోక్తులు విసిరింది. మీలో ఏ లక్షణాలను గుర్తించి మీకు ప్రధాని నరేంద్రమోదీ మంత్రి పదవిని ఇచ్చారన్న ఓ టెలివిజన్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించిన తీరు.. మరోసారి వివాదాన్ని తెచ్చిపెట్టింది. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోగా స్టూడియోలో ప్రేక్షకుల ముందు ఆమె అదే ప్రశ్నను పునరావృతం చేసి అక్కడివారిని రెచ్చగొట్టిన తీరుపై ఫారెన్ మీడియా మండి పడుతోంది. ఇప్పటికే నకిలీ డిగ్రీ ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రి స్మతి ఇరానీపై విదేశీ మీడియా విమర్శలు ఎక్కుపెట్టింది. ఓ టీవీ స్టూడియోలో ఆమె ప్రవర్తించిన తీరును తప్పుపడుతోంది. టీవీ స్టూడియోలో స్మృతిని పాత్రికేయుడు అడిగిన ప్రశ్ననే... ఆమె రిపీట్ చేసి.. అక్కడున్న వారిని రెచ్చగొట్టడంతో వారంతా సదరు జర్నలిస్టుపైకి దూసుకొచ్చి.. దాదాపు కొట్టినంత పనిచేసిన నేపథ్యంలో విదేశీ మీడియా విరుచుకుపడుతోంది. మీలో ఎటువంటి లక్షణాలను గుర్తించి మీకు మంత్రి పదవి ఇచ్చారంటూ సదరు జర్నలిస్టు అడిగిన ప్రశ్న ఆమెలో ఆగ్రహాన్ని తెప్పించిందో.. లేదా ఉద్దేశపూర్వకంగానే ఆమె ఆలా ప్రవర్తించిందో తెలియదు గానీ... అతడు అడిగిన ప్రశ్ననే స్టూడియోలోని ప్రేక్షకులముందు రిపీట్ చేసింది. దీంతో రెచ్చిపోయిన అక్కడి జనం.. కుర్చీలపైనుంచి దూకి.. వేదికపైకి దూసుకొచ్చిన పాత్రికేయుడ్ని కొట్టినంత పని చేశారు. అయితే అంతటి వ్యతిరేకత వస్తుందని ఆమె అనుకుందో లేదో గాని... వారి అభిమానానికి ఓ పక్క ఆనందించినా పరిస్థితులు అదుపు తప్పడంతో స్టేజిపైకి వచ్చిన వారిని వారించి, సదరు జర్నలిస్టును కొట్టకుండా కాపాడింది. ప్రముఖ రాజకీయ నాయకురాలు, నరేంద్రమోదీ ప్రభుత్వంలో మానవవనరుల శాఖామంత్రిగా కొనసాగుతున్న 40 ఏళ్ళ స్మృతి ఇరానీ.. తన విద్యార్హతల విషయంలో ఇప్పటికే పలు వివాదాలు ఎదుర్కొంటున్నారు. ప్రఖ్యాత టీవీ నటిగా ఎన్నో అవార్డులు, రివార్డులూ అందుకున్న ఆమె... రాజకీయాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకొన్నారు. దీనికి తోడు ఎప్పుడూ తన పదునైన ప్రసంగాలతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం కూడ ఆమెలోని మరో ప్రత్యేకతగా చెప్పాలి. లోక్ సభ, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కేంద్రమంత్రి... ఎన్నికల కమిషన్ కు సమర్పించిన మూడు అఫిడవిట్లలో తన విద్యార్హతలు ఒక్కోదాంట్లో ఒక్కో విధంగా ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆమెను మంత్రి పదవినుంచీ తొలగించాలన్న డిమాండ్లుకూడ వెల్లువెత్తాయి. ఫిబ్రవరి నెలలో జరిగిన సుమారు 42 విశ్వవిద్యాలయాలకు చెందిన అధిపతుల సమావేశంలోనూ స్మృతి ప్రవర్తించిన తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాదు ఆమెను ఫోటో తీయాలని చూసిన ఓ ప్రొఫెసర్ ను దురుసుగా తోసేయడంకూడ పెద్ద దుమారమే రేపింది. అయితే ఆమె అజ్ఞానం, అహంకారం కలసి ప్రమాదకరంగా మారుతున్నాయంటూ అప్పట్లో రామచంద్ర గుహ అనే ఓ రాజకీయ చరిత్రకారుడు సైతం విమర్శించడం విశేషం. ఏదై ఏమైనా స్మృతి ఇరానీ ఇప్పుడు విదేశీ మీడియా దృష్టిలో పడి మరోసారి వివాదాలు ఎదుర్కొంటున్నారు. -
వివాదాలపై తొలిసారి నోరు విప్పిన అనిరుధ్
ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) ఉత్సవం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రెండు రోజులు జరుగనున్న ఈ వేడుకలో మొదటిరోజు ఆదివారం తమిళ, మలయాళ కళాకారులకు అవార్డులను అందజేశారు. ఈ వేడుకలో ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్, సమంత జంటగా నటించిన 'కత్తి' సినిమాకి అందించిన సంగీతానికిగాను ఉత్తమ సంగీత దర్శకుడిగా అనిరుధ్ ఎంపికయ్యారు. డిసెంబర్ నెలలో 'బీప్' సాంగ్ పై వివాదం చెలరేగినప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉన్న యువ సంగీత దర్శకుడు అనిరుధ్ తొలిసారి ఐఫా వేదికపై నోరు విప్పాడు. ఉత్తమ సంగీత దర్శకుడిగా ఐఫా పురస్కారాన్ని అందుకుంటూ అనిరుధ్.. 'సాధారణంగా నేను స్టేజ్ మీద మాట్లాడను, కానీ ఈరోజు మాట్లాడతాను. కొలవెరి ఢీ పాట సమయం నుంచే నాకు ఇబ్బందులు మొదలయ్యాయి. కత్తి మూవీ రిలీజ్ టైంలో కూడా చాలా వివాదాలను ఎదుర్కొన్నాను. చివరిగా నేను నేర్చుకున్నదేంటంటే.. వివాదాలను అస్సలు లెక్క చేయకూడదు, మనం పని మీద మాత్రమే శ్రద్ధ పెట్టాలి. గత నాలుగేళ్లుగా నన్నెంతో ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు, ఈ నాలుగేళ్లలో 11 సినిమాలకు సంగీతం అందించాను. ఒక్కటి మాత్రం నేను కచ్చితంగా చెప్పగలను.. బాధ లేకుండా విజయం ఉండదు' అంటూ ముగించాడు ఈ యువ తరంగం. మహిళలను కించపరిచే పదజాలంతో పాడిన 'బీప్' సాంగ్ వివాదంలో తమిళ హీరో శింబు, సంగీత దర్శకుడు అనిరుధ్ లపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని వారాల తర్వాత అనిరుధ్ మాట్లాడటం సినీ సర్కిల్స్ లో ఆసక్తి కలిగించింది. -
వర్మపై మండిపడుతున్న బోనీకపూర్ ?
-
సమస్యలు, సవాళ్లు, నిత్యం నావెంటే...
చెన్నై: విలక్షణమైన, వైవిధ్యభరితమైన సినిమాలు, అద్బుతమైన నటనతో సినీ అభిమానులను అలరించే ప్రముఖ నటుడు కమలహాసన్ ఉత్తమ విలన్ సినిమా ప్రమోషన్ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తన సినిమాలు వివాదాస్పదం కావడం, విడుదల లేటవ్వడంపై స్పందించారు. తనను కావాలనే టార్గెట్ చేసి, నిరంతరం ఇబ్బంది పెడుతున్నారని , అయినా తాను వెరవనన్నారు. ''నా దారి ముళ్లదారి..సమస్యలు, సవాళ్లు నాకు అలవాటే... అయినా నా పయనం ఆగదు'' అంటున్నారు ఈ 60 ఏళ్ల సీనియర్ నటుడు. పాపనాశం సినిమా వివాదం ఎవరు సృష్టించారో తనకు తెలుసన్నారు. సాండియార్ టైటిల్ ఇలా సినిమా ప్రకటించానో అలా వివాదం మొదలైందని... మరి అదే పేరుతో సినిమా విడుదలైనా ఎవరూ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. పాపనాశం, విశ్వరూపం -2 సినిమాల ఆలస్యానికి కూడా ఇలాంటి వివాదాలే కారణమన్నారు. మరోవైపు సినిమాలో కీలకమైన సెన్సార్ బోర్డుపై ఆయన విమర్శలు గుప్పించారు. ముంబై ఎక్స్‌ప్రెస్ సినిమా టైటిల్ వివాదాన్ని గుర్తు చేశారు. ముంబై అనే మాట తమిళభాషలో లేదని అభ్యంతరం చెప్పారనీ, మరి తమిళ భాషలో ముంబైని ఏమంటామని ఆయన ప్రశ్నించారు. సెన్సార్ బోర్డు భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని మండిపడ్డారు. కళాకారుడినైన తనకు ఏదైనా మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు ఉంటుందని తెలిపారు. ''నేను పనీపాటా లేకుండా కూర్చోలేను. ప్రేక్షకులను మంచి సినిమాలతో ఆకట్టుకోవడకోవడమే నా ఆశయం. నానుంచి వారు ఆశిస్తున్న దాన్ని అందించడంకోసం నిరంతరం తపన పడతాను'' అన్నారు కమల్. విశ్వరూపంలో సినిమా ముస్లింలను కించపరిచేలా ఉందని వివాదం చెలరేగడంతో వినూత్న రీతిలో డీటీహెచ్ మీడియా ద్వారా సినిమాను విడుదల చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా కమల్ తమిళంలో మరోనూతన ప్రాజెక్టు పనులు ప్రారంభించినట్టు తెలుస్తోంది. -
2014: విజయాలు.. వివాదాలు
కాలగర్భంలో మరో సంవత్సరం కలసిపోతోంది. తీపి, చేదు జ్ఞపకాలతో 2014కు వీడ్కోలు చెబుతున్న భారత క్రీడారంగం.. ఎన్నో ఆశలతో 2015కు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది అంతర్జాతీయ క్రీడా యవనికపై మనోళ్లకు చిరస్మరణీయ రికార్డులు, వివాదాలు, పరాజయాలు.. ఇలా మిశ్రమ అనుభూతులు ఎదురయ్యాయి. అలాగే క్రీడా ప్రపంచానికి కొన్ని విషాదకర ఘటనలు పీడకలల్ని మిగిల్చాయి. 2014లో మరచిపోలేని జ్ఞాపకాలు కొన్ని.. క్రికెట్: భారత క్రికెట్ జట్టుకు 2014 మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. టెస్టు క్రికెట్లో ముఖ్యంగా విదేశీ గడ్డపై పరాజయాలు.. టి20 ప్రపంచ కప్ ఫైనల్లో పేలవ ప్రదర్శన అభిమానులకు చేదు జ్ఞాపకాలుగా మిగిలాయి. దీనికితోడు ఐపీఎల్ వివాదం, జడేజా-అండర్సన్, కోహ్లి-ధావన్‌ల మధ్య గొడవలు మచ్చ తెచ్చాయి. రోహిత్ వండర్: యువ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ వీరోచిత ప్రపంచ రికార్డు సృష్టించడం భారత క్రికెట్‌కు ఊరట కలిగించే విషయం. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో వన్డేలో రోహిత్ అనితర సాధ్యమైన రీతిలో 173 బంతుల్లోనే 33 ఫోర్లు, 9 సిక్సర్లతో 264 పరుగులు చేశాడు. ధోనీ ప్రపంచ రికార్డు: భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక స్టంప్ అవుట్లు చేసిన కీపర్‌గా ధోనీ (134) సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో ధోనీ ఈ ఘనత సాధించాడు. దీంతో శ్రీలంక ఆటగాడు సంగక్కర (133) పేరిట ఉన్న రికార్డు తెరమరుగైంది. ధోనీ టెస్టుల్లో 38, వన్డేల్లో 85, టి-20ల్లో 11 స్టంప్ అవుట్లు చేశాడు. విరాట్-అనుష్క లవ్వాట: భారత యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ భామ అనుష్క శర్మ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు. విరాట్‌తో తన అనుబంధాన్ని ఇటీవల అంగీకరించిన అనుష్క.. పెళ్లి విషయం మాత్రం తగిన సమయంలో చెబుతానంటూ సస్పెన్షన్‌లో ఉంచింది. విరాట్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లగా అనుష్క కూడా ప్రియుడి చెంతకు చేరింది. ఈ ప్రేమ జంట కొత్త సంవత్సర వేడుకలను ఆస్ట్రేలియాలో జరుపుకోనుంది. అండర్సన్ ఫాస్టెస్ట్ సెంచరీ: న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కోరీ అండర్సన్ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నెలకొల్పాడు. క్వీన్స్‌టౌన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అండర్సన్ 36 బంతుల్లోనే 4 ఫోర్లు, 12 సిక్సర్లతో శతకం బాది షాహిద్ అఫ్రిది పేరిట ఉన్న రికార్డును (37 బంతుల్లో 100) బద్దలు కొట్టాడు. సిడ్నీ విషాదం: ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ ఆకస్మిక మరణం.. ప్రపంచ క్రికెట్‌కు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో బౌన్సర్ తలకు తగలడంతో తీవ్రంగా గాయపడిన 25 ఏళ్ల హ్యూస్ మృతి చెందడం క్రీడాభిమానులను కలచివేసింది. బ్యాడ్మింటన్ వెరీ గుడ్: అంతర్జాతీయ వేదికపై ఈ ఏడాది భారత బ్యాడ్మింటన్ అద్భుత విజయాలు సాధించింది. ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ సహా సింధు, శ్రీకాంత్, కశ్యప్ తదితరులు సత్తాచాటారు. గతేడాది ఒక్క టైటిల్ కూడా నెగ్గలేకపోయిన సైనా నెహ్వాల్ ఈ ఏడాది మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. జనవరిలో ఇండియన్ గ్రాండ్‌ప్రి గోల్డ్‌తో టైటిల్ వేట ఆరంభించిన సైనా, ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్, చైనా ఓపెన్ ప్రీమియర్ టైటిళ్లను సాధించింది. మరో తెలుగుతేజం పీవీ సింధ ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో భారత్ నుంచి గతంలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకుంది. వరుసగా రెండోసారి ఈ మెగా ఈవెంట్లో సింధు కాంస్య పతకాన్ని నెగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరెన్నో చిరస్మరణీయ విజయాలు సొంతం చేసుకుంది. ఇక యువతార కిడాంబి శ్రీకాంత్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో శ్రీకాంత్ విజేతగా నిలిచాడు. ఈ టోర్నీ ఫైనల్లో బ్యాడ్మింటన్ దిగ్గజం లిన్ డాన్‌ను అతని సొంతగడ్డపైనే ఓడించి శ్రీకాంత్ పెను సంచలనం సృష్టించాడు. మరో భారత అగ్రశ్రేణి ప్లేయర్ పారుపల్లి కశ్యప్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని నెగ్గి తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. మెరిసిన సానియా: ఈ ఏడాది భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కొత్త శిఖరాలను అధిరోహించింది. నమ్మశక్యంకాని విజయాలు సాధించి పూర్వ వైభవం సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో హొరియా టెకావ్ (రుమేనియా)తో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచిన సానియా... యూఎస్ ఓపెన్‌లో బ్రూనో సోరెస్ (బ్రెజిల్)తో కలిసి మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఇక ఆసియా క్రీడల్లో సాకేత్ మైనేనితో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణం, ప్రార్థన తొంబారేతో కలిసి మహిళల డబుల్స్‌లో కాంస్యం సాధించింది. హాకీ: జాతీయ క్రీడకు ఈ ఏడాది కలిసొచ్చింది. ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన టీమిండియా 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో మరోసారి రజతం నెగ్గింది. ప్రపంచకప్‌లో నిరాశపరిచినా... చాంపియన్స్ ట్రోఫీలో నాలుగో స్థానాన్ని సంపాదించింది. సరితపై వేటు: ఈ ఏడాది భారత బాక్సింగ్ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. ఆసియా క్రీడల్లో మేరీకోమ్ (51 కేజీలు) స్వర్ణం సాధించగా... ఇవే క్రీడల్లో సెమీఫైనల్ ఫలితంపై నిరసన వ్యక్తం చేస్తూ సరితా (60 కేజీలు) కాంస్య పతకాన్ని స్వీకరించేందుకు నిరాకరించింది. సరితపై ఏడాదిపాటు నిషేధం విధించారు. షూటర్ల గురి కుదిరింది భారత షూటర్ జీతూ రాయ్ ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు. ప్రపంచకప్‌లో మూడు పతకాలు సాధించిన ఈ ఆర్మీ షూటర్ ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో, ఆసియా క్రీడల్లో 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో పసిడి పతకాలు నెగ్గాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం నెగ్గి 2016 రియో ఒలింపిక్స్‌కు బెర్త్ ఖాయం చేసుకున్నాడు. స్టార్ షూటర్ అభినవ్ బింద్రా కామన్వెల్త్ గేమ్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో స్వర్ణం నెగ్గడంతోపాటు ఆసియా క్రీడల్లో రెండు కాంస్యాలు సాధించాడు. గగన్ నారంగ్, ప్రకాశ్ నంజప్ప, సంజీవ్ రాజ్‌పుత్... మహిళా షూటర్లు రాహీ సర్నోబాత్, అయోనిక పాల్, అపూర్వీ చందేలా, మలైకా గోయల్ తదితరులు కూడా కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించారు. బిలియర్డ్స్, స్నూకర్ పంకజ్ అద్వానీ తన ఖాతాలో 12వ ప్రపంచ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. 12 ప్రపంచ టైటిల్స్‌లో నాలుగు ఈ ఏడాది సాధించడం విశేషం. బెంగళూరుకు చెందిన పంకజ్ ఈ సంవత్సరం టైమ్ ఫార్మాట్, పాయింట్ల ఫార్మాట్, వరల్డ్ టీమ్ బిలియర్డ్స్, వరల్డ్ సిక్స్-రెడ్ స్నూకర్ టోర్నీల్లో విజేతగా నిలిచాడు. ఆనంద్‌కు మరో ఓటమి విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మరోసారి కార్ల్సన్ (నార్వే) చేతిలో ఓడిపోయాడు. కాగా చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో భారత్ తొలిసారి కాంస్య పతకాన్ని నెగ్గి చరిత్ర సృష్టించింది. పరిమార్జన్ నేగి, సేతురామన్, శశికిరణ్, అధిబన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ లలిత్‌బాబు సభ్యులుగా ఉన్నారు. కోనేరు హంపి దిలిజాన్, తాష్కెంట్‌లలో జరిగిన మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌లలో విజేతగా నిలిచి ఓవరాల్‌గా రెండో స్థానాన్ని సంపాదించింది. రెజ్లింగ్ పట్టు చిక్కింది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మినహా... మిగతా అన్ని ఈవెంట్స్‌లో భారత రెజ్లర్లు పతకాల పట్టు పట్టారు. కామన్వెల్త్ గేమ్స్‌లో యోగేశ్వర్ దత్, సుశీల్ కుమార్, అమిత్ కుమార్, వినేశ్ స్వర్ణ పతకాలను సాధించారు. ఆసియా క్రీడల్లోనూ యోగేశ్వర్ దత్ రాణించి పసిడి పతకం నెగ్గాడు. 1986 తర్వాత ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గిన భారత రెజ్లర్‌గా అతను గుర్తింపు పొందాడు. కామన్వెల్త్లో ఐదో స్థానం: స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 15 స్వర్ణాలు, 30 రజతాలు, 19 కాంస్యాలు సాధించి మొత్తం 64 పతకాలతో ఐదో స్థానంలో నిలిచింది. ఆసియా గేమ్స్‌లో 8వ స్థానం: దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నగరంలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ 11 స్వర్ణాలు, 10 రజతాలు, 36 కాంస్యాలతో కలిపి మొత్తం 57 పతకాలు సాధించి ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది. -
పుస్తకాలూ, వివాదాలు..
నేషనల్ డెస్క్: 2014లో వెలువడిన పలు పుస్తకాలపై తీవ్రస్థాయిలోనే వివాదాలు వెల్లువెత్తాయి. పుస్తకాల్లోని సంచలనాత్మక అంశాలపై అభ్యంతరాలు, ఆక్షేపణలూ వచ్చాయి. రచయితలకు ఈ స్థాయిలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఎందుకన్న ప్రశ్నలూ తలెత్తాయి. అధికారంలో అగ్రస్థానంలో ఉన్న నేతలనే లక్ష్యంగా చేసుకున్న పుస్తకాలు ఈ ఏడాది పెద్దసంఖ్యలో వచ్చాయి. ఠ మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మాజీ మీ డియా సలహాదారు సంజయ్ బారు రాసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అన్న పుస్తకం వివాదాస్పదమైంది. యూపీఏ హయాంలో మ న్మోహన్ బలహీనమైన ప్రధానిగా మిగిలిపోయారని, మంత్రివర్గ సహచరుల అవకతవకలపై కూడా ఆయన ఏమీచేయలేకపోయారని సంజ య్ బారు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెనుసంచలనం సృష్టించాయి. కేంద్ర బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పి.సి. పరేఖ్ రాసిన ‘క్రూసేడర్ ఆర్ క్రాన్స్పిరేటర్? కోల్గేట్ అండ్ అదర్ ట్రూత్స్’ అనే పుస్తకంలో కూడా మన్మోహన్పై భారీ విమర్శలొచ్చాయి. ఠ మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్‘యువర్స్ సిన్సియర్లీ’ పుస్తకంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాపై వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. రాహుల్ గాంధీ వ్యతిరేకించడం వల్లనే సోనియా2004లో ప్రధాని పదవిని స్వీకరించలేదని నట్వర్ సింగ్ పేర్కొనడం వివాదం రేకెత్తించింది. ఠ‘ది డ్రమెటిక్ డికేడ్: ది ఇందిరాగాంధీ ఇయర్స్’ శీర్షికతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకం కూడా ఎంతో సంచలనానికి కారణమైంది. ఇం దిర హయాంలో విధించిన ఆత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) గురించి ప్రణబ్ ప్రస్తావించారు. రాజ్యాంగంలోని నిబంధనలను గురించి పట్టిం చుకోకుండా ఎమర్జెన్సీని విధించడం అప్పట్లో ఇందిరా గాంధీ తీసుకున్న ఆవేశపూరిత నిర్ణయమని, అందుకు కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో భారీమూల్యమే చెల్లించుకోవాలకల్సి వచ్చిందని ప్రణబ్ ముఖర్జీ రాశారు. -
నేడు అసెంబ్లీలో డీఎల్ఎఫ్ భూ కేటాయింపుల పై చర్చ
-
వివాదాల వర్మ మరో విజయం!
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వివాదం సృష్టించడం ద్వారా తన చిత్రానికి విపరీతమైన ప్రచారం పొంది మరోసారి విజయం సాధించారు. తన విజయపరంపరలో ఈసారి ఓ అడుగు ముందుకు వేశారు. కనీసం సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టకుండానే, వాల్‌పోస్టర్ ద్వారానే సంచలనం సృష్టించారు. వివాదాలాకు కేంద్ర బిందువైన రాము తన చిన్ననాటి జీవితానుభవం ఆధారంగా ఓ చిత్రం రూపొందించదలిచారు. తొలుత దానికి సావిత్రి అని పేరు పెట్టారు. ఈ మూవీకి సంబంధించి గీతాంజలి అనే మోడల్‌తో ఫొటో షూట్ ఒక్కటి మాత్రమే జరిగింది. వెంటనే వాల్‌పోస్టర్ విడుదల చేశారు. సావిత్రి పేరుతో ఓ టీచర్ అందాలను ఓ కుర్రాడు తొంగి తొంగి చూస్తూ ఉన్న స్టిల్ అది. అంతే ఇక విమర్శలు, వివాదం మొదలు. చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే రోజులలో తమ ఇంగ్లీష్ టీచర్ 'సరస్వతి' అంటే తనకు పిచ్చెక్కిపోయేదని తెలిపారు.ఆ సరస్వతే ఈ 'సావిత్రి' అని వివరించారు. ప్రతి టీనేజర్ జీవితంలో ఒక సావిత్రి ఉంటుందన్నారు. అంతే కాకుండా ఆ వయసులో కూడా చాలా మందికి ఇటువంటి అనుభవాలు ఉండే ఉంటాయని చెప్పారు. టీచరో, పక్కింటి లేదా ఎదురింటి ఆంటీనో, అక్క ఫ్రెండో, ట్యూషన్ టీచరో....ఇలా రకరకాల 'సావిత్రి'లు ఉండే ఉంటారన్నది వర్మ అభిప్రాయం. అందులో నిజంలేకపోలేదు. అలా అందరి జీవితాల్లో తారసపడిన ఆ సావిత్రులందరి పట్ల వారివారి అభిప్రాయాల ఆధారంగా ఈ సినిమా మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. అంతటితో ఆగకుండా 'మీ సావిత్రి ఎవరు?' అనే కాంటెస్ట్ కూడా మొదలుపెట్టారు. పాఠకుల అనుభవాలను కూడా తమకు పంపమని కోరారు. 'సావిత్రి' సినిమా టైటిల్‌ను ఇప్పటికే మరొకరు రిజిష్టర్ చేసుకోవడం వల్ల ఆ పేరును మార్చవలసి వచ్చింది.దాంతో వర్మ తనకు ఇష్టమైన శ్రీదేవి పేరు పెట్టారు. వర్మకు ఆ పేరు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. శ్రీదేవి-వెంకటేష్‌లతో వర్మ దర్శకత్వం వహించిన 'క్షణం క్షణం' గొప్ప విజయం కూడా సాధించింది. సావిత్రి సినిమా పోస్టర్‌పై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. సినిమా పోస్టర్‌ను కమిషన్ సుమోటోగా స్వీకరించింది. చిత్ర దర్శకుడు వర్మ, సెన్సార్‌బోర్డు, సిటీ పోలీస్ కమిషనర్ ఎం. మహేందర్‌రెడ్డిలకు నోటీసులు జారీ చేసినట్లు కమిషన్ సభ్యులు అచ్యుతరావు, మమతా రఘువీర్‌లు తెలిపారు. ఆ పోస్టరే కాకుండా, ఆ సినిమాను నిలిపివేయాలన్న డిమాండ్ మొదలైంది. బాలలహక్కుల కమిషన్‌తోపాటు మహిళా సంఘాలు, పలువురు ఉపాధ్యాయులు కూడా ఈ చిత్రంపై తమ అభ్యంతరం తెలిపారు. మహిళా సంఘాల ప్రతినిధులైతే వర్మకు మానసిక స్థితి సరిగా లేదని తేల్చేశారు. సినిమాలే కాదు వాటిపోస్టర్లను కూడా అశ్లీలంగా, అసభ్యంగా రూపొందించి, వివాదాల ద్వారా ప్రచారం పొందాలనే ఆలోచన సరికాదని హితవు పలికారు.మంచి, చెడుల విచక్షణను, నైతిక విలువలను మరిచిన రాంగోపాల్ వర్మ ఓ సైకోలా వ్యవహరిస్తున్నారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) విద్యార్థులు మండిపడుతున్నారు. పవిత్రమైన గురుశిష్య సంబంధాలను కించపరుస్తూ వర్మ రూపొందించే చిత్రాన్ని నిషేధించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ వివాదాలపై వర్మ స్పందిచారు. ఈ సినిమాపై ఎందుకు అభ్యంతరకరమో చెప్పాలని ప్రశ్నించారు. జీవితంలో ప్రతి ఒక్కరికీ 'క్రష్' ఉంటుందని, ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పానని టీచర్ సరస్వతి తనను అభినందించినట్లు తెలిపారు. ఈ సినిమాపై సరస్వతి టీచర్ అభ్యంతరం తెలపలేదన్నారు. తనకున్న భావాలను సినిమా ద్వారా చెప్పే స్వాతంత్ర్యం తనకుందని తనదైన స్టైల్లో చెప్పారు. ఆ తరువాత మామూలుగానే ఈ సినిమా చూడటం, చూడకపోవటం ఎదుటవారి ఇష్టమన్నారు. ఈ విధంగా వర్మ తన సినిమా ప్రారంభం కాకముందే కేవలం పోస్టర్ ద్వారానే వివాదం సృష్టించి విపరీతమైన ప్రచారం పొందారు.ఆలాగే ఈ అంశంపై కొందరిలో ఆలోచనను కూడా రేకెత్తించారు.ఆలోచనలకు జీవం పోయడంలో, సంచనాలు, వివాదాలు సృష్టించడంలో రాము దిట్ట అని మరోసారి నిరూపించారు. -శిసూర్య -
వివాదాలు, విజయాలు
సాక్షి, ముంబై: కేంద్ర కేబినెట్లో కీలకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ మూడేళ్ల క్రితం అనుకోని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవిని స్వీకరించారు. మిస్టర్క్లీన్గా పేరు న్న ఈ నాయకుడి పాలనకు సోమవారంతో మూడే ళ్లు పూర్తికానున్నాయి. అప్పటి ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఆదర్శ్ కుంభకోణంలో చిక్కుకుపోవడంతో ఆయనను తప్పించారు. కాంగ్రెస్ అధినేత్రి సోని యాగాంధీ ఆదేశాలతో పృథ్వీరాజ్ చవాన్‌కు ఈ అవకాశం ద క్కింది. ఇక్కడి రాజకీయాలను చవాన్ తట్టుకోలేరని, తిరిగి ఢిల్లీ వెళ్తారని వాదనలు విని పించినా ఆయన తన పాలనను కొనసాగిస్తున్నారు. ఈ మూడేళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అనేక కీలక నిర్ణయాలనూ తీసుకున్నారు. ఎన్నో విషయాల్లో ప్రతిపక్షాలు, మిత్రపక్షమైన ఎన్సీపీ నుంచి కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. బిల్డర్ల అక్రమా లు, జలవనరుల కుంభకోణం, రైతుల ఆత్మహత్య లు, చక్కెర పరిశ్రమల కుంభకోణం తదితర ఆరోపణలతో చవాన్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రతి పక్షాలు తీవ్రంగా ప్రయత్నించాయి. మిత్రపక్షం ఎన్సీపీ నుంచి కూడా ఆయనకు మద్దతు పెద్దగా లభించలేదు. ఈ సమస్యలన్నింటిని అధిగమిస్తూ మూడేళ్ల పదవి కాలాన్ని ఆయన పూర్తి చేశారు. రాబోయే లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో ఆయన అనేక విషయాలను పంచుకున్నారు. అవన్నీ ఆయన మాటల్లోనే.. ఎన్సీపీకి చురకలు... వారసత్వ రాజకీయాలను నిర్మూలిస్తామని చెప్పిన ఎన్సీపీ, లక్ష్యసాధనలో విఫలమయింది. ఈ విషయంలో దానిని ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉంది. మా కూటమి అధికారంలోకి వచ్చినా, దాని వల్ల ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. రెండు పార్టీల మధ్య సమన్వయం లోపించడంతో నిర్ణయాలు తీసుకోవడంలో అడ్డంకులుగా మారడం నిజమే. ఎన్సీపీ వ్యవహారాలు గందరగోళంగా మారాయి. అయినా దానిని మా పార్టీలో విలీనం చేయాలని నేను కోరుకోవడం లేదు. అప్పట్లో చాలా మంది నాయకులు (ఎన్సీపీని ఉద్దేశించి) వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించారు. ఇప్పుడు వారి వారసులే క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారనేది బిహ రంగ రహస్యం. పాలనలో జాప్యంపైనా ఆయన స్పందిం చారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే దానికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. యశ్వంత్రావ్ చవాన్, వసంత్‌రావ్ నాయ క్ హయాంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉంది. అప్పుడు నిర్ణయాలు తీసుకోవడం చాలా సులభం గా ఉండేది. ప్రస్తుతం మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ అధికారంలో ఉన్నాయి. రెండు పార్టీల ఆలోచనలు ఒకటే. కానీ గ్రామపంచాయతీ మొదలుకొని సాధారణ ఎన్నికల్లోనూ ఇవి పరస్పరం వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధికే ప్రాధాన్యం... ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధికే అగ్రప్రాధాన్యం. నియమాల ఉల్లంఘనలను సహించే ప్రసక్తే లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా ఈ రెండే నాకు ముఖ్యం. స్వార్థప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకిస్తాను. ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి అవసరమైన పనుల్లో జాప్యాన్ని నివారిస్తాం. ఎవరి ఒత్తిళ్లకూ లొంగను. అసెంబ్లీ ఎన్నికల్లోనే.... రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేయాలని కోరుకుంటున్నా. మళ్లీ ఢిల్లీ రాజకీయాల్లోకి వె ళ్లనున్నారా లేదా అసెంబ్లీకి పోటీ చేస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నలకు పైసమాధానం చెప్పారు. కరాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు విజయం సాధించాను. అయితే 1999 లో లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ప్రజల కోసం ఎంతో చేసినా, పరాజయం పాలవడం కొంత బాధ కలిగించింది. మా అధ్యక్షురాలు సోనియాగాంధీ నన్ను రాజ్యసభకు పంపించింది. అనంతరం కరాడ్తోపాటు రాష్ట్ర రాజకీయాలు, ప్రజలతో కొంత దూరం పెరిగింది. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాక ఆ దూరాన్ని తగ్గిం చుకున్నాను. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు నా నేతృత్వంలోనే జరుగుతాయి. -
మమ్మల్ని వివాదాల్లోకి లాగవద్దు: ప్రజాప్రతినిధుల సతీమణులు
ఢిల్లీ: రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసం సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సతీమణులు, వారి కుటుంబ సభ్యులు తమ స్థాయిలో తీవ్రంగా కృషి చేస్తున్నారు. హైదరాబాద్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను మొదలుకొని దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు అందరినీ కలుస్తున్నారు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని కోరుతున్నారు. వినతి పత్రాలు ఇస్తున్నారు. వారు నిన్న రాష్ట్రపతితోపాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్‌సింగ్‌ను కూడా కలిశారు. ఈ బృందంలో కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి భార్య కోట్ల సుజాతమ్మ, కావూరి సాంబశివరావు భార్య హేమలత, కూతురు శ్రీవాణి, రాష్ట్ర మంత్రులు శైలజానాథ్ భార్య మోక్షప్రసూన, పార్థసారధి భార్య కమలాలక్ష్మి, తోట నర్సింహం భార్య వాణి, కన్నా లక్ష్మీనారాయణ భార్య విజయ, శత్రుచర్ల విజయరామరాజు భార్య శశికళ, పితాని సత్యనారాయణ భార్య అనంత లక్ష్మి, మాజీ మంత్రులు ఆర్.చెంగారెడ్డి భార్య ఇందిర, మారెప్ప భార్య వేదవాణి, మాజీ విప్ సామినేని ఉదయభాను భార్య విమలాభాను, మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సోదరి సుచరిత, ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి భార్య శ్రీదేవి తదితరులు ఉన్నారు. వారు ఈరోజు ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర సమైక్యత కోసం తాము ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. తమను వివాదాల్లోకి లాగొవద్దని కోరారు. పార్టీలకు అతీతంగా మహిళలంతా సమైక్యాంధ్ర కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.