
కోల్‌కతా: తనవంటి సానుకూల దృక్పథం కలిగిన వారు ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటారని బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ అన్నారు. గురువారం ఆయన కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్(కేఐఎఫ్‌ఎఫ్)కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రేక్షకులనుద్దేశించి మాట్లాడారు.
కొన్ని సంకుచిత ధోరణుల కారణంగా సామాజిక మాధ్యమం ఒక్కోసారి విభేదాలకు, విధ్వంసాలకు కారణమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో రానున్న పథాన్ సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ పాటపై వీహెచ్‌పీ వంటి సంస్థలు ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో షారూక్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment