Kolkata International Film Festival
-
Kolkata International Film Festival 2023: ఫిలిం ఫెస్టివల్లో మెరిసిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న 'ముత్తయ్య'
కె.సుధాకర్ రెడ్డి, అరుణ రాజ్, మౌనిక బొమ్మ, పూర్ణ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "ముత్తయ్య". ఈ చిత్రాన్ని హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు బ్యానర్లపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి, వ్రిందా ప్రసాద్ నిర్మించారు. భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించారు. గతంలో యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన తొలి తెలుగు సినిమాగా రికార్డ్ సృష్టించిందీ చిత్రం. ఈ ఏడాది మే 9న లండన్‌లో రిచ్ మిక్స్‌లో ప్రీమియర్ అయ్యింది. తాజాగా కోల్‌కతాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ భారతీయ చిత్రంగా అవార్డు అందుకుంది. కాంపిటేషన్ ఆన్ ది ఇండియన్ లాంగ్వేజ్ ఫిలింస్ కేటగిరీలో ఈ పురస్కారం దక్కింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కడంపై దర్శక నిర్మాతలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాత కేదార్ సెలగం శెట్టి మాట్లాడుతూ.. 'కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్(కేఐఎఫ్ఎఫ్)లో మా ముత్తయ్య సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డ్ దక్కడం గర్వంగా ఉంది. మా సినిమా మరింత మందికి స్ఫూర్తి పంచుతుందని ఆశిస్తున్నాం' అన్నారు. నిర్మాత వ్రిందా ప్రసాద్ మాట్లాడుతూ... 'కేఐఎఫ్ఎఫ్ చిత్రోత్సవాల్లో మా సినిమా చూసిన ప్రతి ఒక్కరిలో ఓ మంచి చిత్రాన్ని చూశామనే సంతృప్తి కనిపించింది. ముత్తయ్యలోని కథా కథనాలే ప్రపంచవ్యాప్తంగా చిత్రోత్సవాల్లో ఆదరణ పొందేందుకు కారణంగా నిలుస్తున్నాయి' అన్నారు. దర్శకుడు భాస్కర్ మార్య మాట్లాడుతూ...'ఈ సినిమా తెరకెక్కించే ముందు ఇదొక కలగా ఉండేది. ఇప్పుడు ఊహించనన్ని ఆశ్చర్యాలను తీసుకొస్తోంది. ముత్తయ్య సినిమా మాకెంతో పేరు, గౌరవాన్ని అందిస్తోంది. ఒక దర్శకుడిగా ఇలాంటి గుర్తింపు దక్కడం మంచి సినిమాలు రూపొందించాలనే ఉత్సాహాన్ని పెంచుతోంది' అన్నారు. చదవండి: ఆ డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకుందామనుకున్న చలపతిరావు సీరియల్ నటి ఆత్మహత్య.. చివరి పోస్ట్ వైరల్ -
నాలాంటి వారు ఎప్పుడూ సజీవులే: షారూక్ ఖాన్
కోల్‌కతా: తనవంటి సానుకూల దృక్పథం కలిగిన వారు ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటారని బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ అన్నారు. గురువారం ఆయన కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్(కేఐఎఫ్ఎఫ్)కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రేక్షకులనుద్దేశించి మాట్లాడారు. కొన్ని సంకుచిత ధోరణుల కారణంగా సామాజిక మాధ్యమం ఒక్కోసారి విభేదాలకు, విధ్వంసాలకు కారణమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో రానున్న పథాన్ సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ పాటపై వీహెచ్‌పీ వంటి సంస్థలు ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో షారూక్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
చెరకు గడ చీలుస్తున్న గర్భసంచి
‘నీ గర్భసంచి ఇవ్వు... నీకు కూలిడబ్బులు ఇస్తా’ అని ప్రపంచంలో ఒక్క భారతదేశంలోనే అనగలుగుతారేమో. అసంఘటిత కార్మిక రంగంలో స్త్రీలు పడే బాధలు ఎన్నో ఎందరికి తెలుసు? మహారాష్ట్రలోని బీడ్ చెరకు ఉత్పత్తిలో మేటి. అక్టోబర్ నుంచి మార్చి వరకు అక్కడ కోతకాలం. కోతకు వచ్చిన కూలీలు నెలసరికి మూడురోజుల విశ్రాంతి తీసుకుంటే కూలి డబ్బులు పోతాయి. జరిమానా కూడా చెల్లించాల్సి రావచ్చు. అందుకే అక్కడ కూలి చేయడానికి ముందే గర్భసంచి తొలగించుకుంటారు. ఈ కడుపుకోతపై దర్శకుడు అనంత్ మహదేవన్ ‘కడ్వా గూడ్’ (చేదుబెల్లం– బిట్టర్‌స్వీట్) అనే మరాఠి సినిమా గత సంవత్సరం తీశాడు. వివిధ ఫిల్మ్‌ఫెస్టివల్స్‌లో అవార్డులు పొందుతున్న ఈ సినిమా ఇటీవల జనవరి 8–15 తేదీల మధ్య జరిగిన కోల్‌కతా ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. ఈ సినిమా వెనుక ఉన్న అసలు కథ ఇది. ‘చెరకు కట్ చేసే మిషను రెండున్నర కోట్లు ఉంటుంది. చక్కెర ఉత్పత్తిదారులు అంత పెట్టి మిషన్ ఎందుకు కొంటారు... అతి సలీసుగా కూలీలు దొరుకుతుంటే’ అంటారు దర్శకుడు అనంత్ మహదేవన్. ఆయన మరాఠిలో తీసిన ‘కడ్వా గూడ్’ (చేదుబెల్లం) సినిమా ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ సినిమా ఉత్సవాల్లో ప్రశంసలు అందుకుంటోంది. ప్రశంస సినిమా గొప్పదనం గురించి కాదు. ఒక చేదు వాస్తవాన్ని కథగా ఎంపిక చేసుకోవడం గురించి. ఎందుకంటే ఈ సినిమా చెరకు కోత కోసం పని చేసే లక్షలాది మంది మహిళా కూలీల వెతను చూపింది కాబట్టి. బీడ్‌లో బతుకుపోరు మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలలో షుగర్ ఫ్యాక్టరీలకు ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి మార్చి మధ్యకాలం చాలా కీలకం. చెరకుపంట కోత కాలం అది. లక్షల ఎకరాల్లో పంటను కోయడానికి కూలీలు కావాలి. మహారాష్ట్రలోని ఒక్క బీడ్ జిల్లాలో 5 లక్షల మంది చెరకు కోత కూలీలు ఉన్నారు. బీడ్ అంతగా పంటలు పండని ప్రాంతం కనుక ఇక్కడి నుంచి వలస ఎక్కువ. వీరు చెరకు కోత వచ్చే ఆరు నెలల కాలం కోసం కాచుకుని ఉంటారు. చెరకు కోతకు వెళ్లి్ల ఏం కోల్పోతున్నారనేది ‘బిట్టర్‌స్వీట్’ సినిమాలో చూపించాడు దర్శకుడు. వీరి కన్నీరు రక్తం కలగలవడం వల్లే ఇండియా నేడు ప్రపంచంలోనే రెండవ పెద్ద చక్కెర ఎగుమతిదారు అయ్యిందని అంటాడతను. దారుణమైన దోపిడి చెరకు పంట కోయించి ఫ్యాక్టరీలకు చేరవేసేందుకు చక్కెర ఫ్యాక్టరీలు ‘ముకదమ్’లను ఏర్పాటు చేసుకుంటారు. ముకదమ్‌లంటే దళారీలు. వీరు కూలీలను పట్టుకొని వచ్చి కోత కోయించాలి. అంతేకాదు ఇచ్చిన సమయంలో ఇచ్చినంత మేరా కోత జరిగిపోవాలి. ఇందుకోసం దళారీలు బీడ్ ప్రాంతం నుంచి వయసులో ఉన్న భార్యాభర్తలను కూలికి పిలుస్తారు. వీరిని ‘జోడీ’లంటారు. ఈ జోడీలకు ముందే 80 వేల నుంచి లక్షా 20 వేల వరకూ ఇచ్చేస్తారు. ఆ మేరకు వీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. రోజుకు పది నుంచి 12 గంటలు పని చేయాలి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఒక జోడి రోజులో రెండు మూడు టన్నుల చెరకు పంటను కోస్తారు. నెలసరి తప్పించుకోవడానికి జోడీలు ప్రతిరోజూ పని చేయాలి. చేయకపోతే కూలి దక్కదు. పైగా జరిగిన నష్టానికి జుర్మానా కట్టాలి. ఈ ఆరునెలల కాలంలో జోడీలోని భార్య నెలసరి సమయంలో మూడు రోజుల విశ్రాంతి తీసుకునే అవసరం పడొచ్చు. మూడురోజుల కూలీ పోవడం ఎదురు జుర్మానా కట్టాల్సి రావడం జోడీకి చాలా కష్టం అవుతుంది. అందుకని నెలసరి రాకుండా గర్భసంచిని తీసేయించడం బీడ్‌లో ఒక దయనీయమైన ఆనవాయితీ అయ్యింది. బీడ్ జిల్లాలో దాదాపు 100 ఆస్పత్రులు ఉంటే వాటిలో పది ఆస్పత్రులు ఇవే పని మీద ఉంటాయి. దళారీలకు ఈ ఆస్పత్రులతో అండర్స్టాండింగ్ ఉంటుంది. దళారీ గర్భసంచి తీసే ఆపరేషన్ కోసం విడిగా అప్పు ఇస్తాడు. అది ప్రతి సంవత్సరం కూలీలో కొంత కొంత కోత వేసుకుంటాడు. పైగా గర్భసంచి ఆపరేషన్‌కు మనిషిని పంపినందుకు కమిషన్ కూడా దొరుకుతుంది. ‘గర్భసంచులు లేని స్త్రీల ఊరు అని బీడ్ గురించి వార్త చదివాకే నాకు ఈ సినిమా తీయాలనిపించింది’ అంటాడు దర్శకుడు అనంత్ మహదేవన్. ఈ సినిమా కథలో... ఈ సినిమా కథలో దర్శకుడు సత్యభామ అనే కోత కూలీ పాత్ర ద్వారా మనకు కథ చెప్పే ప్రయత్నం చేస్తాడు. కోత పని సజావుగా సాగడానికి సత్యభామ గర్భసంచిని తీయించుకోవాలని ఆమెపై వొత్తిడి వస్తుంది. తీయించుకోవాలా వద్దా అనే సంఘర్షణలో మనకు సమస్య నేపథ్యం తెలుస్తుంది. చివరకు సత్యభామ గర్భసంచి తీయించుకోవడానికే అంగీకరిస్తుంది. ‘ఇది ఆమె శారీరక హక్కును బలవంతంగా తిరస్కరింప చేయడమే. పిల్లలు కనే హక్కును నివారించడమే. తన దేహం మీద తన హక్కును మహిళా కూలీలు కోల్పోవడమే కాదు భావితరాల పుట్టుకను కూడా నిరాకరిస్తున్నారు’ అంటాడు దర్శకుడు అనంత్ మహదేవన్. ఈ సినిమాలో అందరూ కొత్త నటులే నటించారు. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా మంచి స్పందనను పొందుతోంది. – సాక్షి ఫ్యామిలీ -
ప్లీజ్.. నన్ను పిలవొద్దు!
కోల్‌కతా: 24వ కోల్‌కతా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభ కార్యక్రమంలో శనివారం సరదా సన్నివేశం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలాసార్లు అతిథిగా హాజరయ్యానని, ఇకపై తనని ఆహ్వానించొద్దని మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ విజ్ఞప్తి చేయగా, అలా కుదరదంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తలూపారు. అమితాబ్ మాట్లాడుతూ పదేపదే ఈ కార్యక్రమానికి రావడం వల్ల తాను కొత్తగా చెప్పేదేమీ లేదని, ఇకపై తనని ఆహ్వానించొద్దని పలుమార్లు వేడుకున్నా సీఎం వినడంలేదని అన్నారు. అందుకే బెంగాలీలో ’మేడం దయచేసి నా మాటలు వినండి. ఇకపైనైనా నాకు ఈ కార్యక్రమం నుంచి మినహాయింపు ఇవ్వండి’ అని విజ్ఞప్తిచేశారు. వచ్చే ఏడాది జరగబోయేది 25వ వేడుక కాబట్టి అప్పుడు కూడా అమితాబ్ రావాల్సిందేనని మమతా చెప్పారు. -
సిసలైన బెంగాలీ అనిపించుకుంటా: షారూఖ్
కోల్‌కతా: తాను సిసలైన బెంగాలీ అనిపించుకుంటానని బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ అన్నారు. జయా బచ్చన్ నుంచి బెంగాలీ నేర్చుకుంటానని తెలిపారు. 19వ కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం(కేఐఎఫ్ఎఫ్) ప్రారంభోత్సవానికి షారూఖ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనను ఆదరించినందుకు బెంగాలీ వాసులకు ధన్యావాదాలు తెలిపారు. 'నన్ను మీ వాడిగా అక్కున చేర్చుకున్నందుకు కృతజ్ఞతలు. గత మూడేళ్లుగా కేఐఎఫ్ఎఫ్కు హాజరవుతున్నాను. మరోసారి మీ ముందు వచ్చేటప్పకి తప్పకుండా బెంగాలీలో మాట్లాడతాను. జయా బచ్చన్ దగ్గర బెంగాలీ నేర్చుకుని సిసలైన బెంగాలీ పౌరుడిగా మీ ముందు ఉంటా' అని షారూఖ్ అన్నారు. పశ్చిమ బెంగాల్‌కు షారూఖ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. జయా బచ్చన్ అంతకుముందు ప్రారంభోపన్యాసం చేస్తూ తన భర్త అమితాబ్, షారూఖ్, కమల్ హాసన్‌లను సిసలైన బెంగాలీలు కాదని పేర్కొన్నారు.