
ప్రణబ్ రచించిన ‘ద డ్రమెటిక్ డికేడ్’ పుస్తక కవర్‌పేజీ
నేషనల్ డెస్క్: 2014లో వెలువడిన పలు పుస్తకాలపై తీవ్రస్థాయిలోనే వివాదాలు వెల్లువెత్తాయి. పుస్తకాల్లోని సంచలనాత్మక అంశాలపై అభ్యంతరాలు, ఆక్షేపణలూ వచ్చాయి. రచయితలకు ఈ స్థాయిలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఎందుకన్న ప్రశ్నలూ తలెత్తాయి. అధికారంలో అగ్రస్థానంలో ఉన్న నేతలనే లక్ష్యంగా చేసుకున్న పుస్తకాలు ఈ ఏడాది పెద్దసంఖ్యలో వచ్చాయి.
ఠ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మాజీ మీ డియా సలహాదారు సంజయ్ బారు రాసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అన్న పుస్తకం వివాదాస్పదమైంది. యూపీఏ హయాంలో మ న్మోహన్ బలహీనమైన ప్రధానిగా మిగిలిపోయారని, మంత్రివర్గ సహచరుల అవకతవకలపై కూడా ఆయన ఏమీచేయలేకపోయారని సంజ య్ బారు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెనుసంచలనం సృష్టించాయి.
కేంద్ర బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పి.సి. పరేఖ్ రాసిన ‘క్రూసేడర్ ఆర్ క్రాన్‌స్పిరేటర్? కోల్గేట్ అండ్ అదర్ ట్రూత్స్’ అనే పుస్తకంలో కూడా మన్మోహన్‌పై భారీ విమర్శలొచ్చాయి.
ఠ మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్‘యువర్స్ సిన్సియర్లీ’ పుస్తకంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాపై వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. రాహుల్ గాంధీ వ్యతిరేకించడం వల్లనే సోనియా2004లో ప్రధాని పదవిని స్వీకరించలేదని నట్వర్ సింగ్ పేర్కొనడం వివాదం రేకెత్తించింది.
ఠ‘ది డ్రమెటిక్ డికేడ్: ది ఇందిరాగాంధీ ఇయర్స్’ శీర్షికతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకం కూడా ఎంతో సంచలనానికి కారణమైంది. ఇం దిర హయాంలో విధించిన ఆత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) గురించి ప్రణబ్ ప్రస్తావించారు. రాజ్యాంగంలోని నిబంధనలను గురించి పట్టిం చుకోకుండా ఎమర్జెన్సీని విధించడం అప్పట్లో ఇందిరా గాంధీ తీసుకున్న ఆవేశపూరిత నిర్ణయమని, అందుకు కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో భారీమూల్యమే చెల్లించుకోవాలకల్సి వచ్చిందని ప్రణబ్ ముఖర్జీ రాశారు.