![Shakib withdraws from sponsorship deal with Betwinner after BCB ultimatum - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/12/SHAKIB.jpg.webp?itok=crMQvE5j)
ఢాకా: బంగ్లాదేశ్ టాప్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌కు వివాదాలు కొత్త కాదు. తాజాగా ఒక స్పాన్సర్‌షిప్ ఒప్పందానికి సంబంధించి షకీబ్ చర్య వివాదంగా మారింది. అయితే చివరి నిమిషంలో షకీబ్ దానిని సరిదిద్దుకోవడంతో అతను వేటు తప్పించుకున్నాడు. పది రోజుల క్రితం ‘బెట్‌విన్నర్ న్యూస్’తో తాను ఒప్పందం చేసుకున్న విషయాన్ని షకీబ్ ఇన్‌స్టగ్రామ్ ద్వారా ప్రకటించాడు.
అయితే బెట్‌విన్నర్ అనేది బెట్టింగ్‌కు సంబంధించిన సంస్థ కావడంతో అతను ఒప్పందం చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నిబంధనల ప్రకారం ఏ బంగ్లా క్రికెటర్ అయినా బెట్టింగ్ సంస్థతో ఒప్పందాలు చేసుకోరాదు.
దాంతో షకీబ్‌పై చర్య తీసుకునేందుకు బీసీబీ సిద్ధమైంది. చివరి హెచ్చరికగా గురువారంలోగా దానిని రద్దు చేసుకోకపోతే బోర్డు కాంట్రాక్ట్ రద్దు చేయడంతో పాటు నిషేధం విధిస్తామని హెచ్చరించింది. దాంతో షకీబ్ వెనక్కి తగ్గాడు. తన ఒప్పందాన్నివదిలేస్తున్నట్లు ప్రకటించాడు.
చదవండి: AFG vs IRE: ఆఫ్ఘనిస్తాన్‌కు మరో షాకిచ్చిన ఐర్లాండ్.. వరుసగా రెండో విజయం!
Comments
Please login to add a commentAdd a comment