sponsorship deal
-
ICC World Cup 2023: వరల్డ్ కప్ మ్యాచ్‌లకు స్పాన్సర్ల క్యూ..
న్యూఢిల్లీ: నేటి నుంచి ప్రారంభమవుతున్న ఐసీసీ వరల్డ్ కప్ 2023 మ్యాచ్‌లను స్పాన్సర్ చేసేందుకు కంపెనీలు భారీ ఎత్తున క్యూ కడుతున్నాయి. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 26 స్పాన్సర్లు, 500 ప్రకటనకర్తలు నమోదు చేసుకున్నట్లు టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మ్యాచ్‌ల ప్రసార హక్కులను దక్కించుకున్న డిస్నీ స్టార్ స్పోర్ట్స్ విభాగం హెడ్ సంజోగ్ గుప్తా తెలిపారు. వీటిలో చాలా స్పాన్సర్లు టీవీ, డిజిటల్ ఫార్మాట్లను ఎంచుకోగా, కొన్ని కంపెనీలు కేవలం డిజిటల్ లేదా టీవీని మాత్రమే ఎంచుకున్నట్లు ఆయన వివరించారు. ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా నిర్వహించే 48 మ్యాచ్‌లను డిస్నీ స్టార్ తమ టీవీ చానళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం చేయనుంది. వరల్డ్ కప్ మ్యాచ్‌లు తొమ్మిది భాషల్లో 100 పైచిలుకు కామెంటేటర్స్‌తో డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్నాయి. వీటిలో తెలుగు, తమిళం తదితర భాషలు కూడా ఉన్నాయి. పన్నెండేళ్ల తర్వా త వరల్డ్ కప్ మ్యాచ్‌లకు భారత్ ఆతిథ్యమిస్తోంది. భారత్‌పై అంచనాలు.. పండుగ సీజన్ దన్ను ఆసియా కప్‌లో భారత మెరుగైన పనితీరు, పండుగ సీజన్, భారత్ టీమ్‌పై భారీ అంచనాలు తదితర సానుకూలాంశాల కారణంగా అడ్వరై్టజర్లు భారీగా ఆసక్తి చూపుతున్నట్లు గుప్తా చెప్పారు. అన్ని కేటగిరీల కంపెనీలూ స్పాన్సర్ చేసేందుకు లేదా ప్రకటనలు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాయన్నారు. సాధారణంగా పండుగ సీజన్లో కంపెనీలు ప్రకటనలపై భారీగా వెచ్చిస్తుంటాయని తెలిపారు. స్పాన్సర్ల జాబితాలో కోకాకోలా, ఫోన్‌పే, మహీంద్రా అండ్ మహీంద్రా, డ్రీమ్11, హెచ్‌యూఎల్, హావెల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, పెర్నాడ్ ఇండియా, బుకింగ్‌డాట్‌కామ్, పీటర్ ఇంగ్లాండ్, కింగ్‌ఫిషర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మాండెలీజ్, ఎమిరేట్స్, డయాజియో, ఎంఆర్ఎఫ్, లెండింగ్‌కార్ట్, బీపీసీఎల్, హెర్బాలైఫ్, హయర్, యాంఫీ, గూగుల్ పే, పాలీ క్యాబ్, అమూల్, విడా, అమెజాన్ మొదలైన సంస్థలు న్నాయి. కోకా–కోలా, ఫోన్‌పే, హెచ్‌యూఎల్ వంటి పలు కంపెనీలు ఇటు టీవీ, అటు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ స్పాన్సర్ చేస్తున్నాయి. అనువైన ప్యాకేజీలు.. ప్రకటనకర్తల బడ్జెట్, అవసరాలను బట్టి వారికి అనువైన ప్యాకేజీలను రూపొందించినట్లు గుప్తా చెప్పారు. ‘పండుగ సీజన్ సందర్భంగా.. ఎవరైనా అడ్వరై్టజరు దీపావళి సమయంలో ఎక్కువ మంది కస్టమర్లు తమ ఉత్పత్తులపై మక్కువ చూపుతారనే ఉద్దేశంతో పండుగకి ముందు ఓ రెండు వారాలపాటు ప్రకటనలు ఇవ్వదల్చుకున్నారనుకుందాం. కాస్త ప్రీమియం చెల్లించి ఆ వ్యవధిలో మాత్రమే తమ ప్రకటనలను ప్రసారం చేసుకునేందుకు వీలు కలి్పంచేలా వారికోసం కస్టమైజ్డ్ ప్యాకేజీని అందిస్తున్నాం’ అని తెలిపారు. వరల్డ్ కప్‌లో మరింత మంది ప్రకటనకర్తలు భాగమయ్యేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లో ‘‘సెల్ఫ్–సర్వ్ ఫ్రేమ్‌వర్క్’ను ప్రవేశపెట్టినట్లు గుప్తా తెలిపారు. ఏజెన్సీలు, అడ్వరై్టజర్లు సేల్స్ టీమ్స్ జోక్యం లేకుండా, తమకు అవసరమైన వాటిని స్వయంగా బుక్ చేసుకునే వీలుంటుందని వివరించారు. -
భారత క్రికెట్ జట్టు కిట్ స్పాన్సర్‌గా అడిడాస్
చెన్నై: జర్మనీకి చెందిన ప్రముఖ క్రీడా ఉత్పాదనల సంస్థ అడిడాస్ భారత క్రికెట్ జట్టు కిట్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ప్రస్తుత స్పాన్సర్ ‘కిల్లర్ జీన్స్’తో కాంట్రాక్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త స్పాన్సర్షిప్ ఇచ్చింది. దీనిపై బోర్డు కార్యదర్శి జై షా మాట్లాడుతూ ‘దేశంలో క్రికెట్ అభివృద్ధి అంచనాలను మించుతుంది. కాబట్టి ప్రపంచశ్రేణి సంస్థ మాతో జట్టు కట్టడంపై పెద్దగా ఆశ్చర్యమేమీ లేదు’ అని అన్నారు. జర్మన్ స్పోర్ట్స్ బ్రాండ్ అయిన అడిడాస్‌తో ఒప్పందం ఎన్నేళ్లు, ఎంత మొత్తానికి స్పాన్సర్షిప్ పొందిందనే వివరాలేవీ ఆయన వెల్లడించలేదు. విశ్వసనీయ వర్గాల ప్రకారం రూ. 350 కోట్లతో అడిడాస్ కిట్ స్పాన్సర్షిప్ దక్కించుకున్నట్లు తెలిసింది. టీమిండియా వచ్చే నెల 7 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడుతుంది. ఆ జెర్సీలపై అడిడాస్ లోగో కనిపించనుంది. టీమ్ స్పానర్ బైజుస్ కూడా మారుతున్నట్లు తెలిసింది. ఈ నవంబర్ వరకు గడువున్నప్పటికీ సదరు సంస్థ ముందుగానే వైదొలగనుండటంతో త్వరలోనే బిడ్లను ఆహ్వానిస్తారు. -
రూ. 5,900 కోట్లకు స్పోర్ట్స్ స్పాన్సర్‌షిప్‌లు
ముంబై: క్రీడలు, క్రీడాకారులకు లభించే స్పాన్సర్‌షిప్‌లు గతేడాది (2022) రెట్టింపయ్యాయి. రూ. 5,907 కోట్లకు చేరాయి. ఇందులో సింహభాగం వాటా 85 శాతాన్ని క్రికెట్టే దక్కించుకుంది. మీడియా ఏజెన్సీ గ్రూప్ఎం రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2022లో స్పోర్ట్స్ సెలబ్రిటీలు రూ. 729 కోట్ల మేర స్పాన్సర్‌షిప్‌లు పొందారు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 20 శాతం అధికం. అత్యధికంగా అందుకున్న టాప్ క్రీడాకారుల్లో విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, సచిన్ టెండుల్కర్, నీరజ్ చోప్రాలతో పాటు పీవీ సింధు కూడా ఉన్నారు. గతేడాది మొత్తం మీద క్రీడలపై ఖర్చులు రూ. 9,500 కోట్ల నుంచి రూ. 14,000 కోట్లకు చేరినట్లు గ్రూప్ఎం తెలిపింది. ‘2021తో పోలిస్తే భారత్‌లో క్రీడల స్పాన్సర్‌షిప్‌లు అసాధారణంగా 105 శాతం మేర వృద్ధి చెందాయి‘ అని పేర్కొంది. ఐపీఎల్ దన్ను.. ► ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య పెరగడం, కొత్తగా మరో రెండు టీమ్‌లు వచ్చి చేరడం, ఐసీసీ టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్, ఫిఫా వరల్డ్ కప్‌తో పాటు మారథాన్లు, కామన్వెల్త్ గేమ్స్ మొదలైనవి 2022లో క్రీడలపై చేసే ఖర్చు పెరగడానికి తోడ్పడ్డాయి. ► గతేడాది వచ్చిన స్పాన్సర్‌షిప్‌లలో క్రికెట్ 85% దక్కించుకోగా.. ఫుట్‌బాల్, కబడ్డీ మొదలైనవి 15 శాతంతో సరిపెట్టుకున్నాయి. కొత్త క్రీడలకు స్పాన్సర్‌షిప్‌లు భారీగా పెరుగుతున్నాయి. ► విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ తలో 30 పైగా బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్ తదితరులు కూడా పుంజుకుంటున్నారు. ► కొన్నాళ్లుగా క్రీడలపై వ్యయాలు వార్షికంగా సగటున 14 శాతం మేర వృద్ధి చెందుతున్నాయి. ఎకానమీలో అత్యంత మెరుగ్గా రాణిస్తున్న రంగాల్లో ఇది కూడా ఒకటిగా ఉంటోంది. ► 2023 సీజన్ తర్వాత ఐపీఎల్ స్పాన్సర్‌షిప్‌ల రెన్యువల్, బీసీసీఐ హోమ్ సిరీస్ టైటిల్, టీమ్ ఇండియా స్పాన్సర్షిప్, బీసీసీఐ హోమ్ సిరీస్ మీడియా హక్కులు, మార్చిలో జరిగిన డబ్ల్యూపీఎల్ ప్రారంభ సీజన్ మొదలైన వాటితో భారత్‌లో స్పాన్సర్‌షిప్‌లు ఈ ఏడాది తారా స్థాయికి చేరనున్నాయి. -
ఖేలో ఇండియా స్పాన్సర్‌గా ‘స్పోర్ట్స్ ఫర్ ఆల్’
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ గల క్రీడాకారుల ప్రదర్శనకు పదును పెట్టే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (కేఐవైజీ)తో దేశీయ క్రీడల నిర్వాహక సంస్థ ‘స్పోర్ట్స్ ఫర్ ఆల్’ (ఎస్ఎఫ్ఏ) జతకట్టింది. యువతలోని క్రీడా నైపుణ్యాన్ని మెరుగు పరచడానికి విశేష కృషి చేస్తున్న ఎస్ఎఫ్ఏ ఐదేళ్ల పాటు ఖేలో ఇండియా గేమ్స్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. ఈ మేరకు రూ. 12.5 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఎస్ఎఫ్ఏ వ్యవస్థాపకులు రిషికేశ్ జోషి తెలిపారు. కుర్రాళ్ల ప్రతిభాన్వేషణలో భాగమైన ఎస్ఎఫ్ఏ స్పాన్సర్షిప్ లభించడంపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హర్షం వ్యక్తం చేసింది. గతంలో ఎస్ఎఫ్ఏ ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో భారత జట్టుకు స్పాన్సర్‌గా ఉంది. -
మా వల్ల కాదు.. తప్పుకొనే యోచనలో టీమిండియా ప్రధాన స్పాన్సర్! కారణమిదే
Team India- Sponsorship- Byju's- MPL- ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న ఎడ్యుటెక్ సంస్థ ‘బైజూస్’ ఈ ఒప్పందాన్ని ముందే రద్దు చేసుకునే యోచనలో ఉంది. దీనికి సంబంధించి గత నెలలోనే బోర్డుకు ఆ సంస్థ లేఖ రాసింది. నవంబర్ 2023 వరకు అమల్లో ఉండేలా సుమారు రూ. 290 కోట్లతో గత జూన్‌లోనే బీసీసీఐతో బైజూస్ ఒప్పందం కుదుర్చుకుంది. కారణమిదే అయితే ఆ సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, ఇతర కారణాలతో స్పాన్సర్‌షిప్‌ను కొనసాగించరాదని భావిస్తోంది. ఈ అంశంపై బుధవారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగింది. చివరకు 2023 మార్చి వరకు స్పాన్సర్షిప్ కొనసాగించాలని బైజూస్‌కు బీసీసీఐ విజ్ఞప్తి చేసింది. కిట్ స్పాన్సర్ సైతం మరోవైపు కిట్ స్పాన్సర్‌గా ఉన్న ఎంపీఎల్ స్పోర్ట్స్ కూడా తమ కిట్ ఒప్పంద హక్కులను మరో సంస్థకు వెంటనే బదలాయించేందుకు అనుమతించమని బోర్డును కోరింది. అదే మొత్తానికి కేవల్ కిరణ్ క్లాతింగ్ లిమిటెండ్ (కేకేసీఎల్)కు కిట్ స్పాన్సర్షిప్ హక్కులు ఇవ్వమని కోరింది. దీనిపై కూడా చర్చించిన బోర్డు... ఉన్నపళంగా కిట్ స్పాన్సర్ పేరు మార్పుల వల్ల సమస్యలు వస్తాయి కాబట్టి ఎంపీఎల్‌కు కూడా మార్చి 31, 2023 వరకు కొనసాగాలని విజ్ఞప్తి చేసింది. చదవండి: Ajinkya Rahane: డబుల్ సెంచరీతో చెలరేగిన రహానే.. రెండో ద్విశతకం! టీమిండియాలో చోటు ఖాయమంటూ.. Inzamam Ul Haq: 52 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే! పవర్ఫుల్ సిక్సర్.. ఆశ్చర్యపోయిన ఆఫ్రిది! వీడియో -
వెనక్కి తగ్గిన షకీబ్.. బెట్విన్నర్ న్యూస్‌తో ఒప్పందం రద్దు!
ఢాకా: బంగ్లాదేశ్ టాప్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌కు వివాదాలు కొత్త కాదు. తాజాగా ఒక స్పాన్సర్షిప్ ఒప్పందానికి సంబంధించి షకీబ్ చర్య వివాదంగా మారింది. అయితే చివరి నిమిషంలో షకీబ్ దానిని సరిదిద్దుకోవడంతో అతను వేటు తప్పించుకున్నాడు. పది రోజుల క్రితం ‘బెట్విన్నర్ న్యూస్’తో తాను ఒప్పందం చేసుకున్న విషయాన్ని షకీబ్ ఇన్‌స్టగ్రామ్ ద్వారా ప్రకటించాడు. అయితే బెట్విన్నర్ అనేది బెట్టింగ్‌కు సంబంధించిన సంస్థ కావడంతో అతను ఒప్పందం చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నిబంధనల ప్రకారం ఏ బంగ్లా క్రికెటర్ అయినా బెట్టింగ్ సంస్థతో ఒప్పందాలు చేసుకోరాదు. దాంతో షకీబ్‌పై చర్య తీసుకునేందుకు బీసీబీ సిద్ధమైంది. చివరి హెచ్చరికగా గురువారంలోగా దానిని రద్దు చేసుకోకపోతే బోర్డు కాంట్రాక్ట్ రద్దు చేయడంతో పాటు నిషేధం విధిస్తామని హెచ్చరించింది. దాంతో షకీబ్ వెనక్కి తగ్గాడు. తన ఒప్పందాన్నివదిలేస్తున్నట్లు ప్రకటించాడు. చదవండి: AFG vs IRE: ఆఫ్ఘనిస్తాన్‌కు మరో షాకిచ్చిన ఐర్లాండ్.. వరుసగా రెండో విజయం! -
ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందే సెంచరీ కొట్టిన సీఎస్కే
CSK Cross 100 Crore In Revenue Sponsorship: ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అరుదైన ఘనతను సాధించింది. స్పాన్సర్ల ద్వారా ఆ జట్టుకు వచ్చే ఆదాయం తాజాగా 100 కోట్ల మార్కును చేరుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఈ మార్కును గతంలో ముంబై ఇండియన్స్ మాత్రమే చేరుకోగలిగింది. ఇటీవలే ఎస్ఎన్జే గ్రూప్‌తో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకోవడంతో సీఎస్కే 100 కోట్ల క్లబ్లో చేరిన రెండో ఐపీఎల్ జట్టుగా రికార్డుల్లోకెక్కింది. సీఎస్కే ఇప్పటికే ఇండియా సిమెంట్స్, అముల్, అమెజాన్ పే, టీవీఎస్ యూరో గ్రిప్, గల్ఫ్ ఇండియా, రిలయన్స్ జియో, డ్రీమ్ 11, బ్రిటీష్ అంపైర్ వంటి దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. వీటిలో టీవీఎస్ యూరో గ్రిప్ సీఎస్కే అఫిషియల్ జెర్సీ పార్ట్నర్ (ఆటగాళ్ల జెర్సీలపై ఉండే కంపెనీ లోగో) కాగా, ఇండియా సిమెంట్స్ జెర్సీ పార్ట్నర్గా వ్యవహరిస్తుంది. ఇదిలా ఉంటే, రేపటి (మార్చి 26) నుంచి ఐపీఎల్ 2022 మెగా సీజన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. గతేడాది రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. చదవండి: IPL 2022: ధోని అనూహ్య నిర్ణయం.. అతడు ఆడాలనే మేం కోరుకుంటున్నాం.. అయితే: సీఎస్కే -
IPL 2022: ఐపీఎల్ భాగస్వామిగా ‘రూపే’.. మూడేళ్లకు ఒప్పందం
IPL 2022 New Sponsor Rupay: నానాటికి పెరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రేజ్ దృష్ట్యా.. క్యాష్ రిచ్ లీగ్‌తో జతకట్టేందుకు బడా కార్పొరేట్ సంస్థలు ఎగబడుతున్నాయి. ఇప్పటికే టాటా, డ్రీమ్ 11, అన్ అకాడమీ, క్రెడ్, అప్‌స్టాక్స్, స్విగ్గీ ఇన్స్టంట్, పేటీఎం, సియట్ వంటి కార్పొరేట్లు ఐపీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకోగా, తాజాగా మరో ప్రతిష్టాత్మక సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (రూపే) ఐపీఎల్‌తో చేతులు కలిపింది. రూపే మూడేళ్ల పాటు ఐపీఎల్‌కు అఫిషియల్ పార్ట్నర్గా ఉండేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మీడియా కథనాల ప్రకారం రూపే ఏడాదికి రూ. 42 కోట్లకు ఐపీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఒప్పందంతో ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ మరింత పెరగనుంది. కాగా, మార్చి 26 నుంచి మహారాష్ట్ర వేదికగా ఐపీఎల్ 15వ ఎడిషన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ నుంచి ‘టాటా’ లీగ్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. ఐపీఎల్ 2022 సెంట్రల్ స్పాన్సర్స్ : - టాటా : టైటిల్ స్పాన్సర్ - డ్రీమ్ 11 : అఫిషియల్ పార్ట్నర్ - అన్ అకాడమీ : అఫిషియల్ పార్ట్నర్ - క్రెడ్ : అఫిషియల్ పార్ట్నర్ - అప్‌స్టాక్స్ : అఫిషియల్ పార్ట్నర్ - స్విగ్గీ ఇన్స్టంట్ : అఫిషియల్ పార్ట్నర్ - పేటీఎం : అఫిషియల్ అంపైర్ పార్ట్నర్ - సియట్ : అఫిషియల్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ పార్ట్నర్ - రూపే : అఫిషియల్ పార్ట్నర్ చదవండి: IND VS SL 1st Test: ఒత్తిడిలో విరాట్..? ప్రాక్టీస్ సెషన్స్‌లో ఆరుసార్లు క్లీన్ బౌల్డ్..! -
నాలుగేళ్లకు రూ. 50 కోట్లు!
న్యూఢిల్లీ: భారత టాప్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పూసర్ల వెంకట (పీవీ) సింధు స్పాన్సర్షిప్ ప్రపంచంలో పెద్ద ఘనతను నమోదు చేసింది. చైనాకు చెందిన క్రీడా ఉపకరణాల సంస్థ ‘లి నింగ్’ నాలుగేళ్ల కాలానికి సింధుతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం సింధుకు లి నింగ్ రూ. 50 కోట్లు చెల్లిస్తుంది. ఇందులో రూ.40 కోట్లు స్పాన్సర్షిప్ మొత్తంగా... మరో రూ.10 కోట్లు బ్యాడ్మింటన్ క్రీడా సామగ్రి రూపంలో ఆమెకు అందజేస్తుందని సమాచారం. ఒప్పందం ప్రకారం ఇకపై సింధు లి నింగ్‌కు చెందిన క్రీడా ఉత్పత్తులనే వాడాల్సి ఉంటుంది. ఇటీవలే పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్‌తో రూ. 35 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్న ఆ కంపెనీ ఇప్పుడు సింధుతో జత కట్టడం విశేషం. గతంలో 2014–15లో రెండేళ్ల పాటు సింధుకు స్పాన్సర్షిప్ అందించిన లి నింగ్ అప్పట్లో ఏడాదికి కోటిన్నర చొప్పున చెల్లించింది. గత మూడేళ్లుగా యోనెక్స్ కంపెనీతో అనుబంధం కొనసాగిస్తున్న సింధు ఏడాదికి రూ. 3.5 కోట్ల చొప్పున అందుకుంటోంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఇది అతి పెద్ద ఒప్పందమని, ‘పూమా’తో విరాట్ కోహ్లి కుదుర్చుకున్న ఒప్పందంతో దాదాపుగా సమానమని లి నింగ్ ప్రతినిధి మహేంద్ర కపూర్ వెల్లడించారు. ఏడాదికి రూ.12.5 కోట్ల చొప్పున ‘పూమా’ ఎనిమిదేళ్ల కాలానికి కోహ్లికి రూ. 100 కోట్లు చెల్లించనుంది. మరోవైపు ఇతర భారత షట్లర్లు పారుపల్లి కశ్యప్ (రెండేళ్లకు రూ. 8 కోట్లు), మను అత్రి, సుమీత్ రెడ్డి (రెండేళ్లకు చెరో రూ. 4 కోట్ల చొప్పున)లతో కూడా లి నింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. -
10 సెకన్లకు రూ.6 లక్షలు!
⇒ ఐపీఎల్లో సోనీ ప్రకటనల చార్జ్ ఇది ⇒ 14 కంపెనీలతో స్పాన్సర్షిప్ ఒప్పందం ⇒ తెలుగు, బెంగాళీ, తమిళంలో కామెంటరీ ⇒ సోనీ స్పోర్ట్స్ హెడ్ ప్రసన్న కృష్ణన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐపీఎల్ ప్రసార సమయంలో ప్రదర్శించే ప్రకటనలకు 10 సెకన్లకు గాను రూ.6 లక్షలు చార్జీ నిర్ణయించినట్లు సోనీ పిక్చర్స్ నెట్వరŠక్స్ ఇండియా (ఎస్పీఎన్) తెలియజేసింది. వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కానున్న వివో ఐపీఎల్–10 సీజన్ ప్రసార హక్కులను ఎస్పీఎన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. గురువారమిక్కడ 10 సాల్ ఆప్ కే నామ్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన సందర్భంగా సంస్థ స్పోర్ట్స్ ఈవీపీ, బిజినెస్ హెడ్ ప్రసన్న కృష్ణన్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో మాట్లాడారు. స్థానికంగా క్రికెట్ ప్రియులకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో తెలుగు, తమిళం, బెంగాళీ భాషల్లో కామెంటరీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. వేణుగోపాలరావు, వెంకటపతి రాజు, చంద్రశేఖర్ పీ, సుధీర్ మహావాడీ, కల్యాణ్ కృష్ణ, సీ వెంకటేష్‌లు తెలుగు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తారని తెలియజేశారు. గతేడాది 9వ సీజన్లో 36.1 కోట్ల మంది వీక్షకులను సంపాదించుకున్నామని... ఈ ఏడాది 40 కోట్లకు చేరుతామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘గతేడాదితో పోలిస్తే ప్రకటనల చార్జీలను 10 శాతం పెంచాం. ఐపీఎల్ 9లో 11 మంది స్పాన్సర్స్ రాగా.. ఇప్పుడా సంఖ్య 14కు చేరింది. మరో ఒకటో రెండో సంస్థలు స్పాన్సరర్లుగా చేరే అవకాశముంది. ప్రస్తుతానికైతే అమెజాన్, వివో, వొడాఫోన్, పాలీ క్యాబ్, యమహా, విమల్ పాన్ మసాలా, మేక్‌మై ట్రిప్, పార్లే, వోల్టాస్, ఎస్ బ్యాంక్ వంటివి స్పాన్సర్ ఒప్పందం చేసుకున్నాం’’ అని వివరించారు.