
CSK Cross 100 Crore In Revenue Sponsorship: ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అరుదైన ఘనతను సాధించింది. స్పాన్సర్ల ద్వారా ఆ జట్టుకు వచ్చే ఆదాయం తాజాగా 100 కోట్ల మార్కును చేరుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఈ మార్కును గతంలో ముంబై ఇండియన్స్ మాత్రమే చేరుకోగలిగింది. ఇటీవలే ఎస్ఎన్జే గ్రూప్‌తో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకోవడంతో సీఎస్‌కే 100 కోట్ల క్లబ్‌లో చేరిన రెండో ఐపీఎల్ జట్టుగా రికార్డుల్లోకెక్కింది.
సీఎస్‌కే ఇప్పటికే ఇండియా సిమెంట్స్, అముల్, అమెజాన్ పే, టీవీఎస్ యూరో గ్రిప్, గల్ఫ్ ఇండియా, రిలయన్స్ జియో, డ్రీమ్ 11, బ్రిటీష్ అంపైర్ వంటి దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. వీటిలో టీవీఎస్ యూరో గ్రిప్ సీఎస్‌కే అఫిషియల్ జెర్సీ పార్ట్‌నర్ (ఆటగాళ్ల జెర్సీలపై ఉండే కంపెనీ లోగో) కాగా, ఇండియా సిమెంట్స్ జెర్సీ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తుంది.
ఇదిలా ఉంటే, రేపటి (మార్చి 26) నుంచి ఐపీఎల్ 2022 మెగా సీజన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. గతేడాది రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది.
చదవండి: IPL 2022: ధోని అనూహ్య నిర్ణయం.. అతడు ఆడాలనే మేం కోరుకుంటున్నాం.. అయితే: సీఎస్‌కే