Hari Nishaanth: ఘనంగా యువ క్రికెటర్‌ పెళ్లి.. సీఎస్‌కే విషెస్‌! | CSK Wishes Hari Nishaanth On His Wedding Shares Video | Sakshi
Sakshi News home page

Hari Nishaanth: ఘనంగా యువ క్రికెటర్‌ పెళ్లి.. ‘సూపర్‌ కపుల్‌’ అంటూ సీఎస్‌కే విషెస్‌!

Published Fri, Jun 10 2022 2:13 PM | Last Updated on Fri, Jun 10 2022 2:48 PM

CSK Wishes Hari Nishaanth On His Wedding Shares Video - Sakshi

హరి నిషాంత్‌ దంపతులకు సీఎస్‌కే విషెస్‌(PC: CSK Facebook)

Hari Nishaanth Wedding: ఐపీఎల్‌ జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌ క్రికెటర్‌, తమిళనాడు ఆటగాడు సి. హరి నిషాంత్ వివాహ బంధంలో అడుగుపెట్టాడు. ఇరవై ఐదేళ్ల ఈ యువ ప్లేయర్‌ గురువారం(జూన్‌ 9) మనసుకు నచ్చిన అమ్మాయిని మనువాడాడు. ఈ సందర్భంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ హరి నిషాంత్‌కు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది.

హరి పెళ్లి వేడుకకు సంబంధించిన దృశ్యాలను పోస్ట్‌ చేస్తూ.. ‘‘హరి వివాహం జరిగింది. మిమ్మల్ని మేము సూపర్‌ కపుల్‌ అని పిలుస్తాం’’ అంటూ క్యాప్షన్‌ జత చేసింది. ఈ క్రమంలో కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

దేశవాళీ టోర్నీలో అదరగొట్టి..
తమిళనాడుకు చెందిన హరి నిషాంత్‌ దేశవాళీ టోర్నీల్లో ఆ రాష్ట్ర క్రికెట్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2019లో టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీతో అరంగేట్రం చేసిన ఈ లెఫ్ట్‌ హ్యాండెడ్‌ బ్యాటర్‌.. 2021 సీజన్‌లో 246 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో 35 పరుగులు చేసి జట్టు టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ క్రమంలో చెన్నై ఫ్రాంఛైజీ దృష్టిని ఆకర్షించిన హరి నిషాంత్‌ను ఐపీఎల్‌-2021 వేలం సందర్భంగా సొంతం చేసుకుంది. అయితే, ఇంత వరకు అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. ఇక ఐపీఎల్‌ తాజా సీజన్‌కు ముందు 20 లక్షల కనీస ధరతో అతడి మళ్లీ కొనుగోలు చేసింది. కాగా ఐపీఎల్‌-2022లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నైకి అస్సలు కలిసి రాలేదన్న సంగతి తెలిసిందే.

తొలుత రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా నియమించగా వరుస పరాజయాలు ఎదురయ్యాయి. దీంతో మరోసారి ఎంఎస్‌ ధోనికే పగ్గాలు అప్పజెప్పారు. ఈ క్రమంలో పద్నాలుగింట కేవలం 4 విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

చదవండి: IND vs SA: 'క్యాచ్‌ వదిలితే.. అట్లుంటది మనతో మరి'

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement