IPL 2023 Final CSK Vs GT- Who Is Sai Sudharsan- His Best Innings: ‘సాయి సుదర్శన్ ప్రత్యేకమైన ఆటగాడు. టి20 ఫార్మాట్‌కైతే సరిగ్గా సరిపోతాడు. సాధ్యమైనంత తొందరగా అతడిని తమిళనాడు జట్టులోకి తీసుకు రండి’... భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జూలై, 2021లో చెప్పిన ప్రశంసాపూర్వక మాట ఇది. ఆ ఏడాది తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అతను అద్భుత బ్యాటింగ్‌తో అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
అశ్విన్ మాట విన్నట్లుగా తమిళనాడు సెలక్టర్లు అతడిని జట్టులోకి ఎంపిక చేయగా... నవంబర్, 2021లోనే అతను తన తొలి దేశవాళీ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత గత రెండేళ్లలో అతని ఆట మరింత మెరుగైంది. 21 ఏళ్ల సుదర్శన్ మూడు ఫార్మాట్‌లలోనూ సత్తా చాటి ప్రస్తుతం ఆ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు.
Photo Credit : AFP
చెన్నై తీసుకోలేదు..
తన ప్రదర్శన, గుర్తింపు కారణంగా 2022 ఐపీఎల్ వేలంలో తనను చెన్నై జట్టు తీసుకుంటుందని సుదర్శన్ ఆశించాడు. కానీ అది జరగలేదు. చివరకు అతని కనీస విలువ రూ. 20 లక్షలకు గుజరాత్ టైటాన్స్ తీసుకుంది. విజయ్‌శంకర్‌కు గాయం కావడంతో తొలి మ్యాచ్ ఆడే అవకాశం రాగా, మొత్తం సీజన్‌లో 5 మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. అయితే అతని మెరుపులు ఆకట్టుకున్నాయి.
Photo Credit : AFP
విలియమ్సన్ తప్పుకోవడంతో
ముఖ్యంగా రబడ బౌలింగ్‌లో కొట్టిన హుక్‌షాట్ బౌండరీ అతని ఆత్మవిశ్వాసాన్ని చూపించింది. సాయి బ్యాటింగ్‌ను నమ్మిన టీమ్ యాజమాన్యం ఈసారి కూడా కొనసాగించింది. ఈ ఏడాది కూడా విలియమ్సన్ గాయంతో తప్పుకోవడంతో తనకు అందివచ్చిన అవకాశాన్ని అతను సమర్థంగా వినియోగించుకున్నాడు. ఢిల్లీపై అర్ధసెంచరీ చేసిన మ్యాచ్‌లో నోర్జే వేసిన 144 కిలోమీటర్ల బంతిని వికెట్ల వెనుకవైపు సిక్సర్‌గా మలచడం హైలైట్‌గా నిలిచింది.
Photo Credit : AFP
సెంచరీ చేజారినా..
కోల్‌కతాపై కూడా మరో అర్ధ సెంచరీ సాధించిన అతను ఈ సీజన్‌లో 51.71 సగటు, 141.41 స్ట్రయిక్‌రేట్‌తో 362 పరుగులు సాధించడం విశేషం. ముంబైతో రెండో క్వాలిఫయర్‌లో చివర్లో వేగంగా పరుగులు చేయలేక ‘రిటైర్డ్ అవుట్’గా వెళ్లడంతో అతని దూకుడుపై సందేహాలు తలెత్తాయి. అయితే సోమవారం అతను దానిని పటాపంచలు చేశాడు. సెంచరీ చేజారినా...ఐపీఎల్‌లో ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ ఇన్నింగ్స్‌లలో ఒకటి ఆడాడు.
Photo Credit : AFP
తల్లిదండ్రులు కూడా
సుదర్శన్ ఇంట్లోనే క్రీడలు ఉన్నాయి. అథ్లెట్ అయిన తండ్రి భరద్వాజ్ భారత్ తరఫున దక్షిణాసియా క్రీడల్లో పాల్గొనగా, తల్లి ఉష జాతీయ వాలీబాల్‌లో తమిళనాడు జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ప్రస్తుతం స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా పని చేస్తోంది. వివిధ వయో విభాగాల్లో అద్భుత ప్రదర్శనతో అతను దూసుకొచ్చాడు.
Photo Credit : AFP
తల్లి పర్యవేక్షణలో
2019–20 అండర్–19 చాలెంజర్ ట్రోఫీలో యశస్వి జైస్వాల్, తిలక్‌వర్మ, రవి బిష్ణోయ్, ప్రియమ్ గార్గ్ అతని ఇండియా ‘ఎ’ జట్టు సహచరులు. ఆరంభంలోనే ఫిట్‌నెస్‌పై అంతగా దృష్టి పెట్టని సాయి తల్లి పర్యవేక్షణలో పూర్తి ఫిట్‌గా మారడం కూడా అతని కెరీర్‌కు మేలు చేసింది.
Photo Credit : AFP
చెన్నైపై తన మెరుపు బ్యాటింగ్‌తో
2022లో టైటాన్స్ రూ.20 లక్షలకు తీసుకున్న తర్వాత జరిగిన 2023 తమిళనాడు ప్రీమియర్ లీగ్ వేలంలో సుదర్శన్‌కు రూ. 21.60 లక్షలు దక్కడం విశేషం. సీఎస్‌కేకే చెందిన జూనియర్ సూపర్ కింగ్స్ టీమ్ సభ్యుడిగా 2018లో సుదర్శన్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లగా, ఆ టీమ్‌కు అంబటి రాయుడు మెంటార్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు అదే చెన్నైపై తన మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగడం కొసమెరుపు! ఈ సందర్భంగా రికార్డుల మోత మోగించాడు సాయి సుదర్శన్.
–సాక్షి క్రీడా విభాగం
చదవండి: రిటైర్మెంట్ ప్రకటనకు ఇదే సరైన సమయం.. కానీ! నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి: ధోని
చాంపియన్‌గా చెన్నై.. గిల్ సరికొత్త చరిత్ర! అవార్డులు, ప్రైజ్‌మనీ పూర్తి వివరాలు ఇవే..
High praise for our young Titan 👏🏻💙 https://t.co/Kep0fr6Pgl
— Gujarat Titans (@gujarat_titans) May 29, 2023
Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA
— Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023
Comments
Please login to add a commentAdd a comment