PC: IPL Twitter
వర్షం కారణంగా గుజరాత్, చెన్నై జట్ల మధ్య నిన్న జరగాల్సిన ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డే అయిన నేటికి (మే 29) వాయిదా పడిన నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఇది ఓ రకంగా ధోని సేనకు శుభ సూచకమని చెప్పాలి. గడిచిన 15 ఐపీఎల్ సీజన్లలో 12 సీజన్ల ఫైనల్ మ్యాచ్‌లు ఆదివారం రోజున జరిగాయి. ప్రస్తుత సీజన్ ఫైనల్ మ్యాచ్ కూడా ఆదివారానికే షెడ్యూల్ అయినప్పటికీ వర్షం వల్ల అది సోమవారానికి వాయిదా పడింది.
నాన్ సండే రోజు జరిగిన మూడు ఫైనల్స్‌లో రెండు సీఎస్‌కే (2011 ఆర్సీబీతో శనివారం, 2021 కేకేఆర్‌తో శుక్రవారం), ఒకటి ముంబై (2020, డీసీతో మంగళవారం) గెలిచాయి. మూడింట రెండు ఫైనల్స్ సీఎస్‌కే గెలవడంతో ఆ జట్టు అభిమానులు నాన్ సండే (సోమవారం) రోజు ఐపీఎల్-2023 ఫైనల్స్ జరగడాన్ని శుభ సూచకంగా భావిస్తున్నారు. తమ కొరకే వరుణుడు ఆదివారం మ్యాచ్ జరగకుండా చేశాడని ఫీలవుతున్నారు.
#QuickByte: Non-Sunday finals in the IPL ⬇️
— Cricket.com (@weRcricket) May 28, 2023
2011: CSK vs RCB (Sat, 28 May)
2020: MI vs DC (Tue, 10 Nov)
2021: CSK vs KKR (Fri, 15 Oct)
2023: CSK vs GT (Mon, 29 May)#IPL2023Finals #CSKvGT pic.twitter.com/lyy7gZCz7E
సెంటిమెంట్లు బలంగా ఫాలో అయ్యే సీఎస్‌కే అభిమానులకు ఈ ఈక్వేషన్ అదనపు మనో ధైర్యాన్ని ఇస్తుంది. ఈ సీజన్‌లో సీఎస్‌కే తప్పక టైటిల్ గెలుస్తుందని వారు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఏది జరిగినా తమ మంచి కోసమేనని, ఈసారి ఎలాగైనా ధోని సారధ్యంలో సీఎస్‌కే టైటిల్ గెలవాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఇక, సండే, నాన్ సండే సెంటిమెంట్‌ను పెడితే.. వాస్తవానికి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫాలోవర్స్ కోసం సెలవు దినమైన ఆదివారం రోజు నిర్వహిస్తారు.
షెడ్యూల్ కుదరక, అనివార్య కారణాల వల్ల ఐపీఎల్ ఫైనల్స్ నాన్ సండే రోజు నిర్వహించాల్సి వచ్చిందే తప్ప, దీని వెనుక ఎలాంటి మతలబు లేదు. ఏది ఏమైనా ఎవరి సెంటిమెంట్లు వారికి ఉంటాయి కాబట్టి వాటిని గౌరవించాల్సి ఉంది. మరోవైపు ఫైనల్ మ్యాచ్ పని దినమైన సోమవారానికి వాయిదా పడటంతో మ్యాచ్ ప్రత్యక్షంగా చూసేందుకు టికెట్లు కొనుగోలు ఉద్యోగస్తులు తెగ ఫీలైపోతున్నారు. వర్కింగ్ డే కావడం, అదీ సోమవారం కావడంతో తప్పనిసరిగా ఆఫీస్‌కు వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు. ఎంతో శ్రమ కోర్చి బ్లాక్‌లో టికెట్లు కొంటే, తీరా పరిస్థితి ఇలా తయారైందని బాధపడుతున్నారు.
చదవండి: IPL 2023: 'రిజర్వ్ డే'కు ఫైనల్ మ్యాచ్.. ధోని రిటైర్మెంట్‌కు సంకేతమా..?
Comments
Please login to add a commentAdd a comment