టీమిండియా వెటరన్ ఓపెనర్ మురళీ విజయ్ అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌కు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దాదాపు 16 ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన విజయ్.. సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించాడు. విజయ్ చివరగా తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. ఈ టోర్నీలో మదురై పాంథర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
ఇక 38 ఏళ్ల విజయ్ టీమిండియా తరఫున 61 టెస్ట్‌లు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 12 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీల సాయంతో 3982 పరుగులు చేశాడు. అదే విధంగా వన్డేల్లో ఒక హాఫ్‌తో పాటు 339 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే 106 మ్యాచ్‌లు ఆడిన విజయ్.. 2 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీల సాయంతో 2619 పరుగులు చేశాడు. విజయ్ చివరగా 2020 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. ఇక అన్ని ఫార్మాట్‌ల క్రికెట్ నుంచి తప్పుకున్న విజయ్ విదేశీ లీగ్‌ల్లో ఆడే అవకాశం ఉంది.
ఇప్పటికే విజయ్ పేరునే..
కాగా విజయ్ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటకీ ఓ అరుదైన రికార్డు మాత్రం తన పేరిట సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. 2010 ఐపీఎల్ సీజన్‌లో చెన్నైకు ప్రాతినిథ్యం వహించిన విజయ్.. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో 127 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. దీంతో ఐపీఎల్ సీఎస్‌కే తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా విజయ్ నిలిచాడు. ఇప్పటికి ఈ రికార్డు విజయ్ పేరిటే ఉంది.
చదవండి: న్యూజిలాండ్‌లా కాదు.. పాక్ ప్రధాన బలం అదే! అందుకే టీమిండియా బ్యాటర్లు..: పాక్ మాజీ బౌలర్
Comments
Please login to add a commentAdd a comment