murali vijay
-
సెహ్వాగ్ కాదు!.. గావస్కర్ తర్వాత అతడే టెస్టు బెస్ట్ ఓపెనర్!
టీమిండియా బౌలింగ్ విభాగం మాజీ కోచ్ భరత్ అరుణ్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. రవిశాస్త్రి దృష్టిలో సునిల్ గావస్కర్ తర్వాత అంతటి గొప్ప ఓపెనర్ మళ్లీ మురళీ విజయ్ అని పేర్కొన్నాడు. తనకు కూడా మురళీనే అభిమాన క్రికెటర్ అని తెలిపాడు. కాగా 2008లో నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా తమిళనాడుకు చెందిన మురళీ విజయ్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్‌లో వరుసగా 33, 41 పరుగులు సాధించాడు. ఓపెనర్‌గా సత్తా చాటి టెస్టు జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. కెరీర్లో మొత్తంగా 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో వరుసగా 3982, 339, 169 పరుగులు సాధించాడు మురళీ విజయ్. గతేడాది జనవరిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా మురళీ విజయ్ గురించి క్రికెట్.కామ్ ఇంటర్వ్యూలో భరత్ అరుణ్ మాట్లాడుతూ.. ‘‘యువకుడిగా ఉన్నప్పటి నుంచి నాకు మురళీ విజయ్‌తో పరిచయం ఉంది.కాలేజీలో తనను మొదటిసారి చూశాను. ఫస్ట్ డివిజన్ జట్టుకు అతడి పేరును రికమెండ్ చేశాను. అలా అతడి ప్రయాణం మొదలైంది. రవిశాస్త్రి ఎల్లప్పుడూ నాతో ఓ మాట అంటూ ఉండేవాడు. సునిల్ గావస్కర్ తర్వాత ఆ స్థాయిలో టెస్టుల్లో ఆకట్టుకున్న ఓపెనర్ మురళీ విజయ్ అని చెప్పేవాడు. నా ఫేవరెట్ క్రికెటర్ కూడా మురళీ విజయే’’ అని పేర్కొన్నాడు. కాగా టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన దిగ్గజ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మలను కాదని.. గావస్కర్ తర్వాతి స్థానాన్ని రవిశాస్త్రి మురళీ విజయ్‌కు ఇవ్వడంపై నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: అప్పుడు పుజారాకు ఫోన్ చేశా.. రోహిత్, రాహుల్ భయ్యాకు థాంక్స్: అశూ భార్య -
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మురళీ విజయ్.. ఇప్పటికీ ఆ రికార్డు తన పేరిటే
టీమిండియా వెటరన్ ఓపెనర్ మురళీ విజయ్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దాదాపు 16 ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన విజయ్.. సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించాడు. విజయ్ చివరగా తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. ఈ టోర్నీలో మదురై పాంథర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇక 38 ఏళ్ల విజయ్ టీమిండియా తరఫున 61 టెస్ట్‌లు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 12 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీల సాయంతో 3982 పరుగులు చేశాడు. అదే విధంగా వన్డేల్లో ఒక హాఫ్‌తో పాటు 339 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే 106 మ్యాచ్‌లు ఆడిన విజయ్.. 2 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీల సాయంతో 2619 పరుగులు చేశాడు. విజయ్ చివరగా 2020 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. ఇక అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్న విజయ్ విదేశీ లీగ్‌ల్లో ఆడే అవకాశం ఉంది. ఇప్పటికే విజయ్ పేరునే.. కాగా విజయ్ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటకీ ఓ అరుదైన రికార్డు మాత్రం తన పేరిట సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. 2010 ఐపీఎల్ సీజన్లో చెన్నైకు ప్రాతినిథ్యం వహించిన విజయ్.. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో 127 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. దీంతో ఐపీఎల్ సీఎస్కే తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా విజయ్ నిలిచాడు. ఇప్పటికి ఈ రికార్డు విజయ్ పేరిటే ఉంది. చదవండి: న్యూజిలాండ్‌లా కాదు.. పాక్ ప్రధాన బలం అదే! అందుకే టీమిండియా బ్యాటర్లు..: పాక్ మాజీ బౌలర్ -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ ఓపెనర్
Murali Vijay Announces Retirement: టీమిండియా వెటరన్ ఓపెనింగ్ బ్యాటర్, తమిళనాడు క్రికెటర్ మురళి విజయ్.. క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇవాళ (జనవరి 30) ప్రకటించాడు. మురళి విజయ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించాడు. రిటైర్మంట్ నోట్లో విజయ్ తనకు సహకరించిన వారందికీ ధన్యవాదాలు తెలిపాడు. 16 ఏళ్ల (2002-2018) పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నాని విజయ్ పేర్కొన్నాడు. @BCCI @TNCACricket @IPL @ChennaiIPL pic.twitter.com/ri8CCPzzWK — Murali Vijay (@mvj888) January 30, 2023 తనకు అవకాశాలు కల్పించిన బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్, చెన్నై సూపర్ కింగ్స్, చెమ్‌ప్లాస్ట్ సన్మార్ ఫ్రాంచైజీల యజమాన్యాలకు విజయ్ కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే, తన టీమ్ మేట్స్, కోచెస్, మెంటార్స్, సపోర్టింగ్ స్టాఫ్‌లకు కూడా ధన్యవాదాలు తెలిపాడు. ముఖ్యంగా తన కెరీర్లో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నప్పుడు అండగా నిలిచిన ఫ్యాన్స్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నాడు. తనపై అన్ కండిషనల్ లవ్ చూపిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను క్రికెట్‌కు సంబంధించిన వ్యాపారంలో కొనసాగిస్తానని తెలిపాడు. 38 ఏళ్ల మురళి విజయ్.. టీమిండియా తరఫున 61 టెస్ట్‌లు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 12 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీల సాయంతో 3982 పరుగులు చేసిన విజయ్.. వన్డేల్లో ఒక హాఫ్ సెంచరీ సాయంతో 339 పరుగులు, టీ20ల్లో 169 పరుగులు చేశాడు. ఐపీఎల్లో 106 మ్యాచ్‌లు ఆడిన విజయ్.. 2 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీల సాయంతో 2619 పరుగులు చేశాడు. విజయ్ తన ఐపీఎల్ ప్రస్థానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే కౌంటీల్లో ఎసెక్స్, సోమర్సెట్ జట్ల తరఫున ఆడాడు. విజయ్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌తో పాటు లిస్ట్-ఏ క్రికెట్లోనూ మంచి ట్రాక్ రికార్డు ఉంది. రిటైర్మెంట్ వయసుకు సంబంధించి విజయ్ ఇటీవలే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ క్రికెట్లో 30 ఏళ్లు దాటితే 80 ఏళ్ల వృద్ధుడిలా చూస్తారని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ ప్రకటన చేసిన రోజుల వ్యవధిలోనే విజయ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. -
సెహ్వాగ్‌లా నాకూ ఆ ఫ్రీడం దొరికి ఉంటే కథ వేరేలా ఉండేది! కానీ..
Virender Sehwag- Murali Vijay: విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత క్రికెట్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్న వీరేంద్ర సెహ్వాగ్ గురించి టీమిండియా మాజీ ఓపెనర్ మురళీ విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీరూ భాయ్‌లాగే తనకు కూడా మేనేజ్మెంట్ మద్దతు లభించి ఉంటే తన కెరీర్ వేరే విధంగా ఉండేదని పేర్కొన్నాడు. సెహ్వాగ్‌కు తన క్రీడా జీవితంలో అనుకున్నవన్నీ దక్కాయని, తన విషయంలో మాత్రం అలా జరుగలేదని వాపోయాడు. కాగా 2008లో ఆస్ట్రేలియాతో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు చెన్నై బ్యాటర్ మురళీ విజయ్. సెహ్వాగ్‌తో కలిసి పలు సందర్భాల్లో ఓపెనింగ్ బ్యాటర్‌గా బరిలోకి దిగాడు. 2018లో ఆసీస్‌తో పెర్త్‌లో ఆఖరిసారిగా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం విదేశీ లీగ్‌లలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న 38 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. స్పోర్ట్స్ స్టార్ షోలో పాల్గొన్నాడు. అలాంటి ఫ్రీడం దొరికి ఉంటే ఈ సందర్భంగా డబ్లూవీ రామన్‌తో ముచ్చటిస్తూ.. ‘‘నిజం చెప్పాలంటే.. తన కెరీర్లో వీరేంద్ర సెహ్వాగ్‌కు దక్కినంత స్వేచ్ఛ నాకు లభించలేదనే చెప్పాలి. తనకు యాజమాన్యం నుంచి అన్ని విధాలా మద్దతు దొరికింది. తన మాట చెల్లేది. నాకు కూడా అలాంటి ఫ్రీడం దొరికి ఉంటే.. నా మాట వినిపించుకునే వాళ్లు ఉండి ఉంటే బాగుండేది. అంతర్జాతీయ క్రికెట్లో రాణించాలంటే మేనేజ్మెంట్ మద్దతు తప్పనిసరి. వరుస అవకాశాలు వస్తేనే ప్రయోగాలు చేసే వీలు ఉంటుంది’’ అని మురళీ విజయ్ పేర్కొన్నాడు. ఏదేమైనా తనలా ఎవరూ ఆడలేరు! వీరూ భాయ్‌తో కలిసి ఆడటం గురించి చెబుతూ..‘‘సెహ్వాగ్ మరో ఎండ్‌లో ఉన్నాడంటే బ్యాటింగ్ చేయడం కాస్త కష్టమే. తనలా మరెవరూ బ్యాటింగ్ చేయలేరు అనిపిస్తుంది. భారత క్రికెట్‌కు ఆయన ఎనలేని సేవ చేశారు. అలాంటి అద్భుత ఆటగాడితో కలిసి ఆడటం, ఆయన ఇన్నింగ్స్ ప్రత్యక్షంగా వీక్షించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. బంతి వచ్చిందంటే అదును చూసి బాదడమే ఆయన పని. తన సక్సెస్ మంత్ర ఇదే! గంటకు 145- 150 కిలో మీటర్లవేగంతో బంతిని విసిరే బౌలర్లను కూడా ఉతికి ఆరేయడం తనకే చెల్లింది. నిజంగా తన ఆట తీరు అసాధారణం’’ అని ప్రశంసలు కురిపించాడు. చదవండి: IND vs NZ: మా సంజూ ఎక్కడ? గుండెల్లో ఉన్నాడు.. శభాష్ సూర్య! వీడియో వైరల్ IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. సెహ్వాగ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి -
మురళీ విజయ్‌కు చేదు అనుభవం, డీకే..డీకే అంటూ ఫాన్స్ కేకలు.. అతనేం చేశాడంటే..!
టీమిండియా క్రికెటర్ మురళీ విజయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో రూబీ ట్రిక్కి వారియర్స్‌కు ఆడుతున్న విజయ్ను మ్యాచ్ జరుగుతుండగా అభిమానులు ఆట పట్టించారు. విజయ్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా డీకే.. డీకే అంటూ కేకలు పెడుతూ తీవ్ర అసౌకర్యానికి గురి చేశారు. దీంతో విజయ్ ఫ్యాన్స్‌కు దండం పెడుతూ అరవద్దని ప్రాధేయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టంట వైరలవుతోంది. #TNPL2022 DK DK DK ...... Murali Vijay reaction pic.twitter.com/wK8ZJ84351 — Muthu (@muthu_offl) July 7, 2022 కాగా, డీకే (దినేష్ కార్తీక్) మొదటి భార్య నిఖిత వంజరను మురళీ విజయ్ అనైతికంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత డీకే.. ప్రముఖ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం డీకే కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతూ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వగా.. విజయ్ సరైన అవకాశాలు లేక గల్లీ క్రికెట్‌కు పరిమితమయ్యాడు. చదవండి: ఆఖరి ఓవర్లో సిక్సర్‌తో టీమిండియాను గెలిపించింది వీళ్లే! ఎప్పుడెప్పుడంటే? -
38 ఏళ్ల వయసులో క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తున్న భారత ఆటగాడు..!
టీమిండియా వెటరన్ ఆటగాడు మురళీ విజయ్ దాదాపు రెండేళ్ల తర్వాత క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో రూబీ ట్రిచీ వారియర్స్ తరపున ఆడేందుకు విజయ్ సిద్దమయ్యాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్-2022 తిరునెల్వేలి వేదికగా జాన్ 23న ప్రారంభమైంది. కాగా విజయ్ చివరగా ఐపీఎల్-2020 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. తర్వాత అతడు పూర్తిగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో తన రీ ఎంట్రీపై విజయ్ తాజాగా స్పందించాడు. “నేను వీలైనంత ఎక్కువ కాలం క్రికెట్ ఆడాలనుకుంటున్నాను. నేను యువకులతో కలిసి ఆడబోతున్నాను. వారంతా నా కుటంబం. కాబట్టి నా అనుభావాన్ని వాళ్లతో పంచుకుని ముందుకు నడిపించాలి అనుకుంటున్నాను. నేను ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నాను. నా జట్టు, తమిళనాడు ప్రీమియర్ లీగ్ కోసం నా వంతు కృషి చేస్తాను" అని విజయ్ పేర్కొన్నాడు. ఇక 2008లో టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసిన మురళీ విజయ్, 2018లో ఆస్ట్రేలియాపై చివరి టెస్టు ఆడాడు. చదవండి: IND vs LEI: రాణించిన శ్రీకర్ భరత్.. టీమిండియా స్కోర్: 246/8 -
11 ఏళ్ల రికార్డు సమం చేసిన శివమ్ దూబే
ఐపీఎల్ 2022లో శివమ్ దూబే సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో శివమ్ దూబే.. 45 బంతుల్లో 95 నాటౌట్, 5 ఫోర్లు, 8 సిక్సర్లతో శివాలెత్తాడు. మరో బ్యాట్స్‌మన్ ఊతప్పతో పోటాపోటీగా పరుగులు సాధించాడు. ఆఖర్లో సెంచరీ చేసే అవకాశం వచ్చినప్పటికి తృటిలో చేజార్చుకున్నాడు. అయితే తన ఇన్నింగ్స్‌తో మాత్రం క్రికెట్ ఫ్యాన్స్‌ను సంతోషంలో ముంచెత్తాడు. ఈ నేపథ్యంలో శివమ్ దూబే సీఎస్కే తరపున 11 ఏళ్ల రికార్డును సమం చేశాడు. ఆ రికార్డు ఏంటంటే.. సీఎస్కే, ఆర్సీబీ ముఖాముఖి తలపడిన సందర్భాల్లో సీఎస్కే బ్యాట్స్‌మన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 95గా ఉండేది. 2011 సీఎస్కే, ఆర్సీబీ మధ్య జరిగిన ఫైనల్లో మురళీ విజయ్ 95 పరుగులు సాధించాడు. తాజాగా శివమ్ దూబే.. అదే ఆర్సీబీపై 95 పరుగులు చేసి మురళీ విజయ్‌తో సమంగా నిలిచాడు. చదవండి: IPL 2022: థర్డ్ అంపైర్‌కు మతి భ్రమించిందా..? -
Murali Vijay: ఓర్నీ.. అందుకే మురళీ విజయ్ టోర్నీకి దూరంగా ఉన్నాడా?!
Murali Vijay Refuses Covid 19 Jab Out Of Syed Mushtaq Ali Trophy: తమిళనాడు వెటరన్ క్రికెటర్ మురళీ విజయ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, అతడు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకునేందుకు ఈ ఓపెనర్ సిద్ధంగా లేడని.. అందుకే టోర్నీ నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. అంతేగాక బయో బబుల్‌లో ఉండేందుకు మురళీ విజయ్ నిరాకరించినట్లు సమాచారం. ఈ విషయం గురించి తెలిసిన వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ... ‘‘అది తన వ్యక్తిగత నిర్ణయం. వ్యాక్సిన్ తీసుకోవడానికి అతడు సుముఖంగా లేడు. కరోనా నేపథ్యంలో బీసీసీఐ మార్గదర్శకాలు పాటించడానికి సిద్ధంగా లేడు. టోర్నీ ఆరంభానికి ముందు బయో బబుల్‌లో ఉండాలని బీసీసీఐ నిబంధన విధించింది. విజయ్ మాత్రం ఎందుకో ఆసక్తి చూపలేదు. దీంతో తమిళనాడు జట్టు ఎంపిక సమయంలో సెలక్టర్లు అతడిని పరిగణనలోకి తీసుకోలేదు’’అని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనంలో తెలిపింది. ఒకవేళ అతడు ఇప్పుడు జట్టులోకి రావాలన్నా ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుందని సదరు వర్గాలు తెలిపినట్లు వెల్లడించింది. ఇక ఈ విషయం గురించి మురళీ విజయ్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. అతడు అందుబాటులోకి రాలేదని పేర్కొంది. కాగా 37 ఏళ్ల మురళీ విజయ్ ఒకప్పుడు టీమిండియాలో కీలక ప్లేయర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. టెస్టుల్లో 3982 పరుగులు సాధించిన అతడు.. గతేడాది ఐపీఎల్లో ఆడాడు. ఇక తమిళనాడు తరఫున 2019లో చివరిసారిగా రంజీ ట్రోఫీ ఆడాడు. చదవండి: T20 World Cup 2021: అదరగొడుతున్న ఆడం జంపా.. అయినా గానీ... -
తన స్నేహితుడితో భార్య ‘బంధం’.. భరించలేక నాడు ఆ క్రికెటర్..
Shikhar Dhawan-Ayesha Mukherjee Divorce: ‘‘రెండోసారి డైవోర్సీ అయ్యేంత వరకు విడాకులు అనేది చెత్తపదం అనుకున్నా’’ అంటూ టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ భార్య అయేషా ముఖర్జీ తాము విడిపోయిన విషయాన్ని ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. శిఖర్‌తో తన బంధం ఇక ముగిసిపోయిందని ఆమె స్పష్టం చేశారు. ఎల్లప్పుడూ అన్యోన్యతను ప్రదర్శించే ఈ జంట విడాకులు తీసుకోవడం అభిమానులను విస్మయానికి గురిచేస్తోంది. అంతేకాదు.. ఈ విషయంపై గబ్బర్ ఇంతవరకు స్పందించకపోవడంతో ‘‘ఇంతకూ ఇది నిజమేనా’’ అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కూడా. ఏదేమైనా.. శిఖర్ విడాకుల అంశం క్రీడా వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ క్రమంలో గతంలో భార్యలతో విడిపోయిన టీమిండియా స్టార్, మాజీ క్రికెటర్ల గురించి నెటిజన్లు చర్చింకుంటున్నారు. మహ్మద్ అజారుద్దీన్- సంగీత బిజ్లానీ భారత జట్టు మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్- సంగీత బిజ్లానీ బిగ్గెస్ట్ సెలబ్రిటీ జంటగా పేరొందారు. బాలీవుడ్ నటి అయిన సంగీత అందానికి ఫిదా అయిన అజారుద్దీన్ మొదటి భార్యకు దూరమై.. 1996లో ఆమెను వివాహమాడాడు. అప్పటికే అజారుద్దీన్‌కు ఇద్దరు కొడుకులు. ఇక సంగీతతో కూడా అతడు సుదీర్ఘకాలం పాటు బంధం కొనసాగించలేకపోయాడు. 2010లో ఈ జంట విడిపోయింది. వినోద్ కాంబ్లీ- నోయెలా లూయిస్ టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ, తన చిన్ననాటి స్నేహితురాలు నోయెలా లూయిస్‌ను పెళ్లాడాడు. 1998లో వివాహ బంధంతో ఒక్కటైన జంట అభిప్రాయ భేదాలతో విడాకులు తీసుకుంది. అయితే, కొంతకాలం తర్వాత మాజీ మోడల్ ఆండ్రియా హెవిట్‌ను వివాహమాడిన వినోద్ కాంబ్లీ ఆమెతో జీవనం కొనసాగిస్తున్నాడు. జవగళ్ శ్రీనాథ్- జ్యోత్స భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ వైవాహిక బంధం కూడా సాఫీగా సాగలేదు. 1999లో జ్యోత్స అనే మహిళను పెళ్లాడిన శ్రీనాథ్.. తొమ్మిదేళ్ల పాటు ఆమెతో జీవితం పంచుకున్నాడు. కానీ, మనస్పర్దల కారణంగా 2008లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. ప్రస్తుతం ఐసీసీ మ్యాచ్ రిఫరీగా ఉన్న శ్రీనాథ్ జర్నలిస్టు మాధవి పాత్రవళిని పెళ్లి చేసుకున్నాడు. దినేశ్ కార్తీక్- నికితా వంజారా టీమిండియా క్రికెటర్ల విడాకుల అంశంలో నేటికీ హాట్‌టాపిక్ అంటే దినేశ్- నికితా జంటదే. చిన్ననాటి స్నేహితురాలైన నికితను పెళ్లాడిన దినేశ్‌కు ఆమె ఊహించని షాకిచ్చింది. దినేశ్ సహ ఆటగాడు, భారత క్రికెటర్ మురళీ విజయ్‌తో ఆమె బంధం కొనసాగించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న దినేశ్ 2012లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. మూడేళ్ల తర్వాత స్వ్యాష్ ప్లేయర్ దీపికా పళ్లికల్‌ను వివాహమాడాడు. మరోవైపు.. నికితా.. మురళీ విజయ్ను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. చదవండి: Ind Vs Eng: టీమిండియాదే క్రెడిట్ అంతా: ఇంగ్లండ్ కోచ్ -
మురళీ విజయ్‌కు అద్భుత అవకాశం: శ్రీకాంత్
దుబాయ్: ఐపీఎల్ 2020 నుంచి అనూహ్యంగా తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ప్రధాన ఆటగాడు సురేశ్ రైనా స్థానాన్ని మొరళీ విజయ్ భర్తీ చేయగలడని టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ కే. శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. సీఎస్కే జట్టులో రైనా కీలక పాత్ర పోషించాడని అన్నారు. అయితే కెరీర్లో తిరిగి పుంజుకునేందుకు మొరళీ విజయ్‌కు అనుకూల సమయమని అభిప్రాయపడ్డారు. కాగా అద్భుత ఆటతీరుతో విజయ్ ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు శ్రీకాంత్ ఆడాడని గుర్తు చేశాడు. ఓపెనర్‌గా షేన్ వాట్సన్‌తో కలిసి విజయ్ ఇన్నింగ్స్ ప్రారంభించగలడని తెలిపాడు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనియే సీఎస్కే టీమ్‌కు అతి పెద్ద బలమని తెలిపారు. మ్యాచ్‌లను గెలిపించడంలో ధోనికి అపార అనుభవం ఉందని, మ్యాచ్‌లు గెలవగలిగే ఫార్ములా ఆయనకు తెలుసని కే శ్రీకాంత్ పేర్కొన్నాడు. (చదవండి: మూడో ఫైనల్.. రెండో ట్రోఫీ.. అదిరిందయ్యా ధోని) -
మురళీ విజయ్ హీరో అయిన వేళ!
చెన్నై: టెస్టు బ్యాట్స్‌మన్‌గా ముద్రపడిపోయిన మురళీ విజయ్ ఓ టీ20 మ్యాచ్‌లో భీకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. 52 బంతుల్లో 6 సిక్సర్లు, 4 ఫోర్లతో 95 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా టాప్ స్కోరర్‌గా నిలిచిన విజయ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్- 2011లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్- ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన ఫైనల్ పోరులో విజయ్ ఈ గణాంకాలు నమోదు చేశాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా సీఎస్కే, గ్రూప్ స్టేజ్‌లో అత్యధిక పాయింట్లతో ఉన్న ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన ఈ ఫైనల్ పోరు ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఈ మ్యాచ్ జరిగి నేటిక తొమ్మిదేళ్లవుతున్న సందర్భంగా ఆనాటి మ్యాచ్ విశేషాలు మీకోసం.. (ధోని రిటైర్మెంట్పై సాక్షి ట్వీట్.. డిలీట్) టాస్ గెలిచిన సీఎస్కే సారథి ధోని ‘మనసులో లక్ష్యంతో బరిలోకి దిగాలనుకోవడం లేదు’అని పేర్కొంటూ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఓపెనర్లుగా బరిలోకి దిగిన మైక్ హస్సీ, విజయ్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. హస్సీ(63; 45 బంతుల్లో 3ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు. దీంతో వీరిద్దరు తొలి వికెట్‌కు 159 పరుగుల భారీ భాగస్వామాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన విజయ్(95) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇక మిగతా బ్యాట్స్‌మన్ తమ వంతు మెరుపులు మెరిపించడంతో సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. (ప్రపంచకప్ వాయిదా.. పాక్‌కు కడుపు మంట) అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ అందరి ఆశలను ఆవిరి చేస్తూ డకౌట్‌గా వెనుదిరిగాడు. సౌరభ్ తివారి(42) మినహా మిగతా బ్యాట్స్‌మన్ అంతగా రాణించకపోవడంతో డానియల్ వెటోరీ సారథ్యంలోని ఆర్సీబీ మరోసారి భంగాపాటుకు గురైంది. ఐపీఎల్-2009 ఫైనల్ మ్యాచ్‌లోనూ అప్పటి డెక్కన్ ఛార్జర్స్ చేతిలో ఆర్సీబీ ఓటమిచవిచూసిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో 58 పరుగుల భారీ విజయం సాధించిన సీఎస్కే అటు మ్యాచ్‌తో పాటు ఇటు ఐపీఎల్-2011 ట్రోఫీని గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో మురళీ విజయ్ హీరోచిత ఇన్నింగ్స్ ఆడాడని సారథి ధోని పేర్కొనడం విశేషం. -
విజయ్‌తో డిన్నర్‌కు ఓకే చెప్పిన ఎలిస్
న్యూఢిల్లీ: కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీతో డిన్నర్ చేయాలని ఉందని టీమిండియా క్రికెటర్ మురళీ విజయ్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఇటీవల విజయ్ను సీఎస్కే జట్టు ఇంటర్య్వూ చేయగా అక్కడ ఏ ఇద్దరు క్రికెటర్లతో డిన్నర్‌కు వెళ్తారు అనే ప్రశ్న ఎదురైంది. దీనికి మురళీ విజయ్ బదులిస్తూ.. ఎలిస్ పెర్రీతో డిన్నర్ చేయాలని ఉందన్నాడు. ఆమె చాలా అందంగా ఉంటుందని కూడా వ్యాఖ్యానించాడు. అదే సమయంలో భారత ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కూడా డిన్నర్ చేయాలని ఉందన్నాడు. ఇక్కడ శిఖర్ ధావన్ సంగతి ఎలా ఉన్నా ఎలిస్ పెర్రీ మాత్రం విజయ్‌తో డిన్నర్‌కు ఓకే చెప్పారు. (చివరి వరకు కేకేఆర్‌తోనే: రసెల్) సోనీ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెర్రీకి మురళీ విజయ్‌తో డిన్నర్ ప్రశ్న ఎదురు కాగా అందుకు ఆమె నవ్వుతూ సమాధానమిచ్చారు. తనకు విజయ్‌తో డిన్నర్‌కు ఎటువంటి అభ్యంతరం లేదని, కాకపోతే డిన్నర్‌కు అయ్యే బిల్ మాత్రం విజయ్ చెల్లిస్తాడని ఆశిస్తున్నా అని సరదాగా వ్యాఖ్యానించారు. ఇక వచ్చే వరల్డ్‌కప్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా.. లేక యాషెస్ సిరీస్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారా’ అనే ప్రశ్నకు కాసేపు ఆలోచించి యాషెస్ అని చెప్పారు. కోచ్‌గా చేయడం ఇష్టమా.. కామెంటేటర్‌గా వ్యవహరించడం ఇష్టమా అంటే కోచ్‌గా చేయడానికే ఆమె ఓటేశారు. అదే సమయంలో భారత మహిళా క్రికెట్ జట్టు యువ సంచలనం షెఫాలీ వర్మపై పెర్రీ ప్రశంసలు కురిపించారు. షెఫాలీలో టాలెంట్ అసాధారణమని కొనియాడారు. ఆ తరహా క్రీడాకారిణిని తమ గేమ్‌లో ఉండాలని కోరుకుంటామన్నారు. (ప్రమాదకరమైన పిచ్‌పై ‘టెస్టు’ ఆడుతున్నాం) ఇదిలా ఉంచితే, 2018 డిసెంబర్లో పెర్త్‌లో ఆసీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ తరఫున చివరిసారి కనిపించిన విజయ్.. ఇప్పటికీ రెగ్యులర్ ఆటగాడిగా చోటు సంపాదించుకోలేపోయాడు. టెస్టు ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లకు తోడు ఇప్పుడు రోహిత్ శర్మ కూడా అందుబాటులో ఉండటంతో మురళీ విజయ్ను టీమిండియా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. కాగా, ఈ ఏడాది ఆగస్టులో తాను దేశం కోసం ఆడాలని ఏనాడు కోరుకోనని, ఫ్యాషన్ కోసం మాత్రమే క్రికెట్ ఆడతానంటూ మనసులో మాట బయటపెట్టాడు. కాగా, గత రెండేళ్లుగా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మురళీ విజయ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. -
మురళీ విజయ్‌కు గుడ్ బై..!
చెన్నై: గతేడాది డిసెంబర్లో పెర్త్‌లో ఆసీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ తరఫున చివరిసారి కనిపించిన విజయ్.. ఇప్పటికీ రెగ్యులర్ ఆటగాడిగా చోటు సంపాదించుకోలేపోయాడు. టెస్టు ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లకు తోడు ఇప్పుడు రోహిత్ శర్మ కూడా అందుబాటులో ఉండటంతో మురళీ విజయ్ను టీమిండియా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. కాగా, ఈ ఏడాది ఆగస్టులో తాను దేశం కోసం ఆడాలని ఏనాడు కోరుకోనని, ఫ్యాషన్ కోసం మాత్రమే క్రికెట్ ఆడతానంటూ మనసులో మాట బయటపెట్టాడు. కాగా, గత రెండేళ్లుగా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మురళీ విజయ్.. ఈసారి సీఎస్కే జట్టులో ఉండకపోవచ్చు. వచ్చే నెలలో జరుగనున్న ఐపీఎల్ వేలంలో భాగంగా సీఎస్కే విడుదల చేసే ఆటగాళ్లలో మురళీ విజయ్ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. అసలు మురళీ విజయే అవసరమే చెన్నైకు రాకపోవడంతో అతన్ని అంటిపెట్టుకోవడం వల్ల లాభం లేదని యోచనలో సదరు ఫ్రాంచైజీ ఉంది. గత రెండు సీజన్లుగా రెండు కోట్ల జీతంతో చెన్నై జట్టులో కొనసాగుతున్నాడు విజయ్. 2018,19 సీజన్లలో మూడు మ్యాచ్‌లు ఆడిన విజయ్ కేవం 76 పరుగులు మాత్రమే చేశాడు.అతని వల్ల జట్టుకు ప్రయోజనం లేనప్పుడు రెండు కోట్లు వృథాగా ఇస్తున్నామనేది సీఎస్కే భావన. దాంతో 2020 ఐపీఎల్ వేలం నాటికి విజయ్ను జట్టు నుంచి విడుదల చేసేందుకు సీఎస్కే దాదాపు రంగం సిద్ధం చేసింది. ఇక కరణ్ శర్మ, శార్దూల్ ఠాకూర్లను కూడా జట్టు నుంచి రిలీజ్ చేయడానికి సీఎస్కే సిద్ధమైనట్లు సమాచారం. గత రెండు సీజన్లలో లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మ తీసిన వికెట్లు ఐదు. మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడి ఐదు వికెట్లను మాత్రమే తీశాడు. మరొకవైపు అతని బౌలింగ్ ఎకానమీ రేట్ కూడా అంత బాలేదు. అదే సమయంలో కరణ్ శర్మకు చెల్లించేది రూ. 5 కోట్ల రూపాయిలు కావడంతో అతనికి కూడా సీఎస్కే నుంచి ఉద్వాసన తప్పదు. మరొకవైపు శార్దూల్ ఠాకూర్ విషయంలో కూడా సీఎస్కే అంతగా ఆసక్తి కనబరచడం లేదు. శార్దూల్‌కు రూ. 2 కోట్లకు పైగా చెల్లించడంతో అందుకు తగ్గ ప్రదర్శన అతని నుంచి రావడం లేదు. గత రెండు సీజన్లలో 23 మ్యాచ్‌లు ఆడిన శార్దూల్ 24 వికెట్లు మాత్రమే తీశాడు. దాంతో శార్దూల్ కూడా సీఎస్కే నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఒక వేళ ఈ ముగ్గుర్నీ సీఎస్కే రిలీజ్ చేస్తే వీరు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందే. -
దేశం కోసం ఆడాలనుకోను: మురళీ విజయ్
న్యూఢిల్లీ: ‘నేను కేవలం జట్టు కోసమే కాదు.. దేశం కోసమూ ఆడతా’ ఇటీవల టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్య ఇది. ‘జట్టులో ఆటకన్నా ఎవరు గొప్ప కాదు. అది కెప్టెన్ విరాట్ అయినా, నేనైనా.. ఇంకెవరైనా అందరం జట్టుకోసమే ఆలోచించేవాళ్లమే’ అని రవిశాస్త్రి కామెంట్‌కు కౌంటర్‌గా రోహిత్ ఇలా వ్యంగ్యంగా స్పందించడం కొన్ని రోజుల క్రితం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇప్పుడు టీమిండియా క్రికెటర్ మురళీ విజయ్ చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. తాను దేశం కోసం మాత్రమే ఆడాలని భావించనని, ప్యాషన్‌తో మాత్రమే క్రికెట్‌ను ఆడతానన్నాడు. అది ఏ జట్టు అనేది తనకు అనవసరమన్నాడు. తాను ఏ జట్టు కోసం ఆడినా ఆటపై ఉన్న అభిమానంతో మాత్రమే ఆడతానన్నాడు. ఉన్నత స్థాయి క్రికెట్ ఆడటమే తన లక్ష్యమన్నాడు. ఇక్కడ జట్లు అనేవి తనకు ప్రాధాన్యత ఉండదన్నాడు. ఏ తరహా క్రికెట్ ఆడాల్సి వచ్చినా తన వరకు న్యాయం చేయడంపైనే దృష్టి సారిస్తానన్నాడు. సుమారు 15 ఏళ్లుగా క్రికెట్‌ను ఇదే తరహాలో ఆస్వాదిస్తూ ముందుకు వెళుతున్నానని విజయ్ పేర్కొన్నాడు. తనకు వచ్చే అవకాశాలు ఎప్పుడూ కూడా మరింత అనుభవాన్ని ఇచ్చాయని, దాన్నే ముందుకు తీసుకెళ్లడానికి ఎల్లప్పుడూ యత్నిస్తానన్నాడు. గతేడాది డిసెంబర్లో పెర్త్‌లో ఆసీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ తరఫున చివరిసారి కనిపించిన విజయ్.. ఇప్పటికీ రెగ్యులర్ ఆటగాడిగా చోటు సంపాదించుకోలేపోయాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో మురళీ విజయ్‌కు చోట దక్కలేదు.ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లు ఇప్పుడు జట్టులో కొనసాగుతుండటంతో విజయ్‌కు ఉద్వాసన తప్పలేదు. ఇటీవల కాలంలో తనకు అవకాశాలు ఇవ్వడంలో టీమిండియా మేనేజ్మెంట్ పెద్దగా ఆసక్తి కనబరచకపోవడంతోనే విజయ్ ఇలా సీరియస్ కామెంట్ చేయాల్సి వచ్చిందేమో. -
క్యాచ్ వదిలేస్తావా? విజయ్‌పై ధోనీ ఆగ్రహం
చెన్నై: ఐపీఎల్ సీజన్లో భాగంగా మంగళవారం సొంతగడ్డపై జరిగిన తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో చెన్నైకి అంతగా కలిసిరాలేదు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై చేసింది 131 పరుగులే. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ సునాయసంగా ఛేదించింది. బ్యాటింగ్‌లో విఫలమైన చెన్నై జట్టు బౌలింగ్‌లోనూ అంతగా ప్రభావం చూపలేకపోయింది. దీనికితోడు చెన్నై ఆటగాళ్ల ఫీల్డింగ్ తప్పిదాలు ముంబైకి కలిసివచ్చాయి. ముఖ్యంగా 132 పరుగుల లక్ష్యఛేదనలో ఆద్యంతం చెలరేగిపోయిన సూర్యకుమార్ యాదవ్‌ను తక్కువ స్కోరుకే ఔట్ చేసే అవకాశం చెన్నైకి వచ్చింది. దీపక్ చాహర్ బౌలింగ్‌లో సూర్యకుమార్ ఒకింత పేలవమైన షాట్ ఆడాడు. దీంతో బంతి గాల్లోకి లేచింది. తనకు కొద్ది దూరం నుంచి వెళుతున్న బంతిని పరిగెడుతూ అందుకునే ప్రయత్నం చేసిన మురళీ విజయ్ చివరికీ క్యాచ్‌ను వదిలేశాడు. ఒకింత కష్టమైపా ఈ క్యాచ్‌ను విజయ్ పట్టుకొని ఉంటే మ్యాచ్ వేరే తరహాలో ఉండేది. కీలకమైన దశలో క్యాచ్‌లో వదిలేసిన విజయ్‌పై మిస్టర్ కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్ రీప్లేలో విజయ్‌పై ధోని ఆగ్రహం స్పష్టంగా కనిపించింది. -
విజయ్‌పై ధోనీ ఆగ్రహం
-
‘కోహ్లిని ఆసీస్ పేసర్లు ఆడుకుంటారు’
అడిలైడ్ : తమ పేసర్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని ఓ ఆట ఆడుకుంటారని, అతను మునపటిలా సెంచరీలు చేయలేడని ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టీమ్ పెయిన్ అభిప్రాయపడ్డాడు. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమ్ పెయిన్ మీడియాతో మాట్లాడుతూ.. మా పేస్ బౌలింగ్ నైపుణ్యంపై నాకు నమ్మకం ఉంది. వారు కచ్చితంగా కోహ్లిని ఇబ్బంది పెట్టగలరు. మేం ప్రశాంతంగా.. మా నైపుణ్యాలను ప్రదర్శిస్తాం. తమ జట్టు కోహ్లి రికార్డును చూసి ఏం భయపడటం లేదు. మా బౌలింగ్ వారికంటే మెరుగ్గా ఉంది. విజయం సాధించే సత్తా తమకు ఉంది’ అని టీమ్ చెప్పుకొచ్చాడు. మరోవైపు ఆసీస్ అప్పటిలా బలమైన జట్టుకాదని, టీమిండియా బ్యాట్స్‌మెన్ ఆపడం వారి తరం కాదని మురళి విజయ్ అభిప్రాయపడ్డాడు. మురళి విజయ్ ఒక్కడే కాదు.. చాలా మంది మాజీ క్రికెటర్లు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్ ఇప్పుడు సిరీస్ నెగ్గకపోతే ఎప్పటికి గెలవదని.. వారికి ఇదో మంచి అవకాశమని చెప్పుకొస్తున్నారు. చదవండి: బుమ్రా.. వాటే యార్కర్! -
సన్నాహం సంతోషం
బౌలింగ్ మాటెలా ఉన్నా... టీమిండియాకు ఆస్ట్రేలియా గడ్డపై నిండైన బ్యాటింగ్ ప్రాక్టీస్ దొరికింది. సీఏ ఎలెవెన్‌తో సరైన సన్నాహం లభించింది. మురళీ విజయ శతకం, కేఎల్ రాహుల్ అర్ధ శతకాలతో... పనిలో పనిగా ఓపెనింగ్ జోడీ ఎవరనే సందిగ్ధమూ వీడింది. ఇక మిగిలింది... కంగారూలను ఎలాంటి బెరుకు లేకుండా ఎదుర్కొనడమే! పూర్తి ఆత్మవిశ్వాసంతో టెస్టు సిరీస్ బరిలో దిగడమే..! సిడ్నీ: అనుభవం లేని ప్రత్యర్థిని మన బౌలర్లు నిలువరించలేకపోయినప్పటికీ, బ్యాట్స్‌మెన్ అందరికీ బాగా ఉపయోగపడిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎలెవెన్‌తో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. తుది జట్టులో చోటు దక్కించుకోవడంతో పాటు తమ ఫామ్ చాటుకోవాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో... వచ్చిన అవకాశాన్ని ఓపెనర్లు మురళీ విజయ్ (132 బంతుల్లో 129; 16 ఫోర్లు, 5 సిక్స్‌లు), లోకేశ్ రాహుల్ (98 బంతుల్లో 62; 8 ఫోర్లు, సిక్స్) సద్వినియోగం చేసుకున్నారు. వందకుపైగా పరుగుల భాగస్వామ్యంతో... తొలి టెస్టుకు ముందు టీమిండియాకు ఇన్నింగ్స్‌ను ప్రారంభించేదెవరనే పెద్ద బెంగ తీర్చారు. భారత రెండో ఇన్నింగ్స్‌లో విజయ్ ఔటయ్యాక స్కోరు 211/2 వద్ద ఉండగా మ్యాచ్‌ను ముగించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 356/6తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సీఏ ఎలెవెన్ 544 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ హ్యారీ నీల్సన్ (170 బంతుల్లో 100; 9 ఫోర్లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆరోన్ హార్డీ (141 బంతుల్లో 86; 10 ఫోర్లు, సిక్స్)తో అతడు ఏడో వికెట్‌కు 179 పరుగులు జోడించాడు. ఆ తర్వాత టెయిలెండర్లు ఫాలిన్స్ (43; 7 ఫోర్లు), రాబిన్స్ (38 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్), కోల్మన్ (36; 2 ఫోర్లు) భారత బౌలర్లను విసిగించారు. చివరి మూడు వికెట్లకు వీరు 90 పరుగులు జత చేయడం గమనార్హం.దీంతో ఆ జట్టుకు 186 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. శనివారం పేసర్ బుమ్రా, చైనామన్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌కు దిగారు. భువనేశ్వర్ బౌలింగ్ చేయలేదు. విజయ్ ఐదు ఓవర్లు వేశాడు.మొత్తమ్మీద టీమిండియా తరఫున 10 మంది బౌలింగ్ చేయగా, శతక వీరుడు నీల్సన్‌ను కోహ్లి ఔట్ చేయడం విశేషం. విజయ్ ధనాధన్... భారత రెండో ఇన్నింగ్స్‌లో విజయ్ సంయమనం చూపగా... రాహుల్ దూకుడుగా ఆడాడు. అయితే, అర్ధ శతకం అనంతరం రాహుల్ ఔటయ్యాడు. తొలి వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యం నమోదు కాగా ఇందులో రాహుల్‌వే 62 పరుగులు ఉండటం గమనార్హం. ఇక్కడి నుంచి విజయ్ విజృంభణ ప్రారంభమైంది. రాహుల్ వెనుదిరిగేటప్పటికి 86 బంతుల్లో 46 పరుగులతో ఉన్న అతడు... తర్వాత విరుచుకుపడ్డాడు.కార్డర్ వేసిన ఓవర్లో రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లు సహా 26 పరుగులు రాబట్టాడు. 118 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండో యాభైని అతడు 27 బంతుల్లోనే చేరుకున్నా డు.వన్‌డౌన్‌లో వచ్చిన హనుమ విహారి (15 నాటౌట్) పూర్తి సహకారం అందించాడు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 102 పరుగులు జోడించారు. విహారి ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ, సిక్స్ కూ డా లేకపోగా... అదే సమయంలో మరో ఎండ్‌లో ఉన్న విజయ్ 10 ఫోర్లు, 5 సిక్స్‌లు కొట్టడం విశేషం. నాలుగో రోజు రెండు జట్లు కలిపి 399 పరుగులు చేశాయి. వీరే(నా) ఓపెనర్లు! రెండో ఇన్నింగ్స్‌లో ఆటతో... విజయ్, రాహుల్‌లకు ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో ఈ నెల 6న ప్రారంభం కానున్న తొలి టెస్టులో భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలు మెరుగయ్యాయి. వాస్తవానికి శుక్రవారం వరకు వీరిద్దరిలో పృథ్వీ షాకు తోడెవరనే ప్రశ్నలు వచ్చాయి. ఫామ్‌లో లేకున్నా ఎక్కువ మొగ్గు రాహుల్ వైపే ఉంది. గతంలో ఇక్కడ పర్యటించిన అనుభవం ఉన్నా విజయ్ను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు.\ప్రాక్టీస్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతడిని బ్యాటింగ్‌కు పంపకపోవడమే దీనికి నిదర్శనం. అయితే, ఈలోగా పృథ్వీ గాయపడటంతో రకరకాల ప్రత్యామ్నాయాలు ఆలోచనలోకి వచ్చాయి. వీటన్నిటికీ అడ్డుకట్ట వేస్తూ... శతకం బాదిన విజయ్ తన పునరాగమనానికి మార్గం సుగమం చేసుకున్నాడు. మేనేజ్మెంట్ ఇంకేమైనా ప్రయోగాలు చేయాలని భావిస్తే తప్ప అడిలైడ్‌లో విజయ్ బరిలో దిగడం ఖాయం. సంక్షిప్త స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్: 358; సీఏ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 544 ఆలౌట్ (151.1 ఓవర్లలో) (డార్సీ షార్ట్ 74, బ్రయాంట్ 62, నీల్సన్ 100, హార్డీ 86, అశ్విన్ 2/122); భారత్ రెండో ఇన్నింగ్స్: 211/2 (43.4 ఓవర్లలో) (మురళీ విజయ్ 129, రాహుల్ 62, విహారి 15 నాటౌట్). -
మురళీ విజయ్ దూకుడు
సిడ్నీ: టీమిండియా-క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్ల మధ్య జరిగిన నాలుగురోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. శనివారం చివరి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 43.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. ఈ రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు దూకుడుగా ఆడింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళీ విజయ్‌లు ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 109 పరుగులు జోడించిన తర్వాత హాఫ్ సెంచరీ సాధించిన రాహుల్(62) ఔటయ్యాడు. ఆపై హనుమ విహారీతో కలిసి విజయ్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలోనే మురళీ విజయ్ సెంచరీ సాధించాడు. టీ20 ఫార్మాట్ తరహాలో బ్యాట్‌ను ఝుళిపిస్తూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి హాఫ్ సెంచరీ సాధించడానికి 91 బంతులు ఆడిన విజయ్.. అటు తర్వాత మరింత రెచ్చిపోయిఆడాడు. హాఫ్ సెంచరీని సెంచరీగా మలుచుకోవడానికి కేవలం 27బంతులు మాత్రమే తీసుకున్నాడు. బౌండరీలే లక్ష్యంగా చెలరేగి ఆడాడు.మొత్తంగా 132 బంతులను ఎదుర్కొన్న విజయ్.. 16 ఫోర్లు, 5 సిక్సర్లు సాయంతో 129 పరుగులు సాధించాడు. మురళీ విజయ్ ఔటైన తర్వాత మ్యాచ్ ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. -
సెలక్టర్లు నాతోనూ మాట్లాడలేదు!
ముంబై: టెస్టు జట్టు నుంచి స్థానం కోల్పోయిన భారత ఓపెనర్ మురళీ విజయ్ సెలక్టర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కరుణ్ నాయర్‌లాగే తనతో కూడా మాటమాత్రమైనా చెప్పకుండానే జట్టునుంచి తప్పించారని వెల్లడించాడు. ఇంగ్లండ్ పర్యటనలో తొలి రెండు టెస్టుల్లోనూ విఫలమైన విజయ్‌ని టీమ్ మేనేజ్మెంట్ మూడో టెస్టు ఆడించకుండా పక్కనబెట్టింది. అనంతరం సెలక్టర్లు చివరి రెండు టెస్టులకు అతనిపై వేటు వేశారు. దీనిపై అతను మాట్లాడుతూ ‘మూడో టెస్టునుంచి నన్ను తప్పించిన తర్వాత చీఫ్ సెలక్టర్‌గానీ, మిగతా సెలక్టర్లుగానీ ఎవరూ నాకు మాట మాత్రమైనా చెప్పలేదు. ఇంగ్లండ్‌లో కేవలం జట్టు మేనేజ్మెంట్ మాత్రమే నాతో మాట్లాడింది. అంతకుమించి తొలగింపుపై నేను ఇంకెవరితోనూ మాట్లాడింది లేదు. నాకు చెప్పింది లేదు’ అని అన్నాడు. జట్టుకు ఎంపికైనా కరుణ్ నాయర్‌కు ఒక్క టెస్టులోనూ అవకాశం ఇవ్వకుండానే ప్రస్తుత విండీస్ సిరీస్ నుంచి అతన్ని తప్పించడంపై విమర్శలొచ్చాయి. కరుణ్ తనను తప్పించడానికి గల కారణాలు, ప్రదర్శన మెరుగుపర్చుకునేందుకు సూచనలు ఎవరు చెప్పలేదని మీడియాతో అన్నాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో 20, 6 పరుగులు చేసి విజయ్ రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ డకౌటయ్యాడు. అయితే విజయ్ వ్యాఖ్యలపై కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అతడిని జట్టునుంచి తప్పించినప్పుడు అందుకు తగిన కార ణాలు వివరిస్తూ సహచర సెలక్టర్ దేవాంగ్ గాంధీ స్పష్టంగా మాట్లాడినట్లు ప్రసాద్ వివరణ ఇచ్చారు. -
కనీసం చెప్పలేదు: మురళీ విజయ్ ఆవేదన
న్యూఢిల్లీ: భారత క్రికెట్లో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. జట్టు ఎంపికలో టీమిండియా వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే కరుణ్ నాయర్, సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పెదవి విరచగా.. తాజాగా ఆ జాబితాలో ఓపెనర్ మురళీ విజయ్ కూడా చేరాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ కోసం ఇటీవల ఎంపిక చేసిన జట్టు నుంచి కరుణ్ నాయర్‌ను పక్కకు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై కరుణ నాయర్‌తో పాటు హర్భజన్ సింగ్‌లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే గత నెలలో ఇంగ్లండ్ వేదికగా ముగిసిన టెస్టు సిరీస్‌లో తనను జట్టు నుంచి తప్పించే క్రమంలో కనీసం సెలక్టర్లు ఒక్క మాట కూడా చెప్పలేదని ఓపెనర్ మురళీ విజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ చీఫ్ సెలక్టర్ కానీ మిగతా ఎవరూ కూడా నన్ను తప్పించే విషయం చెప్పలేదు. మూడో టెస్టులో నన్ను ఉన్నపళంగా తప్పించారు. అంత వరకూ ఓకే. కానీ నాకు సమాచారం ఇవ్వలేదు. నేను జట్టుతో పాటు ఉన్నప్పటికీ ఎందుకు ఇలా చేశారో నాకు తెలీదు. దానిపై ఇప్పటికీ టీమిండియా సెలక్టర్లు ఎవ్వరూ మాట్లాడలేదు. తుది జట్టులో ఒక ఆటగాడ్ని తప్పించే క్రమంలో కనీసం ఎందుకు తప్పిస్తున్నామో చెప్పడం ధర్మం. ఒకవేళ ఇలా చేబితే మనకు ఒక ప్రణాళిక అనేది ఉంటుంది’ అని విజయ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 26 పరుగులు మాత్రమే చేసిన మురళీ విజయ్ను మూడో టెస్టు నుంచి తప్పించారు. ఆపై నాలుగు, ఐదు టెస్టుల్లో సైతం అతనికి చోటు దక్కలేదు. కాగా, దీనిపై తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం బాధ కల్గించిందని విజయ్ తాజాగా పేర్కొన్నాడు. -
కౌంటీ క్రికెట్లో మురళీ విజయ్
భారత సీనియర్ ఓపెనర్ మురళీ విజయ్ ఇంగ్లండ్‌లోని కౌంటీ క్రికెట్లో బరిలోకి దిగనున్నాడు. ఈ నెలలో ఎస్సెక్స్ కౌంటీ తరఫున అతను మూడు 4 రోజుల మ్యాచ్‌లు ఆడనున్నాడు. ఇంగ్లండ్ టూర్లో ఫామ్‌లో లేక సతమతమవుతున్న అతనికి బీసీసీఐ కౌంటీలాడే ఏర్పాటు చేసింది. ఈ నెల 10 నుంచి నాటింగ్హమ్షైర్తో తొలి మ్యాచ్, 18 నుంచి వార్సెస్టెర్షైర్తో రెండో మ్యాచ్, 24 నుంచి సర్రేతో మూడో మ్యాచ్‌లో విజయ్ బరిలోకి దిగుతాడు. దీనిపై అతను స్పందిస్తూ కౌంటీలాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. -
లార్డ్స్ టెస్ట్: మళ్లీ సున్నాకే వికెట్
లండన్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మళ్లీ సున్నాకే తొలి వికెట్ కోల్పోయింది. మురళీ విజయ్ రెండో ఇన్నింగ్స్‌లోను డకౌట్‌గా నిష్క్రమించాడు. తొలి ఇన్నింగ్స్‌లో క్లీన్ బౌల్డ్ అయిన విజయ్ రెండో ఇన్నింగ్స్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. రెండు సార్లు జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లోనే వికెట్ కోల్పోవడం విశేషం. ఇది అండర్సన్‌కు లార్డ్స్‌లో 100 వికెట్ కాగా.. ఓవరాల్‌గా టెస్టుల్లో 550వ వికెట్. ఇక ఇంగ్లండ్ 396/7 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ ఇచ్చింది. 357 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ మరో 39 పరుగులు జోడించి కరన్ (40) వికెట్ అనంతరం కోహ్లిసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కరన్ వికెట్‌ను హార్దిక్ పాండ్యా దక్కించుకున్నాడు. ఇక సెంచరీ హీరో క్రిస్ వోక్స్ (137) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఇంగ్లండ్ భారత్‌పై 289 పరుగుల ఆధిక్యాన్ని సంపాధించింది. ఇక భారత్ మ్యాచ్‌ను కాపాడుకోవాలంటే బ్యాట్స్‌మన్ క్రీజులో పాతుకుపోవాల్సిందే. వికెట్లు చేజార్చుకోకుండా డ్రా దిశగా ప్రయత్నం చేస్తేనే కోహ్లిసేన ఓటమి నుంచి గట్టెక్కగలదు. చదవండి: కోహ్లి ఒక్కడి వల్ల కాదు: భజ్జీ -
‘టాప్’ లేచింది.. ‘మిడిల్’ కూలింది
సాక్షి, బెంగళూరు: అఫ్గానిస్తాన్‌తో చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న చారిత్రక టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు భారత్ అదరగొట్టింది. ఓపెనర్లు విజయ్, ధావన్‌లు సెంచరీలతో చెలరేగగా, కేఎల్ రాహుల్ అర్ధసెంచరీతో మెరిశారు. అయితే మిడిల్ ఆర్డర్ విఫలం అవ్వడంతో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 78 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. తొలి రెండు సెషన్లలలో ప్రభావం చూపని ఆఫ్గాన్ బౌలర్లు చివరి సెషన్లో వికెట్లు పడగొట్టారు. టాస్ గెలిచి... తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ (107; 96 బంతుల్లో 19 ఫోర్లు, 3సిక్సర్లు) అహ్మద్జాయ్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో 168 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం అనూహ్యంగా పుజారాకు బదులు బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ కూడా ఎదురుదాడికి దిగడంతో స్కోర్ బోర్డు పరుగులు తీసింది. మరో ఎండ్‌లో మురళీ విజయ్ ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో వరుస ఓవర్లలో మురళీ విజయ్ (105; 153 బంతుల్లో 15 ఫోర్లు, 1సిక్సర్), కేఎల్ రాహుల్(54; 64 బంతుల్లో 8 ఫోర్లు) వెనుదిరగటంతో స్కోర్ నెమ్మదించింది. మూడో సెషన్లో... కెప్టెన్ రహానేతో కలిసి పుజారా ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా అఫ్గాన్ బౌలర్ల అటాకింగ్‌తో మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. ఇన్నింగ్స్ మొదట్లో ఏ మాత్రం ప్రభావం చూపని రషీద్ ఖాన్ మూడో సెషన్లో అద్భుత ప్రతిభ కనబరిచాడు. వరుసగా వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్టు పెవిలియన్‌కు చేరారు. పుజారా(35), రహానే(10), దినేశ్ కార్తీక్(4) పూర్తిగా విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్ల దాటికి చివరి సెషన్లలో ఐదు వికెట్లు కోల్పోయి 99 పరుగులు మాత్రమే చేసింది. ఆట ముగిసే సమయానికి హార్థిక్ పాండ్యా(10), అశ్విన్(7) క్రీజులో ఉన్నారు. అఫ్గాన్ బౌలర్లలో అహ్మద్ జాయ్ రెండు వికెట్లు తీయగా, రషీద్, ముజీబ్, వఫ్దార్ తలో వికెట్ సాధించారు. -
‘నాకు ఇదొక గొప్ప అవకాశం’
సాక్షి, చెన్నై: ఐపీఎల్లో తిరిగి సొంత జట్టుకు ఆడటం పట్ల టీమిండియా బ్యాట్స్‌మెన్ మురళీ విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. తనను వేలంలో తొలి రోజు ఏ ప్రాంచైజీ తీసుకొకపోవటంతో నిరాశ చెందినా, చివరకు చెన్నె కొనుగోలు చేయడం సంతృప్తినిచ్చిందన్నాడు. ఒకవేళ ఐపీఎల్ వేలంలో తనను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయకపోతే పుజారా, ఇషాంత్ శర్మల మాదిరిగా ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ ఆడాలని అనుకున్నానని విజయ్ తెలిపాడు. ఇది తనకు సీఎస్కే ఇచ్చిన గొప్ప అవకాశమని, వారు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని విజయ్ అన్నారు. ప్రతి ఆటగాడు సీఎస్కేను తమ జట్టుగా భావించి సమష్టిగా రాణించడానికి కృషి చేస్తారని విజయ్ పేర్కొన్నారు. ఈసారి ధోనీ సారథ్యంలోని సీఎస్కే జట్టే ఐపీఎల్ విజేతగా నిలుస్తుందని విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ ఓటమిపై స్పందించిన విజయ్.. బౌలర్లు అద్బుత ప్రదర్శన చేసినా, బ్యాటింగ్ వైపల్యంతో ఓటమి చవిచూసామని, బ్యాట్స్‌మెన్‌కు ఈ సిరీస్ గుణపాఠం లాంటిదని అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో జరిగే సిరీస్‌లపై దృష్టి పెట్టానని విజయ్ వివరించారు. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్లో 2010లో జరిగిన ఫైనల్ తన అమితమైన ఆసక్తి కలిగించిందని విజయ్ అన్నారు. గత ఐపీఎల్ సీజన్లలో ఢిల్లీ, పంజాబ్ జట్లకు విజయ్ ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. -
ఆ క్రికెటర్‌పై డీకే అభిమానుల ఆగ్రహం
సాక్షి, స్పోర్ట్స్ : నిదహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో అద్బుత ప్రదర్శనతో జట్టుకు విజయం అందించిన దినేశ్ కార్తిక్‌కు అభిమానులతో పాటు, సహచర ఆటగాళ్లు, సీనియర్లు ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. దీంతో డీకే అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. కానీ వారికి ఇప్పుడు కోపం వచ్చింది. ఎందుకంటే దేశమంతా డీకేను కొనియాడుతుంటే ఒక క్రికెటర్ మాత్రం జట్టును మాత్రమే పొగిడి కనీసం డీకే పేరును ప్రస్తావించకపోవడంతో ట్విటర్ వేదికగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీకే సహచర ఆటగాడు, ఒకప్పటి స్నేహితుడు మురళీ విజయ్ భారత విజయాన్ని అభినందిస్తూ ‘ఇదొక గొప్ప విజయం.. భారత క్రికెట్ బ్రాండ్ విలువను పెంచేందుకు బీసీసీఐ చేస్తున్న కృషికి ఇది నిదర్శనం’ అంటూ ట్వీట్ చేశాడు. జట్టు విజయానికి కారణమైన కార్తిక్ పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడంతో డీకే అభిమానులు మురళీ విజయ్‌కు కౌంటర్‌గా ట్వీట్ల ద్వారానే సమాధానం ఇస్తున్నారు. ‘విజయ్ నీకు ఇదేమీ కొత్త కాదు.. ఇంతకు ముందు తమిళనాడు జట్టు విజయ్ హజారే ట్రోఫీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన డీకేని విస్మరించావు. నువ్వింకా ఎదగాలి’ అంటూ ఓ అభిమాని ట్వీట్ చేయగా.. ‘మీ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి.. నిజాయితీగా స్పందించడం నేర్చుకో’ అని మరొకరు సలహా ఇచ్చారు. కాగా భారత క్రికెటర్ రవీంద్ర జడేజా కూడా.. ‘డీకే పేరును ప్రస్తావించక పోవడానికి ఉన్న స్పష్టమైన కారణాలేంటో’ అంటూ ట్వీట్ చేశాడు. ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న ఈ తమిళనాడు ఆటగాళ్లు... దినేశ్ కార్తిక్ మాజీ భార్య నిఖిత.. మురళీ విజయ్ను పెళ్లాడినప్పటి నుంచి దూరమయ్యారు. కాగా 2015లో దినేశ్ కార్తిక్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పళ్లికల్‌ను పెళ్లి చేసుకున్నాడు. Remarkable win boys @bcci 🌟 pretty much typifies the brand of cricket we play 🤙🏽 #INDVBAN #Champions #TeamIndia #supremacy #NidahasTrophy #NidahasTrophyFinal pic.twitter.com/ewUKclUX29 — Murali Vijay (@mvj888) March 18, 2018 -
చితక్కొట్టి... 'శత' క్కొట్టి...
ఆట మారలేదు... జోరు తగ్గలేదు... అలసట అస్సలే లేదు... మారిందొక్కటే... వేదిక! భారత్‌దే పరుగుల వేడుక! ఒక రోజు ముందు ప్రత్యర్థి కెప్టెన్ చండిమాల్ వ్యంగ్యాస్త్రాలు వేశాడు. వెళ్లేదేమో సఫారీకి, ఆడేదేమో స్పిన్ ట్రాక్‌లపైనా అని చమక్కులు విసిరాడు. పరుగుల వరద ఖాయమన్నాడు. మన బ్యాట్స్‌మెన్ మురళీ విజయ్, కెప్టెన్ విరాట్ కోహ్లి అతని చమక్కులకు బ్యాట్‌తో చుక్కలు చూపారు. ఫిరోజ్ షా కోట్లా మైదానాన్ని ‘రన్’రంగంగా మార్చేసి అతని వరద అంచనాన్ని ఒక్కరోజులోనే నిజం చేశారు. అలవోకగా ఆడేస్తూ సెంచరీల్ని సాధించారు. తొలి రోజే మ్యాచ్‌ను శాసించే పరిస్థితిని సృష్టించుకున్నారు. న్యూఢిల్లీ: భారత బ్యాట్స్‌మెన్ ఆడుతూ... పాడుతూ... అదరగొట్టేస్తున్నారు. ఢిల్లీ గడ్డపై లంక బౌలర్లను చితక్కొడుతున్నారు. తీరని దాహంతో ‘శత’క్కొట్టేస్తున్నారు. చివరి టెస్టులో భారత ఓపెనర్ మురళీ విజయ్ (267 బంతుల్లో 155; 13 ఫోర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లి (186 బంతుల్లో 156 బ్యాటింగ్; 16 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కారు. దీంతో తొలి రోజే భారత్ భారీ స్కోరు చేసింది. ఆట నిలిచే సమయానికి 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 371 పరుగులు చేసింది. ఈ సిరీస్‌లో కోహ్లికిది వరుసగా మూడో సెంచరీ కావడం విశేషం. కోల్‌కతా టెస్టులో సెంచరీ (104 నాటౌట్) చేసిన కోహ్లి... నాగ్‌పూర్ టెస్టులో డబుల్ సెంచరీ (213) సాధించాడు. శ్రీలంక బౌలర్లలో స్పిన్నర్ లక్షణ్ సందకన్ 2 వికెట్లు తీయగా, పేసర్ గమగే, స్పిన్నర్ దిల్రువాన్ పెరీరా చెరో వికెట్ పడగొట్టారు. భారత్ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. ఓపెనర్ రాహుల్, పేసర్ ఉమేశ్ స్థానాల్లో ధావన్, షమీ బరిలోకి దిగారు. ఆరంభం లంకది... ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన భారత కెప్టెన్ కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాహుల్ స్థానంలో వచ్చిన ధావన్... విజయ్‌తో కలిసి జట్టుకు శుభారంభాన్ని అందించలేకపోయాడు. అప్పటికే నాలుగు ఫోర్లతో టచ్‌లోకి వచ్చినట్లే కనిపించినప్పటికీ పదో ఓవర్ చివరి బంతికి ధావన్ (23) అవుటయ్యాడు. పెరీరా బౌలింగ్‌లో లక్మల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత పుజారా (23; 4 ఫోర్లు) క్రీజులోకి వచ్చినప్పటికీ ఎక్కువసేపు నిలువలేక గమగే బౌలింగ్‌లో నిష్క్రమించాడు. దీంతో భారత్ 78 పరుగులకే రెండు టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. ఈ దశలో విజయ్‌కి కోహ్లి జతయ్యాడు. ఇద్దరు కలిసి ముందుగా జట్టు స్కోరును 100 పరుగులు దాటించారు. ఆ తర్వాత బౌండరీలతో జోరు చూపెట్టిన విజయ్ (67 బంతుల్లో; 7 ఫోర్లు) లంచ్ బ్రేక్‌కు కాసేపు ముందే ఫిఫ్టీని పూర్తిచేసుకున్నాడు. 116/2 స్కోరు వద్ద తొలి సెషన్ ముగిసింది. ఆధిపత్యం మొదలైంది... విజయ్, కోహ్లి జోడీ నిలదొక్కుకోవడంతో భారత్‌కు పరుగులు... లంకకు కష్టాలు ఒక్కసారిగా మొదలయ్యాయి. ముఖ్యంగా కోహ్లి... సొంతగడ్డపై వన్డేను తలపించేలా ధాటిగా ఆడాడు. చూడచక్కని బౌండరీలతో (52 బంతుల్లో, 10 ఫోర్లు) అర్ధసెంచరీని అధిగమించాడు. దీంతో మరో వికెట్ పడకుండా భారత్ 200 పరుగులు చేరుకుంది. చైనామన్ స్పిన్నర్ సందకన్, పేసర్లు లక్మల్, గమగే చేసేదేమీ లేక చేష్టలుడిగిపోయారు. కోహ్లి జోరుకు అండగా నిలబడిన విజయ్ కూడా సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతనికిది టెస్టుల్లో 11వ సెంచరీ. మరోవైపు కోహ్లి శతకానికి చేరువకాగా... టీ విరామ సమయానికి భారత్ 57 ఓవర్లలో 245/2 స్కోరు చేసింది. కొడితే షాట్లు... నిలిస్తే సెంచరీలా! టీ విరామం తర్వాత కాసేపటికే కోహ్లి శతకం పూర్తయింది. చిత్రంగా కోహ్లి తన టెస్టు కెరీర్లో వేగవంతమైన అర్ధసెంచరీ (52 బంతుల్లో)ని, సెంచరీ (110 బంతుల్లో)ని ఈ మ్యాచ్‌లోనే చేయడం విశేషం. ఓపెనర్, కెప్టెన్ ఇద్దరూ సెంచరీ పూర్తయ్యాక కూడా తాజాగా ఆడుతున్నట్లే ఆడారు. స్కోరును 72వ ఓవర్లోనే 300 పరుగులు దాటించారు. ఈ క్రమంలో వీరిద్దరు 150 పరుగులు పూర్తి చేసుకున్నారు. ఎట్టకేలకు జట్టు స్కోరు 361 పరుగుల వద్ద విజయ్‌ని స్టంపౌట్ చేయడం ద్వారా సందకన్ ఈ జోడీని విడగొట్టాడు. దీంతో మూడో వికెట్‌కు 283 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన రహానే (1) కూడా సందకన్ బౌలింగ్‌లోనే స్టంపౌట్ కాగా... రోహిత్ శర్మ (6 బ్యాటింగ్)తో కలిసి కోహ్లి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. ►20 టెస్టుల్లో కోహ్లి సెంచరీల సంఖ్య. తక్కువ (105) ఇన్నింగ్స్‌లో 20 సెంచరీలు చేసిన ఐదో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. బ్రాడ్‌మన్ (55 ఇన్నింగ్స్), సునీల్ గావస్కర్ (93), హేడెన్ (95), స్టీవ్ స్మిత్ (99) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా కోహ్లి కెరీర్లో ఇది 52వ శతకం. ►11 భారత్ తరఫున టెస్టుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న 11వ బ్యాట్స్‌మన్ కోహ్లి. గావస్కర్ (95), సెహ్వాగ్ (99), సచిన్ టెండూల్కర్ (103) తర్వాత తక్కువ ఇన్నింగ్స్‌లో 5 వేల పరుగులు చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. ► 50 కెప్టెన్ హోదాలో టెస్టుల్లో 3 వేల పరుగులు చేయడానికి కోహ్లి తీసుకున్న ఇన్నింగ్స్ సంఖ్య. ఈ జాబితాలో బ్రాడ్‌మన్ (37 ఇన్నింగ్స్), జయవర్ధనే (48), గ్రాహమ్ గూచ్ (49) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లండ్‌పై అడిలైడ్ యాషెస్ టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్మిత్ కూడా 50 ఇన్నింగ్స్‌లోనే 3 వేల పరుగులు పూర్తి చేశాడు. ► 6 టెస్టుల్లో వరుసగా మూడు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఆరో భారత బ్యాట్స్‌మన్ కోహ్లి. గతంలో విజయ్ హజారే, పాలీ ఉమ్రిగర్, సునీల్ గావస్కర్, వినోద్ కాంబ్లీ, రాహుల్ ద్రవిడ్ ఈ ఘనత సాధించారు. ► 283 కోహ్లి, విజయ్ మూడో వికెట్‌కు 283 పరుగులు జోడించి శ్రీలంకపై ఏ వికెట్‌కైనా భారత్ తరఫున అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇప్పటివరకు ఈ రికార్డు అజహరుద్దీన్–కపిల్ దేవ్ (ఆరో వికెట్‌కు 272 పరుగులు; 1986లో) పేరిట ఉంది. ►1 శ్రీలంక తరఫున వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా దిల్రువాన్ పెరీరా (25 టెస్టుల్లో) గుర్తింపు పొందాడు. ముత్తయ్య మురళీధరన్ (27 టెస్టుల్లో) రికార్డును అతను అధిగమించాడు. ► 436 మూడు టెస్టుల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా సచిన్ టెండూల్కర్ (435; 1999–2000 న్యూజిలాండ్‌పై) పేరిట ఉన్న రికార్డును ఈ మ్యాచ్ ద్వారా కోహ్లి (436 పరుగులు) బద్దలు కొట్టాడు. ► 1 కెప్టెన్‌గా వరుసగా మూడు సెంచరీలను రెండు పర్యాయాలు చేసిన ఏకైక సారథిగా కోహ్లి నిలిచాడు. 2014–2015 సీజన్లో ఆస్ట్రేలియాపై తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నపుడు కోహ్లి వరుసగా 115, 141, 147 పరుగులు చేశాడు. గ్రీజ్మన్ శైలి వేడుక, డాబ్ డాన్స్ పోజు న్యూఢిల్లీ: భారత ఓపెనర్ మురళీ విజయ్ తన 11వ సెంచరీ పూర్తికాగానే రొటీన్‌కు భిన్నంగా వేడుక చేసుకున్నాడు. అట్లెటికో మాడ్రిడ్ స్టార్, ఫ్రాన్స్ ఫుట్‌బాలర్ ఆంటోని గ్రీజ్మన్ తరహాలో రెండు చేతుల్ని పైకి కిందికి జిగ్ జాగ్గా ఊపి సంబరం చేసుకున్నాడు. తనను అభినందించడానికి పిచ్ మధ్యలోకి వచ్చిన కోహ్లితో కలిసి డాబ్ డాన్స్ పోజు ఇచ్చాడు. ఇద్దరు ఒకేసారిగా ఎడమ చేతుల్ని ఏటవాలుగా వంచి తలలు జోడించి పోజిచ్చారు. దీనిపై స్పందించిన ఐసీసీ ట్విట్టర్లో అభినందించింది. -
మురళీ విజయ్ హాఫ్ సెంచరీ
ఢిల్లీ: శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఓపెనర్ మురళీ విజయ్ హాఫ్ సెంచరీ సాధించాడు. మురళీ విజయ్ 67 బంతుల్లో అర్థశతకంతో ఆకట్టుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఇన్నింగ్స్‌ను శిఖర్ ధావన్, మురళీ విజయ్‌లు ఆరంభించారు. అయితే శిఖర్(23) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా,ఆపై చతేశ్వరా పుజారా(23) రెండో వికెట్‌గా అవుటయ్యాడు. కాగా, మురళీ విజయ్ నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించాడు. ఇది టెస్టుల్లో విజయ్‌కు 16వ హాఫ్ సెంచరీ. తొలి రోజు ఆటలో భారత్ లంచ్ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. మురళీ విజయ్‌కు జతగా కోహ్లి(17 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. -
విజయ్ సెంచరీ.. మరో వికెట్ కోల్పోయిన భారత్
నాగ్‌పూర్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. సెంచరీతో రాణించిన మురళి విజయ్ క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 209 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి తో పుజారా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన విజయ్ తిరిగి తన ఫామ్‌ను సాధించాడు. 187 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో కెరీర్లో 10వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ శతకంతో అధిక సెంచరీలు చేసిన మూడో భారత ఓపెనర్‌గా విజయ్ గుర్తింపు పొందాడు. వీరి అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ సునాయసంగా 200 పరుగులు చేయగలిగింది. పటిష్టంగా క్రీజులో పాతుకుపోయిన ఈ జోడిని రంగనా హెరాత్ విడగొట్టాడు. జట్టు స్కోరు 216 పరుగుల వద్ద అనవసర షాట్‌కు ప్రయత్నించిన విజయ్ 128(218 బంతులు; 11 ఫోర్లు, ఒక సిక్సు) క్యాచ్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు. పుజారా 88(225 బంతులు, 10 ఫోర్లు), కోహ్లి 4 (7 బంతులు) క్రీజులో ఉన్నారు. ఇక భారత్‌కు 24 పరుగుల ఆధిక్యం లభించింది. -
లంకతో రెండో టెస్టు : పటిష్ట స్థితిలో భారత్
శ్రీలంకతో జరగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ నిలకడగా రాణిస్తోంది. భోజన విరామానికి 39 ఓవర్లలో 97పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది. తొలిరోజు తక్కువ స్కోరుకే రాహుల్ వికెట్ కొల్పోయినా విజయ్, పుజారా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. క్రీజులో నిలబడటానికి ప్రాధాన్యం ఇచ్చిన ఇద్దరూ ఆచితూచి ఆడుతున్నారు. భోజన విరామానికి పుజారా 33(92 బంతులు 5ఫోర్లు), మురళీ విజయ్ 56(129 బంతులు 6ఫోర్లు)లతో క్రీజులో ఉన్నారు. తొలిరోజు 11/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్‌కు విజయ్, పుజారాలు బలమైన పునాది వేశారు. రెండోరోజు అసలైన టెస్టుమ్యాచ్ మజాను క్రికెట్ అభిమానులకు అందించారు. ఈదశలో విజయ్ 53 (112 బంతులు 6ఫోర్లు) హాఫ్ సెంచరీ మార్కును చేరుకున్నాడు. 34 ఓవర్లో షనక వేసిన తొలిబంతిని బౌండరీకి తరలించడం ద్వారా మురళీ విజయ్ యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇది మురళీ విజయ్‌కు టెస్టు మ్యాచ్‌లో 16వ హాఫ్ సెంచరీ. మరోవైపు వికెట్లకోసం లంక బౌలర్లు చెమటోడుస్తున్నారు. లంక తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు చెలరేగడంతో శ్రీలంక 205పరుగులకు ఆలౌట్ అయ్యింది. స్పిన్నర్లు అశ్విన్, జడేజాలతోపాటు ఇశాంత్ శర్మ చెలరేగడంతో లంక స్వల్ప స్కోరుకే చాప చుట్టేసింది. -
మురళీ విజయ్ కు పుత్రోత్సాహం
న్యూఢిల్లీ:భారత క్రికెటర్ మురళీ విజయ్ మూడోసారి తండ్రయ్యాడు. ఇప్పటికే ఒక కుమారుడు, కుమార్తె ఉన్న మురళీ దంపతులకు మూడో బిడ్డ జన్మించింది. సోమవారం మురళీ విజయ్ భార్య నికిత మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు తన పెద్ద కుమారుడు అప్పుడే పుట్టిన బిడ్డను ఎత్తుకున్న ఫోటోను మురళీ విజయ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. 'ఇద్దరు రాక్ స్టార్లలో ఒకరు మరొకర్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు'అని క్యాప్షన్ లో పేర్కొన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా గాయానికి గురైన మురళీ అప్పటినుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది చివర్లో ఆరంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటనతో మురళీ మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశముంది. Two Rockstars!! One introducing the other to the world . Feeling Blessed. #grateful #lovetoall #moretolife pic.twitter.com/1dPJtSpcK9 — Murali Vijay (@mvj888) 2 October 2017 -
గాయంతో విజయ్ దూరం
♦ జట్టులోకి శిఖర్ ధావన్ ♦ శ్రీలంకతో టెస్టు సిరీస్ న్యూఢిల్లీ: శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు ఓపెనర్ మురళీ విజయ్ గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో విజయ్ స్థానంలో శిఖర్ ధావన్‌కు చోటు లభించింది. ఈనెల 26 నుంచి శ్రీలంకలో ఈ మూడు టెస్టుల సిరీస్ జరుగుతుంది. ‘సన్నాహక మ్యాచ్ ఆడే సమయంలో విజయ్ తన కుడిచేతి మణికట్టు నొప్పిగా ఉందని సమాచారం ఇచ్చాడు. దీంతో బీసీసీఐ మెడికల్ సిబ్బంది అతడిని పరీక్షించి పునరావాస శిబిరానికి వెళ్లాలని సూచించారు. దీంతో అతను లంక పర్యటనకు దూరం కానున్నాడు. అతడి స్థానంలో సెలక్షన్ కమిటీ శిఖర్ ధావన్‌ను ఎంపిక చేసింది’ అని బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి తెలిపారు. గతంలో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు కూడా విజయ్ మణికట్టు గాయంతోనే దూరమయ్యాడు. ఆ తర్వాత ఐపీఎల్లో కూడా ఆడలేదు. ఇక ధావన్ తన చివరి టెస్టు గతేడాది న్యూజిలాండ్‌పై ఆడాడు. లోకేశ్ రాహుల్‌తో కలిసి ధావన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశం ఉంది. ఇటీవలి చాంపియన్స్ ట్రోఫీ, కరీబియన్ పర్యటనలోనూ ధావన్ విశేషంగా రాణించిన సంగతి తెలిసిందే. -
విజయ్ స్థానంలో ధావన్
ముంబై: శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత క్రికెట్ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ కు అనూహ్యంగా చోటు దక్కింది. గాయంతో బాధపడుతున్న మురళీ విజయ్ స్థానంలో ధావన్ ను ఎంపిక చేస్తూ బీసీసీఐ సెలక్షన్ కమిటీ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇటీవల శ్రీలంకకు పర్యటనలో భాగంగా భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో మురళీ విజయ్ ఊహించినట్లుగానే చోటు దక్కించుకున్నాడు. అయితే అతని మణికట్టు గాయం ఇంకా నయం కాకపోవడంతో ధావన్ ను జట్టులోకి వచ్చాడు. దాదాపు మూడు నెలల క్రితం మురళీ విజయ్ తన మణికట్టుకు శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ గాయం నుంచి కోలుకోవడానికి విజయ్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ సిరీస్‌లో భాగంగా ఈ నెల 26 నుంచి గాలేలో తొలి టెస్టు జరుగుతుంది. ఈ ద్వైపాక్షిక సిరీస్ లో మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక ట్వంటీ 20 జరుగనుంది. ఇలా ఇరు జట్ల మధ్య మూడు ఫార్మాట్లలో సిరీస్ జరగడం ఎనిమిదేళ్ల తరువాత ఇదే మొదటిసారి. 2009లో భారత్ లో శ్రీలంక పర్యటించింది. అప్పుడు మూడు టెస్టుల సిరీస్ తో పాటు, ఐదు వన్డేల సిరీస్, రెండు ట్వంటీ 20ల సిరీస్‌లు ఇరు జట్ల మధ్య జరిగాయి. అది ఇరు జట్ల మధ్య జరిగిన పూర్తిస్థాయి చివరిసిరీస్. కాగా, రెండేళ్ల క్రితం శ్రీలంకలో భారత్ పర్యటించినప్పటికీ టెస్టు సిరీస్, వన్డే సిరీస్ మాత్రమే జరిగింది. -
శ్రీలంక సిరీస్‌కి జట్టులోకి వస్తా : విజయ్
చెన్నై: భారత ఓపెనర్ మురళీ విజయ్ త్వరలో శ్రీలంకతో జరిగే సిరీస్ నాటికి పూర్తి ఫిట్‌గా మారతానని ప్రకటించాడు. తమిళనాడుకు చెందిన ఈ బ్యాట్స్‌మన్ మణికట్టు గాయం కారణంగా ఐపీఎల్–10కు దూరమై లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. గాయం నుంచి కోలుకుంటున్న విజయ్ ఇప్పుడు చెన్నైలోని ఎన్సీఏ ట్రైనర్ రజనీకాంత్ దగ్గర ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ‘సర్జరీ కారణంగా దొరికిన సమయంలో నా బ్యాటింగ్‌పైన, ఫిట్నెస్పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. మూడు ఫార్మాట్లలో రాణించాలంటే ఫిట్నెస్ చాలా ముఖ్యం. అందుకోసం చాలా శ్రమిస్తున్నాను. వచ్చే నెలలో జరిగే శ్రీలంక సిరీస్నాటికి పూర్తి ఫిట్నెస్ సాధించి జట్టుకు అందుబాటులో ఉంటాను’ అని ఈ స్టయిలిష్ బ్యాట్స్‌మన్ తెలిపాడు. ఈ గాయం వల్ల కొంతకాలం తన కుటుంబంతో గడిపే విలువైన సమయం దొరికిందని విజయ్ చెప్పుకొచ్చాడు. -
'ఫిట్టర్ క్రికెటర్ గా తయారవుతా'
న్యూఢిల్లీ: గత రెండు నెలల క్రితం మణికట్టుకు శస్త్రచికిత్స చేయించుకున్న టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ తిరిగి కోలుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ ట్రైనర్ రజనీకాంత్ పర్యవేక్షణలో ఫిట్నెస్ ను మెరుగుపరుచుకుంటున్నట్లు విజయ్ తెలిపాడు. వచ్చే నెలలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్ కు సంబంధించి భారత జట్టులో స్థానం సంపాదించడంపైనే తన దృష్టిని కేంద్రీకరించినట్లు పేర్కొన్నాడు. 'గాయం నుంచి కోలుకునే పనిలో ఉన్నాను. మరొకొద్ది రోజుల్లో ఫిట్‌గా తయారవుతా. ఎన్సీఏ ట్రైనర్ రజనీ కాంత్ నా ఫిట్ నెస్ ను పర్యవేక్షిస్తున్నారు. నా ఫిట్నెస్ మెరుగుదలకు రజనీకాంత్ సరైన వ్యక్తి అనుకుంటున్నా. అత్యుత్తమ ట్రైనర్ అయిన అతనితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. త్వరలో ఫిట్టర్ క్రికెటర్ గా తయారవుతా' అని మురళీ విజయ్ తెలిపాడు. గాయం కారణంగా ఐపీఎల్-10 సీజన్ కు మురళీ విజయ్ దూరమైన సంగతి తెలిసిందే. గత ఏప్రిల్ నెలలో అతని మణికట్టుకు ఇంగ్లండ్ లో ఆపరేషన్ చేయించుకున్న విజయ్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. ఆపై చెన్నైలో ట్రైనర్ రజనీకాంత్ సమక్షంలో ఫిట్ నెస్ కు మెరుగుపరుచుకునే పనిలో పడ్డాడు. -
గాయంతోనే ఆడా: విజయ్
చెన్నై: భారత ఓపెనర్ మురళీ విజయ్ మణికట్టు గాయంతోనే సొంతగడ్డపై టెస్టు మ్యాచ్‌లు ఆడానని తెలిపాడు. మణికట్టుకు ఇంగ్లండ్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ఇటీవలే స్వదేశానికి వచ్చాడు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్–10 మొత్తం సీజన్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ‘అప్పుడు గాయంపై పెద్దగా ఆలోచించకుండా ఆటను కొనసాగించాను. గాయం తీవ్రత దృష్ట్యా మణికట్టును మునుపటిలా కదిలించలేక సహజసిద్ధమైన షాట్లు స్వేచ్ఛగా ఆడలేకపోయా. ముఖ్యంగా పేసర్లతో మరీ క్లిష్టమైన పరిస్థితి ఎదురైంది’ అని విజయ్ తెలిపాడు. ఈ సీజన్లో సెప్టెంబర్‌లో కివీస్‌తో మొదలైన సిరీస్ నుంచి ఇప్పటి వరకు సొంతగడ్డపై 13 టెస్టులు జరగగా... విజయ్ ఒక్క టెస్టు (ఆస్ట్రేలియా) మినహా అన్ని మ్యాచ్‌లూ ఆడాడు. దీంతో చతేశ్వర్ పుజారా, కోహ్లి తర్వాత అత్యధిక పరుగులు (771) చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. -
ఐపీఎల్–10కు అశ్విన్, రాహుల్ దూరం
న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, లోకేశ్ రాహుల్, మురళీ విజయ్ గాయాల కారణంగా ఈ నెల 5న మొదలయ్యే ఐపీఎల్–10 సీజన్ నుంచి వైదొలిగారు. అశ్విన్ పుణే రైజింగ్ సూపర్ జెయింట్ తరఫున, రాహుల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున, విజయ్ పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తరఫున ఆడాల్సి ఉంది. భుజం గాయం నుంచి ఇంకా కోలుకోని విరాట్ కోహ్లి (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)... గత తొమ్మిది నెలలుగా విరామం లేకుండా జాతీయ జట్టుకు ఆడుతున్న రవీంద్ర జడేజా (గుజరాత్ లయన్స్), ఉమేశ్ యాదవ్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) ఆరంభంలోని కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండే అవకాశముంది. ‘నేను ఐపీఎల్లో ఆడటంలేదు. అధికారిక సమాచారాన్ని నా జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వెల్లడిస్తుంది’ అని రాహుల్ తెలిపాడు. భుజానికి శస్త్ర చికిత్స చేయించుకోవడానికి రాహుల్ లండన్ వెళ్లనున్నట్లు సమాచారం. -
క్రికెటర్ విజయ్‌ని స్మిత్ దారుణంగా తిట్టాడా?
ప్రస్తుతం కొనసాగుతున్న బోర్డర్-గవస్కర్ ట్రోఫీలో వివాదాలకు అడ్డే లేకుండా పోయింది. ప్రపంచంలో మేటి జట్లుగా పేరొందిన భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ అంటే సహజంగానే మైదానంలో హోరాహోరీ పోరు ఉంటుందని అందరూ భావించారు. అందుకు తగ్గట్టే ప్రస్తుత సిరీస్‌లో ఇరుజట్లు ధాటిగా తలపడుతున్నప్పటికీ.. ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్న వివాదాలు మాత్రం ఇరు జట్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. స్లెడ్జింగ్‌కు తోడు ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్ 'డీఆర్ఎస్ వివాదం' సిరీస్‌ను కుదిపేసింది. డీఆర్ఎస్ రివ్యూ కోసం స్మిత్ డ్రెసింగ్ రూమ్ సలహాలు తీసుకోవడం పెద్ద దుమారమే రేపింది. ఇక రాంచీ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భుజానికి గాయమవ్వగా.. ఆసిస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ కోహ్లిని వెక్కిరించేలా అనుకరించడం వివాదం రేపింది. తాజాగా ధర్మశాలలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్మిత్.. విజయ్ను దారుణంగా దుర్భాషలాడటం వివాదం రేపుతోంది. సిరీస్ ఎవరిదో తేల్చే నాలుగు టెస్టు మూడో రోజు సోమవారం.. జోష్ హజెల్‌వుడ్ బ్యాటుకు తగిలి వచ్చిన బంతిని స్లిప్‌లో ఉన్న మురళీ విజయ్ క్యాచ్ పట్టాడు. భారత ఆటగాళ్లు కాన్ఫిడెంట్‌గా అప్పీల్ చేశారు. దీంతో ఎటూ తేల్చుకోలేకపోయిన ఎంపైర్లు.. థర్డ్ ఎంపైర్‌కు నివేదించారు. థర్డ్ ఎంపైర్ మాత్రం బ్యాట్స్‌మన్‌కు ఫేవర్‌గా నిర్ణయాన్ని వెలువరించాడు. హజెల్‌వుడ్ ఔటైతే తాను బ్యాటింగ్‌కు దిగాల్సి ఉండటంతో అందుకు సిద్ధమవుతూ కనిపించిన స్మిత్.. థర్డ్ ఎంపైర్ నిర్ణయం నేపథ్యంలో ఆగ్రహంగా స్పందిస్తూ.. విజయ్ను ఉద్దేశించి (ఫ.. చీట్) అంటూ దారుణంగా నోరుపారేసుకున్నాడు. డ్రెసింగ్ రూమ్‌లో అతని ఆగ్రహం, దుర్భాషలాడటం కెమెరా కంటికి చిక్కింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. స్మిత్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి హజెల్‌వుడ్ నాటౌట్ నిర్ణయం పెద్దగా మ్యాచ్‌పై ప్రభావం చూపలేదు. అశ్విన్ బౌలింగ్‌లో ఆ తర్వాత బంతికే హజెల్‌వుడ్ ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 137 పరుగులకే చాపచుట్టేయడంతో 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా విజయం దిశగా దూసుకుపోతున్నది. In response to @BenHorne8 tweet. This is the video. pic.twitter.com/TiiClKS1BH — Neroli Meadows (@Neroli_M_FOX) March 27, 2017 -
భారత క్రికెట్లో 'డబుల్ ధమాకా'
► ఆటగాళ్ల వార్షిక ఫీజులు రెట్టింపు ► పుజారా, విజయ్, జడేజాలకు ప్రమోషన్ ►సురేశ్ రైనాకు దక్కని చోటు ►బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్‌ల ప్రకటన న్యూఢిల్లీ: భారత టెస్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారాకు బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌లలో ప్రమోషన్ లభించింది. గతంలో గ్రేడ్ ‘బి’లో ఉన్న పుజారాతో పాటు మురళీ విజయ్‌ని కూడా గ్రేడ్ ‘ఎ’లోకి చేరుస్తూ బోర్డు కొత్త కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. వరల్డ్ నంబర్‌వన్ బౌలర్‌గా ఎదిగిన రవీంద్ర జడేజా కూడా ‘సి’ గ్రేడ్ నుంచి నేరుగా ‘ఎ’కు ప్రమోట్ కావడం విశేషం. ఈ అగ్రశ్రేణి జాబితాలో ఇప్పటి వరకు ధోని, కోహ్లి, అశ్విన్, రహానే మాత్రమే ఉండగా ఇప్పుడు పుజారా, విజయ్, జడేజా చేరికతో ఈ సంఖ్య ఏడుకు చేరింది. కొత్త కాంట్రాక్ట్ ప్రకారం ఇందులో ఉన్నవారికి ఏడాదికి రూ. 2 కోట్లు వార్షిక ఫీజుగా లభిస్తాయి. గతంలో ఈ జాబితాలో ఉన్నవారికి రూ. కోటి దక్కేవి. గ్రేడ్ ‘బి’లో 9 మంది ఆటగాళ్లు, గ్రేడ్ ‘సి’లో 16 మంది ఆటగాళ్లు ఉన్నారు. ‘బి’, ‘సి’ గ్రేడ్ల మొత్తాలను కూడా గత ఏడాదికంటే రెట్టింపు చేశారు. అంతర్జాతీయ మ్యాచ్‌లో బరిలోకి దిగినప్పుడు లభించే మ్యాచ్ ఫీజుకు ఈ కాంట్రాక్ట్ మొత్తం అదనం. అక్టోబర్ 1, 2016 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయి. అయితే గత ఏడాది కాంట్రాక్ట్‌లు ప్రకటించిన సమయంలో భారత మహిళా జట్టు క్రీడాకారిణులను పరిగణనలోకి తీసుకుంటూ రెండు గ్రేడ్లుగా విభజించారు. ఈసారి వారి గురించి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఆటగాళ్ల విజ్ఞప్తితో... మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా క్రికెటర్ల కాంట్రాక్ట్ మొత్తం కూడా పెంచాలంటూ గత అక్టోబర్‌లో విజ్ఞప్తులు వచ్చాయి. కెప్టెన్ కోహ్లి అప్పటి బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌తో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఆ సమయంలో కేవలం టెస్టులకు ప్రాధాన్యత పెంచేందుకు టెస్టు మ్యాచ్ ఫీజును రెట్టింపు చేసేందుకు మాత్రం ఠాకూర్ అంగీకరించారు. ఇతర అంశాలపై ఇంకా స్పష్టత రాకుండానే ఠాకూర్ నిష్క్రమించారు. ఇటీవలే బెంగళూరు టెస్టు తర్వాత కూడా కోహ్లి ఇదే అంశాన్ని ప్రత్యేకంగా సీఓఏ దృష్టికి తీసుకు వచ్చారు. దాంతో బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి, జనరల్ మేనేజర్ ఎంవీ శ్రీధర్‌లతో చర్చించిన అనంతరం సీఓఏ బృందం కొత్త కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. రైనాకు నిరాశ... బీసీసీఐ 32 మందితో ప్రకటించిన జాబితాలో సురేశ్ రైనాకు చోటు దక్కకపోవడమే అనూహ్యం. గత ఏడాది అతను గ్రేడ్ ‘బి’లో ఉన్నాడు. వన్డే జట్టులో స్థానం లేకపోయినా... భారత టి20 జట్టు సభ్యుడిగా ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు కూడా ఆడాడు. ఈ మ్యాచ్‌లన్నీ కూడా తాజా ఒప్పందాలు అమలు చేయబోతున్న తేదీ తర్వాత ఆడినవే. రైనాకు దిగువ గ్రేడ్‌కు కూడా పంపించకుండా పూర్తిగా కాంట్రాక్ట్ నుంచే తప్పించడం ఆశ్చర్యకర పరిణామం. ఇక అంబటి తిరుపతి రాయుడు, శిఖర్ ధావన్ గ్రేడ్ ‘బి’ నుంచి ‘సి’కి పడిపోయారు. గత ఏడాది జాబితాలో లేని యువరాజ్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాలకు ఈ సారి గ్రేడ్ ‘బి’లో స్థానం లభించింది. భారత్ తరఫున 3 టి20లు ఆడిన మన్దీప్ సింగ్, ఒకే ఒక టి20 ఆడిన రిషభ్ పంత్‌లకు తొలిసారి చోటు దక్కగా... భారత్ తరఫున ఇంకా అరంగేట్రం చేయని శార్దుల్ ఠాకూర్‌కు కాంట్రాక్ట్ దక్కడం మరో విశేషం. టెస్టు మ్యాచ్ ఆడితే రూ. 15 లక్షలు భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు కూడా రెట్టింపయ్యాయి. ఇకపై ఒక టెస్టు మ్యాచ్ ఆడితే ఒక్కో ఆటగాడికి రూ. 15 లక్షలు లభిస్తాయి. టెస్టుల్లో రిజర్వ్ ఆటగాడికి రూ. 7 లక్షలు దక్కుతాయి. ఒక్కో వన్డేకు రూ. 6 లక్షలు, ఒక్కో టి20 మ్యాచ్‌కు రూ. 3 లక్షలు అందజేస్తారు. కొత్త కాంట్రాక్ట్‌ల జాబితా గ్రేడ్ ‘ఎ’ (రూ. 2 కోట్లు): విరాట్ కోహ్లి, ధోని, అశ్విన్, అజింక్య రహానే, చతేశ్వర్ పుజారా, మురళీ విజయ్, రవీంద్ర జడేజా. గ్రేడ్ ‘బి’ (రూ. 1 కోటి): రోహిత్ శర్మ, భువనేశ్వర్, మొహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, యువరాజ్ సింగ్, కేఎల్ రాహుల్ (ప్రమోషన్), వృద్ధిమాన్ సాహా (ప్రమోషన్). గ్రేడ్ ‘సి’ (రూ. 50 లక్షలు): శిఖర్ ధావన్ (దిగువకు), అంబటి తిరుపతి రాయుడు (దిగువకు), అమిత్ మిశ్రా, మనీశ్ పాండే, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్, హార్దిక్ పాండ్యా, ఆశిష్ నెహ్రా, కేదార్ జాదవ్, యజువేంద్ర చహల్, పార్థివ్ పటేల్, జయంత్ యాదవ్, మన్దీప్ సింగ్, ధావల్ కులకర్ణి, శార్దుల్ ఠాకూర్, రిషభ్ పంత్ (వీరిలో మిశ్రా, అక్షర్, ధావల్ గత ఏడాది కూడా ‘సి’లోనే ఉండగా మిగతా 11 మందికి తొలిసారి కాంట్రాక్ట్ లభించింది) స్థానం కోల్పోయినవారు: సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, స్టువర్ట్ బిన్నీ, మోహిత్ శర్మ, వరుణ్ ఆరోన్, కరణ్ శర్మ, శ్రీనాథ్ అరవింద్. -
పుజారా ప్రత్యేకత అదే
రాంచీ: టీమిండియా బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పుజారా కీలక సమయంలో ఒత్తిడిని ఎదుర్కొని రాణించి, ఇతర బాట్స్మెన్పై భారం పడకుండా వాళ్లు సహజశైలిలో ఆడేలా చేస్తాడని ఓపెనర్ మురళీ విజయ్ అన్నాడు. ఆస్ట్రేలియాతో రాంచీ టెస్టులో మూడో రోజు శనివారం పుజారా సెంచరీతో రాణించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడని ప్రశంసించాడు. ఆటలో ఒత్తిడి ఎదురైనపుడు ఆ భారం పుజారాపై వేసి, మరో ఆటగాడు సహజశైలిలో ఆడవచ్చని విజయ్ అన్నాడు. తామిద్దరం మంచి ఫామ్‌లో ఉన్నామని, ఇది జట్టు పటిష్ట స్థితిలో నిలవడానికి ఉపయోగపడిందని చెప్పాడు. రాంచీ టెస్టులో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 451 పరుగులు చేయగా.. భారత్ మూడో రోజు ఆట ముగిసేసరికి 360/6 స్కోరు చేసింది. సెంచరీ వీరుడు పుజారా (130 బ్యాటింగ్), సాహా (18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. పుజరా, విజయ్ రెండో వికెట్‌కు 102 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆధిక్యం సాధిస్తే మ్యాచ్ చేతిలోకి వస్తుందని విజయ్ చెప్పాడు. -
వారెవ్వా.. విజయ్
రాంచీ:భారత క్రికెట్ జట్టులో మురళీ విజయ్‌ది ప్రత్యేకమైన స్థానం. ఎంతమంది ఓపెనర్లు వచ్చి వెళుతున్నా జట్టు ప్రయోజనాలకు కోసం అత్యంత ఎక్కువ శ్రమించే ఆటగాళ్లలో విజయ్ ఒకడు. ఈ క్రమంలోనే భారత్ జట్టులో కీలక సభ్యుడిగా మారిపోయాడు. నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో్ జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో విజయ్ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే ఇది విజయ్ టెస్టు కెరీర్ లో 15 వ హాఫ్ సెంచరీగా నమోదైంది. ఇదిలా ఉంచితే టెస్టు కెరీర్ లో 9 సెంచరీలను సాధించిన విజయ్.. ఆసీస్ పై మాత్రం అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ రోజు మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సాధించిన తరువాత అతని కెరీర్ లో యాభై అంతకంటే ఎక్కువ పరుగుల్ని ఆసీస్ పైనే అత్యధిక సార్లు సాధించడం ఇక్కడ విశేషం. తన టెస్టు కెరీర్ లో ఆసీస్ పై 10సార్లు యాభై ప్లస్ స్కోర్లను మురళీ విజయ్ నమోదు చేశాడు. తద్వారాఆసీస్ పైనే అత్యధిక సార్లు యాభై అంతకంటే ఎక్కువ వ్యక్తిగత పరుగుల్ని సాధించిన ఘనతను విజయ్ సొంతం చేసుకున్నాడు. కేవలం ఆసీస్ అంటేనే పూనకం వచ్చినట్లు ఆడే విజయ్.. మిగతా ఏ జట్టుపైనా కూడా యాభైకు పైగా స్కోర్లను ఐదుసార్ల కంటే ఎక్కువసార్లు నమోదు చేయలేదు. 120/1 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు లంచ్ కు ముందు మరో వికెట్ ను కోల్పోయింది. ఓవర్ నైట్ ఆటగాడు విజయ్(82;183 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ సాధించిన తరువాత పెవిలియన్ చేరాడు. ఓకీఫ్ వేసిన ఇన్నింగ్స్ 71 ఓవర్ నాల్గో బంతికి ఫ్రంట్ ఫుట్ కు వచ్చి షాట్ కు యత్నించిన విజయ్ స్టంప్ అవుట్ అయ్యాడు. దాంతో 193 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ ను కోల్పోయింది. -
మురళీ విజయ్ ను తప్పించారు!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) పదో సీజన్ కోసం కింగ్స్ పంజాబ్ ఫ్రాంచైజీ తమ జట్టు కెప్టెన్సీ పదవి నుంచి మురళీ విజయ్ ను తప్పించింది. గత సీజన్ లో మురళీ విజయ్ ను సారథిగా నియమించిన కింగ్స్ పంజాబ్.. తాజా సీజన్ కోసం అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించింది. రాబోవు సీజన్ కోసం విజయ్ ను ఆటగాడిగా మాత్రమే పరిమితం చేసిన సదరు ఫ్రాంచైజీ అతని స్థానంలో మ్యాక్స్ వెల్ ను సారథిగా నియమించింది. ప్రస్తుత కింగ్స్ పంజాబ్ జట్టులో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, వెస్టిండీసీ ట్వంటీ 20 మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ, దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు హషీమ్ ఆమ్లాలు ఉన్నప్పటికీ మ్యాక్స్ వెల్ ను కెప్టెన్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఆశ్చర్యపరిచినప్పటికీ ఐపీఎల్-10వ సీజన్ లో కెప్టెన్లగా వ్యవహరించే ఆస్ట్రేలియా ఆటగాళ్ల సంఖ్య మూడుకు చేరింది. గత కొన్ని రోజుల క్రితం పుణె సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ ను నియమించిన సంగతి తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోని తప్పించిన పుణె.. ఆ స్థానంలో స్మిత్ ను కెప్టెన్ గా ఎంపిక చేసింది. మరొకవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ గతేడాది బాధ్యతలు స్వీకరించాడు. -
విజయ్ అవుట్.. ముకుంద్, నాయర్ ఇన్
-
విజయ్ అవుట్.. ముకుంద్, నాయర్ ఇన్
బెంగళూరు: తమిళనాడు బ్యాట్స్‌మన్ అభినవ్ ముకుంద్‌కు దాదాపు ఐదున్నరేళ్ల విరామం తర్వాత భారత టెస్టు జట్టులో ఆడే అవకాశం వచ్చింది. ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు టీమిండియా తుది జట్టులో రెండు మార్పులు చేశారు. తొలిటెస్టులో గాయపడ్డ ఓపెనర్ మురళీ విజయ్ను పక్కనబెట్టి, అతని స్థానంలో ముకుంద్‌ను తీసుకున్నారు. ఇక జయంత్ యాదవ్‌ను తప్పించి ఎక్స్ట్రా బ్యాట్స్‌మన్‌గా ట్రిపుల్ సెంచరీ హీరో కరుణ్ నాయర్‌కు తుది జట్టులో స్థానం కల్పించారు. ఈ రెండు మార్పులు మినహా తొలి టెస్టులో ఆడిన ఆటగాళ్లు రెండో టెస్టులో బరిలో దిగారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమిస్తోన్న రెండో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లోకేష్ రాహుల్, ముకుంద్ బ్యాటింగ్‌కు దిగారు. పుణెలో ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ సేన ఘోరపరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పుంజుకుని విజయం సాధించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. -
పిచ్ తప్పేమీ లేదు: మురళీ విజయ్
బెంగళూరు: తొలి టెస్టులో తమ జట్టు ఘోర పరాజయంలో పిచ్ పాత్ర ఏమీ లేదని భారత క్రికెటర్ మురళీ విజయ్ అభిప్రాయపడ్డాడు. ఈ వికెట్ నాసిరకంగా ఉందంటూ ఐసీసీ ఇచ్చిన నివేదికతో అతను విభేదించాడు. ‘పుణే వికెట్ నాసిరకంగా ఏమీ లేదు. తొలి బంతి నుంచే అది బ్యాట్స్‌మెన్‌కు సవాల్ విసిరింది. క్రికెటర్లుగా మేం ఎప్పుడూ బ్యాటింగ్ పిచ్‌లపైనే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి పిచ్‌లపై కూడా ఆడాల్సి ఉంటుంది. మా సమర్థతను, సాంకేతిక నైపుణ్యాన్ని పరీక్షించే ఇలాంటి వికెట్లపై ఆడటం కూడా మంచిది. బెంగళూరులో ఎలాంటి పిచ్ ఎదురవుతుందో చూడాలి’ అని విజయ్ వ్యాఖ్యానించాడు. -
'చెత్త' పిచ్ పై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
బెంగళూరు: వివాదాస్పదమైన పుణే పిచ్ పై టీమిండియా ఆటగాడు మురళీ విజయ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. వాస్తవానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చెప్పినట్లుగా ఎంసీఏ (పుణే టెస్ట్) పిచ్ చెత్త పిచ్ కాదని, అది చాలా చాలెంజింగ్ పిచ్ అని అభిప్రాయపడ్డాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో ఆస్ట్రేలియాతో పుణేలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 333 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఏది ఏమైతేనేం తమ జట్టు 105, 107 పరుగులకే ఆలౌట్ అయిన విషయాన్ని అంగీకరించక తప్పదన్నాడు. ఫ్లాట్ వికెట్లపై ఆడేకంటే ఇలాంటి పిచ్ లపై టెస్టులు ఆడాల్సి ఉంటుందని, అప్పుడే ఆటగాళ్ల టెక్నిక్స్, లోపాలు లాంటివి బయటపడే ఛాన్స్ ఎక్కువ అని తెలిపాడు. 'పుణే టెస్టులో ఆసీస్ బౌలర్లు అద్బుతంగా రాణించారు. తొలి ఇన్నింగ్స్ తోనే ఆసీస్ ఆధిక్యంలోకి వచ్చింది. ఆపై రెండో ఇన్నింగ్స్ తర్వాత భారీ లక్ష్యం ముందుండటం, ముఖ్యంగా ఆసీస్ బౌలర్ ఓకీఫ్ 12 వికెట్లతో చెలరేగడంతో భారత్ ఓటమిపాలైంది. తొలి టెస్టు తప్పిదాలను గుర్తించాం. రెండో టెస్టులో వాటిని ఎలా అధిగమించాలన్న దానిపై కోచ్, కెప్టెన్ సహా జట్టు దృష్టి పెట్టింది. నెక్ట్స్ మ్యాచ్ లో రాణించేందుకు తమ జట్టు శాయశక్తులా కృషిచేస్తుందని' టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ చెప్పుకొచ్చాడు. రెండో టెస్టు మార్చి 4న బెంగళూరు చిన్నస్వామి స్డేడియంలో జరుగుతుంది. -
68 ఏళ్ల రికార్డు బద్దలైంది!
హైదరాబాద్: ఉప్పల్ స్డేడియంలో టీమిండియా ఆటగాళ్లు మురళీ విజయ్(108), చతేశ్వర్ పుజారా(83 పరుగులు) అరుదైన రికార్డు నెలకొల్పారు. భారత గడ్డపై ఓ సీజన్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన భారత జోడీగా అరుదైన ఫీట్ ను ఈ క్రికెటర్లు తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో దాదాపు 68 ఏళ్ల టెస్టు క్రికెట్ రికార్డు బద్దలైంది. 1948-49 సీజన్లో భారత ఆటగాళ్లు విజయ్ హజారే- రుసి మోడీ నాలుగు సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పారు. నేడు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్డేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు తొలి రోజున విజయ్-చతేశ్వర్ పుజారా సెంచరీ భాగస్వామ్యాన్ని (178 పరుగులు) అందించారు. 2016-2017 సీజన్లో ఇది వీరికి ఐదో సెంచరీ భాగస్వామ్యం. దీంతో 1948-49 సీజన్లో విజయ్ హజారే-రుసి మోడీ సాధించిన నాలుగు సెంచరీ భాగస్వామ్యాల రికార్డును విజయ్-పుజారా సవరించినట్లయింది. ఈ క్రమంలో పుజారా మరో అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. 1964-65లో చందు బోర్డే సాధించిన అత్యధిక ఫస్ట్ క్లాస్ పరుగులు (1604) రికార్డును పుజారా (1605 పరుగులు) అదిగమించాడు. -
అది నా చేతుల్లో లేదు: మురళీ విజయ్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ టెస్టు జట్టులో అత్యంత నిలకడగా బ్యాటింగ్ చేసే ఆటగాళ్లలో ఓపెనర్ మురళీ విజయ్ ఒకడు. అయితే ఇటీవల కాలంలో మురళీ విజయ్ రిజర్వ్ బెంచ్ కే ఎక్కువ పరిమితమవుతున్నాడు. మూడు ఫార్మాట్లలో కీలక ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోవాలని మురళీ విజయ్ అనుకుంటున్నా, ఆ మేరకు జట్టులో మాత్రం స్థానం సంపాదించలేకపోతున్నాడు. ఒకవైపు గాయాల బారిన పడుతుండటమే కాకుండా, అన్నిఫార్మాట్లకు సరిపోయే ఆటగాడిగా మాత్రం విజయ్ ఇంకా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. 'భారత క్రికెట్ జట్టు తరపున అన్ని ఫార్మాట్లలో ఆడాలనేది నా కోరిక. దాని ప్రకారమే నా ఆట తీరును ఎప్పటికప్పుడూ మార్చుకుంటూనే ఉన్నా. అయితే సెలక్షన్ కమిటీ అనేది నా చేతుల్లో లేదు. నా స్కిల్‌ను పెంచుకోవడంతో పాటు ఫిట్నెస్ను కాపాడుకోవడంపైనే దృష్టి సారించడమే నా పని. ఇప్పటికే టెస్టు ఫార్మాట్లోనన్ను నేను నిరూపించుకున్నప్పటికీ, ఇంకా నిలకడగా ఆడటం కోసం యత్నిస్తున్నా'అని విజయ్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంచితే, భారత కెప్టెన్ విరాట్ కోహ్లిపై మురళీ విజయ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఏ పరిస్థితుల్లోనైనా చక్కటి ప్రణాళిక అనేది విరాట్ సొంతమని విజయ్ కొనియాడాడు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా విరాట్ చాకచక్యంగా వ్యవహరించి జట్టును కాపాడే తీరు నిజంగా అద్భుతమన్నాడు. మూడు ఫార్మాట్లలో సత్తా చాటిన ఏకైక క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లినేనని విజయ్ పేర్కొన్నాడు. -
ఈ సెంచరీ వెరీ వెరీ స్పెషల్!
-
ఈ సెంచరీ వెరీ వెరీ స్పెషల్!
ముంబై: ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో తాను సాధించిన శతకం ఎంతో ప్రత్యేకమైనదని టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ అన్నాడు. మూడోరోజు ఆట నిలిపివేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. గత నాలుగు ఇన్నింగ్స్ ల్లో తాను పూర్తిగా విఫలం కావడంతో తనపై ఎంతో ఒత్తిడి పెరిగిందన్నాడు. దీంతో సరైన సమయంలో తన బ్యాట్ నుంచి పరుగులు రావడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నాడు. ‘గత నాలుగు ఇన్నింగ్స్ లలో పరుగులు చేయాలని ప్రయత్నించినా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యాను. ఈ టెస్టులో క్లియర్ మైండ్ సెట్ తో బ్యాటింగ్ చేశాను. ఈ టెస్టుకు ముందు వారం రోజుల విరామం రావడం కూడా కలిసొచ్చింది’ అని సెంచరీ వీరుడు విజయ్ వివరించాడు. 2002లో చివరిసారిగా వీరేంద్ర సెహ్వాగ్ ఇక్కడ టెస్టు సెంచరీ చేసిన 14 ఏళ్లకు శతకం నమోదు చేసిన ఓపెనర్ గానూ విజయ్ రికార్డు నెలకొల్పాడు. మురళీ విజయ్(136;282 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకంతో ఆకట్టుకోగా, కెప్టెన్ విరాట్ కోహ్లి(147 బ్యాటింగ్;241 బంతుల్లో 17ఫోర్లు) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి తన మొదటి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 451 పరుగులు చేసి 51 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 400 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. -
సెహ్వాగ్ తరువాత మురళీ విజయ్!
-
సెహ్వాగ్ తరువాత మురళీ విజయ్!
ముంబై: భారత క్రికెట్ చరిత్రలో ఘనమైన చరిత్ర ఉన్న నగరంలోని వాంఖేడ్ స్టేడియంలో ఇప్పటివరకూ నమోదైన టెస్టు సెంచరీల సంఖ్య మరీ ఎక్కువేమీ కాదు. 1975లో తొలిసారి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌కు వేదికైన ఈ స్టేడియంలో ఇప్పటివరకూ 38 టెస్టు సెంచరీలు నమోదయ్యాయి. అందులో భారత ఆటగాళ్లు 22 సెంచరీలు సాధించారు. అయితే ఓపెనర్లలో అత్యధికంగా ఇక్కడ సెంచరీలు చేసింది మాత్రం భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్. ఈ స్టేడియంలో గవాస్కర్ ఓపెనర్ గా చేసిన సెంచరీల సంఖ్య 5. ఇదిలా ఉంచితే భారత ఓపెనర్‌గా 2002లో చివరిసారిగా వీరేంద్ర సెహ్వాగ్ ఇక్కడ టెస్టు సెంచరీ సాధించాడు. ఆ తరువాత ఇంత కాలానికి భారత ఓపెనర్ గా మురళీ విజయ్ ఆ మార్కును చేరాడు. దాదాపు 14 ఏళ్ల తరువాత ఒక భారత ఓపెనర్ ఇక్కడ సెంచరీ చేయడం ఇదే ప్రథమం. కాగా, గడిచిన ఇరవై ఏళ్ల కాలంలో సెహ్వాగ్, మురళీ విజయ్‌లు మాత్రమే భారత ఓపెనర్లుగా సెంచరీలు నమోదు చేసినవారు. ఇంగ్లండ్ తో ఇక్కడ జరుగుతున్న మురళీ విజయ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 231 బంతుల్లో8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో శతకం సాధించాడు. -
శతక్కొట్టిన విజయ్
ముంబై:ఇంగ్లండ్‌తో ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ శతకం సాధించాడు. 231 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ నమోదు చేశాడు. 146/1 ఓవర్ నైట్ స్కోరు మూడో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది. దీనిలో భాగంగా ఓవర్ నైట్ ఆటగాడు మురళీ విజయ్ శతకం పూర్తి చేసుకోగా, మరో ఓవర్ నైట్ ఆటగాడు చటేశ్వర పూజారా(47) హాఫ్ సెంచరీని తృటిలో కోల్పోయాడు. ఇన్నింగ్స్ ఆరంభించిన రెండో బంతికే పూజారాను బాల్ బౌల్డ్ చేశాడు. దాంతో భారత్ జట్టు 146 పరుగుల వద్దే రెండో వికెట్‌ను నష్టపోయింది. ఈ తరుణంలో విజయ్‌కు జతకలిసిన కెప్టెన్ విరాట్ కోహ్లి సమయోచితంగా ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళుతున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ తన టెస్టు కెరీర్లో ఎనిమిదో సెంచరీ నమోదు చేశాడు. దాంతో భారత్ 72.0 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఈ సిరీస్ తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో విజయ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. -
మురళీ విజయ్ హాఫ్ సెంచరీ
ముంబై:ఇంగ్లండ్‌తో ఇక్కడ జరుగుతున్న నాల్గో టెస్టులో భారత ఓపెనర్ మురళీ విజయ్ హాఫ్ సెంచరీ సాధించాడు. 126 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో అర్థ శతకం సాధించాడు. ఇది విజయ్ కెరీర్లో 15వ హాఫ్ సెంచరీ. శుక్రవారం రెండో రోజు ఆటలో భాగంగా తొలుత ఇంగ్లండ్‌ను 400 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. ఆ తరువాత మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. భారత ఇన్నింగ్స్‌ను కేఎల్ రాహుల్‌తో కలిసి మురళీ విజయ్ ప్రారంభించాడు. కాగా, రాహుల్(24) తొలి వికెట్ గా అవుటయ్యాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్‌లో రాహుల్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత విజయ్‌తో కలిసిన చటేశ్వర పూజారా ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టారు. ఈ క్రమంలోనే విజయ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోవడంతో భారత్ 44.0 ఓవర్లలో వికెట్ నష్టానికి 133 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. -
'కోట'లో సెంచరీల మోత
-
రాణించిన విజయ్,పూజారా
కాన్పూర్:మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు 42 పరుగుల వద్ద తొలి వికెట్ గా కేఎల్ రాహుల్(32) కోల్పోయినప్పటికీ, మరో ఓపెనర్ మురళీ విజయ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. విజయ్ 123 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో అర్థ శతకం చేయగా, ఫస్ట్ డౌన్లో వచ్చిన చటేశ్వర పూజారా 84 బంతుల్లో ఏడు ఫోర్లతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరూ రాణించడంతో భారత క్రికెట్ జట్టు 46.0 ఓవర్లలో వికెట్ నష్టానికి 147 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. -
కుంబ్లే నుంచి ఎంతో నేర్చుకోవచ్చు
కుర్రాళ్లకు మంచి అవకాశమన్న విజయ్ బెంగళూరు: భారత కోచ్ అనిల్ కుంబ్లే నుంచి మరిన్ని కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కలుగుతుందని ఓపెనర్ మురళీ విజయ్ అభిప్రాయ పడ్డాడు. ఆటగాళ్లంతా కొత్త కోచ్‌తో కలిసి పని చేయడంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అతను అన్నాడు. కుంబ్లే, కోహ్లి భాగస్వామ్యంపై తాను ఇప్పుడే ఏమీ వ్యాఖ్యానించనని, అయితే రాబోయే 12 నెలలు భారత క్రికెట్‌కు అద్భుతమైన రోజులు అవుతాయని విజయ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘నా కెరీర్ తొలి టెస్టు, కుంబ్లే ఆడిన ఆఖరి టెస్టు ఒకటే కావడం యాదృచ్ఛికం. అప్పుడు ఆయనతో ఎక్కువగా మాట్లాడే అవకాశం రాలేదు. అయితే చిన్నప్పటి నుంచి ఆయనకు అభిమానిని. ఇప్పుడు కలిసి పని చేస్తే ఎంతో నేర్చుకోవచ్చు’ అని అతను అన్నాడు. వెస్టిండీస్ గడ్డపై గత సిరీస్‌లో తాను విఫలమయ్యానని, ఈ సారి బాగా ఆడాలని పట్టుదలగా ఉన్నట్లు విజయ్ పేర్కొన్నాడు. -
నా తొలి టెస్టే.. అతనికి చివరి టెస్టు..
బెంగళూరు: భారత క్రికెట్ ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లే ఎంపిక కావడం నిజంగా తమకు దక్కిన సువర్ణావకాశమని ఓపెనర్ మురళీ విజయ్ తెలిపాడు. ఆ దిగ్గజ ఆటగాడు దగ్గర్నుంచి అనేక విషయాలను నేర్చుకోవడానికి భారత క్రికెట్ జట్టు ఎదురుచూస్తుందన్నాడు. తాను కుంబ్లేకు పెద్ద అభిమానినని పేర్కొన్న విజయ్.. అతను భారత్ క్రికెట్ ను మరింత ముందుకు తీసుకువెళ్తాడన్నాడు. ' నేను యువకుడిగా ఉన్న దగ్గర్నుంచీ కుంబ్లేకు పెద్ద అభిమానిని. అయినప్పటికీ నేను కుంబ్లేతో ఎక్కువ సమయం గడపే అవకాశం రాలేదు. నా తొలి టెస్టు మ్యాచే.. అతనికి చివరి టెస్టు మ్యాచ్ అయ్యింది. అందుచేత అతనితో ఎక్కువగా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని పంచుకోలేదు. మరొకసారి అతనితో కలిసి భాగస్వామ్యం అయ్యే అవకాశం లభించింది. అతని ఎంపిక భారత జట్టుకు లభించిన గొప్ప వరం. యువ క్రికెటర్లు కుంబ్లే నుంచి చాలా విషయాలు నేర్చుకుంటారు'అని మురళీ విజయ్ తెలిపాడు. గతంలో టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రితో కొన్ని అద్భుతమైన క్షణాలను ఆస్వాదించినట్లు విజయ్.. ఇప్పుడు కుంబ్లే రూపంలో ఒక గొప్ప కోచ్ వచ్చాడన్నాడు. -
బెంగళూరు బతికిపోయింది
ఓటమికి చేరువగా వచ్చిన బెంగళూరు అదృష్టవశాత్తూ గట్టెక్కింది. జట్టు బౌలర్ క్రిస్ జోర్డాన్ ఒత్తిడిని తట్టుకొని బౌండరీ రాకుండా ఆఖరి బంతిని విసరడంతో ఆ జట్టుకు ఒక్క పరుగుతో విజయం దక్కింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి నాలుగు పరుగులు కావాల్సి ఉండగా స్టొయినిస్ 2 పరుగులే తీయగలిగాడు. చివరి ఓవర్లో విజయానికి 17 పరుగులు కావాల్సిన స్థితిలో పంజాబ్ బ్యాట్స్‌మెన్ స్టొయినిస్, బెహర్దీన్ 15 పరుగులు తీయగలిగినా పంజాబ్‌ను ఓటమి నుంచి రక్షించలేకపోయారు. అంతకుముందు చహల్ బౌలింగ్ ప్రదర్శన ఆర్సీబీని ఆదుకుంది. ఒక్క పరుగుతో విజయం * రాణించిన డివిలియర్స్, చహల్ * చివరి బంతికి ఓడిన పంజాబ్ * విజయ్ మెరుపులు వృథా మొహాలీ: ఐపీఎల్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కీలక విజయాన్ని అందుకుంది. మరోసారి బౌలింగ్ వైఫల్యం జట్టును దెబ్బ తీసేలా కనిపించినా, ఎట్టకేలకు గట్టెక్కింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు పరుగు తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. డివిలియర్స్ (35 బంతుల్లో 64; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా, రాహుల్ (25 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్), సచిన్ బేబీ (29 బంతుల్లో 33; 1 ఫోర్) రాణించారు. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులే చేయగలిగింది. మురళీ విజయ్ (57 బంతుల్లో 89; 12 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగగా, స్టొయినిస్ (22 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. రెండు కీలక వికెట్లు తీసిన వాట్సన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చెలరేగిన డివిలియర్స్... వరుసగా రెండో ఇన్నింగ్స్‌లో 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రాహుల్, కోహ్లి (21 బంతుల్లో 20; 2 ఫోర్లు) బెంగళూరుకు శుభారంభం అందించారు. ఒకవైపు కోహ్లి సంయమనంతో ఆడగా, మరోవైపు నుంచి రాహుల్ చెలరేగిపోయాడు. స్టొయినిస్ వేసిన నాలుగో ఓవర్లో అతను మూడు ఫోర్లు, 1 సిక్సర్ బాదడంతో 20 పరుగులు వచ్చాయి. ఈ జోరులో పవర్‌ప్లేలో ఆర్సీబీ 56 పరుగులు చేసింది. 11 పరుగుల వద్ద స్టొయినిస్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన కోహ్లి దానిని పెద్దగా ఉపయోగించుకోలేకపోయాడు. కరియప్ప వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో బెంగళూరు వేగానికి బ్రేక్ వేసింది. మూడో బంతికి రాహుల్‌ను బౌల్డ్ చేసిన కరియప్ప, మరో రెండు బంతుల తర్వాత కోహ్లిని పెవిలియన్ పంపించాడు. మరుసటి ఓవర్లోనే వాట్సన్ (1) కూడా వెనుదిరిగాడు. గత రెండు మ్యాచ్‌లలో విఫలమైన డివిలియర్స్ ఈ దశలో తన ధాటిని ప్రదర్శించాడు. సందీప్ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన అతను, మోహిత్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సందీప్ తర్వాతి ఓవర్లో కూడా మళ్లీ సిక్స్, ఫోర్ కొట్టిన తర్వాత మరో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. డివిలియర్స్‌కు సచిన్ బేబీ నుంచి చక్కటి సహకారం లభించింది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 55 బంతుల్లోనే 88 పరుగులు జోడించారు. ఆఖరి ఓవర్లో బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయింది. తొలి 10 ఓవర్లలో 73 పరుగులు చేసిన కోహ్లి సేన, తర్వాతి 10 ఓవర్లలో 102 పరుగులు సాధించింది. విజయ్ ఒంటరి పోరు... పంజాబ్ ఇన్నింగ్స్‌ను విజయ్ దూకుడుగా ఆరంభించగా, ఆమ్లా (20 బంతుల్లో 21; 2 ఫోర్లు) కొద్ది సేపు అండగా నిలిచాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 33 బంతుల్లో 45 పరుగులు జోడించిన అనంతరం ఆమ్లాను వాట్సన్ అవుట్ చేశాడు. విజయ్‌కు సాహా (13 బంతుల్లో 16; 1 ఫోర్) కూడా సహకరించడంతో రెండో వికెట్‌కూ 32 బంతుల్లో 43 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. 10 ఓవర్లు ముగిసే సరికి కింగ్స్ స్కోరు 83 పరుగులకు చేరింది. అయితే 11వ ఓవర్లో పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయింది. సాహా రనౌట్ కాగా, మిల్లర్(0) స్టంపౌట్ అయి వెనుదిరిగాడు. మరోవైపు 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న విజయ్, ఆ తర్వాత మరింత బాధ్యతగా ఆడాడు. అబ్దుల్లా ఓవర్లో రెండు వరుస ఫోర్లు కొట్టిన విజయ్, చహల్ ఓవర్లో మరో రెండు బౌండరీలు రాబట్టాడు. విజయ్, స్టొయినిస్ నాలుగో వికెట్‌కు ఆరు ఓవర్లలో 51 పరుగులు జత చేసిన తర్వాత భారీ షాట్‌కు ప్రయత్నించి విజయ్ వెనుదిరగడం పంజాబ్ అవకాశాలను దెబ్బ తీసింది. స్కోరు వివరాలు:- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) విజయ్ (బి) కరియప్ప 20; రాహుల్ (బి) కరియప్ప 42; డివిలియర్స్ (సి) కరియప్ప (బి) సందీప్ 64; వాట్సన్ (బి) అక్షర్ 1; సచిన్ బేబీ (రనౌట్) 33; హెడ్ (సి) విజయ్ (బి) సందీప్ 11; బిన్నీ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1-63; 2-64; 3-67; 4-155; 5-174; 6-175. బౌలింగ్: సందీప్ 4-0-49-2; అనురీత్ 3-0-15-0; మోహిత్ 3-0-33-0; స్టొయినిస్ 3-0-35-0; అక్షర్ పటేల్ 4-0-27-1; కరియప్ప 3-0-16-2. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: ఆమ్లా (సి) బిన్నీ (బి) వాట్సన్ 21; విజయ్ (సి) చహల్ (బి) వాట్సన్ 89; సాహా (రనౌట్) 16; మిల్లర్ (స్టంప్డ్) రాహుల్ (బి) చహల్ 0; స్టొయినిస్ (నాటౌట్) 34; బెహర్దీన్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1-45; 2-88; 3-88; 4-139. బౌలింగ్: బిన్నీ 2-0-16-0; చహల్ 4-0-30-1; జోర్డాన్ 4-0-52-0; వాట్సన్ 4-0-22-2; ఆరోన్ 3-0-25-0; అబ్దుల్లా 3-0-26-0. -
ప్రతి మ్యాచ్ మాకు సవాల్ లాంటిది..
మొహాలి: ఢిల్లీ డేర్ డేవిల్స్ ను చిత్తుచేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 9 లో తమ సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. జహీర్ ఖాన్ నేతృత్వంలోని డేర్ డెవిల్స్ పై 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం పంజాబ్ బౌలర్ సందీప్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు. ఇక నుంచి తమ జట్టు ఇలాగే జోరును కొనసాగిస్తుందన్నాడు. టాప్ 4లో నిలిచి సెమీస్ ఆశల్ని నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తంచేశాడు. లీగ్ లో పోటీలో నిలవాలంటే ఇక ప్రతీ మ్యాచ్ తమకు సవాల్ లాంటిదేనని అభిప్రాయపడ్డాడు. స్టోయినిస్ (44 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్సర్లు; 3/40) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పంజాబ్ గట్టెక్కింది. కోల్ కతా లో తమ జట్టు మంచి ప్రదర్శన చేసిందన్నాడు. ఇప్పుడు తాము మంచి కెప్టెన్ నేతృత్వంలో కొనసాగుతున్నామని, అతడికి బౌలర్లకు బంతి ఎప్పుడు ఇవ్వాలో తెలుసునని సందీప్ చెప్పుకొచ్చాడు. మిల్లర్ నుంచి పగ్గాలు చేపట్టిన తర్వాత మురళీ విజయ్ జట్టుకు రెండు విజయాలను అందించిన విషయం తెలిసిందే. మిల్లర్, మాక్స్ వెల్ ఇప్పుడు గాడిలో పడి పరుగుల వేట మొదలెట్టారని, బ్యాట్స్ మన్ ఏ స్థానాల్లో రావాలో కూడా విజయ్ కి అవగాహనా ఉందని కెప్టెన్ పై పంజాబ్ ఆటగాడు సందీప్ ప్రశంసలు కురిపించాడు. -
'అక్షర్ అద్భుతం చేశాడు'
రాజ్ కోట్: 'హ్యాట్రిక్' నమోదు చేసిన స్పిన్నర్ అక్షర్ పటేల్ పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ మురళీ విజయ్ ప్రశంసలు కురింపించాడు. అక్షర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని మెచ్చుకున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత విజయ్ మాట్లాడుతూ... 'ఈ రోజు విజయం క్రెడిట్ అక్షర్ కు దక్కుతుంది. గత మ్యాచుల్లో అతడు ఒత్తిడికి గురయ్యాడు. ఈ మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు' అని పేర్కొన్నాడు. ఆదివారం గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో అక్షర్ 21 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. హ్యాట్రిక్ తో టాప్ ఆటగాళ్లను పెవిలియన్ కు పంపాడు. ఓవర్ మూడో బంతికి డ్వేన్ స్మిత్ (15)ను అవుట్ చేసిన అక్షర్... ఐదు, ఆరు బంతులకు కార్తీక్ (2), బ్రేవో (0)లను పెవిలియన్ పంపించాడు. మరో మూడు ఓవర్ల తర్వాత మళ్లీ బౌలింగ్‌కు దిగిన అక్షర్ తొలి బంతికే జడేజా (11)ను 'హ్యాట్రిక్' వికెట్‌గా అవుట్ చేశాడు. తాను వేసిన ఐదు బంతుల వ్యవధిలో పటేల్ నాలుగు వికెట్లు తీయడం విశేషం. మిల్లర్ ను తప్పించి విజయ్ కు కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అక్షర్ తో పాటు పేసర్లు మొహిత్ శర్మ, సందీప్ శర్మ కూడా బాగా బౌలింగ్ చేశారని విజయ్ అన్నాడు. మిల్లర్ ఫామ్ గురించి అడగ్గా.. ఏ జట్టుకైనా అతడు ఎసెట్ అని పేర్కొన్నాడు. ఏడు మ్యాచ్ లు ఆడిన పంజాబ్ కేవలం 2 మ్యాచుల్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. -
కింగ్స్ పంజాబ్ కెప్టెన్సీ మార్పు
మొహాలి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9వ సీజన్లో పేలవ ప్రదర్శనతో ప్రస్తుతం అట్టడుగు స్థానంలో ఉన్న కింగ్స్ పంజాబ్ కెప్టెన్సీ పదవి నుంచి డేవిడ్ మిల్లర్‌ను తొలగించారు. అతని స్థానంలో మురళీ విజయ్ కు జట్టు పగ్గాలు అప్పజెప్పుతూ కింగ్స్ పంజాబ్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కింగ్స్ పంజాబ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. 'డేవిడ్ మిల్లర్ కెప్టెన్ గా విఫలమైన కారణంగా ఆ బాధ్యతను మురళీ విజయ్ కు అప్పగిస్తున్నాం. కెప్టెన్సీ భారం వల్ల మిల్లర్ ఆటగాడిగా కూడా సఫలం కావడం లేదు. ఇక నుంచి మిల్లర్ జట్టులో సభ్యుడిగా మాత్రమే కొనసాగుతాడు' అని కింగ్స్ పంజాబ్ ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కేవలం ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో వెనుకబడింది. గతేడాది కూడా పంజాబ్ చివరి స్థానంతోనే ఐపీఎల్ సీజన్ ను ముగించడం తెలిసిందే. -
‘చెన్నై వరద బాధితులకు అండగా ఉంటాం’
న్యూఢిల్లీ: భీకర వర్షాలకు అల్లాడుతున్న చెన్నై నగరవాసుల్లో భారత క్రికెటర్లు మురళీ విజయ్, ఆర్.అశ్విన్ కుటుంబసభ్యులు కూడా బాధితులుగా ఉన్నారు. ఈ ఉపద్రవంలో మరణించిన వారికి నివాళి అర్పిస్తున్నట్టు క్రికెటర్లు తెలిపారు. ప్రస్తుత దక్షిణాఫ్రికా సిరీస్ ముగియగానే ప్రభావిత ప్రాం తాల్లో సహాయం చేస్తామని అన్నారు. ‘చెన్నైని వర ద ముంచెత్తినా నగర వాసులు కొందరు ధైర్యంగా ఇతరులకు సహాయపడుతున్నందుకు గర్విస్తున్నాను. ఇందులో నా స్నేహితులు నటుడు సిద్ధార్థ్, ఆర్జే బాలాజి కూడా ఉన్నారు. ఈ కష్ట సమయం లో చెన్నై నగరం ధైర్యంగా ఉంది. సిరీస్ ముగిశాక బాధిత కుటుంబాలకు నా చేతనైనంత సహాయాన్ని కచ్చితంగా అందిస్తాను’ అని స్పిన్నర్ అశ్విన్ తెలి పాడు. అలాగే ప్రస్తుత తరుణంలో తన కుటుంబం తో పాటు లేనందుకు బాధపడుతున్నానని ఓపెనర్ మురళీ విజయ్ తెలిపారు. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని విశ్వాసం వ్యక్తం చేశాడు. -
'ఇప్పుడు వారి వద్ద లేకపోవడం కలతగా ఉంది'
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నైతో సహా పలు జిల్లాలో వరద ముంపునకు గురయ్యాయి. ఇలా వరద బారిన పడిన వారిలో టీమిండియా ఆటగాళ్ల కుటుంబాలు కూడా ఉన్నాయి. చెన్నైకు చెందిన మురళీ విజయ్, రవిచంద్రన్ అశ్విన్ కుటుంబాలు వరదలో చిక్కుకున్నాయి. చెన్నై వరద బాధితులకు సాయం చేసేందుకు ఈ ఇద్దరు ఆటగాళ్లతో పాటు అజింక్యా రహానే కూడా ముందుకొచ్చాడు. వరద బాధితులకు తన వంతు సాయం చేస్తానని రహానే ప్రకటించాడు. దీనిపై విజయ్ స్పందిస్తూ ఇప్పుడు తాను కుటుంబ సభ్యులు వద్ద లేకపోవడం తీవ్రంగా కలిచి వేస్తోందన్నాడు. 'తమిళనాడులోని పలు ప్రాంతాలు తీవ్ర వరద ముంపుకు గురవ్వడం ఆందోళనగా ఉంది. ఇది నిజంగా బాధాకరం. అక్కడి పరిస్థితులు త్వరలోనే సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నా. ప్రజలంతా మనోధైర్యంతో ఉండాలి. ఈ సమయంలో నా కుటుంబ సభ్యులతో లేకపోవడం బాధగా ఉంది. నా కుటుంబ సభ్యుల ఇచ్చే ధైర్యమే నాకు అదనపు శక్తి. వరద బాధితులకు అండగా ఉంటా' అని మురళీ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ ముగిసిన అనంతరం తాను సహాయక చర్యల్లో పాల్గొంటానని మరో ఆటగాడు రవి చంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. తన స్నేహితులైన నటుడు సిద్దార్ధ, ఆర్ జే బాలాజీలు వరద బాధితులు అండగా నిలవడం అభినందించదగ్గ విషయమని అశ్విన్ తెలిపాడు. -
'బౌలర్లు ఒత్తిడి తగ్గిస్తున్నారు'
నాగ్ పూర్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో తమ బౌలర్లు ఒత్తిడి తగ్గిస్తూ బ్యాట్స్ మెన్ లకు తగినంత సహకారం అందిస్తున్న కారణంగానే టీమిండియాకు ఆధిక్యం సాధ్యమైందని ఓపెనర్ మురళీ విజయ్ స్పష్టం చేశాడు. టీమిండియా బౌలర్లు అంచనాలకు తగ్గట్టు రాణించడంతో తమలో నమ్మకాన్ని రెట్టింపు చేస్తుందన్నాడు. 'బౌలర్లు వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచితే బ్యాట్స్ మెన్ ఆడటానికి సులభతరం అవుతుంది. ఏ జట్టులో అయినా బౌలింగ్ లో రాణిస్తే విజయం సాధ్యమవుతుంది. అది మా బౌలర్లు చేస్తున్నారు. అందుకే టెస్టు సిరీస్ లో పైచేయి సాధించాం' అని విజయ్ పేర్కొన్నాడు. ఫీల్డర్ల కోణంలో చూస్తే తమ జట్ల మధ్య టెస్టు సిరీస్ పిల్లి-ఎలుక ఆటగా ఉందని అభిప్రాయపడ్డాడు. ఇరు జట్లు నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నా బ్యాట్స్ మెన్ పై అధికారం పడుతుందన్నాడు. తొలి టెస్టులో(75,47) మెరుగైన ప్రదర్శనతో విజయ్ ఆకట్టుకుని టీమిండియా గెలుపులో భాగం పంచుకున్నాడు. రెండో టెస్టు వర్షం కారణంగా నాలుగు రోజులు ఆట జరగకపోవడంతో డ్రా ముగిసింది. నవంబర్ 25 నుంచి జరిగే మూడో టెస్టులో భాగంగా భారత్-సఫారీ క్రికెటర్లు నాగ్ పూర్ లో ప్రాక్టీస్ చేసున్నారు. -
11వ ర్యాంక్‌లో మురళీ విజయ్
దుబాయ్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో నిలకడగా రాణించిన భారత ఓపెనర్ మురళీ విజయ్... ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఎనిమిది స్థానాలు పురోగతి సాధించాడు. మంగళవారం విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో మురళీ విజయ్ 11వ స్థానంలో నిలిచాడు. భారత బ్యాట్స్‌మెన్‌లో మురళీ విజయ్‌దే బెస్ట్ ర్యాంక్ కావడం విశేషం. దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో స్పిన్నర్ అశ్విన్ మూడు స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంక్‌ను సొంతం చేసుకోగా... జడేజా 21వ స్థానంలో నిలిచాడు. -
విజయ్ 11, రహానే 8
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ లో భారత ఆటగాళ్లు మురళీ విజయ్, అజింక్య రహానే అర్ధసెంచరీలు సాధించారు. విజయ్ 104 బంతుల్లో 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. టెస్టుల్లో అతడికిది 11 అర్ధసెంచరీ. రహానే టెస్టుల్లో 8వ హాఫ్ సెంచరీ సాధించాడు. 118 బంతుల్లో 5 ఫోర్లతో అర్ధసెంచరీ బాదాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 228 బంతుల్లో 100 పరుగులు జోడించారు. భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 132/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. విజయ్(74), రహానే(55) క్రీజ్ లో ఉన్నారు. ఇప్పటివరకు లంకపై టీమిండియా 219 పరుగుల ఆధిక్యం సాధించింది. -
నిరాశపరిచిన విజయ్, రహానే
కొలంబో: శ్రీలంకతో ప్రారంభమైన రెండో టెస్టులో భారత్ ఆరంభంలోనే ఇబ్బందుల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 12 పరుగులకే 2 వికెట్లు నష్టపోయింది. కెప్టెన్ కోహ్లి, ఓపెనర్ రాహుల్ జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ పడకుండా నిలబడ్డారు. మూడో వికెట్ కు వీరిద్దరూ 85 పరుగులు జోడించడంతో భారత్ కోలుకుంది. లంచ్ విరామ సమయానికి టీమిండియా 2 వికెట్లు నష్టపోయి 97 పరుగులు చేసింది. కోహ్లి 48, రాహుల్ 39 పరుగులతో ఆడుతున్నారు. ఓపెనర్ మురళీ విజయ్ డకౌటయ్యాడు. అజింక్య రహానే(4) మరోసారి నిరాశపరిచాడు. వీరిద్దరినీ ప్రసాద్ అవుట్ చేశాడు. -
తొలి టెస్టుకు విజయ్ దూరం
శ్రీలంకతో బుధవారం నుంచి జరిగే తొలి టెస్టుకు భారత ఓపెనర్ మురళీ విజయ్ దూరమయ్యాడు. తొడ కండరాల గాయం కారణంగా అతను ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడలేదు. జింబాబ్వే పర్యటనలోనే అతనికి గాయమైనా తొలి టెస్టు సమయానికి తగ్గుతుందని భావించి ఎంపిక చేశారు. విజయ్ అందుబాటులో లేనందున శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. -
భారత్-బంగ్లా టెస్ట్ నాల్గో రోజు
-
లంచ్ సమయానికి బంగ్లాదేశ్ స్కోరు 111/3
ఢాకా: టీమిండియాతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ లో్ భాగంగా నాల్గో రోజు ఆటలో బంగ్లాదేశ్ భోజన సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. బంగ్లా ఆటగాళ్లలో ఇమ్రుల్ కేయ్స్ (59), షకిబుల్ హసన్(0) లు క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు తమీమ్ ఇక్బాల్(19), మామ్మినుల్ హక్యూ(30),రహీమ్(2) పెవిలియన్ కు చేరారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీయగా, హర్భజన్ సింగ్ కు ఒక వికెట్ లభించింది. ఇదిలా ఉండగా టీమిండియా 462/6 ఓవర్ నైట్ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ 351 పరుగులు వెనుకబడి ఉంది. కాగా, ఈరోజు ఆట ప్రారంభించిన కాసేపటకే వరుణుడు మరోసారి ఆటంకం కల్గించాడు. -
రహానే రాగం...మురళీ గానం...
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462/6 ♦ మూడో రోజు కూడా అడ్డుకున్న వరుణుడు ♦ బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు ♦ షకీబ్‌కు నాలుగు వికెట్లు స్లో వికెట్... విపరీతంగా టర్న్ అవుతున్న బంతి... ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని వాతావరణం... వెరసి బంగ్లాదేశ్‌తో టెస్టులో బ్యాట్స్‌మెన్‌కు ప్రతికూల పరిస్థితులు. అయినా భారత్ జోరు తగ్గలేదు. వేగంగా పరుగులు చేసి ఫలితం కోసం ప్రయత్నించాలనే తపనతో ఆడారు. ఓపెనర్ మురళీ విజయ్ తన నిలకడను అలాగే కొనసాగిస్తే... రహానే అద్భుతమైన ఇన్నింగ్స్‌తో వేగంగా పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ భారీస్కోరు సాధించింది. ఢాకా : బంగ్లాదేశ్ బేబీలపై భారత బ్యాట్స్‌మెన్ పరాక్రమం కొనసాగింది. తొలి రోజు ధావన్ చూపించిన దూకుడును విజయ్, రహానే కూడా అందిపుచ్చుకోవడంతో ఫతుల్లాలో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ భారీ స్కోరు సాధించింది. మూడో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 103.3 ఓవర్లలో ఆరు వికెట్లకు 462 పరుగులు చేసింది. ఓపెనర్ మురళీ విజయ్ (272 బంతుల్లో 150; 12 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీ చేయగా... శిఖర్ ధావన్ (195 బంతుల్లో 173; 23 ఫోర్లు) తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో 23 పరుగులు జోడించి అవుటయ్యాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 283 పరుగులు జోడించడం విశేషం. రోహిత్, కోహ్లి విఫలమైనా.... రహానే (103 బంతుల్లో 98; 14 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మురళీ విజయ్, రహానే నాలుగో వికె ట్‌కు 114 పరుగులు జోడించారు. సాహా విఫలం కాగా... హర్భజన్ 7, అశ్విన్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ అల్ హసన్ నాలుగు వికెట్లు సాధించగా... జుబైర్ హొస్సేన్కు రెండు వికెట్లు దక్కాయి. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: మురళీ విజయ్ ఎల్బీడబ్ల్యు (బి) షకీబ్ 150; శిఖర్ ధావన్ (సి అండ్ బి) షకీబ్ 173; రోహిత్ శర్మ (బి) షకీబ్ 6; విరాట్ కోహ్లి (బి) జుబైర్ 14; రహానే (బి) షకీబ్ 98; సాహా (బి) జుబైర్ 6; అశ్విన్ బ్యాటింగ్ 2; హర్భజన్ బ్యాటింగ్ 7; ఎక్స్‌ట్రాలు (బైస్ 4, లెగ్‌బై 1, నోబాల్ 1) 6; మొత్తం (103.3 ఓవర్లలో ఆరు వికెట్లకు) 462 వికెట్ల పతనం: 1-283; 2-291; 3-310; 4-424; 5-445; 6-453. బౌలింగ్: షాహిద్ 22-2-88-0; సౌమ్య సర్కార్ 3-0-11-0; షువగతా 14-0-52-0; షకీబ్ అల్ హసన్ 24.3-1-105-4; తైజుల్ ఇస్లామ్ 20-0-85-0; జుబైర్ 19-1-113-2; కైస్ 1-0-3-0. సెషన్ 1: మంచి భాగస్వామ్యం తొలి రోజు అద్భుతంగా ఆడిన భారత ఓపెనర్లు రెండో రోజు ఆట మొత్తం రద్దయినా మూడో రోజు ఏకాగ్రతతోనే ఆడారు. దాదాపు ఆరు ఓవర్ల పాటు సింగిల్స్, డబుల్స్‌కు పరిమితమయ్యారు. తైజుల్ బౌలింగ్‌లో బౌండరీతో మురళీ విజయ్ 201 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెరీర్లో విజయ్‌కిది ఆరో టెస్టు సెంచరీ. ఆటలో వేగం పెంచే ప్రయత్నంలో శిఖర్ ధావన్... షకీబ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రాగానే మంచి బౌండరీతో టచ్‌లో కనిపించిన రోహిత్... షకీబ్ వేసిన చక్కటి బంతిని అంచనా వేయడంలో పొరబడి క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ కోహ్లి కూడా రెండు ఫోర్లు కొట్టినా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేదు. జుబేర్ హొస్సేన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో భారత్ 27 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో విజయ్‌తో జతకలిసిన రహానే చక్కగా ఆడాడు. షకీబ్ బౌలింగ్‌లో మూడు బంతుల వ్యవధిలో రెండు బౌండరీలతో తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. విజయ్ సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తే... రహానే అడపాదడపా బౌండరీలతో పరుగుల వేగం తగ్గకుండా చూశాడు. బంగ్లాదేశ్ కొత్త బంతి తీసుకున్నాక... షాహిద్ బౌలింగ్‌లో బౌండరీతో 64 బంతుల్లో రహానే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో వర్షం మొదలవడంతో లంచ్ విరామం ప్రకటించారు. మూడు వికెట్లు కోల్పోయినా... రహానే, విజయ్‌ల మంచి భాగస్వామ్యంతో భారత్ ఈ సెషన్‌ను సంతృప్తికరంగా ముగించింది. ఓవర్లు: 37; పరుగులు: 159; వికెట్లు: 3 సెషన్ 2: పెరిగిన వేగం లంచ్ తర్వాత రహానే మరింత వేగంగా ఆడాడు. మరో ఎండ్‌లో విజయ్ 271 బంతుల్లో 150 మార్కును చేరుకున్నాడు. అయితే ఆ వెంటనే షకీబ్ బౌలింగ్‌లో ఎల్బీగా అవుటయ్యాడు. సాహా వెంటనే అవుటైనా రహానే మాత్రం బౌండరీలతో దూకుడు పెంచాడు. షకీబ్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన రహానే... ఆ తర్వాతి బంతిని కూడా షాట్ ఆడబోయి మిస్ అయి బౌల్డ్ అయ్యాడు. కేవలం రెండు పరుగుల తేడాతో రహానే సెంచరీని కోల్పోయాడు. ఓవర్లు: 10.3; పరుగులు: 64; వికెట్లు: 3 సెషన్ 3: వర్షంతో రద్దు ఎడతెరపి లేని వర్షం కారణంగా సెషన్ రద్దయింది. సాయంత్రం గం.4.30 వరకు ఎదురుచూసిన తర్వాత రోజు ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. -
శిఖర్ ధావన్ సెంచరీ
ఫతుల్లా: బంగ్లాదేశ్ తో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ సాధించాడు. 101 బంతుల్లో 16 ఫోర్లతో శతకం పూర్తి చేశాడు. టెస్టుల్లో ధావన్ కు ఇది మూడో సెంచరీ కాగా, బంగ్లాదేశ్ పై మొదటిది. మరో ఓపెనర్ మురళీ విజయ్ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 98 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ బాదాడు. టెస్టుల్లో అతకిది 11 అర్ధసెంచరీ, బంగ్లాదేశ్ పై మొదటిది. ధావన్, విజయ్ శుభారంభం అందించడంతో టీమిండియా 36 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 167 పరుగులు చేసింది. ధావన్ 103 , విజయ్ 64 పరుగులతో ఆడుతున్నారు. -
రూ.3 కోట్లు పలికిన మురళీ విజయ్
-
రూ.3 కోట్లు పలికిన మురళీ విజయ్
బెంగళూరు : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎనిమిదో సీజన్ వేలం సోమవారమిక్కడ ప్రారంభమైంది. ఐపీఎల్ అధ్యక్షుడు రంజీబ్ బిస్వాల్ ఆధ్వర్యంలో ఆటగాళ్ల వేలం ప్రక్రియ జరుగుతోంది. ఓపెనర్ బ్యాట్స్‌మెన్ మురళీ విజయ్ను రూ.3 కోట్లకు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు సొంతం చేసుకుంది. వేలానికి మొత్తం 344మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. కాగా ఏంజిలో మాథ్యూస్ (శ్రీలంక)రూ.7.5 కోట్లు పలకగా, సూపర్ ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లా రూ.2 కోట్లు పలికాడు. అలాగే ఆస్ట్రేలియా స్టార్ ఆరోన్ ఫించ్ ఈ వేలంలో ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నారు. గతేడాది వేలంలో యువీని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు అనూహ్యంగా రూ.14 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అంచనాలకు తగ్గట్టు రాణించకపోవడంతో యువీని ఆ జట్టు వదులుకుంది. -
ఆసీస్‌పై అదరహో!
సాక్షి క్రీడావిభాగం గత మ్యాచ్‌లో 99కి అవుటైన ఆటగాడు ఈసారి సెంచరీ సాధిస్తే ఏం చేస్తాడు. ఎగిరి గంతేస్తాడు... అదో రకంగా సంబరం చేసుకుంటాడు. కానీ మురళీ విజయ్ అదేమీ పట్టించుకోలేదు. అసలు అతను తన స్కోరును గుర్తు పెట్టుకోలేదు. ఆ మైలురాయిని చేరినా మామూలుగా ఉండిపోయాడు. అవతలి ఎండ్‌లో రహానే చెప్పాక గానీ అతను బ్యాట్ ఎత్తలేదు. గత ఏడాది కాలంలో మూడు సార్లు మురళీ విజయ్ 90ల్లో (97, 95, 99) అవుట్ కావడం కూడా అందుకు కారణం కావచ్చు. అయితే సంబరాల సంగతి పక్కన పెడితే... మురళీ విజయ్ కెరీర్లో ఐదు సెంచరీలు సాధిస్తే అందులో నాలుగు ఆస్ట్రేలియాపైనే వచ్చాయి. అయితే భారత్‌లో చేసిన మొదటి మూడింటితో పోలిస్తే ఈ శతకం ఎంతో ప్రత్యేకం. ఆస్ట్రేలియాలాంటి పటిష్ట ప్రత్యర్థితో వారి గడ్డపై సెంచరీ సాధించడం అతని స్థాయిని ఖచ్చితంగా పెంచుతుంది. తీవ్రమైన ఎండ, వేడిలో విజయ్ ఎంతో పట్టుదలగా ఆడాడు. ఒకసారి కండరాలు పట్టేసినా, రెండో సెషన్లో ప్రత్యర్థి బౌలర్లు పూర్తిగా కట్టడి చేసినా సంయమనం కోల్పోలేదు. పూర్తిగా చెమటతో తడిసి ముద్దయి, పదే పదే గ్లవ్స్ మారుస్తూ తన ఏకాగ్రతను చెదరనివ్వలేదు. ఆఫ్ స్టంప్ బయట పడిన బంతులను ఎంతో జాగ్రత్తగా వదిలేస్తూనే... 22 ఫోర్లు కూడా బాదడం అతని బ్యాటింగ్ ఎంత తులనాత్మకంగా సాగిందో చెబుతుంది. తాను ఎదుర్కొన్న తొలి 26 బంతుల్లోనే విజయ్ 8 ఫోర్లు కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొదటి 150 బంతుల్లో 73 పరుగులే చేసిన విజయ్, తర్వాతి 63 బంతుల్లోనే 71 పరుగులు సాధించాడు. అడిలైడ్‌లో విజయ్ ఇన్నింగ్స్ జట్టును విజయం దిశగా నడిపిస్తే...ఇప్పుడు అతని బ్యాటింగ్ భారత ఆశలకు జీవం పోసింది. హ్యాట్సాఫ్ విజయ్! ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన ఏడో భారత ఓపెనర్ విజయ్ టెస్టుల్లో విజయ్ 2 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు విదేశాల్లో కెప్టెన్‌గా ధోనికిది 29వ టెస్టు. గంగూలీ (28)ని అతను అధిగమించాడు. 1960-61 తర్వాత ఒక విదేశీ జట్టు గాబాలో తొలి రోజు 300కు పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. -
మురళీ’ గానం
విజయ్ అద్భుత సెంచరీ భారత్ 311/4 రాణించిన రహానే తొలి రోజు టీమిండియాదే ఆస్ట్రేలియాతో రెండో టెస్టు సుమారు 38 డిగ్రీల ఉష్ణోగ్రత... దానికి తోడు తీవ్ర ఉక్కపోత... ఆస్ట్రేలియాలో ఇలాంటి పరిస్థితులు అరుదు. గాబా మైదానంలో మాత్రం ఇదే కనిపించింది. దీన్ని తట్టుకోలేక ఆసీస్ బౌలర్లు ఒక్కొక్కరు పక్కకు తప్పుకుంటూ మంచు ముక్కలను ఆశ్రయించారు. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రిస్బేన్‌ను చూస్తే చెన్నై గుర్తుకొచ్చింది. సరిగ్గా ఇలాంటి వాతావరణంలోనే విజయ్ బౌండరీల మోత మోగించాడు. తాను కూడా సొంత మైదానం చెన్నైలో ఆడుతున్నట్లే భావించినట్లున్నాడు. అందుకే అతను ఎక్కడా జోరు తగ్గించలేదు. ఐదున్నర గంటలకుపైగా క్రీజ్‌లో గడిపినా నీరసపడిపోలేదు. అద్భుతమైన ఆటతీరుతో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి సత్తా చాటాడు. రెండో టెస్టులో తొలిరోజు మూడు సెషన్లలో రెండున్నర సెషన్లలో మనదే ఆధిపత్యం. అనుభవలేమికి తోడు అలసిపోయినట్లు కనిపించిన ప్రత్యర్థి బౌలింగ్‌ను అనుకూలంగా మార్చుకుంటూ మన బ్యాట్స్‌మెన్ చెలరేగారు. రెండో రోజు కూడా ఇదే ఊపును కొనసాగిస్తే ధోని సేనకు మ్యాచ్‌పై పట్టు చిక్కినట్లే. బ్రిస్బేన్: తొలి టెస్టు పరాజయం నుంచి కోలుకున్న భారత జట్టు రెండో టెస్టులో స్ఫూర్తిదాయక ఆటతీరు కనబర్చింది. ఆస్ట్రేలియాతో బుధవారం ఇక్కడి గాబా మైదానంలో ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 311 పరుగులు సాధించింది. ఓపెనర్ మురళీ విజయ్ (213 బంతుల్లో 144; 22 ఫోర్లు) కెరీర్లో ఐదో సెంచరీతో జట్టును ముందుండి నడిపించాడు. అజింక్య రహానే (122 బంతుల్లో 75 బ్యాటింగ్; 7 ఫోర్లు) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 124 పరుగులు జోడించడం విశేషం. పేస్, బౌన్స్ అంటూ హడలగొట్టిన వికెట్‌పై భారత బ్యాట్స్‌మెన్ అలవోకగా ఆడుతూ పాడుతూ సాధికారిక షాట్లతో ఆకట్టుకున్నారు. రోజంతా తీవ్రంగా శ్రమించినా, ఆసీస్ బౌలర్లు నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగారు. ప్రస్తుతం రహానేతో పాటు రోహిత్ శర్మ (26 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) హాడిన్ (బి) లయోన్ 144; ధావన్ (సి) హాడిన్ (బి) మిషెల్ మార్ష్ 24; పుజారా (సి) హాడిన్ (బి) హాజల్‌వుడ్ 18; కోహ్లి (సి) హాడిన్ (బి) హాజల్‌వుడ్ 19; రహానే (బ్యాటింగ్) 75; రోహిత్ (బ్యాటింగ్) 26; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (83 ఓవర్లలో 4 వికెట్లకు) 311 వికెట్ల పతనం: 1-56; 2-100; 3-137; 4-261. బౌలింగ్: జాన్సన్ 15-2-64-0; హాజల్‌వుడ్ 15.2-5-44-2; స్టార్క్ 14-1-56-0; మిషెల్ మార్ష్ 6-1-14-1; లయోన్ 20-1-87-1; వాట్సన్ 10.4-5-29-0; వార్నర్ 1-0-9-0; స్మిత్ 1-0-4-0. ఆసీస్ గడ్డపై సెంచరీ సాధించడం ఎంతో ఆనందకరం. ఈ రోజు నిజంగా చాలా వేడిగా ఉంది. అందరూ అలసిపోవడం నేను చూశాను. దేశానికి ఆడేటప్పుడు ఇలాంటివి పట్టించుకోవద్దు. అందుకే క్రీజ్‌లో నిలబడాలని పట్టుదలగా ఉన్నాను. పరిస్థితులు ఎలా ఉన్నా మన వికెట్ విలువ ఎక్కువ. నేను నా ఫిట్‌నెస్‌పై కూడా చాలా శ్రద్ధ వహిస్తాను కాబట్టి ఇబ్బంది ఎదురు కాలేదు. -విజయ్ ఆమ్లెట్ వేసేశారు! ‘ఎండ ఎంత ఎక్కువగా ఉందంటే కోడి గుడ్డు తెచ్చి పెడితే ఆమ్లెట్ అయిపోతుంది..’ చాలా సందర్భాల్లో మనం మాటవరసకు ఇలా అనేస్తాం. అయితే టెస్టు సిరీస్ ప్రసారకర్త చానెల్-9 కేవలం మాటలతో ఆగిపోలేదు. సరదాగానో, నిజంగానో ఎండ తీవ్రత తెలియాలని ప్రయత్నమో గానీ ఆమ్లెట్ వ్యాఖ్యను అమల్లో పెట్టేసింది. బ్రిస్బేన్‌లో మధ్యాహ్నం విరామం సమయంలో చానెల్ రిపోర్టర్ సాంప్సన్ ‘ప్యాన్’తో సిద్ధమైపోయింది. బౌండరీ బయట దానిని పెట్టి పగలగొట్టిన గుడ్డును ఉంచింది. కొద్ది సేపటికే అది కాస్తా ఫ్రై అయి ఆమ్లెట్‌గా మారిపోయింది! చూశారా... ఎంత ఎండ ఉందో, మరి ఆటగాళ్ల పరిస్థితి ఏమిటో అంటూ వ్యాఖ్యానంతో ముగించింది. నిజమే... వేడితోనే కాదు, విజయ్ ఆటతోనూ ఆసీస్ ఆటగాళ్లంతా తొలి రోజు ‘ఫ్రై’ అయ్యారనేది వాస్తవం. సెషన్-1 విజయ్ నిలకడ తొలి టెస్టు నుంచి మూడు మార్పులతో భారత్ బరిలోకి దిగింది. ధోని, అశ్విన్‌లు తుది జట్టులోకి రాగా, షమీ స్థానంలో ఉమేశ్‌కు అవకాశం దక్కింది. ఓపెనర్లు విజయ్, ధావన్ (39 బంతుల్లో 24) నియంత్రణతో ఆడి చెప్పుకోదగ్గ ఆరంభాన్ని అందించారు. 2011 లార్డ్స్ టెస్టు తర్వాత విదేశీ గడ్డపై తొలిసారి మన ఓపెనింగ్ జోడి 50కుపైగా పరుగులు జత చేసింది. అయితే ధావన్‌ను అవుట్ చేసి మిషెల్ మార్ష్ భారత్‌ను దెబ్బ తీశాడు. అతనికి ఇదే తొలి వికెట్ కావడం విశేషం. మరోవైపు 32 పరుగుల వద్ద జాన్సన్ బౌలింగ్‌లో గల్లీలో షాన్ మార్ష్ క్యాచ్ వదిలేయడంతో విజయ్ బతికిపోయాడు. ఓవర్లు: 25, పరుగులు: 89, వికెట్లు: 1 సెషన్-2 ఆసీస్ ఆధిపత్యం లంచ్ తర్వాత మాత్రం భారత బ్యాటింగ్ కాస్త తడబాటుకు గురైంది. విజయ్ ఒక్కసారిగా నెమ్మదించగా, జట్టు మరో రెండు వికెట్లు కోల్పోయింది. అంపైర్ ఇయాన్ గౌల్డ్ తప్పుడు నిర్ణయంతో పుజారా (18) బలయ్యాడు. హాజల్‌వుడ్ బౌలింగ్‌లో హెల్మెట్‌ను తాకి కీపర్ వద్దకు చేరిన బంతికి అతను వెనుదిరిగాడు. హాజల్‌వుడ్‌కు ఇదే తొలి వికెట్. ఆ తర్వాత అతను అద్భుత బంతితో కోహ్లి (19)ని అవుట్ చేశాడు. అంతకుముందు మరోసారి విజయ్‌కు అదృష్టం కలిసొచ్చింది. 68 పరుగుల వద్ద స్టార్క్ తన బౌలింగ్‌లోనే కష్టసాధ్యమైన రిటర్న్ క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమయ్యాడు. ఓవర్లు: 27, పరుగులు: 62, వికెట్లు: 2 సెషన్-3 ఆకట్టుకున్న రహానే చివరి సెషన్లో మాత్రం టీమిండియా ఒక్కసారిగా దూకుడు కనబర్చింది. ప్రతీ ఆసీస్ బౌలర్‌ను సమర్థంగా ఎదుర్కొన్న విజయ్, రహానే అలవోకగా పరుగులు సాధించారు. రెగ్యులర్, పార్ట్ టైమ్ బౌలర్లు ఎవరూ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టలేకపోయారు. ఈ క్రమంలో 175 బంతుల్లో విజయ్ సెంచరీ పూర్తయింది. ఆ వెంటనే జాన్సన్ బౌలింగ్‌లో మార్ష్ మరోసారి క్యాచ్ వదిలేయడం అతనికి కలిసొచ్చింది. రహానే కూడా 85 బంతుల్లో అర్ధ సెంచరీ అందుకున్నాడు. సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడిన విజయ్, ఎట్టకేలకు లయోన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. ఆసీస్ కొత్త బంతి తీసుకున్నా రహానే, రోహిత్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ సెషన్లో భారత్ 5.16 రన్‌రేట్‌తో పరుగులు చేయడం విశేషం. ఓవర్లు: 31, పరుగులు: 160, వికెట్లు: 1 పాపం స్మిత్... కెప్టెన్‌గా తొలి టెస్టు ఆడుతున్న స్టీవెన్ స్మిత్‌కు మొదటి రోజు ఏదీ కలిసి రాలేదు. ఆటలో అతని ప్రణాళికలు, వ్యూహాలు విఫలం కాగా... ఇతరత్రా అన్నీ అతనికి వ్యతిరేకంగానే సాగాయి. తీవ్రమైన ఎండ ఆ జట్టు బౌలర్లపై ప్రభావం చూపించింది. దాంతో వారు ఐస్ క్యూబ్‌లు నెత్తిన పెట్టి ప్రతీ 40 నిమిషాలకు ఐస్‌క్రీమ్‌లతో చల్లబడే ప్రయత్నం చేశారు. మైదానంలో వేడి వారి బౌలింగ్‌లో వేడిని కూడా తగ్గించింది! ఎండకు నీరసించిపోయి స్టార్క్ చాలా సేపు మైదానం వదిలి వెళ్లాడు. మిషెల్ స్టార్క్ తొడ కండరాల గాయంతో నిష్ర్కమించాడు. ఈ టెస్టులో అతను బౌలింగ్ చేసే అవకాశం లేదు. తొలి టెస్టు ఆడుతున్నాడు... 23 ఏళ్ల కుర్రాడు కదా అనుకుంటే హాజల్‌వుడ్ కూడా కండరాలు పట్టేయడంతో మధ్యలోనే బౌలింగ్ వదిలేశాడు. జట్టుతో సంబంధం లేని బయటివాళ్లు ముగ్గురిని కూడా సబ్స్టిట్యూట్లుగా వాడుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థమవుతుంది. మార్ష్ ఒక్కడే రెండు క్యాచ్‌లు వదిలేయగా... షార్ట్ లెగ్‌లో రోహిత్ కొట్టిన షాట్ రోజర్స్ హెల్మెట్‌కు తాకడంతో డాక్టర్ పరుగెత్తుకు రావాల్సి వచ్చింది. ఇక ఈ అన్ని కారణాలతో అదనంగా అర గంట ఇచ్చినా ఆ జట్టు ఏడు ఓవర్లు తక్కువగా వేయడం ఓవర్‌రేట్ పరిస్థితిని సూచిస్తోంది. ఇలాంటి రోజు మళ్లీ తన కెప్టెన్సీలో ఎన్నడూ రావద్దని స్మిత్ కోరుకున్నాడేమో! -
భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్ట్ తొలిరోజు
-
తొలిరోజు ఆట ముగిసేసరికి భారత్ స్కోర్ : 311/4
బ్రిస్బెన్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో తొలిరోజు ఆట ముగిసే సరికి భారత్ 83 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ దూకుడుగా ఆడింది. రెహానే 75, రోహిత్ శర్మ 26 పరుగులతో నాటౌట్‌గా క్రీజ్ లో ఉన్నారు. ఓపెనర్ విజయ్ మురళీ 144, శిఖర్ థావన్ 24, పుజరా 18, కోహ్లీ 19 పరుగులు చేశారు. మరోవైపు బ్రిస్బేన్‌లో భారత ఆటగాళ్లను కట్టడి చేసేందుకు ఆసీస్ కెప్టెన్ స్మిత్ ఏకంగా ఎనిమిది మంతితో బౌలింగ్ చేయించటం విశేషం. -
మురళీ విజయ్ వికెట్ కోల్పోయిన భారత్
బ్రిస్బేన్ : బ్రిస్బేన్ టెస్ట్‌లో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మురళీ విజయ్ 144 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. లయోన్ బౌలింగ్‌లో విజయ్...హాడిన్‌కు క్యాచ్ ఇచ్చాడు. మరోవైపు రహానే 105 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. భారత్ 77 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. రెహానే 55, రోహిత్ శర్మ 15 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.