
తొలి టెస్టుకు విజయ్ దూరం
శ్రీలంకతో బుధవారం నుంచి జరిగే తొలి టెస్టుకు భారత ఓపెనర్ మురళీ విజయ్ దూరమయ్యాడు. తొడ కండరాల గాయం కారణంగా అతను ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడలేదు. జింబాబ్వే పర్యటనలోనే అతనికి గాయమైనా తొలి టెస్టు సమయానికి తగ్గుతుందని భావించి ఎంపిక చేశారు. విజయ్ అందుబాటులో లేనందున శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు.