సెంచరీ కోల్పోయిన మురళీ విజయ్
లండన్: ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ తృటిలో సెంచరీ కోల్పోయాడు. ఒంటరిగా పోరాడిన విజయ్ 5 పరుగుల తేడాతో చేజార్చుకున్నాడు. 247 బంతుల్లో 11 ఫోర్లతో 95 పరుగులు చేసి ఆండర్సన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ విజయ్(146) సాధించాడు. రెండో ఇన్నింగ్స్ లోనూ అర్థసెంచరీ(52)తో రాణించాడు.
ఆట నాలుగో రోజు భోజన విరామ సమయానికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. జడేజా(37), భువనేశ్వర్ కుమార్(13) క్రీజ్ లో ఉన్నారు.