Lords ground
-
‘ప్రపంచకప్ గెలవకపోవడమే లోటు’
లండన్: రెండు దశాబ్దాలకు పైగా భారత మహిళా క్రికెట్ మూలస్థంభాల్లో ఒకరిగా నిలిచిన దిగ్గజ పేస్ బౌలర్ జులన్ గోస్వామి ఆటకు ముగింపు పలుకుతోంది. నేడు భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే చివరి వన్డేతో రిటైర్ కానున్న జులన్ ఆఖరిసారిగా లార్డ్స్ మైదానంలో బరిలోకి దిగనుంది. భారత్ ఇప్పటికే సిరీస్‌ను గెలుచుకున్న నేపథ్యంలో అందరి దృష్టీ జులన్పైనే ఉంది. ఆమెకు విజయంతో ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని హర్మన్ బృందం భావిస్తోంది. ఈ నేపథ్యంలో తన కెరీర్ విశేషాల గురించి జులన్ శుక్రవారం మీడియాతో మాట్లాడింది. వన్డే లేదా టి20 ప్రపంచకప్‌లలో తాము ఒకటి గెలిచి ఉంటే బాగుండేదని ఆమె వ్యాఖ్యానించింది. ‘2005, 2017 వన్డే వరల్డ్‌కప్‌లలో మేం ఫైనల్ చేరాం. వీటిలో ఒకటి గెలిచి ఉండాల్సింది. ప్రతీ క్రికెటర్‌కి అదే లక్ష్యం ఉంటుంది. నాలుగేళ్ల పాటు ఎంతో కష్టపడి అక్కడి దాకా వచ్చాక కప్ గెలిస్తే కల నిజమయ్యేది. టి20 ప్రపంచకప్ సహా మేం మూడు ఫైనల్స్ ఆడినా ఒక్కటి గెలవలేకపోయాం. అది చాలా బాధిస్తుంది. నా కెరీర్లో అదే లోటు’ అని జులన్ చెప్పింది. గత రెండేళ్లుగా చాలా సార్లు రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తూ వచ్చానని, చివరకు ఇప్పుడు తప్పుకుంటున్నానని జులన్ భావోద్వేగంతో చెప్పింది. ‘రెండేళ్లుగా ప్రతీ సిరీస్ నాకు చివరి సిరీస్‌లాగానే అనిపించేది. కోవిడ్ వల్ల మ్యాచ్‌లు వాయిదాపడుతూ రావడంతో పాటు వరుసగా గాయాలపాలయ్యాను. శ్రీలంక సిరీస్‌తోనే ముగిద్దామనుకున్నా. అయితే ఫిట్‌గా లేక ఆ సిరీస్ ఆడలేదు. దాంతో మళ్లీ ఎన్సీఏకు వెళ్లాను. రాబోయే టి20 వరల్డ్‌కప్‌కు ముందు ఇదే చివరి వన్డే సిరీస్ కాబట్టి ఆటను ముగిస్తున్నా’ అని ఈ బెంగాల్ పేసర్ పేర్కొంది. కోల్‌కతాలో 1997 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో బాల్‌బాయ్‌గా పని చేసిన తర్వాత దేశానికి ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నానని, ఇన్నేళ్లు కొనసాగగలనని అనుకోలేదన్న జులన్... కెరీర్లో తొలి మ్యాచే అన్నింటికంటే ప్రత్యేకమైందని గుర్తు చేసుకుంది. వచ్చే ఏడాది జరి గే తొలి మహిళల ఐపీఎల్లో పాల్గొనడం గురించి తాను ఇప్పుడే చెప్పలేనని జులన్ స్పష్టం చేసింది. -
లార్డ్స్‌లో కలిసి మ్యాచ్ చూసిన రవిశాస్త్రి, సుందర్ పిచాయ్, ముఖేష్ అంబానీ ..!
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రస్తుతం ఇంగ్లండ్ క్రికెట్ టోర్నీ ది హండ్రెడ్ లీగ్‌లో కామెంటేటర్ వ్యవహారిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం లార్డ్స్ వేదికగా లండన్ స్పిరిట్, మాంచెస్టర్ ఒరిజినల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో కలిసి రవిశాస్త్రి వీక్షించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను రవిశాస్త్రి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. "క్రికెట్‌ను ఎక్కువగా ఇష్టపడే ముఖేష్ అంబానీ, సుందర్ పిచాయ్‌తో క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్‌లో మ్యాచ్ చూడడం చాలా సంతోషంగా ఉంది" అంటూ ఈ పోస్ట్‌కు రవిశాస్త్రి క్యాప్షన్‌గా పెట్టాడు. కాగా వ్యక్తిగత కారణాలతో ముఖేష్ అంబానీ, సుందర్ పిచాయ్ ఇంగ్లండ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే లండన్ స్పిరిట్ ది హండ్రెడ్ 2022లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మాంచెస్టర్‌పై 52 పరగుల తేడాతో లండన్ స్పిరిట్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లండన్ నిర్ణీత 100బంతుల్లో 6వికెట్లు కోల్పోయి 160పరుగులు చేసింది. లండన్ బ్యాటర్లలో జాక్ క్రాలే(41), మోర్గాన్(37) కిరాన్ పొలార్ట్( 34) పరుగులతో రాణించారు. అనంతరం 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మాంచెస్టర్ ఒరిజినల్స్ 108 పరుగులకే కుప్పకూలింది. మాంచెస్టర్ బ్యాటర్లలో సాల్ట్ 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లండన్ బౌలర్లలో జోర్డాన్ థాంప్సన్ నాలుగు వికెట్లతో చేలరేగగా.. మాసన్ క్రేన్,లియామ్ డాసన్ తలా రెండు వికెట్లు సాధించారు. In the august company of two people who love their cricket @HomeOfCricket - Mr Mukesh Ambani and Mr @sundarpichai at @thehundred @SkyCricket pic.twitter.com/JYnkGlMd8W — Ravi Shastri (@RaviShastriOfc) August 9, 2022 చదవండి: CWG 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో ఓటమి.. ఇంగ్లండ్ హెడ్ కోచ్ సంచలన నిర్ణయం! -
IND vs ENG 2nd ODI: ‘టాప్’లీ లేపేశాడు...
లండన్: లార్డ్స్‌లో సీన్ రివర్స్ అయ్యింది. తొలి వన్డేలో మన పేస్‌కు తలవంచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌లాగే... ఇక్కడ ప్రత్యర్థి నిప్పులు చెరిగే బౌలింగ్‌కు భారత్ కుదేలైంది. దీంతో భారత్ రెండో వన్డేలో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. మొయిన్ అలీ (64 బంతుల్లో 47; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), విల్లీ (49 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. చహల్ (4/47) తిప్పేయగా, బుమ్రా, పాండ్యా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ 38.5 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.జడేజా (29), హార్దిక్ పాండ్యా (29) టాప్స్కోరర్లుగా నిలువగా, రీస్ టాప్లీ 6 వికెట్లు పడగొట్టాడు. కోహ్లి గాయం నుంచి కోలుకోవడంతో రెండో వన్డే బరిలోకి దిగాడు. దీంతో శ్రేయస్‌ను తుదిజట్టు నుంచి తప్పించారు. ఆఖరి వన్డే 17న మాంచెస్టర్‌లో జరుగుతుంది. ఆరంభానికి చహల్ తూట్లు ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన రాయ్, బెయిర్‌స్టో జాగ్రత్త పడ్డారు. దీంతో తొలి 4 ఓవర్లలో 17 పరుగులే చేశారు. ఐదో ఓవర్లో రాయ్ బౌండరీ, సిక్సర్ బాదడంతో 13 పరుగులు వచ్చాయి. తర్వాత కూడా ఇద్దరు ఆచితూచి ఆడటంతో పరుగుల వేగం మందగించింది. 9వ ఓవర్ వేసిన పాండ్యా తన తొలి ఓవర్లోనే జేసన్ రాయ్ (33 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్)ని అవుట్ చేశాడు. 10 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు 46/1. చహల్ (4/47) అనంతరం స్పిన్నర్ చహల్ బౌలింగ్‌కు దిగడంతో ఇంగ్లండ్ కష్టాలు పెరిగాయి. ధాటిగా ఆడగలిగే బెయిర్‌స్టో (38 బంతుల్లో 38; 6 ఫోర్లు)తో పాటు జో రూట్ (11)ను తన వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. బట్లర్(4) షమీ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ 87 పరుగులకే కీలకమైన 4 వికెట్లను కోల్పోయింది. చహల్ వేసిన 20వ ఓవర్లో రెండు బౌండరీలు బాదిన స్టోక్స్ ఆ స్పిన్నర్ మరుసటి ఓవర్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆదుకున్న అలీ, విల్లీ ఇంగ్లండ్ 102 స్కోరుకే ప్రధానమైన సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఊరించే బంతులు వేసిన హార్దిక్ పాండ్యా... లివింగ్‌స్టోన్ (33 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను బోల్తా కొట్టించాడు. దీంతో అలీతో జతకట్టిన డేవిడ్ విల్లే పరుగుల బాధ్యతను పంచుకున్నారు. ఒక పరుగు వద్ద విల్లీ ఇచ్చిన క్యాచ్‌ను ప్రసిధ్ వదిలేయడం జట్టుకు కలిసొచ్చింది. అయితే కట్టుదిట్టమైన భారత బౌలింగ్ వల్ల రన్‌రేట్ మందగించింది. ఇద్దరు ఏడో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 200పైచిలుకు చేరాక అలీ, కాసేపటికి విల్లీ అవుట్ కావడంతో డెత్ ఓవర్లలో తగినన్ని పరుగులు రాలేదు. టాప్ లేపిన టాప్లీ ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన ఉత్సాహం ఆవిరయ్యేందుకు ఎంతో సేపు పట్టలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ (0), శిఖర్ ధావన్ (9) టాప్లీ పేస్‌కు తలవంచారు. ఆ వెంటనే రిషభ్ పంత్ (0)ను కార్స్ ఖాతా తెరువనీయలేదు. అయినా విరాట్ కోహ్లి (16) ఉండటంతో కొంత నమ్మకం ఉన్నా, అతని ఆటకు విల్లీ చెక్ పెట్టాడు. సూర్యకుమార్ (29 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (44 బంతుల్లో 29; 2 ఫోర్లు) కొద్ది సేపు పోరాడటంతో స్కోరు వంద దాటింది! జట్టు స్కోరు 140 పరుగుల వద్ద జడేజా అవుట్ కావడంతో భారత్ ఆశలు కోల్పోయింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 23; బెయిర్‌స్టో (బి) చహల్ 38; రూట్ (ఎల్బీ) (బి) చహల్ 11; స్టోక్స్ (ఎల్బీ) (బి) చహల్ 21; బట్లర్ (బి) షమీ 4; లివింగ్‌స్టోన్ (సి) సబ్–శ్రేయస్ (బి) పాండ్యా 33; అలీ (సి) జడేజా (బి) చహల్ 47; విల్లీ (సి) సబ్–శ్రేయస్ (బి) బుమ్రా 41; ఓవర్టన్ నాటౌట్ 10; కార్స్ (ఎల్బీ) (బి) ప్రసిధ్ 2; టాప్లీ (బి) బుమ్రా 3; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (49 ఓవర్లలో ఆలౌట్) 246. వికెట్ల పతనం: 1–41, 2–72, 3–82, 4–87, 5–102, 6–148, 7–210 బౌలింగ్: షమీ 10–0–48–1, బుమ్రా 10–1–49–2, హార్దిక్ 6–0–28–2, ప్రసిధ్ 8–0–53–1, చహల్ 10–0–47–4, జడేజా 5–0–17–0. -
ENG vs NZ 2022: విజయానికి 61 పరుగుల దూరంలో ఇంగ్లండ్
లండన్: న్యూజిలాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలుపుపై కన్నేసింది. 277 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. జో రూట్ (131 బంతుల్లో 77 నాటౌట్; 7 ఫోర్లు), బెన్ ఫోక్స్ (9 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. గెలుపు కోసం ఇంగ్లండ్ మరో 61 పరుగులు చేయాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్‌ను రూట్, కెప్టెన్ బెన్ స్టోక్స్ (110 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 90 పరుగులు జోడించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 236/4తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు ఆలౌటైంది. డరైల్ మిచెల్ (203 బంతుల్లో 108; 12 ఫోర్లు) సెంచరీ పూర్తి చేసుకోగా, టామ్ బ్లన్‌డెల్ (198 బంతుల్లో 96; 12 ఫోర్లు) ఆ అవకాశం కోల్పోయాడు. శనివారం కివీస్ 49 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన 6 వికెట్లు చేజార్చుకుంది. పాట్స్, బ్రాడ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. -
Ind Vs Eng: రోహిత్ జోరు.. రాహుల్ హుషారు
రెండో టెస్టుపై కూడా చినుకులే! ఆట వానతో ఆలస్యమై, ఆరంభమైంది. తర్వాత రోహిత్ శర్మ జోరు మొదలైంది. చూడచక్కని స్ట్రోక్స్‌తో అతని బౌండరీలు భారత స్కోరు బోర్డును పరుగెత్తించాయి. లోకేశ్ రాహుల్‌తో కలిసి జట్టుకు శుభారంభం ఇచ్చాడు. అతను అవుటయ్యాక మరో ఓపెనర్ రాహుల్ పరుగుల బాధ్యత తీసుకున్నాడు. సెంచరీతో తొలిరోజు భారత ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశాడు. రెండో రోజు మిగతా బ్యాట్స్‌మెన్ కూడా భాగమైతే భారీ స్కోరు ఖాయమవుతుంది. లండన్: చినుకులు పడ్డాయి... నెమ్మదించిన పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్ వికెట్లను ఎంచక్కా పడగొట్టొచ్చు అనుకున్న ఇంగ్లండ్ ఎత్తుగడ పారలేదు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రూట్ నిర్ణయం బెడిసికొట్టింది. భారత ఓపెనర్లు జోరు ప్రత్యర్థి ఆశల్ని, అవకాశాల్ని దెబ్బతీశాయి. పట్టుదలగా క్రీజ్‌లో నిలిచిన లోకేశ్ రాహుల్ (248 బంతుల్లో 127 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్), ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో సెంచరీ సాధించగా...దూకుడైన ఆటతో రోహిత్ శర్మ (145 బంతుల్లో 83; 11 ఫోర్లు, 1 సిక్స్) భారీ స్కోరుకు పునాది వేశాడు వీళ్లిద్దరు ఇంగ్లండ్ బౌలర్లపై అవలీలగా పరుగులు చేయడంతో భారత్ మొదటి రోజు ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 3 వికెట్లకు 276 పరుగులు చేసింది. రాహుల్‌తో పాటు రహానే (1 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. అండర్సన్‌కు 2 వికెట్లు దక్కాయి. భారత తుది జట్టులోకి శార్దుల్ స్థానంలో ఇషాంత్‌ను తీసుకోగా... అశ్విన్ మళ్లీ పెవిలియన్‌కే పరిమితమయ్యాడు. కష్టంగా మొదలై... భారత ఓపెనర్లు ఆరంభంలో పరుగులు చేసేందుకు కష్టపడ్డారు. రోహిత్, రాహుల్ ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొనేందుకు కాస్త ఇబ్బంది పడ్డారు. అలా మొదటి పది ఓవర్లలో ఓపెనింగ్ జోడి 11 పరుగులే చేయగలిగింది. 13వ ఓవర్లో తొలిసారి బంతి బౌండరీ లైను దాటింది. 8 ఓవర్లు వేసిన అండర్సన్ కేవలం 11 పరుగులే ఇచ్చాడు. అయితే భారత్ పుంజుకునేందుకు స్యామ్ కరన్ బౌలింగ్ దోహదం చేసింది. అనుభవజ్ఞుడైన అండర్సన్ బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడిన రోహిత్... స్యామ్‌ను చితగ్గొడుతూ ఒకే ఓవర్లో నాలుగు ఫోర్లు కొట్టాడు. వర్షం అంతరాయం కల్పించడంతో 18.4 ఓవర్ల వద్ద ఆట ఆగింది. అప్పటికి భారత్ స్కోరు 46/0. వర్షం ఆగకపోవడంతో లంచ్ విరామం ప్రకటించారు. రోహిత్ ఫిఫ్టీ రెండో సెషన్లోనూ భారత్ హవానే కొనసాగింది. హిట్‌మ్యాన్ రోహిత్ ఆటలో వేగం పెంచాడు. ఆఫ్ స్టంప్‌పై పడిన బంతులను జాగ్రత్తగా ఆడిన ఈ ఓపెనర్... గతి తప్పిన బంతులకు తన స్ట్రోక్ ప్లే దెబ్బ రుచి చూపించాడు. రాహుల్ మాత్రం ఓపిగ్గా నిలబడ్డాడు. ఆచితూచి ఆడుతూ సహచరుడి వేగాన్ని ఆస్వాదించాడు. రోహిత్ 8 బౌండరీలతో అర్ధసెంచరీ (83 బంతుల్లో) అధిగమించాడు. అనంతరం మార్క్‌వుడ్ బౌలింగ్‌లో చెలరేగిన రోహిత్, హుక్‌షాట్‌తో సిక్సర్, పుల్, లాఫ్టెడ్ షాట్లతో బౌండరీలు రాబట్టాడు. జట్టు 100 పరుగుల్లో రోహిత్‌వే 75 పరుగులు కావడం విశేషం. మరోవైపు వంద బంతులాడినా ఒక్క ఫోర్ కొట్టని రాహుల్... ఎట్టకేలకు మొయిన్ అలీ ఓవర్లో సిక్సర్‌తో తొలిసారి బంతిని బౌండరీ దాటించాడు. అజేయంగా సాగిపోతున్న ఓపెనింగ్ జోడీని అండర్సన్ విడదీశాడు. సెంచరీ ఊపుమీదున్న రోహిత్‌ను బోల్తా కొట్టించడంతో 126 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. రాహుల్ సెంచరీ క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా (9) మళ్లీ విఫలమయ్యాడు. కెప్టెన్ కోహ్లి జత కలిశాక రాహుల్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 157/2 స్కోరు వద్ద టీ విరామానికి వెళ్లారు. ఆఖరి సెషన్లో అండర్సన్ బౌలింగ్‌లోనూ బౌండరీలు కొట్టడం ద్వారా రాహుల్ స్కోరు పెంచే బాధ్యత తన భుజాన వేసుకున్నాడు. కోహ్లినేమో జాగ్రత్తపడ్డాడు. పది బంతులాడాకే ఖాతా తెరిచిన కోహ్లి తొలి బౌండరీ కోసం 48 బంతులు ఆడాల్సి వచ్చింది. ఈ జోడీ క్రీజులో కుదురుకోవడంతో భారత్ మరో వికెట్ కోల్పోకుండా 200 మార్క్‌ను దాటింది. తొలి టెస్టులో పూర్తి చేయలేకపోయిన సెంచరీని రాహుల్ ‘క్రికెట్ మక్కా’లో చేశాడు. అలీ, మార్క్‌వుడ్, రాబిన్సన్ల బౌలింగ్ల్లో యథే చ్ఛగా ఫోర్లు కొట్టాడు. వుడ్ బౌలింగ్‌లో థర్డ్ మ్యాన్ దిశగా బాదిన బౌండరీతో 212 బంతుల్లో రాహుల్ శతకం పూర్తి చేసుకున్నాడు. 80 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ కొత్త బంతి తీసుకుంది. ఈ బంతి విరాట్ వికెట్ బలిగొంది. రాబిన్సన్ బౌలింగ్‌లో కోహ్లి (42; 3 ఫోర్లు) అవుటవడంతో 117 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (బి) అండర్సన్ 83; రాహుల్ (నాటౌట్) 127; పుజారా (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్ 9; కోహ్లి (సి) రూట్ (బి) రాబిన్సన్ 42; రహానే (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (90 ఓవర్లలో 3 వికెట్లకు) 276. వికెట్ల పతనం: 1–126, 2–150, 3–267. బౌలింగ్: అండర్సన్ 20–4–52–2, రాబిన్సన్ 23–7–47–1; స్యామ్ కరన్ 18–1–58–0 మార్క్‌వుడ్ 16–1–66–0, మొయిన్ అలీ 13–1–40–0. -
భారత బ్యాట్స్‌మెన్ ఘోర వైఫల్యం!
ఇంగ్లండ్ గడ్డపై ఏదో సమయంలో ఇలాంటి ప్రమాదం ముంచుకొస్తుందని సిరీస్‌కు ముందే అనుకున్న అంచనాలు నిజమయ్యాయి. భారత అభిమానుల ఆందోళనను నిజం చేస్తూ మన ఆటగాళ్లు ‘స్వింగ్’కు దాసోహమయ్యారు. వర్షం, చల్లటి వాతావరణం, గాలిలో కాస్త తేమ... ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగిపోయేందుకు, మన బ్యాట్స్‌మెన్ చేతులెత్తేసేందుకు ఈ దినుసులు సరిపోయాయి... గత మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ వైఫల్యాన్ని కొనసాగించిన టీమిండియా రెండో టెస్టులోనూ కుప్పకూలింది. వర్షం బారిన పడిన మ్యాచ్‌లో ‘మొదటి’ రోజే ప్రత్యర్థికి తలవంచింది. 0/1, 10/2... కాస్త బ్రేక్... 15/3... మళ్లీ విరామం... ఈ దశలో నడిపించాల్సిన మొనగాడు కోహ్లి వల్ల కాలేదు, నమ్ముకున్న రహానే కూడా గండం గట్టెక్కించలేకపోయాడు. అశ్విన్ పట్టుదలతో వంద దాటినా అది ఏమాత్రం సరిపోని స్కోరు. వర్షం ఆగకపోయినా బాగుండేదనిపించేలా సాగింది మన ఆట... మూడో రోజు కూడా పిచ్ అదే తరహాలో స్పందించి మన పేసర్లూ ప్రత్యర్థిని కుప్పకూల్చుతారా లేక చక్కటి ఎండలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ చెలరేగి మ్యాచ్‌ను తమ వశం చేసుకుంటారా చూడాలి. లండన్: లార్డ్స్ టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ బొక్కబోర్లా పడ్డారు. ఇంగ్లండ్ పేసర్ల దెబ్బకు తట్టుకోలేక తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 35.2 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ (38 బంతుల్లో 29; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... కోహ్లి (23) కూడా ప్రభావం చూపలేకపోయాడు. అండర్సన్ (5/20) ఐదు వికెట్లతో చెలరేగగా, వోక్స్ 2 కీలక వికెట్లు పడగొట్టాడు. 58 పరుగుల వ్యవధిలో భారత్ తమ చివరి 6 వికెట్లు కోల్పోయింది. టపటపా... టాస్ గెలిచిన ఇంగ్లండ్ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టు ధావన్, ఉమేశ్‌ల స్థానాల్లో పుజారా, కుల్దీప్లను తుది జట్టులోకి తీసుకుంది. ఆరంభంలోనే చెలరేగిపోయిన అండర్సన్ రెండు వికెట్లతో దెబ్బ తీశాడు. తొలి ఓవర్లోనే విజయ్ (0) క్లీన్‌బౌల్డ్ కాగా, రాహుల్ (8) మళ్లీ విఫలమయ్యాడు. విరామం తర్వాత పుజారా (1) రనౌట్‌కు ఎక్కువ సేపు పట్టలేదు. సమర్థంగా 25 బంతులు ఎదుర్కొని పాతుకుపోయిన పుజారా... కోహ్లి అత్యుత్సాహంతో వెనుదిరగాల్సి వచ్చింది. అండర్సన్ బంతిని ఆడి పుజారా ముందుకు రాగా, కోహ్లి పరుగు కోసం వేగంగా దూసుకొచ్చాడు. అయితే బంతి ఫీల్డర్ వద్దకు చేరడంతో అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోయాడు. దాంతో పుజారా ఔట్ కాక తప్పలేదు. ఈ దశలో వర్షం పడింది. తిరిగొచ్చిన అనంతరం కోహ్లి, రహానే (18) కలిసి ఆదుకునే ప్రయత్నం చేసినా అది ఎంతో సేపు సాగలేదు. వోక్స్ బౌలింగ్‌లో కెప్టెన్ కోహ్లి ఔటయ్యాక భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 35.2 ఓవర్లలో... వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా తుడిచి పెట్టుకుపోగా... రెండో రోజు కూడా చాలా వరకు అదే పరిస్థితి కనిపించింది. ఉదయం ఆట ప్రారంభమైన అర గంట తర్వాత ఒకసారి, ఆ తర్వాత మరో 20 నిమిషాల తర్వాత ఒకసారి మ్యాచ్ వర్షంతో ఆగిపోయింది. అనంతరం దాదాపు మూడున్నర గంటల పాటు ఆట నిలిచిపోయింది. రెండో రోజు మొత్తం 35.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా, టీమిండియాను కుప్పకూల్చేందుకు ఈ కాసిన్ని ఓవర్లు సరిపోయాయి. ఆ 9 బంతులు... అండర్సన్‌ను ఎదుర్కొన్నాడు... బ్రాడ్ నుంచి సమస్యే రాలేదు... కానీ అనూహ్యంగా వోక్స్ నుంచి కోహ్లికి ప్రమాదం ఎదురైంది. బంతిని అద్భుతంగా స్వింగ్ చేసిన వోక్స్... కోహ్లిని ఆడుకున్నాడు. వికెట్ తీయడానికి ముందు వేసిన ఎనిమిది బంతులు కూడా కోహ్లిని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. రెండో బంతి కోహ్లి బ్యాట్‌ను తాకి గల్లీ ఫీల్డర్‌కు ముందు పడింది. నాలుగో బంతి కూడా సరిగ్గా ఇదే తరహాలో వెళ్లింది. ఈసారి నాలుగో స్లిప్ ఫీల్డర్‌కు కాస్త ముందుగా పడటంతో విరాట్ ఊపిరి పీల్చుకున్నాడు. ఓవర్‌ను మెయిడిన్‌గా ముగించిన వోక్స్ తర్వాతి ఓవర్ మూడో బంతి క్యాచ్‌గా మారేదే! కానీ బట్లర్ వదిలేశాడు. కానీ తర్వాతి బంతికే భారత కెప్టెన్ వెనుదిరిగాడు. లోపలికి దూసుకొచ్చిన చక్కటి బంతిని ఆడలేక తడబడ్డాడు. ఈసారి బంతి రెండో స్లిప్లోకే వెళ్లగా బట్లర్ తప్పు చేయలేదు. ఆరంభంలో చెలరేగిన అండర్సన్‌ను అడ్డుకోవాల్సిన బాధ్యతను తీసుకున్న కోహ్లి దానిని చేసి చూపించాడు. ఇంగ్లండ్ ప్రధాన పేసర్ నుంచి 30 బంతులు ఎదుర్కొన్నా ఎక్కడా అవకాశం ఇవ్వని భారత కెప్టెన్‌ను వోక్స్ ఔట్ చేశాడు. -
భారత్‌లో క్రీడల అభివృద్ధి కోసం భారీ ప్రణాళిక
లండన్‌లో ఆత్మకథ ఆవిష్కరణ సందర్భంగా సచిన్ వెల్లడి లండన్: భారత్‌లో క్రీడల అభివృద్ధికి భారీ ప్రణాళికను సిద్ధం చేసినట్లు దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ తెలిపాడు. ఈ నివేదికను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అందజేసినట్లు తెలిపాడు. లార్డ్స్ మైదానంలో తన ఆటోబయోగ్రఫీ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ ఆవిష్కరణలో పాల్గొన్న మాస్టర్... ప్రణాళికకు సంబంధించిన అన్ని విషయాలు త్వరలోనే వెల్లడవుతాయని చెప్పాడు. రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసిన సచిన్... ఎప్పుడూ ఓ క్రీడాకారుడిగానే ఉంటానన్నాడు. అన్ని జట్లకు అందుబాటులో ఉండే సాంకేతికతను రూపొందించి అంపైర్ నిర్ణయ పునఃసమీక్ష పద్ధతి (డీఆర్ఎస్)ని అన్ని ఫార్మాట్లలో అమలు చేయాలని సచిన్ సూచించాడు. ఇందుకోసం తక్షణమే టెక్నాలజీని మెరుగుపర్చాలని చెప్పాడు. భారత పర్యటన నుంచి వెస్టిండీస్ అర్ధంతరంగా తప్పుకోవడం క్రికెట్‌కు మంచి పరిణామం కాదని హెచ్చరించాడు. విడుదలకు ముందే రికార్డు: మార్కెట్లో అమ్మకానికి రాకముందే సచిన్ పుస్తకం లక్షా 50 వేల కాపీల ప్రీ ఆర్డర్‌ను సాధించిందని ప్రచురణకర్తలు తెలిపారు. -
మనోళ్లు గెలుస్తారని ముందే చెప్పా: సచిన్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ధోని సేన విజయాన్ని ముందే ఊహించానని భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు. మొదటి రోజు ఆట చూసే భారత్ గెలుస్తుందని చెప్పినట్టు ఎన్డీ టీవీతో అన్నాడు. తన కుమారుడు అర్జున్ తో కలిసి మొదటి రోజు ఆటను సచిన్ వీక్షించాడు. 28 ఏళ్ల తర్వాత లార్డ్స్ లో టీమిండియా విజయం సాధించడం పట్ల సచిన్ హర్షం వ్యక్తం చేశాడు. కుర్రాళ్లు అద్భుతంగా ఆడారని మాస్టర్ కితాబిచ్చాడు. జాతీయ స్ఫూర్తిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారని మెచ్చుకున్నాడు. 'మ్యాచ్ మొదలయ్యే సమయానికి నేను లండన్ లోనే ఉన్నాను. నా కుమారుడితో కలిసి మొదటి రోజు ఆట చూశాను. మన టీమ్ కచ్చితంగా గెలుస్తుందని నా కుమారుడితో చెప్పాను. ఇప్పుడు అదే నిజమైంది' అని సచిన్ పేర్కొన్నాడు. -
కుర్రాళ్లు కొట్టారు...
సచిన్, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్, సెహ్వాగ్, కుంబ్లే...భారత టెస్టు క్రికెట్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన ఒక తరం ఆటగాళ్లు. కానీ వీరెవ్వరూ ‘క్రికెట్ మక్కా’గా పేరొందిన లార్డ్స్ మైదానంలో విజయం రుచి చూడలేదు. కానీ రహానే, భువనేశ్వర్, జడేజాలాంటి ఈతరం కుర్రాళ్లు ఈ 200 ఏళ్ల చారిత్రక మైదానంలో తమ కోసం కొత్త చరిత్ర ‘లిఖించుకున్నారు’. లార్డ్స్‌లో ఆడిన తొలిసారే లార్డ్‌లా సత్తా చాటి భారత క్రికెట్ అభిమానులకు చాలా కాలం తర్వాత ఆనందాన్ని పంచారు. యువ ఆటగాళ్లంతా తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన చోట... నేనున్నానంటూ వెన్నుతట్టిన సారథి ధోని అండగా నిలవగా క్రికెట్ పుట్టింట్లో టీమిండియాకు చిరస్మరణీయ విజయం దక్కింది. అందరూ కలిసి... లార్డ్స్ విజయంలో దాదాపు అందరు ఆటగాళ్లూ కీలక పాత్ర పోషించారు. తొలి రోజు పచ్చని వికెట్‌పై బంతి స్వింగ్ అవుతున్న చోట పుజారా పట్టుదల కనబర్చాడు. చేసింది 28 పరుగులే అయినా వందకు పైగా బంతులు ఎదుర్కొని ఇన్నింగ్స్ కుప్పకూలకుండా కాపాడాడు. మరో వైపు తొలి ఇన్నింగ్స్‌లో గట్టిగా నిలబడ్డ ఓపెనర్ విజయ్, రెండో ఇన్నింగ్స్‌లో స్ఫూర్తిదాయక బ్యాటింగ్ ప్రదర్శించాడు. 18 ఏళ్లనాడు ద్రవిడ్ తరహాలో ఇక్కడే త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నా ఎంతో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. లార్డ్స్‌లో సెంచరీతో దిగ్గజాల సరసన రహానే చోటు దక్కించుకుంటే...ఇందుగలడందు లేడంటూ భువనేశ్వర్ కుమార్ అన్నింటా తానై సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేసిన భువీ, రెండో ఇన్నింగ్స్‌లో తన బ్యాటింగ్ పదును చూపించి కీలక అర్ధ సెంచరీ సాధించాడు. ఈ వరుసలో రవీంద్ర జడేజా పాత్ర మరింత ప్రత్యేకం. తొలి టెస్టు వివాదం వెంటాడుతుండగా ఈ మ్యాచ్‌లో ఆటపై ఏకాగ్రత చెదరనివ్వలేదు. రెండో ఇన్నింగ్స్‌లో అతని దూకుడైన బ్యాటింగే భారత్ అవకాశాలు మెరుగు పర్చిందని చెప్పవచ్చు. అన్నింటికి మించి కొత్త శత్రువు అండర్సన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో అవుట్ చేసిన జడేజా... రెండో ఇన్నింగ్స్‌లోనూ అతడిని డెరైక్ట్ త్రోతో రనౌట్ చేసి మ్యాచ్‌ను గొప్ప జ్ఞాపకంగా మలచుకున్నాడు. - సాక్షి క్రీడావిభాగం ఎన్నాళ్లకెన్నాళ్లకు... 1124 రోజులు... భారత జట్టు విదేశీ గడ్డపై టెస్టు మ్యాచ్ నెగ్గి గడిచిన కాలం. సరిగ్గా చెప్పాలంటే 2011 జూన్‌లో కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌పై భారత్ 63 పరుగుల తేడాతో నెగ్గింది. అంతే...ఆ తర్వాత బయటికి అడుగు పెట్టిన చోటల్లా పరాభవమే వెక్కిరించింది. ఇంగ్లండ్‌లో 0-4, ఆస్ట్రేలియాలో 0-4, దక్షిణాఫ్రికాలో 0-1, న్యూజిలాండ్‌లో 0-1...ఈ వరుస 15 టెస్టుల పాటు గెలుపన్నదే లేకుండా సాగింది. ఈ క్రమంలో కెప్టెన్‌గా ధోని వైఫల్యంపై అనేక విమర్శలు వచ్చాయి. జొహన్నెస్‌బర్గ్‌లో, ఆ తర్వాత వెల్లింగ్టన్లో విజయానికి చేరువగా వచ్చినా...ఫలితం మాత్రం దక్కలేదు. సీనియర్లు పోయారు, జూనియర్లు వచ్చారు...కానీ పరిస్థితి మాత్రం మారలేదు. ఇలాంటి స్థితిలో ధోని, కుర్రాళ్లను నమ్ముకొని ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టాడు. ‘గత రెండు టూర్లలో విజయం వాకిట నిలిచాం. ఈ సారి అవకాశం వస్తే వదులుకోం’ అని చెప్పిన ధోని దానిని నిజం చేసి చూపించాడు. తొలి టెస్టులో భారత్ ఆధిక్యం కనబర్చినా...లార్డ్స్‌లో పూర్తిగా పట్టు నిలబెట్టుకుంది. ముఖ్యంగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లను మార్చడంలో, వ్యూహాల్లో ధోని ప్రత్యేకత కనిపించింది. అది చివరకు ఫలితాన్నిచ్చింది. ఇప్పటికే ఇంగ్లండ్‌ను చావు దెబ్బ కొట్టిన టీమిండియా ఇకపై అదే జోరును కొనసాగించి సిరీస్‌ను కూడా గెలుచుకోవాల్సి ఉంది. -
ఇరగదీసిన ఇషాంత్ శర్మ
లండన్: కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తనపై ఉంచిన నమ్మకాన్ని పేసర్ ఇషాంత్ శర్మ నిలుపుకున్నాడు. తానెంత విలువైన ఆటగాడినో తెలియజెప్పాడు. ప్రతిష్టాత్మక లార్డ్స్ టెస్టులో ఏకంగా ఏడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. సరైన సమయంలో విజృభించి తనలో సత్తా తగ్గలేదని రుజువు చేశాడు. కెరీర్ లో ఉత్తమ గణంకాలు నమోదు చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' కూడా అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ఒక వికెట్ తీయకపోవడంతో అతడు విమర్శలు ఎదుర్కొన్నాడు. 24 ఓవర్లు వేసినా ఒక వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. మరోపక్క యువ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వికెట్ల వేటలో దూసుకెళుతుండడంతో 'లంబూ' ప్రభావం తగ్గుతూ వచ్చింది. ఈ సిరీస్ లో బ్యాటింగ్ లోనూ దుమ్ము దులిపిన భువీ.. శభాష్ అనిపించుకున్నాడు. దీంతో సీనియర్ బౌలరైన ఇషాంత్ పై ఒత్తిడి పెరిగింది. ఇక వికెట్లు తీయలేక సతమవుతున్న ఇషాంత్ కీలక సమయంలో జూలు విధిల్చాడు. కుక్, బెల్, రూట్, ప్రయర్ లాంటి ప్రధాన బ్యాట్స్‌మెన్ కు కళ్లెం వేసి జట్టుకు విజయాన్ని అందించాడు. చాలా కాలం తర్వాత ఒంటి చేత్తో గెలుపు సాధించిపెట్టాడు. అంతేకాదు ఈ ప్రదర్శనతో లార్డ్స్ హానర్స్ బోర్డులోకి చేరాడు. ఒకే టెస్టులో ఇద్దరు భారత బౌలర్లు ఈ ఘనత సాధించడం విశేషం. తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీసినన భువనేశ్వర్ కుమార్ పేరు హానర్స్ బోర్డులో తన పేరు లిఖించుకున్నాడు. విదేశీ గడ్డపై భారత పేసర్లు పూర్తి ఆధిపత్యం కనబరచడం ఇటీవల కాలంలో ఇదే ప్రథమం. -
విజయం దిశగా టీంఇండియా
లండన్: ఇంగ్లండ్ తో జట్ల మధ్య ఇక్కడ లార్డ్స్ లో జరుగుతున్నరెండో టెస్ట్ లో భారత్ విజయం దిశగా పయనిస్తోంది. గెలుపు ఎవరిని వరిస్తుందనే దానిపై తొలుత ఉత్కంఠ నెలకొన్నాటీం ఇండియా బౌలర్లు విజృంభించి వరుస వికెట్లు నేలకూల్చారు. చివరి రోజు భోజన విరామ సమయానికి కుక్ సేన 5 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన ఇంగ్లిష్ ఆటగాళ్లు నాలుగు వికెట్లు కోల్పోయారు. ప్రస్తుతం భారత్ విజయానికి ఇంకా వికెట్ మాత్రమే తీయాల్సి ఉంది. రూట్ అర్థసెంచరీ (66) పరుగులతో ఆకట్టుకున్నా 9 వికెట్టుగా వెనుదిరిగాడు. ఇంగ్లండ్216/9 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. విజయం సాధించాలంటే 103 పరుగులు చేయాలి. -
214 పరుగులు.. 6 వికెట్లు
లండన్: భారత్, ఇంగ్లండ్ రెండో టెస్టు రసకందాయంలో పడింది. ఫలితం తేలనున్న ఈ మ్యాచ్‌లో భారత్ విజయానికి మరో 6 వికెట్లు తీయాల్సివుండగా.. ఇంగ్లండ్ ఓటమి నుంచి తప్పించుకోవడానికి మరో 214 పరుగులు చేయాలి. ఈ నేపథ్యంలో మ్యాచ్ చివరి రోజు ఆట ఇరు జట్లకు చాలా కీలకంకానుంది. రవీంద్ర జడేజా (68), భువనేశ్వర్ కుమార్ (52) హాఫ్ సెంచరీలతో రాణించి భారత్‌ను ఆదుకున్నారు. 169/4 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ధోనీసేన 342 పరుగులు చేసింది. ఓ దశలో 235/7 స్కోరుతో ఎదురీదుతున్న భారత్‌ను జడ్డూ, భువి పటిష్టస్థితికి చేర్చారు. దీంతో ఇంగ్లండ్‌కు 319 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ రాబ్సన్, కుక్, బాలెన్స్, ఇయాన్ బెల్ అవుటయ్యారు. రూట్, అలీ క్రీజులో ఉన్నారు. ఇషాంత్ రెండు, జడేజా, షమీ చెరో వికెట్ తీశారు. -
ఇంగ్లండ్ లక్ష్యం 319 పరుగులు
లండన్: ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ సెకండ్ ఇన్నింగ్స్ లో 342 పరుగులకు ఆలౌటయింది. కుక్ సేనకు 319 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. చివర్లో రవీంద్ర జడేజా(68), భువనేశ్వర్ కుమార్(52) అర్థ సెంచరీలు సాధించడంతో సవాల్ విసిరే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది ధోని సేన. మహ్మద్ షమీ డకౌటయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్, ప్లంకెట్ మూడేసి వికెట్లు పడగొట్టారు. అలీ రెండు వికెట్లు తీశాడు. ఆండర్సన్, బ్రాడ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిటిన ఇంగ్లండ్ 12 పరుగులకే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రాబ్సన్(7) జడేజా బౌలింగ్ లో అవుటయ్యాడు. -
సెంచరీ కోల్పోయిన మురళీ విజయ్
లండన్: ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ తృటిలో సెంచరీ కోల్పోయాడు. ఒంటరిగా పోరాడిన విజయ్ 5 పరుగుల తేడాతో చేజార్చుకున్నాడు. 247 బంతుల్లో 11 ఫోర్లతో 95 పరుగులు చేసి ఆండర్సన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ విజయ్(146) సాధించాడు. రెండో ఇన్నింగ్స్ లోనూ అర్థసెంచరీ(52)తో రాణించాడు. ఆట నాలుగో రోజు భోజన విరామ సమయానికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. జడేజా(37), భువనేశ్వర్ కుమార్(13) క్రీజ్ లో ఉన్నారు. -
మళ్లీ విఫలమైన 'కూల్ కెప్టెన్'
లండన్: వరుసగా రెండో ఇన్నింగ్స్ లోనూ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విఫలమయ్యాడు. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో 'కూల్ కెప్టెన్' కేవలం 19 పరుగులు మాత్రమే సాధించాడు. ఎంతో ఓపిగ్గా ఆడి 86 బంతుల్లో 2 ఫోర్లతో అతడీ పరుగులు చేయడం విశేషం. తొలి ఇన్నింగ్స్ ఒక్క మాత్రమే చేశాడు. ఆట నాలుగో రోజు రోజు డ్రింక్స్ విరామ సమయానికి భారత్ 203/6 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. దీంతో ఇంగ్లండ్ పై 179 పరుగుల ఆధిక్యం లభించింది. ఓపెనర్ విజయ్ 82 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. జడేజా ఒక్క పరుగుతో క్రీజ్ లో ఉన్నాడు. 169/4 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ధోనిసేన మరో రెండు వికెట్లు కోల్పోయింది. బిన్నీ డకౌటయ్యాడు. -
టీమిండియాకు సరికొత్త తేజం.. భువీ
-
పట్టు చేజారినట్టే (నా)!
-
భువి భళా.. ఇంగ్లండ్ 'బాలెన్స్'
లండన్: భారత్‌తో రెండో టెస్టులో గ్యారీ బాలెన్స్ (110) సెంచరీతో రాణించి ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. మ్యాచ్ రెండో రోజు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 76 పరుగులు వెనకబడి ఉంది. 290/9 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 5 పరుగులకు ఆలౌటైంది. ఆండర్సన్ నాలుగు, బ్రాడ్, స్టోక్స్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ మొదట్లో తడబడింది. భారత యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లీష్ మెన్‌కు వణుకు పుట్టించాడు. భువి వరుసగా కుక్, రాబ్సన్, ఇయానె బెల్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఇంగ్లండ్ 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రూట్ కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. అయితే ఈ దశలో బాలెన్స్ సంయమనంతో ఆడుతూ ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. బాలెన్స్‌కు కాసేపు అలీ అండగా నిలిచాడు. వీరిద్దరూ వికెట్లు కాపాడుకోవడానికి ప్రాధానమిస్తూ ఆచితూచి ఆడారు. బాలెన్స్ సెంచరీ చేయడంతో స్కోరు 200 దాటింది. అయితే చివర్లో వీరిద్దరినీ అవుట్ చేసి భారత్ మ్యాచ్ పై పట్టు చేజారకుండా కాపాడుకుంది. -
భారత్ 295 పరుగులకు ఆలౌట్
-
భారత్ 295 పరుగులకు ఆలౌట్
లండన్: ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 295 పరుగులకు ఆలౌటయింది. 290 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మరో 5 పరుగులు మాత్రమే జోడించింది. టెయిలెండర్ మహ్మద్ షమీ 19 పరుగులు చేసి అవుటవడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. షమీని స్ట్రోక్ అవుట్ చేశాడు. 12 పరుగులతో ఇషాంత్ శర్మ నాటౌట్ గా నిలిచాడు. భారత యువ ఆటగాడు అజింక్య రహానే లార్డ్స్‌లో తాను ఆడిన తొలి టెస్టులోనే శతకం సాధించి... మైదానంలోని ‘హానర్స్ బోర్డు’లో దిగ్గజాల సరసన పేరు రాయించుకోవడం తొలి రోజు ఆటలో విశేషం. రహానే 103 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ 4 వికెట్లు పడగొట్టాడు. బ్రాడ్, స్ట్రోక్ రెండేసి వికెట్లు తీశాడు. ప్లంకెట్, అలీ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
లార్డ్స్ డబుల్ సెంచరీ
క్రికెట్ మక్కా... లార్డ్స్ మైదానం గురించి చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. ప్రపంచంలో ప్రతి క్రికెటర్‌కీ కనీసం ఒక్కసారైనా అక్కడ ఆడాలనేది కల. ప్రతి క్రికెట్ అభిమానికీ అక్కడ మ్యాచ్ చూడటం ఓ ఆశ. ఎందుకంటే ఇది క్రికెట్‌కు పుట్టినిల్లు. చరిత్రలో అత్యంత పురాతనమైన మైదానం కూడా ఇదే. ఎన్నో రికార్డులకు, క్రికెట్లో మరెన్నో మార్పులకు వేదికైన లార్డ్స్ మైదానం ఇప్పుడు మరో ఘనతను సొంతం చేసుకోబోతోంది. 1814లో స్థాపించిన ఈ గ్రౌండ్‌కు ఇప్పుడు 200 ఏళ్లు పూర్తి కానున్నాయి. అక్కడ ఆడటం ఓ కల లార్డ్స్ మైదానంలో 1814 జూన్ 22న మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్, హెర్ట్‌ఫోర్డ్‌షైర్ మధ్య తొలి మ్యాచ్ జరిగినట్లుగా చెబుతుంటారు. అయితే తొలి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ జరిగింది మాత్రం 1884లోనే. జూలై 21న లార్డ్స్‌లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఇప్పటిదాకా లార్డ్స్ 127 టెస్టు మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది. ఇక్కడ 55 వన్డేలు, 8 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇక ప్రతీ క్రికెటర్ తన కెరీర్లో కనీసం ఒక్కసారైనా ఇక్కడ ఆడాలని..ఇదే మైదానంలో వ్యక్తిగతంగా సత్తా చాటి మధురానుభూతులను సొంతం చేసుకోవాలని కలలుకంటారు. కానీ ఈ మైదానం అందరికీ మధురానుభూతులను పంచలేదు. కొందరు మాత్రమే ఈ మైదానంలో సత్తా చాటడం ద్వారా తమ కలను నెరవేర్చుకున్నారు. ఇక్కడ టెస్టుల్లో సెంచరీ చేసే బ్యాట్స్‌మెన్ పేరును అలాగే ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, టెస్టు మ్యాచ్‌లో పది వికెట్లు తీసే బౌలర్ పేరును డ్రెస్సింగ్ రూమ్‌లో బోర్డుపై రాయడం ఆనవాయితీగా వస్తోంది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ జీవితంలో లార్డ్స్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. అయితే అజిత్ అగార్కర్ తన టెస్టు కెరీర్లో చేసిన ఏకైక సెంచరీ ఇక్కడే నమోదు చేయడం విశేషం. ఇక వన్డేల్లో ఇక్కడ ఏ ఒక్క భారత బ్యాట్స్‌మెన్ కూడా సెంచరీ చేయలేకపోయాడు. ఆ పేరు వెనక... ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) కార్యకలాపాలు లార్డ్స్ మైదానం నుంచే నడుస్తున్నప్పటికీ ఈసీబీ మాత్రం ఈ మైదానంలో కిరాయిదారు మాత్రమే. ప్రపంచంలో పురాతన క్రికెట్ గ్రౌండ్ అయిన లార్డ్స్‌కు యజమాని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్. ఈ మైదానం వ్యవస్థాపకులు థామస్ లార్డ్. అతను ఇంగ్లిష్ ప్రొఫెషనల్ క్రికెటర్. అతని పేరే ఈ మైదానానికి పెట్టారు. ఇంగ్లండ్ రాజధాని లండన్‌లోని సెయింట్ జాన్స్ వుడ్ ప్రాంతంలో ఉంది. ప్రముఖ క్రికెట్ మ్యూజియం లార్డ్స్‌లోనే ఉంది. ఐసీసీ ప్రధాన కార్యాలయం 2005లో దుబాయ్‌కి మార్చకముందు ఇక్కడే ఉండేది. ఇప్పటికీ అదే పెవిలియన్ 200 ఏళ్ల చరిత్ర ఉన్న లార్డ్స్‌లో ఇప్పటిదాకా ఎన్నో మార్పులు జరిగాయి. కాలానుగుణంగా ఈ మైదానం మారుతూ వచ్చింది. అయితే 1889-90లో ఇక్కడ నిర్మించిన పెవిలియన్ (విక్టోరియన్ ఎరా పెవిలియన్) ఇప్పటికీ అలాగే ఉంది. స్టేడియం రూపురేఖలు మారినా ఈ పెవిలియన్ మాత్రం అలాగే ఉంది. ప్రపంచకప్ విజేత అయినా... యాషెస్ సిరీస్ విన్నర్ అయినా... లేక మరే సిరీస్ గెలిచినా... లార్డ్స్ పెవిలియన్‌లో షాంపేన్ విరజిమ్మడాన్ని గర్వంగా భావిస్తారు. అంతేకాదు ఆ మధురానుభూతిని ఎప్పటికీ మరిచిపోరంటే అతిశయోక్తి కాదేమో. 1983లో ప్రుడెన్షియల్ ప్రపంచకప్‌ను కపిల్‌దేవ్ అందుకున్న మధుర జ్ఞాపకాలు ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటాయి.