మళ్లీ విఫలమైన 'కూల్ కెప్టెన్'
లండన్: వరుసగా రెండో ఇన్నింగ్స్ లోనూ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విఫలమయ్యాడు. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో 'కూల్ కెప్టెన్' కేవలం 19 పరుగులు మాత్రమే సాధించాడు. ఎంతో ఓపిగ్గా ఆడి 86 బంతుల్లో 2 ఫోర్లతో అతడీ పరుగులు చేయడం విశేషం. తొలి ఇన్నింగ్స్ ఒక్క మాత్రమే చేశాడు.
ఆట నాలుగో రోజు రోజు డ్రింక్స్ విరామ సమయానికి భారత్ 203/6 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. దీంతో ఇంగ్లండ్ పై 179 పరుగుల ఆధిక్యం లభించింది. ఓపెనర్ విజయ్ 82 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. జడేజా ఒక్క పరుగుతో క్రీజ్ లో ఉన్నాడు. 169/4 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ధోనిసేన మరో రెండు వికెట్లు కోల్పోయింది. బిన్నీ డకౌటయ్యాడు.