ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ సెకండ్ ఇన్నింగ్స్ లో 342 పరుగులకు ఆలౌటయింది.
లండన్: ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ సెకండ్ ఇన్నింగ్స్ లో 342 పరుగులకు ఆలౌటయింది. కుక్ సేనకు 319 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. చివర్లో రవీంద్ర జడేజా(68), భువనేశ్వర్ కుమార్(52) అర్థ సెంచరీలు సాధించడంతో సవాల్ విసిరే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది ధోని సేన. మహ్మద్ షమీ డకౌటయ్యాడు.
ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్, ప్లంకెట్ మూడేసి వికెట్లు పడగొట్టారు. అలీ రెండు వికెట్లు తీశాడు. ఆండర్సన్, బ్రాడ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిటిన ఇంగ్లండ్ 12 పరుగులకే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రాబ్సన్(7) జడేజా బౌలింగ్ లో అవుటయ్యాడు.