భారత్‌లో క్రీడల అభివృద్ధి కోసం భారీ ప్రణాళిక
లండన్‌లో ఆత్మకథ ఆవిష్కరణ సందర్భంగా సచిన్ వెల్లడి
లండన్: భారత్‌లో క్రీడల అభివృద్ధికి భారీ ప్రణాళికను సిద్ధం చేసినట్లు దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ తెలిపాడు. ఈ నివేదికను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అందజేసినట్లు తెలిపాడు. లార్డ్స్ మైదానంలో తన ఆటోబయోగ్రఫీ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ ఆవిష్కరణలో పాల్గొన్న మాస్టర్... ప్రణాళికకు సంబంధించిన అన్ని విషయాలు త్వరలోనే వెల్లడవుతాయని చెప్పాడు.
రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసిన సచిన్... ఎప్పుడూ ఓ క్రీడాకారుడిగానే ఉంటానన్నాడు. అన్ని జట్లకు అందుబాటులో ఉండే సాంకేతికతను రూపొందించి అంపైర్ నిర్ణయ పునఃసమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్)ని అన్ని ఫార్మాట్లలో అమలు చేయాలని సచిన్ సూచించాడు. ఇందుకోసం తక్షణమే టెక్నాలజీని మెరుగుపర్చాలని చెప్పాడు. భారత పర్యటన నుంచి వెస్టిండీస్ అర్ధంతరంగా తప్పుకోవడం క్రికెట్‌కు మంచి పరిణామం కాదని హెచ్చరించాడు.
విడుదలకు ముందే రికార్డు: మార్కెట్‌లో అమ్మకానికి రాకముందే సచిన్ పుస్తకం లక్షా 50 వేల కాపీల ప్రీ ఆర్డర్‌ను సాధించిందని ప్రచురణకర్తలు తెలిపారు.