సచిన్ కు ఆపరేషన్, అభిమానులకు షాక్ | Sachin Tendulkar undergoes knee surgery in London | Sakshi
Sakshi News home page

సచిన్ కు ఆపరేషన్, అభిమానులకు షాక్

Published Wed, Jul 6 2016 8:23 PM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM

సచిన్ కు ఆపరేషన్, అభిమానులకు షాక్

సచిన్ కు ఆపరేషన్, అభిమానులకు షాక్

లండన్: రిటైర్మెంట్ తర్వాత కూడా గాయాల బాధ తప్పడం లేదని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు. లండన్ లో తన మోకాలికి ఆపరేషన్ చేయించుకున్నట్టు 'లిటిర్ మాస్టర్' ట్విటర్ ద్వారా వెల్లడించారు. శస్త్ర చికిత్స జరిగిన తన ఎడమ కాలి ఫొటో కూడా ట్విటర్, ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. త్వరలోనే కోలుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

'కొన్ని గాయాలు రిటైర్మెంట్ తర్వాత కూడా బాధ పెడుతుంటాయి. నా మోకాలికి ఆపరేషన్ జరిగింది. త్వరగా కోలుకుని మళ్లీ మామూలుగా తిరుగుతానని ఆశిస్తున్నా. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నా'నని సచిన్ ట్వీట్ చేశాడు. ఇది పోస్ట్ చేసిన కొద్ది సేపటికే 34 వేల మందిపైగా అభిమానులు స్పందించారు. సచిన్ కు ఆపరేషన్ జరగడం పట్ల ఆశ్చర్యం, సానుభూతి వ్యక్తం చేశారు. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement