మనోళ్లు గెలుస్తారని ముందే చెప్పా: సచిన్ | Sachin Tendulkar says he predicted a India win in Lord's Test | Sakshi
Sakshi News home page

మనోళ్లు గెలుస్తారని ముందే చెప్పా: సచిన్

Published Tue, Jul 22 2014 8:11 PM | Last Updated on Sat, Sep 2 2017 10:42 AM

మనోళ్లు గెలుస్తారని ముందే చెప్పా: సచిన్

మనోళ్లు గెలుస్తారని ముందే చెప్పా: సచిన్

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ధోని సేన విజయాన్ని ముందే ఊహించానని భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు. మొదటి రోజు ఆట చూసే భారత్ గెలుస్తుందని చెప్పినట్టు ఎన్డీ టీవీతో అన్నాడు. తన కుమారుడు అర్జున్ తో కలిసి మొదటి రోజు ఆటను సచిన్ వీక్షించాడు. 28 ఏళ్ల తర్వాత లార్డ్స్ లో టీమిండియా విజయం సాధించడం పట్ల సచిన్ హర్షం వ్యక్తం చేశాడు.

కుర్రాళ్లు అద్భుతంగా ఆడారని మాస్టర్ కితాబిచ్చాడు. జాతీయ స్ఫూర్తిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారని మెచ్చుకున్నాడు. 'మ్యాచ్ మొదలయ్యే సమయానికి నేను లండన్ లోనే ఉన్నాను. నా కుమారుడితో కలిసి మొదటి రోజు ఆట చూశాను. మన టీమ్ కచ్చితంగా గెలుస్తుందని నా కుమారుడితో చెప్పాను. ఇప్పుడు అదే నిజమైంది' అని సచిన్ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement