సచిన్గా అర్జున్
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో సచిన్ వారసుడు అర్జున్ కనిపించనున్నాడు. చిన్ననాటి సచిన్‌గా అర్జున్ టెండూల్కర్ అలరించనున్నాడు. బాల్యంలోని సచిన్ నుంచి క్రికెట్ దేవుడిగా మారిన వైనాన్ని బయోపిక్‌లో పొందుపరచనున్నారు. ఈ మేరకు సచిన్ పోలికలు, మ్యానరిజంను పుణికి పుచ్చుకున్న అర్జునే చిన్ననాటి సచిన్ పాత్రకు సరైన వ్యక్తి అని చిత్ర బృందం భావించింది.