సచిన్ మూవీ పోస్టర్ విడుదల | Sachin Tendulkar unveils poster of his biopic | Sakshi
Sakshi News home page

సచిన్ మూవీ పోస్టర్ విడుదల

Published Mon, Apr 11 2016 5:06 PM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

సచిన్ మూవీ పోస్టర్ విడుదల

సచిన్ మూవీ పోస్టర్ విడుదల

ముంబై:ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకున్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జీవితకథ ఆధారంగా రూపొందుతున్న 'సచిన్'  చిత్ర పోస్టర్ను సోమవారం విడుదల చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్లో భాగంగా  పోస్టర్ ను సచిన్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. 42 ఏళ్ల సచిన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ముంబైకి చెందిన  ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తుండగా,  బ్రిటన్ కు చెందిన జేమ్స్ ఏర్స్‌కిన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దాదాపు అన్ని భాషల్లోనూ అనువాదం చేసే అవకాశం ఉంది.

 

'55 డేస్ ఆఫ్ ట్రైనింగ్. వన్ పెయిర్ ఆఫ్ ట్రూజర్స్. ది సచిన్ స్టోరీ'  అని పోస్టర్ పై రాసి ఉన్న క్యాప్షన్ ఆలోచింపజేసేదిగా ఉండగా, మరోవైపు బ్యాక్ గ్రౌండ్ లో సచిన్ చేతిలో బ్యాట్ పట్టుకుని ఫీల్డ్లో నడుచుకుంటూ వెళుతున్నట్లు  ఉండటం ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ చిత్ర టీజర్ను ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. సచిన్ తన క్రీడా జీవితంలో 200 టెస్టులు, 463 వన్డేలు ఆడి మొత్తం 100 సెంచరీలు చేసి ప్రపంచ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి క్రికెట్  ఫీల్డ్ లో తనదైన ముద్ర వేసిన సచిన్ ఇక చిత్రాల్లో ఎలాంటి హిట్లు కొడతాడనేది అనేది మాత్రం వేచి చూడకతప్పదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement