వెండితెర మీద క్రికెట్ గాడ్ | A Bollywood Biopic On Sachin Tendulkar | Sakshi
Sakshi News home page

వెండితెర మీద క్రికెట్ గాడ్

Published Tue, Apr 12 2016 11:52 AM | Last Updated on Mon, Aug 20 2018 3:51 PM

వెండితెర మీద క్రికెట్ గాడ్ - Sakshi

వెండితెర మీద క్రికెట్ గాడ్

బాలీవుడ్ తెర మీద మరో బయోపిక్కు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇండియన్ క్రికెటర్స్ ధోని, అజారుద్దీన్ల జీవిత కథల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్న నేపథ్యంలో క్రికెట్ గాడ్ సచిన్ బయోగ్రఫీ కూడా వెండితెర మీద సందడి చేయనుంది. తాజాగా ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ను సచిన్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. కాళ్లకు ప్యాడ్స్ కట్టుకొని వస్తున్న ఈ ఫొటో అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
 
సచిన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏ బిలియన్ డ్రీమ్స్ అనే క్యాప్షన్ను యాడ్ చేశారు. '55 రోజుల ట్రైనింగ్, ఒక జత ట్రౌజర్స్, సచిన్ స్టోరీ' అని పోస్టర్పై రాసిన స్టేట్ మెంట్, ఇది సచిన్ పూర్తి బయోగ్రఫీ కాదేమో అన్న అనుమానం కలిగిస్తోంది. తన పాత్రలో సచిన్ స్వయంగా నటిస్తున్న ఈ సినిమాను డాక్యుమెంటరీ సినిమా తరహాలో రూపొందిస్తున్నారు. బ్రిటిష్ దర్శకుడు జేమ్స్ ఎరిక్సన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అదిస్తున్నాడు. ఈ నెల 14న సచిన్ ఫస్ట్ లుక్ టీజర్ను విడుదల చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement