ఆ డేట్ ను సేవ్ చేసుకోండి: సచిన్
ముంబై:భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గా స్వయంగా నటించిన బయోపిక్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త. త్వరలోనే సచిన్ -ఎ బిలియన్ డ్రీమ్స్ సినిమాను వెండి తెరపై చూడొచ్చు. 'ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఇప్పటివరకూ అడుగుతూ వచ్చిన ప్రతీ అభిమాని ప్రశ్నకు ఇదే నా సమాధానం. మే 26వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఆ డేట్ ను క్యాలెండర్ లో మార్కు చేసుకోండి లేకపోతే సేవ్ చేసుకోండి' అని సచిన్ తన ట్విటర్ అకౌంట్ లో పేర్కొన్నాడు.
జేమ్స్ ఎర్సికిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సచిన్ తన పాత్రను తానే పోషించుకుంటున్నాడు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎఆర్ రెహ్మాన్ మ్యూజిక్ చేస్తున్నాడు. ఇక యువ సచిన్ పాత్రలో అతని కుమారుడు అర్జున్ టెండూల్కర్ నటించనుండటం మరో విశేషం. గతేడాది విడుదలైన సచిన్ బయోపిక్ చిత్ర టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువుర క్రీడాకారుల జీవిత కథల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు సక్సెస్ బాటలో పయనించాయి. మరి ఇది సచిన్ టెండూల్కర్ స్వయంగా నటించిన సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.
The answer to the question that everyone's asking me is here. Mark your calendars and save the date. @SachinTheFilm releases 26.05.17 pic.twitter.com/aS0FGNjGKY
— sachin tendulkar (@sachin_rt) 13 February 2017