బాస్ డి లీడ్ (PC: Cricket Netherlands Twitter)
ICC Mens T20 World Cup 2022 - India vs Netherlands: టీ20 ప్రపంచకప్- 2022 సూపర్-12లో భాగంగా టీమిండియాతో సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఆటగాడు బాస్ డి లీడ్ అరుదైన ఘనత సాధించాడు. తండ్రిలాగే తాను సైతం ఐసీసీ టోర్నీలో భారత్‌తో ఆడి.. ఈ ఫీట్ నమోదు చేసిన తొలి డచ్ ప్లేయర్‌గా నిలిచాడు.
కాగా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ బాస్ తండ్రి టిమ్ డి లీడ్ 2003 వన్డే వరల్డ్‌కప్ ఆడిన నెదర్లాండ్స్ జట్టులో సభ్యుడు. నాడు సౌతాఫ్రికా వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పార్ల్‌లో టీమిండియా- నెదర్లాండ్స్ తలపడ్డాయి.
గంగూలీ సారథ్యంలోని భారత జట్టుతో..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గంగూలీ సేన 48.5 ఓవర్లలో 204 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సచిన్ టెండుల్కర్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. దినేశ్ మోంగియా 42 పరుగులతో రాణించాడు. కాగా పటిష్టమైన భారత జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో నాడు టిమ్ డి లీడ్ కీలక పాత్ర పోషించాడు.
తండ్రితో బాస్ డి లీడ్(PC: Voorburg Cricket Club)
కీలక వికెట్లు తీసి.. టిమ్ అలా
నాటి మ్యాచ్‌లో ఈ రైట్ ఆర్మ్ మీడియం పేసర్ 9.5 ఓవర్లు బౌలింగ్ చేసి.. 35 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. సచిన్, రాహుల్ ద్రవిడ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, లక్ష్య ఛేదనలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన టిమ్.. హర్భజన్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు.
ఓపెనర్ డాన్ వా న్ బంగే ఒక్కడే 62 పరుగులు చేయగా మిగిలిన వాళ్లంతా నామ మాత్రపు స్కోరుకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో 48.1 ఓవర్లలో డచ్ జట్టు 136 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో భారత్ 68 పరుగులతో విజయం సాధించింది.
అయితే, ఈ మ్యాచ్‌లో గంగూలీ సేన నెగ్గినా.. అద్భుత ప్రదర్శన కనబరిచిన నెదర్లాండ్స్ ప్లేయర్ టిమ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వడం విశేషం.
టీ20 ప్రపంచకప్-2022లో డచ్ జట్టు(PC: Cricket Netherlands Twitter)
టీ20 ప్రపంచకప్‌లో బాస్ డి లీడ్ ఇలా
ఇక టీమిండియాతో గురువారం నాటి మ్యాచ్ విషయానికొస్తే.. బాస్ డి లీడ్ 3 ఓవర్లు వేసి 33 పరుగులు సమర్పించుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో వన్‌డౌన్‌లో వచ్చి 23 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ అర్ధ శతకాలతో చెలరేగడం.. భువనేశ్వర్ కుమార్ అద్బుతంగా బౌలింగ్ చేయడంతో 56 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది.
ఇదిలా ఉంటే.. నెదర్లాండ్స్ సూపర్-12కు చేరుకోవడంలో బాస్ డీ లీడ్ తన వంతు పాత్ర పోషించి జట్టు విజయాల్లో భాగమయ్యాడు.
-వెబ్ స్పెషల్
చదవండి: T20 WC: 'బాబర్ ఒక పనికిరాని కెప్టెన్.. ఆడింది చాలు ఇంటికి వచ్చేయండి'
T20 World Cup 2022: వరుస ఓటములు.. అయినా పాకిస్తాన్ సెమీ ఫైనల్‌కు చేరే ఛాన్స్?
Comments
Please login to add a commentAdd a comment