Bas de Leede
-
WC 2023: వన్డే చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
WC 2023- Australia vs Netherlands: నెదర్లాండ్స్ స్టార్ క్రికెటర్ బాస్ డి లిడేకు చేదు అనుభవం ఎదురైంది. వరల్డ్‌కప్-2023లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో భాగంగా వన్డే చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన ఆటగాడిగా ఈ ఆల్‌రౌండర్ నిలిచాడు. ఆసీస్ బౌలర్లు మిక్ లూయీస్, ఆడం జంపాలను అధిగమించి చెత్త గణాంకాలతో చరిత్రకెక్కాడు. కాగా ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన నెదర్లాండ్స్ ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బౌలింగ్ చేసింది. ఆ ఆనందం కాసేపే ఈ క్రమంలో డచ్ పేసర్ లోగన్ వాన్ బీక్ ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ మార్ష్‌ను 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపి శుభారంభం అందించాడు. అయితే, మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవనీయలేదు. వాళ్లంతా ఒకెత్తు.. మాక్సీ మరో ఎత్తు వన్‌డౌన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(71)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అద్భుత శతకం(104)తో భారీ స్కోరుకు పునాది వేశాడు. ఇక వార్నర్, స్మిత్‌లతో పాటు మార్నస్ లబుషేన్ కూడా బ్యాట్ ఝులిపించాడు. మొత్తంగా 47 బంతుల్లో 62 పరుగులతో రాణించాడు. నెదర్లాండ్స్ బౌలర్లను ఆడుకోవడంలో ఈ ముగ్గురు ఒక ఎత్తైతే ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ మరో ఎత్తు. డచ్ ఆటగాళ్ల బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 44 బంతుల్లోనే మొత్తంగా 106 పరుగులు రాబట్టాడు. రెండో అత్యుత్తమ స్కోరు వార్నర్, స్మిత్, లబుషేన్.. మాక్సీ.. ఇలా ఈ నలుగురి విజృంభణతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఏకంగా 399 పరుగులు సాధించింది. వరల్డ్‌కప్ చరిత్రలో తమ రెండో అత్యుత్తమ స్కోరు నమోదు చేసింది. పాపం.. బాస్ బలి అయితే, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్ల పరుగుల దాహానికి బలైపోయిన బౌలర్లలో బాస్ డి లిడే ముందు వరుసలో ఉన్నాడు. ఈ రైట్ఆర్మ్ మీడియం పేసర్ తన 10 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి రికార్డు స్థాయిలో 115 పరుగులు సమర్పించుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా బాస్ డి లిడే నిలిచాడు. ఇక ఆసీస్‌తో మ్యాచ్‌లో లబుషేన్, జోష్ ఇంగ్లిస్ రూపంలో రెండు వికెట్లు తీయడం ఒక్కటే అతడికి కాస్త ఊరట. బాస్ డి లిడే సంగతి ఇలా ఉంటే.. నెదర్లాండ్స్ ఇతర బౌలర్లలో వాన్ బీక్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. ఆర్యన్ దత్‌కు ఒక్క వికెట్ దక్కింది. ఇంటర్నేషనల్ వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్లు వీరే ►2/115 (10) - బాస్ డి లిడే(నెదర్లాండ్స్)- ఆస్ట్రేలియా మ్యాచ్‌లో- ఢిల్లీ-2023 ►0/113 (10) - మిక్ లూయిస్(ఆస్ట్రేలియా)- సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో- జొహన్నస్‌బర్గ్- 2006 ►0/113(10) - ఆడం జంపా(ఆస్ట్రేలియా)- సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో- సెంచూరియన్- 2023 ►0/110 (10)- వాహబ్ రియాజ్(పాకిస్తాన్)- ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో- నాటింగ్‌హాం- 2016 ►0/110 (9) - రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్)- ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో- మాంచెస్టర్- 2019. చదవండి: WC 2023: వార్నర్ 22వ సెంచరీ.. రికార్డులు బద్దలు! సచిన్‌తో పాటు View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: పాపం ‘బాస్’! ‘ఆఖరి బంతి’కి 13 పరుగులు.. చుక్కలు చూపించాడు!
ICC Cricket World Cup 2023- New Zealand vs Netherlands: వన్డే వరల్డ్‌కప్-2023లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ సాంట్నర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్.. 17 బంతులు ఎదుర్కొని 36 పరుగులతో అజేయంగా నిలిచాడు. సాంట్నర్ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అయితే, ఈ లెఫ్టాండ్ బ్యాటర్ బాదిన రెండు సిక్స్‌లు కివీస్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రావడం విశేషం. అంతేకాదు.. చివరి బాల్‌కు సాంట్నర్ ఏకంగా 13 పరుగులు రాబట్టడం మరో విశేషం. ఆఖరి బంతికి అలా 13 పరుగులు ఎలా అంటారా? న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో నెదర్లాండ్స్ ఆల్‌రౌండర్ బాస్ డి లిడే 50వ ఓవర్ వేసేందుకు బరిలోకి దిగాడు. మొదటి బంతికే సాంట్నర్ ఫోర్ బాదగా.. ఆ తర్వాత లిడే అతడిని కట్టడి చేయగలిగాడు. సాంట్నర్‌తో పాటు మ్యాచ్ హెన్రీ క్రీజులో ఉండగా.. మరో నాలుగు బంతుల్లో కివీస్ కేవలం నాలుగు పరుగులే రాబట్టగలిగింది. కానీ ఆఖరి బంతికి సీన్ మొత్తం రివర్స్ అయింది. లిడే వేసిన లో ఫుల్‌టాస్‌ను అద్భుత రీతిలో సిక్సర్‌గా మలిచాడు సాంట్నర్. అయితే, అక్కడే మరో ట్విస్టు చోటు చేసుకుంది. లిడే వేసిన బంతిని No Ball(Waist Height)గా తేల్చాడు అంపైర్. దీంతో ఏడు పరుగులు ఖాతాలో చేరాయి. ఇక అప్పటికే ఒత్తిడిలో కూరకుపోయిన బాస్ డి లిడే ఆఖరి బంతికి మరోసారి మూల్యం చెల్లించుకోకతప్పలేదు. ఆఫ్ సైడ్ దిశగా లిడే మరోసారి లో ఫుల్ టాస్ వేయగా.. సిక్సర్ బాది కివీస్ ఇన్నింగ్స్‌కు అద్భుతమైన ముగింపునిచ్చాడు సాంట్నర్. ఇలా ఒకే బంతికి పదమూడు పరుగులు ఇచ్చిన లిడేకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఆఖరి ఓవర్లో మొత్తంగా 21 పరుగులు వచ్చాయి. ముగ్గురి అర్ధశతకాలతో కాగా హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ విల్ యంగ్(70) సహా వన్‌డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర(51), కెప్టెన్ టామ్ లాథమ్(53) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో సాంట్నర్ మెరుపుల కారణంగా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు సాధించి డచ్ జట్టుకు గట్టి సవాల్ విసిరింది. వరుసగా రెండో విజయంపై కన్నేసింది. చదవండి: WC 2023: పాక్, కివీస్‌లకు అంత సీన్ లేదు.. సెమీస్‌లో ఆ 4 జట్లే! ఫైనల్లో: ఆండర్సన్ View this post on Instagram A post shared by ICC (@icc) -
అప్పుడు తండ్రి టీమిండియాపై.. కొడుకు ఇప్పుడు పాకిస్తాన్‌పై! అరుదైన రికార్డు
ICC Cricket World Cup 2023, 2nd Match- - Pakistan vs Netherlands: వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఫాస్ట్‌బౌలర్ బాస్ డి లిడే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 9 ఓవర్ల బౌలింగ్‌లో 62 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. పాక్ ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్‌తో కలిసి 68 పరుగులతో సంయుక్తంగా టాప్ స్కోరర్‌గా నిలిచిన వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ రూపంలో లిడేకు తొలి వికెట్ దక్కింది. అదే ఓవర్లో(32) ఇఫిక్తర్ అహ్మద్(9) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు బాస్ డి లిడే. ఆ తర్వాత షాదాబ్ ఖాన్(32), హసన్ అలీ(0) వికెట్లు కూడా పడగొట్టాడు. దీంతో అతడి ఖాతాలో నాలుగు వికెట్లు చేరాయి. తండ్రి అడుగుజాడల్లో ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్ చరిత్రలో తండ్రి అడుగుజాడల్లో నడిచిన కొడుకుగా బాస్ డి లిడే గుర్తింపు సాధించాడు. నెదర్లాండ్స్ తరఫున ప్రపంచకప్ ఈవెంట్లో అత్యుత్తమ బౌలింగ్ గణాకాలు సాధించిన నాలుగో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. 2003 వరల్డ్‌కప్‌లో బాస్ తండ్రి.. టిమ్ డి లిడె టీమిండియాతో పర్ల్ మ్యాచ్‌లో 4/35 నమోదు చేశాడు. (PC: Voorburg Cricket Club) వన్డే ప్రపంచకప్ చరిత్రలో అదే ప్రపంచకప్ టోర్నీలో టిమ్ డి లిడేతో పాటు ఫీకో క్లాపెన్బర్గ్ నమీబియాపై 4/42, ఆదిల్ రాజా నమీబియాపైనే 4/42 గణాంకాలు నమెదు చేశారు. ఇక తాజాగా భారత్ వేదికగా హైదరాబాద్‌లో బాస్ డి లిడే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 4/62 బౌలింగ్ ఫిగర్స్‌తో ఈ జాబితాలో చేరిపోయాడు. కాగా ఈ ఎలైట్ లిస్టులో చోటు సంపాదించిన తండ్రీ కొడుకులుగా( నెదర్లాండ్స్ తరఫున) అరుదైన రికార్డు సృష్టించారు టిమ్, బాస్. 286 పరుగులకు పాక్ ఆలౌట్ ఇక ఉప్పల్ వేదికగా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయింది. డచ్ బౌలర్లలో అకెర్మాన్ రెండు, వాన్ మెకెరిన్, వాన్‌బీక్, ఆర్యన్ దత్ ఒక్కో వికెట్ తీయగా.. లిడేకు నాలుగు వికెట్లు దక్కిన విషయం తెలిసిందే. నాడు సచిన్ వికెట్ తీసి కాగా తండ్రి టిమ్ డి లిడే మాదిరే బాస్ డి లిడే సైతం బ్యాటింగ్ ఆల్‌రౌండర్. ఇక టిమ్ 2003 వరల్డ్‌కప్‌లో టీమిండియాతో మ్యాచ్‌లో సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజ బ్యాటర్లతో పాటు హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ వికెట్లు తీశాడు. నాటి.. లక్ష్య ఛేదనలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన టిమ్.. హర్భజన్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరగడం గమనార్హం. చదవండి: Asian Games: జపాన్ను చిత్తు చేసి.. పసిడి గెలిచి! ప్యారిస్ ఒలంపిక్స్ బెర్తు ఖరారు -
ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో మొత్తం యాషెస్ స్టార్లే.. ఒక్కరు మాత్రం..!
2023 జులై నెలకు గాను ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 7) ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ను ప్రకటించింది. ఈ జాబితాలో ఒక్కరు మినహా మొత్తం యాషెస్ 2023 స్టార్లే ఉండటం విశేషం. పురుషుల విభాగంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు జాక్ క్రాలే, క్రిస్ వోక్స్‌లతో పాటు నెదర్లాండ్స్ ఆల్‌రౌండర్ బాస్ డి లీడ్ నామినేట్ కాగా.. మహిళల విభాగంలో ఆసీస్ ప్లేయర్స్ ఆష్లే గార్డ్నర్, ఎల్లిస్ పెర్రీతో పాటు ఇంగ్లండ్ నాట్ సీవర్ బ్రంట్ నామినేట్ అయ్యింది. పై పేర్కొన్న జాబితాలో నెదర్లాండ్స్ బాస్ డి లీడ్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ అదరగొట్టగా.. మిగతా ఐదుగురు పురుషులు, మహిళల యాషెస్‌లో ఇరగదీసారు. శ్రీలంకలో జరిగిన వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో కనబర్చిన అత్యుత్తమ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు (5/52, 123 (92)) గాను లీడ్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. క్రిస్ వోక్స్ (ఇంగ్లండ్).. యాషెస్ సిరీస్‌లో తొలి రెండు టెస్ట్‌లు మిస్ అయ్యి, మూడో టెస్ట్ నుంచి బరిలోకి దిగిన వోక్స్.. జులై నెలలో జరిగిన 3,4,5 యాషెస్ టెస్ట్‌ల్లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు సైతం దక్కించుకున్నాడు. వోక్స్ జులైలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో 18.15 సగటున 19 వికెట్లు పడగొట్టాడు. జాక్ క్రాలే (ఇంగ్లండ్).. జులైలో జరిగిన 2, 3, 4, 5 యాషెస్ టెస్ట్‌ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన క్రాలే.. ఈ నాలుగు టెస్ట్‌ల్లో 58.85 సగటున 412 పరుగులు చేశాడు. ఇందులో మాంచెస్టర్ టెస్ట్‌లో అతను చేసిన 189 పరుగుల ఇన్నింగ్స్, నిర్ణయాత్మక ఐదో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో చేసిన 73 పరుగుల ఇన్నింగ్స్‌లు హైలైట్‌గా నిలిచాయి. ఆష్లే గార్డ్నర్ (ఆసీస్).. జూన్ నెల మహిళల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు విన్నర్ అయిన ఆష్లే గార్డ్నర్ జులైలో జరిగిన మ్యాచ్‌ల్లో 232 పరుగులతో పాటు 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు వరుసగా రెండో నెల కూడా నామినేట్ అయ్యింది. ఎల్లిస్ పెర్రీ (ఆసీస్).. పెర్రీ.. జులై నెలలో ఇంగ్లండ్, ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో బ్యాట్‌తో అద్భుతంగా రాణించి (4 మ్యాచ్‌ల్లో 276 పరుగులు) తొలిసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యింది. నాట్ సీవర్ బ్రంట్ (ఇంగ్లండ్).. మహిళల యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన 3 వన్డేల సిరీస్‌లో బ్రంట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఈ సిరీస్‌లో భాగంగా జులై నెలలో జరిగిన ఆఖరి 2 మ్యాచ్‌ల్లో ఈమె రెండు సెంచరీలు (111 నాటౌట్, 129) సాధించింది. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యింది. -
#BasDeLeede: తండ్రికి తగ్గ తనయుడు..
ఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వన్డే ప్రపంచకప్‌కు నెదర్లాండ్స్ జట్టు ఐదోసారి అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 1996, 2003, 2007, 2011లో నాలుగుసార్లు డచ్ జట్టు వన్డే వరల్డ్‌కప్ ఆడింది. ఈ నాలుగు సందర్భాల్లో మూడుసార్లు తన జట్టును వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అతనే టిమ్ డీ లీడే.. ఈ పేరు మీకు ఎక్కువగా పరిచయం లేకపోవచ్చు. కానీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా శుక్రవారం సూపర్ సిక్స్‌లో స్కాట్లాండ్, నెదర్లాండ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఒకడి పేరు బాగా మార్మోగిపోయింది. అతనే బాస్ డీ లీడే. బౌలింగ్‌లో ఐదు వికెట్లు.. బ్యాటింగ్‌లో 123 పరుగులు వీరోచిత సెంచరీ.. వెరసి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తన జట్టును వన్డే వరల్డ్‌కప్ ఆడే అర్హతను సాధించిపెట్టాడు. 278 పరుగులు లక్ష్యాన్ని కేవలం 42.5 ఓవర్లలోనే చేధించిన డచ్ జట్టు క్వాలిఫయర్-2గా.. పదో జట్టుగా వన్డే వరల్డ్‌కప్‌లోకి అడుగుపెట్టింది. మరి ఒంటిచేత్తో నెదర్లాండ్స్‌ను వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనేలా చేసిన బాస్ డీ లీడే.. ఎవరో కాదు.. పైన మనం చెప్పుకున్న టిమ్ డీ లీడే కుమారుడే. బాస్ డీ లీడే తన వీరోచిత పోరాటంతో 12 ఏళ్ల తర్వాత మళ్లీ నెదర్లాండ్స్ వన్డే వరల్డ్‌కప్ ఆడేందుకు అర్హత సాధించిపెట్టి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక టిమ్ డీ లీడే 1996లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తన 11 ఏళ్ల కెరీర్లో కేవలం వన్డే వరల్డ్‌కప్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన టిమ్ డీ లీడే 29 మ్యాచ్‌ల్లో 400 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 29 వికెట్లు పడగొట్టి బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. 2018లో నేపాల్‌తో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన బాస్ డీ లీడే అనతికాలంలోనే మంచి పేరు సంపాదించాడు. మిడిలార్డర్లో ఎక్కువగా బ్యాటింగ్‌కు వచ్చే బాస్ డీ లీడే మంచి బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు 30 వన్డేల్లో 765 పరుగులతో పాటు 24 వికెట్లు, 31 టి20ల్లో 610 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 27 వికెట్లు పడగొట్టాడు. కాగా స్కాట్లాండ్తో మ్యాచ్‌లో విజయం అనంతరం ఐసీసీ నెదర్లాండ్స్‌కు అభినందనలు తెలుపుతూ ఒక ఫోటోను షేర్ చేసిది. ఆ ఫోటోలో బాస్ డీ లీడే.. తన తండ్రి టిమ్ డీ లీడేను గుర్తుచేస్తూ సేమ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం హైలెట్‌గా నిలిచింది. ఇదే విషయాన్ని ఐసీసీ వివరిస్తూ తండ్రికి తగ్గ తనయుడు.. బాస్ డీ లీడే సన్నాఫ్ టిమ్ డీ లీడే అంటూ క్యాప్షన్ జత చేసింది. Tim de Leede, Bas de Leede 🏏 Like father, like son 🇳🇱 #CWC23 More: https://t.co/qguNPPA8ai pic.twitter.com/KGECQ1yt5s — ICC (@ICC) July 7, 2023 చదవండి: #NED Vs SCO: ఐదు వికెట్లు, వీరోచిత శతకం.. వన్డే వరల్డ్‌కప్‌కు నెదర్లాండ్స్ అర్హత Bas De Leede: సెంచరీ హీరో ప్రపంచ రికార్డు.. వాళ్లెవరికీ సాధ్యం కాలేదు! దిగ్గజం సరసన.. -
WC: సెంచరీ హీరో ప్రపంచ రికార్డు.. వాళ్లెవరికీ సాధ్యం కాలేదు! దిగ్గజాలతో..
ICC Cricket World Cup Qualifiers 2023 SCO Vs NED: వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే భారత్‌కు వచ్చే రెండు జట్లేవో తేలిపోయింది. మాజీ చాంపియన్ శ్రీలంక ఇంతకుముందే అర్హత సాధించగా, ఇప్పుడు నెదర్లాండ్స్ తమ చోటును ఖాయం చేసుకుంది. తప్పనిసరిగా నెగ్గాల్సిన గురువారం నాటి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 4 వికెట్లతో స్కాట్లాండ్పై నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ అసాధారణ రీతిలో బ్రెండన్ మెక్‌ములన్ (106; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, కెప్టెన్ రిచీ బెరింగ్టన్ (64; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. బాస్ డి లీడె (5/52) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం వరల్డ్‌కప్‌కు క్వాలిఫై కావాలంటే 44 ఓవర్లలోనే లక్ష్యం సాధించాల్సిన స్థితిలో నెదర్లాండ్స్ బరిలోకి దిగింది. ఆ జట్టు 42.5 ఓవర్లలో 6 వికెట్లకు 278 పరుగులు సాధించింది. బాస్ దంచికొట్టాడు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బాస్ డి లీడె (92 బంతుల్లో 123; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకంతో చెలరేగగా... విక్రమ్‌జిత్ సింగ్ (40), సాఖిబ్ జుల్ఫికర్ (33 నాటౌట్) రాణించారు. 36 ఓవర్లు ముగిసేవరకు కూడా మ్యాచ్ స్కాట్లాండ్ నియంత్రణలోనే ఉంది. 8 ఓవర్లలో నెదర్లాండ్స్ 85 పరుగులు చేయాల్సి ఉంది. తర్వాతి 4 ఓవర్లలో 40 పరుగులు వచ్చాయి. దాంతో సమీకరణం 4 ఓవర్లలో 45కు మారింది. ఈ సమయంలో డి లీడె ఒక్క సారిగా టి20 తరహా ఆటను చూపించాడు. వాట్ వేసిన ఓవర్లో 2 సిక్స్‌లు, మెక్‌ములెన్ వేసిన తర్వాతి ఓవర్లో 2 సిక్స్‌లు బాదడంతో మొత్తం 42 పరుగులు వచ్చేశాయి. 84 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. డి లీడె రనౌటైనా, వాన్ బీక్ సింగిల్ తీయడంతో డచ్ శిబిరంలో సంబరాలు షురూ అయ్యాయి. తొలి డచ్ క్రికెటర్‌గా ఇక ఈ మ్యాచ్ సందర్భంగా సెంచరీ హీరో బాస్ డి లీడె అరుదైన రికార్డు సాధించాడు. డచ్ క్రికెటర్లలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ సరసన నిలిచాడు. వన్డేల్లో సెంచరీ సాధించడంతో పాటు ఐదు వికెట్లు తీసిన నాలుగో క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు డి లీడె. గతంలో వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్), కాలింగ్‌వుడ్ (ఇంగ్లండ్), రోహన్ ముస్తఫా (యూఏఈ) మాత్రమే ఈ ఘనత సాధించారు. తొలి ప్లేయర్ వివియన్ రిచర్డ్స్ 1987లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో వివ్ రిచర్డ్స్ 119 పరుగులు చేయడంతో పాటు 41 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇక బంగ్లాదేశ్‌తో 2005 నాటి మ్యాచ్‌లో పాల్ కాలింగ్‌వుడ్ సెంచరీ సాధించడంతో పాటు ఆరు వికెట్లు కూల్చాడు. ఇదిలా ఉంటే.. యూఏఈ కెప్టెన్ రోహన్ ముస్తఫా 2017లో పపువా న్యూ గినియాతో మ్యాచ్ సందర్భంగా ఈ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. చదవండి: ఒక్క బంతి ఎక్కువ తీసుకున్నా గోవిందా! నాడు తండ్రి సచిన్ వికెట్ తీసి.. ఇప్పుడేమో Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
ఒక్క బంతి ఎక్కువ తీసుకున్నా గోవిందా! నాడు తండ్రి సచిన్ వికెట్ తీసి.. ఇప్పుడేమో
CWC Qualifiers 2023: వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించేందుకు నెదర్లాండ్స్ తమ చివరి మ్యాచ్‌లో స్కాట్లాండ్పై తప్పనిసరిగా గెలవాలి. లక్ష్యం 278 పరుగులు... అదీ 44 ఓవర్లలో సాధిస్తేనే బెర్త్ దక్కుతుంది. అంతకంటే ఒక్క బంతి ఎక్కువ తీసుకొని మ్యాచ్ గెలిచినా లాభం లేదు. స్కాట్లాండ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తక్కువ వ్యవధిలో ఒక్కో వికెట్ కోల్పోతూ వచ్చిన జట్టు ఒక దశలో 163/5 వద్ద నిలిచింది. 79 బంతుల్లోనే మరో 115 పరుగులు కావాలి. ఇలాంటి స్థితిలో బాస్ డి లీడె ఒక్కసారిగా చెలరేగిపోయాడు. తర్వాతి 40 బంతుల్లోనే 76 పరుగులు సాధించి జట్టుకు సంచలన విజయం అందించాడు. డి లీడె శతకానికి తోడు జుల్ఫికర్ అండగా నిలవడంతో నెదర్లాండ్స్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరి ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో భారత్‌లో జరిగే వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. ‘సూపర్ సిక్స్’ దశలో జింబాబ్వేను ఓడించి ఆ జట్టును వరల్డ్ కప్‌కు దూరం చేసి తమ అవకాశాలు మెరుగుపర్చుకున్న స్కాట్లాండ్ అనూహ్య ఓటమితో నిష్క్రమించింది. వరల్డ్ కప్‌కు నెదర్లాండ్స్ అర్హత సాధించడం ఇది ఐదోసారి. 2011 తర్వాత మళ్లీ భారత్‌లోనే ఆ జట్టు బరిలోకి దిగుతోంది. అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం 2003 వన్డే వరల్డ్ కప్... పార్ల్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 68 పరుగుల తేడాతో ఓడింది. అయితే సచిన్ టెండూల్కర్ సహా 4 వికెట్లు తీసిన టిమ్ డి లీడె ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. అతని కొడుకే ఈ బాస్ డి లీడె. టోర్నీ ఆసాంతం నిలకడైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అతను జట్టును ముందుకు నడపడంలో కీలకపాత్ర పోషించాడు. 285 పరుగులు చేయడంతో పాటు డి లీడె 15 వికెట్లు పడగొట్టడం విశేషం. ప్రధాన ఆటగాళ్లు తప్పుకొన్నా.. కౌంటీల్లో ఒప్పందాల కారణంగా పలువురు ప్రధాన ఆటగాళ్లు ఈ టోర్నీ నుంచి తప్పుకున్నా... డి లీడె మాత్రం రెండిటిలో వరల్డ్ కప్ క్వాలిఫయర్స్నే ఎంచుకున్నాడు. సీనియర్లు లేకపోయినా స్ఫూర్తిదాయక ఆటతో డచ్ బృందం సత్తా చాటింది. గ్రూప్ దశలో జింబాబ్వే చేతిలో ఓడినా అమెరికా, నేపాల్‌పై సునాయాస విజయాలు సాధించింది. విండీస్‌తో మ్యాచ్ ఆ జట్టు స్థాయిని చూపించింది. 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ తడబడకుండా స్కోరు సమం చేయగలిగింది. తేజ అద్భుతంగా ఆడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తేజ నిడమనూరు అద్భుత సెంచరీతో చెలరేగగా, కీలకమైన సూపర్ ఓవర్లో వాన్ బీక్ 30 పరుగులు కొట్టి జట్టును గెలిపించాడు. ‘సూపర్ సిక్స్’ దశలో ఒమన్‌పై భారీ విజయం జట్టుకు మేలు చేయగా, ఇప్పుడు స్కాట్లాండ్పై గెలుపు ఆ జట్టును ప్రధాన టోరీ్నకి చేర్చింది. 4 అర్ధ సెంచరీలు చేసిన స్కాట్ ఎడ్వర్డ్స్, మరో సెంచరీ చేసిన విక్రమ్‌జిత్ సింగ్‌తో పాటు బౌలింగ్‌లో వాన్ బీక్, ర్యాన్ క్లీన్ కీలక పాత్ర పోషించారు. ‘భారత గడ్డపై అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలనేది నా కల’ అని తేజ కొన్నాళ్ల క్రితం ‘సాక్షి’తో ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు అతను భారత్‌పైనే వరల్డ్ కప్ మ్యాచ్ ఆడబోతుండటం విశేషం. నవంబర్ 11న బెంగళూరులో భారత్‌తో తలపడే నెదర్లాండ్స్... అక్టోబర్ 6న తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో హైదరాబాద్‌లో ఆడుతుంది. చదవండి: Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) -
ఐదు వికెట్లు, వీరోచిత శతకం.. వన్డే వరల్డ్‌కప్‌కు నెదర్లాండ్స్ అర్హత
అక్టోబర్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు నెదర్లాండ్స్ అర్హత సాధించింది. స్కాట్లాండ్తో జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్ మ్యాచ్‌లో డచ్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో(బౌలింగ్‌లో ఐదు వికెట్లు, బ్యాటింగ్‌లో సెంచరీ) మెరిసిన బాస్ డీ లీడే హైలెట్‌గా నిలిచాడు. దీంతో క్వాలిఫయర్-2 హోదాలో నెదర్లాండ్స్ వరల్డ్‌కప్‌కు పదో జట్టుగా అర్హత సాధించింది. ఇక క్వాలిఫయర్-1గా శ్రీలంక ఇప్పటికే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించగా.. తాజాగా డచ్ జట్టు క్వాలిఫయర్-2 హోదాలో వన్డే వరల్డ్‌కప్‌కు వెళ్లనుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. భారత్ గడ్డపై ఈ మెగా సంగ్రామం జరగనుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. బ్రాండన్ మెక్ముల్లన్ 110 బంతుల్లో 106 పరుగులు సెంచరీ చేయగా.. కెప్టెన్ రిచీ బెరింగ్టన్ 64, థామస్ మెకింటోష్ 38 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే ఐదు వికెట్లు తీయగా.. రెయాన్ క్లీన్ రెండు, వాన్‌బీక్ ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 42.5 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. నెదర్లాండ్స్ మిడిలార్డర్ బ్యాటర్ బాస్ డీ లీడే(92 బంతుల్లో 123 పరుగులు) సంచలన శతకంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్ విక్రమ్‌జిత్ సింగ్ 40 పరుగులు, ఆఖర్లో సకీబ్ జుల్పికర్ 33 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బౌలిగ్లో ఐదు వికెట్లు తీయడంతో పాటు వీరోచిత శతకంతో మెరిసిన బాస్ డీ లీడేను 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు వరించింది. 90 (82) 👉 123 (92) Bas de Leede went berserk in the last 10 balls he faced to seal Netherlands' #CWC23 qualification 💪#SCOvNED pic.twitter.com/gJMrkhm3aU — ICC Cricket World Cup (@cricketworldcup) July 6, 2023 A stunning heist! 😱 Netherlands have booked their #CWC23 tickets 🎫✈#SCOvNED pic.twitter.com/HtdyRvTWo0 — ICC Cricket World Cup (@cricketworldcup) July 6, 2023 చదవండి: #MitchellMarsh: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. వన్డే తరహాలో రెచ్చిపోయి సెంచరీ #MarkWood: యాషెస్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ బంతి.. ఖవాజాకు మైండ్ బ్లాక్ -
ఆసీస్‌కు అవమానం! టాప్ రన్ స్కోరర్లు, అత్యధిక వికెట్ల వీరులు ఎవరంటే!
ICC Mens T20 World Cup 2022- Super 12: టీ20 ప్రపంచకప్-2022 విజేత ఎవరో మరికొన్ని రోజుల్లో తేలనుంది. టీమిండియా- జింబాబ్వేతో సూపర్-12 దశకు ఆదివారం(నవంబరు 6) తెరపడిన విషయం తెలిసిందే. వర్షం అంతరాయం జట్ల తలరాతను ప్రభావితం చేసే అంశంగా పరిణమించగా.. గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్.. గ్రూప్-2 నుంచి భారత్, పాకిస్తాన్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టాయి. ఇక డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు స్వదేశంలో ప్రతిష్టాత్మక టోర్నీలో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. సూపర్-12లో తమ ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్- శ్రీలంకను ఓడించి ఆసీస్‌కు నిరాశను మిగిల్చింది. పత్తా లేని వార్నర్ ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా మరో పరాభవాన్ని కూడా ముటగట్టుకుంది. సూపర్-12 ముగిసే సరికి అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా కంగారూ ప్లేయర్ కూడా లేకపోవడం గమనార్హం. గత ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన డేవిడ్ వార్నర్ ఈ ఎడిషన్‌లో(44) అసలు పత్తానే లేకుండా పోయాడు. వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దు కావడం, చిన్న జట్లు క్వాలిఫైయర్స్‌లో ఆడిన విషయాన్ని పక్కన పెడితే.. ఆసీస్ బౌలర్లు సైతం సొంతగడ్డపై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కోహ్లి తర్వాతి స్థానంలో అతడే టాప్-10 రన్ స్కోరర్లలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి మొదటి స్థానంలో నిలవగా.. పసికూన నెదర్లాండ్స్‌కు చెందిన మాక్స్ ఒడౌడ్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో భారత మిడిలార్డర్ స్టార్, టీ20 ర్యాంకింగ్స్ నంబర్ 1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానం దక్కించుకున్నాడు. కోహ్లి వర్సెస్ సూర్య కోహ్లి, సూర్య తప్ప మిగిలిన వాళ్లంతా క్వాలిఫైయర్స్ ఆడిన జట్లకు చెందిన వారు కావడం విశేషం. అయితే సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో కివీస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ గనుక రేసులో నిలవకపోతే.. వీరిద్దరిలో ఎవరో ఒకరు టోర్నీ టాపర్‌గా అవతరించే అవకాశం ఉంది. మన అర్ష్ కూడా ఇక బౌలర్ల విషయానికొస్తే.. వనిందు హసరంగ అగ్ర స్థానంలో ఉండగా.. టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు తొమ్మిదో స్థానం దక్కింది. ఈ లిస్ట్‌లో కూడా అర్ష్, సామ్ కర్రన్, షాదాబ్ ఖాన్ తప్ప మిగిలిన వాళ్లు క్వాలిఫైయర్స్ ఆడారు. కాగా నవంబరు 13న ఫైనల్‌తో ప్రపంచకప్-2022 టోర్నీకి ముగియనుంది. టీ20 ప్రపంచకప్ 2022: సూపర్-12 అత్యధిక పరుగుల వీరులు 1. విరాట్ కోహ్లి(ఇండియా)-246 2. మాక్స్ ఒడౌడ్(నెదర్లాండ్స్)-242 3. సూర్యకుమార్ యాదవ్(ఇండియా)- 225 4. కుశాల్ మెండిస్ (శ్రీలంక)- 223 5. సికందర్ రజా(జింబాబ్వే)- 219 6. పాతుమ్ నిసాంక (శ్రీలంక)- 214 7. లోర్కాన్ టకర్ (ఐర్లాండ్)- 204 8. గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్)- 195 9. షాంటో (బంగ్లాదేశ్)- 180 10. ధనుంజయ డి సిల్వ(శ్రీలంక)- 177 అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లు 1. వనిందు హసరంగ (శ్రీలంక)- 15 2. బాస్ డి లీడ్ (నెదర్లాండ్స్)- 13 3. బ్లెస్సింగ్ ముజరబానీ (జింబాబ్వే)- 12 4. అన్రిచ్ నోర్జే (సౌతాఫ్రికా)- 11 5. జాషువా లిటిల్ (ఐర్లాండ్)- 11 6. వాన్ మెకరిన్ (నెదర్లాండ్స్)- 11 7. సామ్ కర్రన్ (ఇంగ్లండ్)- 10 8. షాదాబ్ ఖాన్(పాకిస్తాన్)- 10 9. అర్ష్‌దీప్ సింగ్ (ఇండియా)- 10 10. సికందర్ రజా (జింబాబ్వే)- 10 చదవండి: WC 2022: ఒక్క క్యాచ్‌తో తారుమారు: సౌతాఫ్రికాలో పుట్టి ఆ జట్టునే దెబ్బకొట్టిన ప్లేయర్లు.. టీమ్‌లో తెలుగు కుర్రాడు కూడా! T20 WC 2022: సెమీ ఫైనల్ జట్లు, షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్.. ఇతర వివరాలు -
పాకిస్తాన్ బౌలర్ రాకాసి బౌన్సర్.. బద్ధలైన బ్యాటర్ ముఖం, రక్తం ధారలా..!
టీ20 వరల్డ్‌కప్-2022 గ్రూప్-2లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్ 30) జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ బ్యాటర్ బాస్ డి లీడ్ తీవ్రంగా గాయపడ్డాడు. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ 6వ ఓవర్లో పాక్ పేసర్ హరీస్ రౌఫ్ విసిరిన రాకాసి బౌన్సర్.. బాస్ డి లీడ్ హెల్మెట్ లోపలికి చొచ్చుకుపోయి ముఖాన్ని బద్ధలు కొట్టింది. ఈ దెబ్బకు విలవిలలాడిపోయిన డచ్ బ్యాటర్ కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్ధంకాక అలాగే క్రీజ్‌లో కూలబడిపోయాడు. 142 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతి బాస్ డి లీడ్ ముఖానికి బలంగా తాకడంతో రక్తం ధార కట్టింది. దీంతో బ్యాటర్‌తో సహా గ్రౌండ్లో ఉన్న వారంతా ఆందోళన చెందారు. కుడి కంటి కింది భాగంలో తగిలిన ఈ గాయం బాస్ డి లీడ్ ముఖాన్ని చీల్చేసింది. బంతి ఏమత్రం అటుఇటు అయినా లీడ్ కంటిని కోల్పోయే వాడు. దీంతో అతను బతుకు జీవుడా అని మైదానాన్ని వీడాడు. లీడ్ గాయం తీవ్రత కారణంగా తిరిగి బరిలోకి కూడా దిగలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్ ఉంది. Comeback soon, Bas De Leede. pic.twitter.com/bd0r2HzxHY — Johns. (@CricCrazyJohns) October 30, 2022 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. డచ్ జట్లు నిర్ధేశించిన 92 పరుగుల సునాయాస లక్ష్యాన్ని పాక్ ముక్కి మూలిగి 13.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత పాక్ బౌలర్లు షాదాబ్ ఖాన్ (3/22), మహ్మద్ వసీం జూనియర్ (2/15), షాహీన్ అఫ్రిది (1/19), నసీం షా (1/11), హరీస్ రౌఫ్ (1/10) సత్తా చాటడంతో నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేయగా, ఛేదనలో పాకిస్తాన్ నానా కష్టాలు పడి అతి కష్టం మీద లక్ష్యాన్ని చేరుకుంది. సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ 4 పరుగులు మాత్రమే చేసి రనౌటయ్యాడు. అయితే మహ్మద్ రిజ్వాన్ (49), ఫఖర్ జమాన్ (20) బాధ్యతాయుతంగా ఆడి జట్టును లక్ష్యం దిశగా నడిపించారు. 30 పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరూ ఔట్ కావడంతో పాక్ నెమ్మదిగా లక్ష్యం దిశగా సాగింది. ఈ క్రమంలో షాన్ మసూద్ (12) ఔట్ కాగా.. ఇఫ్తికార్ అహ్మద్ (6), షాదాబ్ ఖాన్ (4) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో పాక్ ప్రస్తుత ప్రపంచకప్‌లో బోణీ కొట్టడంతో పాటు ఆసీస్ గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసింది. -
నాటి వరల్డ్‌కప్‌లో తండ్రి సచిన్ వంటి దిగ్గజాల వికెట్లు తీసి.. నేడు కొడుకు మాత్రం
ICC Mens T20 World Cup 2022 - India vs Netherlands: టీ20 ప్రపంచకప్- 2022 సూపర్-12లో భాగంగా టీమిండియాతో సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఆటగాడు బాస్ డి లీడ్ అరుదైన ఘనత సాధించాడు. తండ్రిలాగే తాను సైతం ఐసీసీ టోర్నీలో భారత్‌తో ఆడి.. ఈ ఫీట్ నమోదు చేసిన తొలి డచ్ ప్లేయర్‌గా నిలిచాడు. కాగా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ బాస్ తండ్రి టిమ్ డి లీడ్ 2003 వన్డే వరల్డ్‌కప్ ఆడిన నెదర్లాండ్స్ జట్టులో సభ్యుడు. నాడు సౌతాఫ్రికా వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పార్ల్‌లో టీమిండియా- నెదర్లాండ్స్ తలపడ్డాయి. గంగూలీ సారథ్యంలోని భారత జట్టుతో.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గంగూలీ సేన 48.5 ఓవర్లలో 204 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సచిన్ టెండుల్కర్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. దినేశ్ మోంగియా 42 పరుగులతో రాణించాడు. కాగా పటిష్టమైన భారత జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో నాడు టిమ్ డి లీడ్ కీలక పాత్ర పోషించాడు. తండ్రితో బాస్ డి లీడ్(PC: Voorburg Cricket Club) కీలక వికెట్లు తీసి.. టిమ్ అలా నాటి మ్యాచ్‌లో ఈ రైట్ ఆర్మ్ మీడియం పేసర్ 9.5 ఓవర్లు బౌలింగ్ చేసి.. 35 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. సచిన్, రాహుల్ ద్రవిడ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, లక్ష్య ఛేదనలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన టిమ్.. హర్భజన్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఓపెనర్ డాన్ వా న్ బంగే ఒక్కడే 62 పరుగులు చేయగా మిగిలిన వాళ్లంతా నామ మాత్రపు స్కోరుకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో 48.1 ఓవర్లలో డచ్ జట్టు 136 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో భారత్ 68 పరుగులతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో గంగూలీ సేన నెగ్గినా.. అద్భుత ప్రదర్శన కనబరిచిన నెదర్లాండ్స్ ప్లేయర్ టిమ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వడం విశేషం. టీ20 ప్రపంచకప్-2022లో డచ్ జట్టు(PC: Cricket Netherlands Twitter) టీ20 ప్రపంచకప్‌లో బాస్ డి లీడ్ ఇలా ఇక టీమిండియాతో గురువారం నాటి మ్యాచ్ విషయానికొస్తే.. బాస్ డి లీడ్ 3 ఓవర్లు వేసి 33 పరుగులు సమర్పించుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో వన్‌డౌన్‌లో వచ్చి 23 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ అర్ధ శతకాలతో చెలరేగడం.. భువనేశ్వర్ కుమార్ అద్బుతంగా బౌలింగ్ చేయడంతో 56 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. నెదర్లాండ్స్ సూపర్-12కు చేరుకోవడంలో బాస్ డీ లీడ్ తన వంతు పాత్ర పోషించి జట్టు విజయాల్లో భాగమయ్యాడు. -వెబ్ స్పెషల్ చదవండి: T20 WC: 'బాబర్ ఒక పనికిరాని కెప్టెన్.. ఆడింది చాలు ఇంటికి వచ్చేయండి' T20 World Cup 2022: వరుస ఓటములు.. అయినా పాకిస్తాన్ సెమీ ఫైనల్‌కు చేరే ఛాన్స్?