ICC Cricket World Cup 2023- New Zealand vs Netherlands: వన్డే వరల్డ్‌కప్-2023లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ సాంట్నర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్.. 17 బంతులు ఎదుర్కొని 36 పరుగులతో అజేయంగా నిలిచాడు.
సాంట్నర్ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అయితే, ఈ లెఫ్టాండ్ బ్యాటర్ బాదిన రెండు సిక్స్‌లు కివీస్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రావడం విశేషం. అంతేకాదు.. చివరి బాల్‌కు సాంట్నర్ ఏకంగా 13 పరుగులు రాబట్టడం మరో విశేషం.
ఆఖరి బంతికి అలా 13 పరుగులు
ఎలా అంటారా? న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో నెదర్లాండ్స్ ఆల్‌రౌండర్ బాస్ డి లిడే 50వ ఓవర్ వేసేందుకు బరిలోకి దిగాడు. మొదటి బంతికే సాంట్నర్ ఫోర్ బాదగా.. ఆ తర్వాత లిడే అతడిని కట్టడి చేయగలిగాడు.
సాంట్నర్‌తో పాటు మ్యాచ్ హెన్రీ క్రీజులో ఉండగా.. మరో నాలుగు బంతుల్లో కివీస్ కేవలం నాలుగు పరుగులే రాబట్టగలిగింది. కానీ ఆఖరి బంతికి సీన్ మొత్తం రివర్స్ అయింది. లిడే వేసిన లో ఫుల్‌టాస్‌ను అద్భుత రీతిలో సిక్సర్‌గా మలిచాడు సాంట్నర్.
అయితే, అక్కడే మరో ట్విస్టు చోటు చేసుకుంది. లిడే వేసిన బంతిని No Ball(Waist Height)గా తేల్చాడు అంపైర్. దీంతో ఏడు పరుగులు ఖాతాలో చేరాయి. ఇక అప్పటికే ఒత్తిడిలో కూరకుపోయిన బాస్ డి లిడే ఆఖరి బంతికి మరోసారి మూల్యం చెల్లించుకోకతప్పలేదు.
ఆఫ్ సైడ్ దిశగా లిడే మరోసారి లో ఫుల్ టాస్ వేయగా.. సిక్సర్ బాది కివీస్ ఇన్నింగ్స్‌కు అద్భుతమైన ముగింపునిచ్చాడు సాంట్నర్. ఇలా ఒకే బంతికి పదమూడు పరుగులు ఇచ్చిన లిడేకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఆఖరి ఓవర్లో మొత్తంగా 21 పరుగులు వచ్చాయి.
ముగ్గురి అర్ధశతకాలతో
కాగా హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ విల్ యంగ్(70) సహా వన్‌డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర(51), కెప్టెన్ టామ్ లాథమ్(53) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో సాంట్నర్ మెరుపుల కారణంగా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు సాధించి డచ్ జట్టుకు గట్టి సవాల్ విసిరింది. వరుసగా రెండో విజయంపై కన్నేసింది.
చదవండి: WC 2023: పాక్, కివీస్‌లకు అంత సీన్ లేదు.. సెమీస్‌లో ఆ 4 జట్లే! ఫైనల్లో: ఆండర్సన్
Comments
Please login to add a commentAdd a comment