
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్ డార్లీ మిచెల్‌కు డచ్ బౌలర్ పాల్ వాన్ మీకెరెన్ చేతులు జోడించి మరీ నమస్కారం పెట్టాడు.
అసలేం జరిగిందంటే?
కివీస్ ఇన్నింగ్స్ 39 ఓవర్ వేసిన పాల్ వాన్ మీకెరెన్ బౌలింగ్‌లో రెండో బంతికి మిచెల్ స్ట్రైట్ డ్రైవ్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో బంతి నేరుగా వెళ్లి నాన్ స్ట్రైక్‌లోని స్టంప్స్‌ను గిరాటేసింది. అంతకంటే ముందు వాన్ మీకెరెన్ కాలికి బలంగా తాకిండేది. కానీ మీకెరెన్ ఆఖరి నిమిషంలో తన కాలిని వెనుక్కితీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
లేదంటే భారీ గాయం అయిండేది. అయితే సెకన్ల వ్యవధిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న వాన్ మీకెరెన్.. చేతులను జోడించి, వంగి మరీ దండం పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యూజిలాండ్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 13న బంగ్లాదేశ్‌తో తలపడనుండగా.. నెదర్లాండ్స్ ఆక్టోబర్ 17న దక్షిణాఫ్రికాతో ఆడనుంది.
చదవండి: ODI WC 2023: చరిత్ర సృష్టించిన మెండిస్.. వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ!
Comments
Please login to add a commentAdd a comment