Daryl Mitchell
-
NZ vs SL: కుశాల్ పెరీరా ‘ఫాస్టెస్ట్ సెంచరీ’.. ఉత్కంఠ పోరులో ఆఖరికి!
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ గండం నుంచి శ్రీలంక తప్పించుకుంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన నామమాత్రపు మూడో టీ20లో ఏడు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. కుశాల్ పెరీరా(Kusal Perera) విధ్వంసక శతకంతో దుమ్ములేపగా.. చరిత్ అసలంక(Charith Asalanka) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించడంతో లంక గట్టెక్కగలిగింది. మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు శ్రీలంక న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా మొదట టీ20లు జరుగగా.. తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచిన న్యూజిలాండ్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో గురువారం నెల్సన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మాత్రం పర్యాటక లంక ఆతిథ్య కివీస్ జట్టుకు ఊహించని షాకిచ్చింది.సాక్స్టన్ ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనర్లు పాతుమ్ నిసాంక(12 బంతుల్లో 14), కుశాల్ మెండిస్(16 బంతుల్లో 22) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు.లంక తరఫున ఫాస్టెస్ట్ సెంచరీఅయితే, వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ పెరీరా మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగి కివీస్ బౌలింగ్‌ను చీల్చి చెండాడు. కేవలం 46 బంతుల్లోనే 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 219కి పైగా స్ట్రైక్‌రేటుతో 101 పరుగులు సాధించాడు. తద్వారా శ్రీలంక తరఫున అంతర్జాతీయ టీ20లలో ఫాస్టెస్ట్ సెంచరీ(44 బంతుల్లో) నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.ఇక మిడిలార్డర్లో అవిష్క ఫెర్నాండో(17) విఫలమైనా.. చరిత్ అసలంక(24 బంతుల్లో 46) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మిగిలిన వాళ్లలో భనుక రాజపక్స, చమిందు విక్రమసింఘే చెరో ఆరు పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి శ్రీలంక 218 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, జాకబ్ డఫీ, జకారీ ఫౌల్క్స్, మిచెల్ సాంట్నర్, డారిల్ మిచెల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.రాణించిన రచిన్ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఘనంగానే ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. ఓపెనర్లలో టిమ్ రాబిన్సన్(21 బంతుల్లో 37) ఫర్వాలేదనిపించగా.. రచిన్ రవీంద్ర(39 బంతుల్లో 69) అర్ధ శతకంతో రాణించాడు. కానీ వీరిద్దరు అవుటైన తర్వాత కివీస్ ఇన్నింగ్స్ గాడి తప్పింది. వన్‌డౌన్‌లో వచ్చిన మార్క్ చాప్మన్(9), గ్లెన్ ఫిలిప్స్(6) పూర్తిగా విఫలమయ్యారు.అయితే, డారిల్ మిచెల్(17 బంతుల్లో 35) ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగగా నువాన్ తుషార అతడికి చెక్ పెట్టాడు. మిగతా వాళ్లలో మిచెల్ హే(8), మైకేల్ బ్రాస్‌వెల్(1) విఫలమయ్యారు. ఆఖర్లో సాంట్నర్(10 బంతుల్లో 14*), జకారీ ఫౌల్క్స్(13 బంతుల్లో 21*) మెరుపులు మెరిపించినా.. విజయానికి కివీస్ ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 211 పరుగులే చేయగలిగింది. 2006 తర్వాత తొలిసారిఫలితంగా ఏడు పరుగుల తేడాతో జయభేరి మోగించిన శ్రీలంక సిరీస్‌లో కివీస్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించి.. వైట్‌వాష్ నుంచి తప్పించుకుంది. అంతేకాదు.. కివీస్ గడ్డపై 2006 తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. లంక బౌలర్లలో అసలంక అత్యధికంగా మూడు, వనిందు హసరంగ రెండు వికెట్లు పడగొట్టగా.. నువాన్ తుషార, బినుర ఫెర్నాండో ఒక్కో వికెట్ తీశారు.ఇక సెంచరీ వీరుడు కుశాల్ పెరీరా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకోగా.. కివీస్ పేసర్ జాకబ్ డఫీ(Jacob Duffy)కి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది.చదవండి: IND vs AUS 5th Test: రోహిత్ శర్మపై వేటు.. భారత కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా!? -
నిస్సాంక అద్భుత ఇన్నింగ్స్ వృథా.. ఉత్కంఠ పోరులో ఓడిన శ్రీలంక
మౌంట్ మౌంగానుయ్ వేదికగా జరిగిన తొలి టీ20లో 8 పరుగుల తేడాతో శ్రీలంకపై కివీస్ విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 164 పరుగులకే పరిమతమైంది. లక్ష్య చేధనలో లంకకు ఓపెనర్లు పాథుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్ అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు.తొలి వికెట్‌కు 121 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో శ్రీలంక సునయాసంగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ శ్రీలంక ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన కివీ పేసర్ జాకబ్ ఢఫీ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.కుశాల్ మెండిస్(46),కుశాల్ పెరీరా(0), కమిందు మెండిస్(0)లను ఒకే ఓవర్లో ఔట్ చేసి మ్యాచ్‌ను న్యూజిలాండ్ వైపు మలుపుతిప్పాడు. ఆ తర్వాత లంకేయులు తిరిగి కోలుకోలేకపోయారు. ఆఖరి ఓవర్లో శ్రీలంక విజయానికి 14 పరుగులు అవసరమవ్వగా కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి.అయితే లంక ఓటమిపాలైనప్పటికి పాథుమ్ నిస్సాంక మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 60 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 90 పరుగులు చేసి ఔటయ్యాడు. కివీస్ బౌలర్లలో డఫీ మూడు వికెట్లు పడగొట్టగా.. ఫోల్క్స్, హెన్రీ తలా రెండు వికెట్లు సాధించారు.అదరగొట్టిన మిచెల్, బ్రేస్వెల్అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డార్లీ మిచెల్(62), బ్రేస్‌వెల్(59) హాఫ్ సెంచరీలతో మెరిశారు. లంక బౌలర్లలో ఫెర్నాండో, థీక్షణ, హసరంగా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇదే వేదికలో డిసెంబర్ 30న జరగనుంది.చదవండి: టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. నితీశ్ రెడ్డి- వాషీ ప్రపంచ రికార్డు -
న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాడికి చోటు
స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. ఈ సిరీస్‌లకు రెండు వేర్వేరు జట్లను కివీస్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఐపీఎల్-2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన బెవాన్ జాకబ్స్‌కు ఈ జట్టులో చోటు దక్కింది.న్యూజిలాండ్ దేశీవాళీ క్రికెట్లో జాకబ్స్ గత కొంత కాలంగా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ క్రమంలోనే బ్యాక్క్యాప్స్ సెలక్టర్లు అతడికి ఛాన్స్ ఇచ్చారు.ఈ రెండు సిరీస్‌లలో న్యూజిలాండ్ కెప్టెన్‌గా మిచెల్ శాంట్నర్ వ్యవహరించనున్నాడు. ఇటీవలే తమ వైట్ బాల్ జట్టు ఫుల్‌టైమ్ కెప్టెన్ శాంట్నర్‌ను కివీ క్రికెట్ బోర్డు నియమించింది. ఇక ఈ సిరీస్‌లకు కోసం న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్లు రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, మాట్ హెన్రీ తిరిగి జట్టులోకి వచ్చారు. ఈ ముగ్గురు గత నెలలో శ్రీలంకతో వైట్‌బాల్ సిరీస్‌లకు దూరమయ్యారు. మళ్లీ ఇప్పుడు అదే జట్టుపై పునరగామనం చేయననున్నారు. ఈ వైట్‌బాల్ సిరీస్‌లలో భాగంగా పర్యాటక శ్రీలంకతో న్యూజిలాండ్ మూడు టీ20లు ,మూడు వన్డేలు ఆడనుంది.టీ20 జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మిచ్ హే, మాట్ హెన్రీ, బెవాన్ జాకబ్స్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, నాథన్ స్మిత్వన్డే జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ, మిచ్ హే, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్క్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, విల్ యంగ్చదవండి: సర్ఫరాజ్ కెప్టెన్సీలో కోహ్లి.. గెలిచింది మాత్రం వాళ్లే!.. వీడియో -
చెప్పినా వినని సర్ఫరాజ్ ఖాన్.. రోహిత్‌కు వార్నింగ్.. ఆఖరికి!
టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ చేసిన పని వల్ల కెప్టెన్ రోహిత్ శర్మ ఆవేశానికి లోనయ్యాడు. అంపైర్లతో చిన్నపాటి వాగ్వాదానికి దిగాడు. అయితే, సర్ఫరాజ్‌ను సమర్థించే క్రమంలో ఆరంభంలో కాస్త దూకుడు ప్రదర్శించిన రోహిత్.. తర్వాత చల్లబడ్డాడు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్‌తో మాట్లాడి వివాదం సద్దుమణిగేలా చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..?!ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. బెంగళూరు, పుణెలలో జరిగిన తొలి రెండు టెస్టుల్లో పర్యాటక కివీస్ జట్టు రోహిత్ సేనకు ఊహించని షాకిచ్చింది. రెండింటిలోనూ ఘన విజయం సాధించి 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. తద్వారా పన్నెండేళ్ల తర్వాత సొంతగడ్డపై టీమిండియాకు టెస్టు సిరీస్‌లో ఓటమిని రుచిచూపించింది.ఆరంభం బాగున్నాఫలితంగా అవమానభారంతో కుంగిపోయిన టీమిండియా ముంబైలో జరుగుతున్న మూడో టెస్టులో గెలుపొంది.. పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. Washington bowls a jaffa to castle Latham 🤌 Don't miss LIVE action from the 3rd #INDvNZ Test, on #JioCinema, #Sports18 and #ColorsCineplex!#IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/BY5BeQRJ08— JioCinema (@JioCinema) November 1, 2024 ఆరంభంలోనే పేసర్ ఆకాశ్ దీప్ డెవాన్ కాన్వే(4) వికెట్ తీసి బ్రేక్ ఇవ్వగా.. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ మరో ఓపెనర్, కెప్టెన్ టామ్ లాథమ్(28), స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర(5)ను పెవిలియన్‌కు పంపాడు.సర్ఫరాజ్ ఖాన్ స్లెడ్జింగ్ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ విల్ యంగ్(71), డారిల్ మిచెల్(82) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరూ సూపర్ హాఫ్ సెంచరీలతో రాణించి.. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగుల మెరుగైన స్కోరు సాధించేలా చేశారు. అయితే, ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు శ్రమించాల్సి వచ్చిన వేళ సర్ఫరాజ్ ఖాన్ స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు.కివీస్ ఇన్నింగ్స్‌లో 32 ఓవర్‌కు ముందు బౌలర్ బంతిని రిలీజ్ చేసే సమయంలో షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్.. బ్యాటర్‌కు మరీ దగ్గరగా వచ్చి ఏదో మాట్లాడుతున్నట్లు కనిపించాడు. అప్పుడు క్రీజులో ఉన్న డారిల్ మిచెల్ సర్ఫరాజ్ వల్ల తన ఏకాగ్రత దెబ్బతింటుందని ఫీల్డ్ అంపైర్లకు ఫిర్యాదు చేసినట్లు కనిపించింది.రోహిత్‌కు వార్నింగ్ఈ క్రమంలో అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ సర్ఫరాజ్‌తో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను పిలిచి.. మాటలు తగ్గించాలని సూచించాడు. దీంతో అసహనానికి లోనైన రోహిత్ అంపైర్‌తో కాసేపు వాదించాడు. ఆ తర్వాత మిచెల్ దగ్గరకు వెళ్లి ఏదో మాట్లాడాడు. దీంతో మిచెల్ సైతం రోహిత్ వ్యాఖ్యలతో అంగీకరించినట్లుగా తిరిగి తన బ్యాటింగ్ పొజిషన్‌కు వెళ్లిపోయాడు. దీంతో వివాదం సద్దుమణిగింది.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 86 పరుగులే చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ కంటే ఇంకా 149 పరుగులు వెనుకబడి ఉంది.చదవండి: నువ్వు జట్టులో ఉండి ఏం లాభం?.. కోహ్లిపై ఫ్యాన్స్ ఫైర్pic.twitter.com/H0G7GazjgE— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) November 1, 2024 -
టీమిండియా స్పిన్నర్ల ప్రతాపం.. తొలిరోజే కివీస్ ఆలౌట్
న్యూజిలాండ్‌తో మూడో టెస్టును టీమిండియా మెరుగ్గా ఆరంభించింది. ముంబైలో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో తొలిరోజే కివీస్‌ను ఆలౌట్ చేసింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న వాంఖడే పిచ్‌పై రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో చెలరేగగా.. వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. అయితే, బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయిన రోహిత్ సేన.. పుణె మ్యాచ్‌లోనూ ఘోర పరాభవం పాలైంది. కివీస్ చేతిలో ఏకంగా 113 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. పన్నెండేళ్ల తర్వాత టెస్టు సిరీస్ కోల్పోయితద్వారా సొంతగడ్డపై పన్నెండేళ్ల తర్వాత టెస్టు సిరీస్ కోల్పోయిన తొలి భారత జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో ముంబైలో జరుగుతున్న మూడో టెస్టు టీమిండియాకు కీలకంగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సాఫీగా చేరాలన్నా.. వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకోవాలన్నా ఈ మ్యాచ్‌లో గెలవడం రోహిత్ సేనకు అత్యంత ముఖ్యం. లంచ్‌కు ముందు ఇలాఈ నేపథ్యంలో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. కివీస్ బ్యాటింగ్ మొదలుపెట్టిన కాసేపటికే ప్రమాదకర ఓపెనర్ డెవాన్ కాన్వే(4)ను అవుట్ చేసి పేసర్ ఆకాశ్ దీప్ శుభారంభం అందించగా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కెప్టెన్, ఓపెనర్ టామ్ లాథమ్(28), రచిన్ రవీంద్ర(5) రూపంలో బిగ్ వికెట్లు దక్కించుకున్నాడు.జడేజా విశ్వరూపంలంచ్ బ్రేక్‌కు ముందు వీరిద్దరు కలిసి మూడు వికెట్లు తీయగా.. భోజన విరామం సమయం తర్వాత మరో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా విశ్వరూపం ప్రదర్శించాడు. విల్ యంగ్(71) రూపంలో తొలి వికెట్ దక్కించుకన్న జడ్డూ.. ఆ తర్వాత టామ్ బ్లండెల్(0)ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్(17)ల పనిపట్టాడు.Jadeja stuns the Kiwis with a double strike 💥 Catch LIVE action from the 3rd #INDvNZ Test, on #JioCinema, #Sports18 and #ColorsCineplex!#IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/Gyy3vZgTz2— JioCinema (@JioCinema) November 1, 2024 అదే విధంగా ఇష్ సోధి(7), మ్యాట్ హెన్రీ(0) వికెట్లను కూడా జడ్డూ తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు.. వాషీ డారిల్ మిచెల్(82), అజాజ్ పటేల్(7)లను కూడా అవుట్ చేసి మొత్తంగా తన వికెట్ల సంఖ్యను నాలుగుకు పెంచుకున్నాడు. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్(71), డారిల్ మిచెల్(82) మినహా భారత స్పిన్నర్ల ప్రతాపం ముందు కివీస్ బ్యాటర్లంతా తలవంచారు. దీంతో 65.4 ఓవర్లలో న్యూజిలాండ్ 235 పరుగులు(తొలి ఇన్నింగ్స్) చేసి తొలిరోజే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో జడ్డూ ఐదు, వాషీ నాలుగు, ఆకాశ్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నారు.టీమిండియాకూ ఆదిలోనే ఎదురుదెబ్బఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో భారత కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ టామ్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దూకుడుగా ఆడిన రోహిత్ 18 బంతులు ఎదుర్కొని 18 పరుగులు చేశాడు.టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మూడో టెస్టు(నవంబరు 1- 5)👉వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై👉టాస్: న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 235 రన్స్.. ఆలౌట్.చదవండి: చరిత్రకెక్కిన జడేజా.. జహీర్ రికార్డు బ్రేక్.. అరుదైన జాబితాలో చోటు -
ఎలాంటి పిచ్ ఎదురైనా...
పుణే: తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు... రెండో మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఆ జట్టు ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ అన్నాడు. పుణేలో స్పిన్ పిచ్ ఎదురయ్యే అవకాశముందని... అయితే దాని కోసం కివీస్ ప్లేయర్ల వద్ద తగిన ప్రణాళికలు ఉన్నాయని పేర్కొన్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన న్యూజిలాండ్... 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు మ్యాచ్ నెగ్గింది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రాక్టీస్ సెషన్ అనంతరం మిచెల్ మాట్లాడుతూ.. ‘పిచ్ గురించి ఎక్కువ ఆలోచించడం లేదు. అది ఆటగాళ్ల పని కాదు. పరిస్థితులను ఆకలింపు చేసుకొని దానికి తగ్గట్లు ముందుకు సాగడం ముఖ్యం. ఇందులో మా ప్లేయర్లు సిద్ధహస్తులు. పరిస్థితులకు తగ్గట్లు ఆడటం ముఖ్యం. ప్రత్యర్థి 20 వికెట్లు పడగొట్టడంతో పాటు మంచి స్కోర్లు చేయడం గురించే మేం ఆలోచిస్తున్నాం. బెంగళూరు విజయం జట్టులో మరింత సానుకూల దృక్పథం నింపింది. అయితే దాన్ని పక్కన పెట్టి పుణేలో మళ్లీ తాజాగా ప్రారంభించాల్సిందే. శ్రీలంక పర్యటనలో భాగంగా గాలెలో పూర్తిగా స్పిన్ పిచ్‌లపై మ్యాచ్‌లు ఆడాం. ఒక్కో పిచ్ ప్రత్యేకత ఒకలా ఉంటుంది. వికెట్‌ను బట్టి ఆటతీరును మార్చుకుంటూ ముందుకు సాగాలి. తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. పంత్ ప్రపంచ స్థాయి ప్లేయర్ అతడి ఆటతీరు నాకు చాలా ఇష్టం’ అని మిచెల్ అన్నాడు. మరోవైపు న్యూజిలాండ్ మహిళల జట్టు తొలిసారి ఐసీసీ టి20 ప్రపంచకప్ గెలవడం చాలా ఆనందంగా ఉందని మిచెల్ పేర్కొన్నాడు. రెండో టెస్టుకూ విలియమ్సన్ దూరంపుణే: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ భారత్‌తో రెండో టెస్టులో కూడా బరిలోకి దిగబోడని ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. గజ్జల్లో గాయం కారణంగా బెంగళూరులో జరిగిన తొలి టెస్టుకు దూరమైన విలియమ్సన్... ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో రెండో టెస్టుకు కూడా అందుబాటులో ఉండడని బోర్డు మంగళవారం స్పష్టం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు గెలిచిన న్యూజిలాండ్... గురువారం నుంచి రెండో టెస్టులో టీమిండియాతో తలపడుతుంది. శ్రీలంకతో సిరీస్ సందర్భంగా గాయపడ్డ విలియమ్సన్ అప్పటి నుంచి చికిత్స పొందుతున్నాడు. ‘కేన్ కోలుకుంటున్నాడు. అయితే వంద శాతం ఫిట్నెస్ సాధించలేదు. అందుకే అతడు రెండో టెస్టులో ఆడబోవడం లేదు. ప్రస్తుతం విలియమ్సన్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. మూడో టెస్టు వరకు అతడు మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తాడని భావిస్తున్నాం’ అని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. విలియమ్సన్ గైర్హాజరీలోనూ సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకున్న న్యూజిలాండ్ జట్టు... 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత గడ్డపై టెస్టు మ్యాచ్ గెలిచి సిరీస్‌లో ముందంజ వేసింది. -
శ్రీలంకతో తొలి టెస్టు.. పటిష్ట స్థితిలో న్యూజిలాండ్
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ అదరగొడుతోంది. రెండో రోజు ఆటముగిసే సమయానికి కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో లంక కంటే ఇంకా 50 పరుగులు వెనకంజలో ఉంది.క్రీజులో డార్లీ మిచెల్(41), బ్లాండెల్(18) పరుగులతో ఉన్నారు. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్ టామ్ లాథమ్(70), కేన్ విలియమ్స్(55) హాఫ్ సెంచరీలతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో దనుంజయ డి సిల్వా 2 వికెట్లు పడగొట్టగా.. మెండిస్, జయసూర్య తలా వికెట్ సాధించారు. ఇక అంతకుముందు ఓవర్‌నైట్ స్కోర్ 302/7 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. మరో మూడు పరుగులు మాత్రమే జోడించి 305 పరుగులకు ఆలౌటైంది. లంక తొలి ఇన్నింగ్స్‌లో కమిందు మెండిస్ (114) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. బ్లాక్ క్యాప్స్ బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ 5 వికెట్లు పడగొట్టగా.. అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్ తలో రెండు, సౌథీ ఓ వికెట్ పడగొట్టారు.చదవండి: IND vs BAN: చెపాక్‌లో చితక్కొట్టుడు.. అశ్విన్ సూపర్ సెంచరీ -
అభిమాని ఐఫోన్ బద్దలు కొట్టాడు.. గ్లౌవ్స్ గిఫ్ట్‌గా ఇచ్చాడు! వీడియో
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్, న్యూజిలాండ్ క్రికెటర్ డారిల్ మిచెల్ తన మంచి మనుసును చాటుకున్నాడు. ఐపీఎల్-2024లో ధర్మశాల వేదికగా మే5న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు మిచెల్ బౌండరీ లైన్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. మిచిల్ ఫుల్ షాట్ ఆడగా.. బంతి ప్రమాదశాత్తూ స్టాండ్స్‌లో ఉన్న అభిమానికి తాకింది. వెంటనే పక్క సీట్లో పడిపోయాడు. ఈ క్రమంలో అతడి చేతిలో ఉన్న ఐ ఫోన్ గ్లాస్ సైతం బ్రేక్ అయింది. అదృష్టవశాత్తూ ఆ అభిమానికి ఎటువంటి గాయం కాలేదు. కానీ అతడి ఫోన్ మాత్రం పాడైపోయింది. ఇది చూసిన మిచెల్ అతడికి క్షమపణలు తెలిపాడు. అంతేకాకుండా తర్వాత అతడికి వద్ద తన బ్యాటింగ్‌కు గ్లౌవ్స్‌ను మిచెల్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు శెభాష్ మిచెల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్‌లో అహ్మదాబాద్ వేదికగా మే 10న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. A guy got hurt and broke his iPhone during practice!!!Daz gave him his Gloves as a reward!!!💛👊🏻⭐️😎 pic.twitter.com/NkfAGp8Zph— AnishCSK💛 (@TheAnishh) May 7, 2024 -
ధోని తీరుపై విమర్శలు.. ఊహించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని వ్యవహరించిన తీరును అభిమానులను ఆశ్చర్యపరిచింది. ధోని వంటి దిగ్గజ ఆటగాడి నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదంటూ ఫ్యాన్స్‌తో పాటు ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు.అసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై బుధవారం పంజాబ్ కింగ్స్‌తో తలపడిన విషయం తెలిసిందే. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ .. చెన్నైని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి చెన్నై జట్టు 162 పరుగులు చేసింది. అయితే, పంజాబ్ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం మూడు వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసి.. ఏడు వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది.ఇదిలా ఉంటే.. చెన్నై ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఆ సమయంలో... ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు ధోనికి.. ఎనిమిదో నంబర్ బ్యాటర్ డారిల్ మిచెల్ మరో ఎండ్ నుంచి సహకారం అందించాడు.అనూహ్య రీతిలో మిచెల్‌ను వెనక్కి పంపిఅయితే, చివరి ఓవర్ మూడో బంతికి అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ధోని షాట్ ఆడటానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే, సింగిల్‌కు ఆస్కారం ఉన్న నేపథ్యంలో డారిల్ మిచెల్ పరుగు తీసి ధోని ఉన్న ఎండ్‌కు చేరుకున్నాడు.కానీ సింగిల్ తీసేందకు సిద్ధంగా లేని ధోని అనూహ్య రీతిలో మిచెల్‌ను వెనక్కి పంపించాడు. దీంతో వేగంగా కదిలిన మిచెల్ ఎట్టకేలకు సరైన సమయంలో క్రీజులోకి చేరుకోవడంతో రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.ఆ తర్వాతి బంతికి సిక్స్ కొట్టిన ధోని.. ఆఖరి బంతికి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఘాటుగా స్పందించాడు.ధోని అలా చేయడం సరికాదు‘‘ఎంఎస్ ధోనికి భారీ అభిమాన గణం ఉందన్న విషయం గురించే అందరూ మాట్లాడుకుంటారు. అతడు కొట్టిన సిక్స్ గురించి కూడా మాట్లాడతారు. కానీ.. టీమ్ గేమ్‌లో ధోని ఇలా సింగిల్‌కు నిరాకరించకుండా ఉండాల్సింది.ఎదుట ఉన్న వ్యక్తి కూడా అంతర్జాతీయ స్థాయి ఆటగాడే. అతడు ఒకవేళ బౌలర్ అయి ఉంటే ధోని చేసిన పని సబబుగానే ఉండేది. కానీ... రవీంద్ర జడేజా, డారిల్ మిచెల్ లాంటి ఆటగాళ్లు ఉన్నపుడు అలా చేయడం సరికాదు’’ అని ఇర్ఫాన్ పఠాన్ ధోని చర్యను తప్పుబట్టాడు.చదవండి: గిల్ విఫలమైనా చోటు.. అతడికి అన్యాయం: బీసీసీఐపై మండిపడ్డ దిగ్గజం MS Dhoni denied to run 👀Daryl Mitchell literally ran 2 Runs 😅Next Ball, MS hits a huge SIX 👏If this has been done by Virat Kohli or Rohit Sharma, then people start calling them Selfish 😳What's your take on this 🤔 #CSKvPBKS #CSKvsPBKS #SRHvsRR pic.twitter.com/ElvrInMDaI— Richard Kettleborough (@RichKettle07) May 2, 2024 -
IPL 2024: డారిల్ మిచెల్ ఖాతాలో అరుదైన రికార్డు
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సన్‌రైజర్స్‌తో నిన్న (ఏప్రిల్ 28) జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఆటగాడు డారిల్ మిచెల్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదు క్యాచ్‌లు పట్టిన మిచెల్.. ఓ ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రెండో నాన్ వికెట్‌కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2021 సీజన్లో మొహమ్మద్ నబీ (సన్‌రైజర్స్).. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి (ఓ ఇన్నింగ్స్‌లో) ఐదు క్యాచ్‌ల ఘనత సాధించాడు. వికెట్‌కీపర్లలో కుమార సంగక్కర ప్రస్తుతం కనుమరుగైన డెక్కన్ ఛార్జర్స్ తరఫున గతంలో ఈ ఫీట్‌ను సాధించాడు. 2011 సీజన్లో సంగక్కర ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌ల ప్రదర్శన నమోదు చేశాడు. 5 catches in an IPL match:Mohammad Nabi vs MI, Abu Dhabi, 2021Daryl Mitchell vs SRH, Chennai, 2024 pic.twitter.com/2QfcuZt1vl— CricTracker (@Cricketracker) April 28, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో డారిల్ మిచెల్ తొలుత బ్యాట్‌తో రాణించి (52), ఆతర్వాత ఫీల్డ్‌లో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో మిచెల్ ఎస్ఆర్హెచ్ విధ్వంసకర ఆటగాళ్లను ఔట్ చేయడంలో భాగమయ్యాడు. మిచెల్.. ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, కమిన్స్, షాబాజ్ అహ్మద్ క్యాచ్‌లు పట్టాడు. ఈ మ్యాచ్‌లో మిచెల్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్ (54 బంతుల్లో 98) కూడా చెలరేగడంతో సన్‌రైజర్స్‌పై సీఎస్కే 78 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. రుతురాజ్, డారిల్ మిచెల్ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. భువనేశ్వర్, నటరాజన్, ఉనద్కత్ తలో వికెట్ పడగొట్టారు.భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన సన్‌రైజర్స్.. 18.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. తుషార్ దేశ్ పాండే (3-0-27-4), ముస్తాఫిజుర్ (2.5-0-19-2), పతిరణ (2-0-17-2), రవీంద్ర జడేజా (4-0-22-1), శార్దూల్ ఠాకూర్ (4-0-27-1) సన్‌రైజర్స్ పతనాన్ని శాశించారు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో 32 పరుగులు చేసిన మార్క్రమ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ట్రవిస్ హెడ్ (13), అభిషేక్ శర్మ (15), నితీశ్ రెడ్డి (15), క్లాసెన్ (20), అబ్దుల్ సమద్ (19) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ గెలుపుతో సీఎస్కే మూడో స్థానానికి ఎగబాకగా.. ఆ స్థానంలో ఉండిన సన్‌రైజర్స్ నాలుగో స్థానానికి పడిపోయింది. -
చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. రూ.14 కోట్ల ఆటగాడికి గాయం!?
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్‌కు ఊహించని షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ డార్లీ మిచెల్ గాయం కారణంగా సఫారీలతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లో మిచెల్ కాలి బొటన వేలికి గాయమైంది. అయితే అతడి గాయం తీవ్రమైనది కావడంతో రెండో టెస్టుకు జట్టు మేనెజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని బౌలింగ్ ఆల్‌రౌండర్ విల్ ఓ'రూర్క్తో న్యూజిలాండ్ క్రికెట్ భర్తీ చేసింది. కాగా మిచెల్ తన గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్వదేశంలో ఆసీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు కూడా మిచెల్ దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఇదే విషయంపై బ్లాక్ క్యాప్స్ హెడ్‌కోచ్ గ్యారీ స్టీడ్ మాట్లాడుతూ.. మిచెల్ మూడు ఫార్మాట్లలో మా జట్టు కీలక ఆటగాడు. అతడు గాయం పడటం మా దురదృష్టం. అయితే రాబోయే సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని అతడిని రిహాబిలిటేషన్‌కు పంపించాం. తర్వాతి మ్యాచులకు అతడు పూర్తిగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌కు ముందు మిచెల్ గాయం చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆందోళన కలిగిస్తోంది. గతేడాది జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో మిచెల్‌ను రూ. 14 కోట్లకు సీఎస్కే కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్ సమయానికి మిచెల్ కోలుకునే ఛాన్స్ ఉంది. చదవండి: SA20 2024: హెన్రిస్ క్లాసెన్ విధ్వంసం.. కేవలం 30 బంత్లులో! వీడియో వైరల్ -
#NZvPAK: దంచి కొట్టిన మిచెల్, ఫిలిప్స్.. పాకిస్తాన్‌కు మరో పరాభవం
New Zealand vs Pakistan, 4th T20I: న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్తాన్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఆతిథ్య జట్టుకు సిరీస్ సమర్పించుకున్న షాహిన్ ఆఫ్రిది బృందం.. నాలుగో టీ20లోనూ ఓటమి పాలైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడి మరో పరాభవం మూటగట్టుకుంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా టాస్ ఓడిన పాకిస్తాన్.. న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ సయీమ్ ఆయుబ్(1) ఆదిలోనే అవుట్ కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(19), ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన ఫఖర్ జమాన్(9), షాహిజాదా ఫర్హాన్(1), ఇఫ్తికర్ అహ్మద్ (10) పూర్తిగా విఫలమయ్యారు. ఇలా ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా మరో ఓపెనింగ్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ మాత్రం అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 63 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 90 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. రిజ్వాన్‌కు తోడు మహ్మద్ నవాజ్(9 బంతుల్లో 23 రన్స్- నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌కు పాక్ కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది ఆరంభంలోనే షాకిచ్చాడు. కివస్ టాపార్డర్‌ను కకావికలం చేశాడు. ఈ ఫాస్ట్‌బౌలర్ ధాటికి ఓపెనర్లు ఫిన్ అలెన్ 8, టిమ్ సెఫార్ట్ 0 వచ్చీ రాగానే మైదానం వీడగా.. విల్ యంగ్ 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో పాకిస్తాన్‌కు శుభారంభం లభించింది. కానీ.. డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. వీరిద్దరు తుపాన్ ఇన్నింగ్స్ కారణంగా పాకిస్తాన్‌కు మరోసారి ఘోర అవమానం తప్పలేదు. డారిల్ మిచెల్ 44 బంతుల్లో 72 పరుగులు(7 ఫోర్లు, 2 సిక్స్‌లు), గ్లెన్ ఫిలిప్స్ 52 బంతుల్లో 70 పరుగుల(5 ఫోర్లు, 3 సిక్సర్లు)తో అజేయంగా నిలిచి న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా కివీస్ 18.1 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. క్లీన్ స్వీప్ లక్ష్యంగా ఆఖరి మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. ఇక పాక్‌తో నాలుగో టీ20లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన డారిల్ మిచెల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. Victory in Christchurch! #NZvPAK pic.twitter.com/5PZKPIzemF — BLACKCAPS (@BLACKCAPS) January 19, 2024 -
డారిల్ మిచెల్ విధ్వంసకర ఇన్నింగ్స్.. బాబర్ పోరాటం వృథా
న్యూజిలాండ్ పర్యటనను పాకిస్తాన్ పరాజయంతో ప్రారంభించింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయింది. అక్లాండ్ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్ డెవాన్ కాన్వేను డకౌట్ చేసి శుభారంభం అందుకుంది. అయితే, మరో ఓపెనర్ ఫిన్ అలెన్(35), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ విలియమ్సన్(57) ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవనీయలేదు. ఇక నాలుగో నంబర్లో బ్యాటింగ్‌కు దిగిన డారిల్ మిచెల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కొరకరాని కొయ్యలా మారి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. కేవలం 27 బంతుల్లోనే 61 పరుగులు సాధించాడు. మిగిలిన వాళ్లలో మార్క్ చాప్మప్ 26(11 బంతుల్లో) రన్స్‌తో రాణించాడు. బ్యాటర్లంతా రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజం ఒక్క హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. ఈ వన్‌డౌన్ బ్యాటర్ మొత్తంగా 35 బంతులు ఎదుర్కొని 57 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో ఓపెనర్లు సయీమ్ ఆయుబ్(27), మహ్మద్ రిజ్వాన్(25), ఇఫ్తికర్ అహ్మద్(24) మాత్రమే 20 అంకెల స్కోరు చేశారు. రిజ్వాన్, ఇఫ్తికర్ రూపంలో కీలక వికెట్లు తీసిన టిమ్ సౌతీ.. అబ్బాస్ ఆఫ్రిది(1), హారిస్ రవూఫ్(0)లను త్వరత్వరగా పెవిలియన్‌కు పంపాడు. మొత్తంగా నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకుని పాక్‌ను కోలుకోని దెబ్బకొట్టాడు. మిగతా వాళ్లలో ఆడం మిల్నే రెండు, బెన్ సియర్స్ రెండు, ఇష్ సోధి ఒక వికెట్ దక్కించుకున్నారు. కివీస్ బౌలర్ల విజృంభణతో 18 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయిన పాకిస్తాన్ 46 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక పాకిస్తాన్ కెప్టెన్‌గా ఆ జట్టు ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో అతడు బౌలర్‌గా, సారథిగానూ విఫలమయ్యాడు. నాలుగు ఓవర్ల కోటాలో 46 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసిన ఆఫ్రిది.. కెప్టెన్‌గా అరంగేట్ర మ్యాచ్‌లో ఓటమిని చవిచూశాడు. మరోవైపు.. కివీస్‌ను గెలిపించిన డారిల్ మిచెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది’ మ్యాచ్ అవార్డు దక్కింది. -
NZ VS PAK 1st T20: డారిల్ మిచెల్ ఊచకోత
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. డారిల్ మిచెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ (27 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి కివీస్ భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించగా.. 417 రోజుల తర్వాత టీ20 మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో (57) రాణించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో ఫిన్ అలెన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆఖర్లో మార్క్ చాప్మన్ (11 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోర్ చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో డెవాన్ కాన్వే, ఐష్ సోధి డకౌట్లు కాగా.. గ్లెన్ ఫిలిప్స్ 19, ఆడమ్ మిల్నే 10 పరుగులు చేశారు. మ్యాట్ హెన్రీ 0, టిమ్ సౌథీ 6 పరుగులతో అజేయంగా నిలిచారు. డారిల్ మిచెల్ క్రీజ్‌లో ఉన్న సమయంలో కివీస్ 250కి పైగా పరుగులు చేసేలా కనిపించింది. అయితే అతను ఔటైన తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవ్వరూ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడకపోవడంలో కివీస్ 226 పరుగులతో సరిపెట్టుకుంది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది (4-0-46-3), ఆమిర్ జమాల్ (4-0-56-0), ఉసామా మిర్‌లను (4-0-51-0) కివీస్ బ్యాటర్లు ఆటాడుకున్నారు. ముఖ్యంగా షాహీన్ అఫ్రిది, ఉసామా మిర్‌లకు చుక్కలు చూపించారు. కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్.. షాహీన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో 2 సిక్స్‌లు, 3 బౌండరీల సాయంతో ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. పాకిస్తాన్‌ను అబ్బాస్ అఫ్రిది (4-0-34-3), హరీస్ రౌఫ్ (4-0-34-2) కాపాడారు. వీరిద్దరు కాస్త పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు కూడా తీశారు. -
వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2023 అవార్డు రేసులో ముగ్గురు టీమిండియా క్రికెటర్లు
ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 నామినీస్ జాబితాను ఇవాళ (జనవరి 4) ప్రకటించింది. అవార్డు రేసులో ఏకంగా ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు ఉండటం విశేషం. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో అద్బుత ప్రదర్శన కనబర్చిన విరాట్ కోహ్లి, మొహమ్మద్ షమీతో పాటు గతేడంతా వన్డేల్లో అద్భుతంగా రాణించిన శుభ్‌మన్ గిల్ ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు కోసం పోటీపడనున్నారు. వీరితో పాటు న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ రేసులో నిలిచాడు. మిచెల్ సైతం గతేడంతా వన్డేల్లో అద్భుతంగా రాణించడంతో పాటు వరల్డ్‌కప్ 2023లోనూ చెలరేగిపోయాడు. కాగా, ఐసీసీ నిన్న మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ (2023), మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ (2023) అవార్డుల కోసం నామినీస్ జాబితాను ప్రకటించింది. టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌తో పాటు జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్మన్, ఉగాండ ఆటగాడు అల్పేశ్ రామ్‌జనీ ఉండగా.. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో టీమిండియా అప్‌కమింగ్ స్టార్ యశస్వి జైస్వాల్‌తో పాటు న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర, సౌతాఫ్రికా పేసర్ గెరాల్డ్ కొయెట్జీ, శ్రీలంక పేసర్ దిల్షన్ మధుషంక నిలిచారు. గతేడాది ఆయా విభాగాల్లో ప్రదర్శన ఆధారంగా ఐసీసీ నామినీస్ జాబితాను ఎంపిక చేసింది. -
IPL 2024 Auction: సీఎస్కేపై స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రభావం
చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రభావం భారీగా ఉన్నట్లు ఇవాళ జరిగిన ఐపీఎల్ వేలం తర్వాత స్పష్టంగా తెలుస్తుంది. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, కోచ్ అయిన ఫ్లెమింగ్ సీఎస్కే కోచింగ్ బాధ్యతలు చేపట్టాక ఆ జట్టుపై తన మార్కు ప్రభావం చూపిస్తున్నాడు. ఇప్పటికే డెవాన్ కాన్వే (కోటి), మిచెల్ సాంట్నర్ (1.9 కోట్లు) లాంటి కివీస్ ఆటగాళ్లను పంచన చేర్చుకున్న ఫ్లెమింగ్.. ఇవాళ జరిగిన వేలంలో మరో ఇద్దరు కివీస్ ఆటగాళ్లను జట్టులో చేర్చుకుని సీఎస్కేపై బ్లాక్ క్యాప్స్ మార్కు స్పష్టంగా కనిపించేలా చేశాడు. ఇవాళ జరిగిన వేలంలో సీఎస్కే మేనేజ్మెంట్ డారిల్ మిచెల్‌ను 14 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేయగా.. వన్డే వరల్డ్‌కప్ హీరో రచిన్ రవీంద్రను 1.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ ఇద్దరితో పాటు సీఎస్కే ఇవాల్టి వేలంలో మరో భారీ కొనుగోలు చేసింది. ఆ జట్టు యాజమాన్యం శార్దూల్ ఠాకూర్‌ను 4 కోట్లకు సొంతం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరణ, అజింక్య రహానే, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, సిమర్జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ ఐపీఎల్ 2024 వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: డారిల్ మిచెల్ (14 కోట్లు), రచిన రవీంద్ర (1.8 కోట్లు), శార్దూల్ ఠాకూర్ (4 కోట్లు) -
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. ఓటమి అంచుల్లో న్యూజిలాండ్
సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ ఓటమి అంచున నిలిచింది. 332 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. నాలుగో రోజు ఆటముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు మాత్రమే చేసింది. కివీస్ విజయానికి ఇంకా 219 పరుగులు అవసరమ్వగా.. బంగ్లా విజయానికి కేవలం 3 వికెట్ల దూరంలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో న్యూజిలాండ్ బ్యాటర్లు డార్లీ మిచెల్(44), ఇష్ సోధి(7) పరుగులతో ఉన్నారు. తొలి టెస్టులో కివీస్ ఓటమి నుంచి గట్టుఎక్కాలంటే ఏవైనా అద్బుతాలు జరిగాలి. కాగా సెకెండ్ ఇన్సింగ్స్‌లో బంగ్లా స్పిన్వలలో కివీస్ బ్యాటర్లు చిక్కుకున్నారు. బంగ్లా స్పిన్నర్ తైజుల్ ఇస్లాం 4 వికెట్లతో కివీస్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. తైజుల్ ఇస్లాంతో పాటు షార్ఫుల్ ఇస్లాం, మెహాది హసన్, నయీం హసన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బంగ్లాదేశ్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ షాంటో(105) సెంచరీతో మెరిశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ఆజాజ్ పటేల్ 4 వికెట్లు, ఇష్ సోధి రెండు వికెట్లు సాధించారు. అదే విధంగా బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 310 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ 317 పరుగులు మాత్రమే చేసింది. చదవండి: VHT 2023: దినేష్ కార్తీక్ విధ్వంసం.. 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో! అయినా పాపం -
వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన భారత్...అభిమానులు సంబరాలు (ఫోటోలు)
-
వన్డే వరల్డ్‌కప్-2023లో భారీ సిక్సర్.. వీడియో వైరల్
వన్డే వరల్డ్‌కప్-2023లో భారీ సిక్సర్ నమోదైంది. వాంఖడే వేదికగా టీమిండియాతో సెమీఫైనల్లో న్యూజిలాండ్ ఆటగాడు డార్లీ మిచెల్ ఓ భారీ సిక్సర్ కొట్టాడు. కివీస్ ఇన్నింగ్స్ 27 ఓవర్లో జడేజా వేసిన ఐదో బంతిని లాంగాన్ మీదగా భారీ సిక్సర్ బాదాడు. అతను కొట్టిన షాట్‌కి బంతి 107 మీటర్ల దూరం వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ పేరిట ఉండేది. ఈ టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ 106 మీటర్ల సిక్స్ కొట్టాడు. తాజా మ్యాచ్‌తో శ్రేయస్ రికార్డును మిచెల్ బ్రేక్ చేశాడు. అదే విధంగా మరో అరుదైన రికార్డును కూడా మిచెల్ తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన న్యూజిలాండ్ ఆటగాడిగా మిచెల్ నిలిచాడు. మిచెల్ ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో 18 సిక్స్‌లు కొట్టాడు. అంతకు ఈ రికార్డు కివీస్ మాజీ కెప్టెన్ బ్రాండెన్ మెకెల్లమ్(17) పేరిట ఉండేది. చదవండి: CWC 2023: హృదయాన్ని తాకావు.. నా రికార్డు బ్రేక్ చేయడం సంతోషం: సచిన్ ట్వీట్ వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) -
న్యూజిలాండ్ బ్యాటర్‌కు దండం పెట్టిన డచ్ బౌలర్..! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్ డార్లీ మిచెల్‌కు డచ్ బౌలర్ పాల్ వాన్ మీకెరెన్ చేతులు జోడించి మరీ నమస్కారం పెట్టాడు. అసలేం జరిగిందంటే? కివీస్ ఇన్నింగ్స్ 39 ఓవర్ వేసిన పాల్ వాన్ మీకెరెన్ బౌలింగ్‌లో రెండో బంతికి మిచెల్ స్ట్రైట్ డ్రైవ్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో బంతి నేరుగా వెళ్లి నాన్ స్ట్రైక్‌లోని స్టంప్స్‌ను గిరాటేసింది. అంతకంటే ముందు వాన్ మీకెరెన్ కాలికి బలంగా తాకిండేది. కానీ మీకెరెన్ ఆఖరి నిమిషంలో తన కాలిని వెనుక్కితీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే భారీ గాయం అయిండేది. అయితే సెకన్ల వ్యవధిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న వాన్ మీకెరెన్.. చేతులను జోడించి, వంగి మరీ దండం పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యూజిలాండ్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 13న బంగ్లాదేశ్‌తో తలపడనుండగా.. నెదర్లాండ్స్ ఆక్టోబర్ 17న దక్షిణాఫ్రికాతో ఆడనుంది. చదవండి: ODI WC 2023: చరిత్ర సృష్టించిన మెండిస్.. వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ! View this post on Instagram A post shared by ICC (@icc) -
శెభాష్.. ఓడించినంత పనిచేశారు... మరేం పర్లేదు! అసలైన మజా ఇదే!
New Zealand vs Sri Lanka, 1st Test: న్యూజిలాండ్ గడ్డ మీద కివీస్‌ను ఓడించడం అంత తేలికేమీ కాదు! టీమిండియాతో ఫైనల్ రేసులో ముందంజ వేయాలని శ్రీలంక ఉవ్విళ్లూరుతోంది! పటిష్ట కివీస్‌ను 2-0తో వైట్‌వాష్ చేయడం సాధ్యమమ్యే పనేనా!? లంకేయులు మరీ ఎక్కువగా ఆశపడుతున్నారేమో! న్యూజిలాండ్ పర్యటన నేపథ్యంలో లంక జట్టు గురించి వినిపించిన మాటలు! న్యూజిలాండ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించడం కఠినతరమే కానీ అసాధ్యం కాదు! లంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ ఒక్కడిలోనే కాదు దిముత్ కరుణరత్నె బృందం అందరిలోనూ అదే ఆత్మవిశ్వాసం.. అందుకు తగ్గట్లే తొలి టెస్టులో కివీస్‌ను అల్లల్లాడించింది శ్రీలంక జట్టు.. ఆఖరి బంతి వరకు అసాధారణ పోరాటం కనబరిచింది.. అయితే, అదృష్టం మాత్రం కివీస్ వైపు ఉంది. కేన్ విలియమ్సన్ అద్భుత డైవ్‌తో నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో చివరి బంతికి న్యూజిలాండ్‌కు విజయం అందించాడు. ఆశలు ఆవిరి దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలన్న లంక ఆశలు ఆవిరైపోయాయి. వెరసి ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో ఆఖరి టెస్టు ఫలితం తేలకముందే టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో అభిమానులు భారత జట్టుకు శుభాకాంక్షలు చెబుతూనే శ్రీలంక అద్భుత పోరాటాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఓడించినంత పనిచేశారు ‘‘దేశం తీవ్ర సంక్షోభంలో మునిగిపోయిన వేళ ధైర్యంగా ముందడుగు వేసి ఆసియా కప్ గెలిచారు. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు న్యూజిలాండ్ గడ్డపై అసాధారణ పోరాటం చేశారు. కివీస్‌తో తొలి టెస్టులో తృటిలో గెలుపు చేజారింది. అంతమాత్రాన చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆటలో గెలుపోటములు సహజం. విజయం కోసం ఆఖరి బంతి వరకు మీరు పోరాడిన తీరు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. టెస్టు క్రికెట్లో అసలైన మజా అందించారు’’ అంటూ లంక ఆటగాళ్లను కొనియాడుతున్నారు. ‘‘ఓడినా మనసులు గెలిచారు.. మరేం పర్లేదు’’ అంటూ నిరాశలో మునిగిపోయిన కరుణరత్నె బృందానికి సోషల్ మీడియా వేదికగా సానుభూతి ప్రకటిస్తున్నారు. కేన్ మామ వల్లే కాగా మార్చి 9-13 వరకు క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక న్యూజిలాండ్ చేతిలో 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. లంక తొలి ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్ 87 పరుగులతో రాణించగా.. రెండో ఇన్నింగ్స్‌లో ఏంజెలో మాథ్యూస్ సెంచరీతో మెరిశాడు. ఇరు జట్ల మధ్య విజయం దోబూచులాడిన వేళ న్యూజిలాండ్ మాజీ సారథి కేన్ విలియమ్సన్ 121 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఆటను ఐదో రోజు వరకు తీసుకువచ్చిన మరో సెంచరీ వీరుడు డారిల్ మిచెల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మార్చి 17 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Axar Patel: బుమ్రా రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన అక్షర్! అశ్విన్‌కూ సాధ్యం కానిది.. Kane Williamson: 75 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. న్యూజిలాండ్ అత్యంత అరుదైన రికార్డు! వారెవ్వా కేన్ మామ BGT 2023: గత నాలుగు సిరీస్‌ల్లో ఆసీస్‌కు ఇదే గతి..! Test cricket, you beauty! ❤️#WTC23 | #NZvSL pic.twitter.com/7l7Yjmzraz — ICC (@ICC) March 13, 2023 -
NZ vs SL 1st Test: డరైల్ మిచెల్ సెంచరీ
క్రైస్ట్‌చర్చ్: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ అనూహ్యంగా స్వల్ప ఆధిక్యం అందుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 162/5తో ఆట కొనసాగించిన కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆ జట్టుకు 18 పరుగుల ఆధిక్యం దక్కింది. డరైల్ మిచెల్ (193 బంతుల్లో 102; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, మాట్ హెన్రీ (75 బంతుల్లో 72; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. అసిత ఫెర్నాండో 4 వికెట్లు పడగొట్టగా, లహిరు కుమారకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం శ్రీలంక మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్ (20 బ్యాటింగ్), ప్రభాత్ జయసూర్య (2 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం లంక 65 పరుగులు మాత్రమే ముందంజలో ఉన్న నేపథ్యంలో మ్యాచ్ ఆసక్తికర స్థితికి చేరింది. -
కుల్దీప్ మ్యాజిక్ డెలివరి.. దెబ్బకు కివీస్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్!
లక్నో వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ 1-1 సమమైంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సంచలన బంతితో మెరిశాడు. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్‌ను కుల్దీప్ ఔట్ చేసిన విధానం మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. మిచిల్‌ను ఓ అద్భుతమైన బంతితో కుల్దీప్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఏం జరిగిందంటే? టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన కివీస్ ఆది నుంచే భారత స్పిన్నర్లు ఎదుర్కొవడానికి ఇబ్బంది పడింది. తొలి నాలుగు వికెట్లు కూడా స్పిన్నర్లకే దక్కాయి. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ న్యూజిలాండ్‌ను మిచెల్.. మరో బ్యాటర్ చాప్మాన్తో కలిసి అదుకునే ప్రయత్నం చేశాడు. ఇదే సమయంలో కుల్దీప్ యాదవ్.. మిచెల్‌ను ఔట్ చేసి కివీస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 10 ఓవర్లో కుల్దీప్ యాదవ్ వేసిన ఓ మిస్టరీ బంతికి మిచెల్ దగ్గర సమాధానం లేకుండాపోయింది. ఆఫ్ స్టంప్ వెలుపల బంతి ఒక్క సారిగా టర్న్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. ఇది చూసిన మిచెల్ ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాడు. కుల్దీప్ దెబ్బకు కేవలం 8 పరుగులు మాత్రమే చేసిన మిచెల్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: T20 WC: 2005 వరల్డ్‌కప్ టైమ్‌లో పుట్టినోళ్లు! ఒక్కొక్కరిది ఒక్కో కథ.. కుల్దీప్ కోచ్ దత్తత తీసుకున్న ఆ అమ్మాయి.. How about that for a ball! 👍 👍@imkuldeep18 bowled an absolute beaut to dismiss Daryl Mitchell 👏 👏 #TeamIndia | #INDvNZ | @mastercardindia Watch 🎥 🔽 pic.twitter.com/EpgXWYC2XE — BCCI (@BCCI) January 29, 2023 -
'బిర్యానీ నచ్చలేదని రెస్టారెంట్‌కు వెళ్లడం మానేస్తామా'
టీమిండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రాంచీ వేదికగా జరిగిన తొలి టి20లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముందు బౌలింగ్‌లో రెండు కీలక వికెట్లతో పాటు స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసిన సుందర్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో అర్థసెంచరీతో రాణించాడు. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 151 పరుగులు చేయగలిగిదంటే అదంతా సుందర్ చలవే. మధ్యలో సూర్యకుమార్, పాండ్యాలు ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టినప్పటికి స్వల్ప వ్యవధిలో ఇద్దరు ఔటవ్వడం టీమిండియాను దెబ్బతీసింది. ఆ తర్వాత టీమిండియాను నడిపించే బాధ్యతను భుజానికెత్తుకున్న సుందర్ 28 బంతుల్లోనే అర్థశతకం సాధించాడు. కానీ చివర్లో రన్‌రేట్ పెరిగిపోవడం.. చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. భారత్ ఓడినా సుందర్ మాత్రం తన ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. మ్యాచ్ అనంతరం సుందర్ మీడియాతో మాట్లాడాడు. '' నా ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నా జట్టు ఓటమి బాధ కలిగించింది. అయినా ఇది ఒక మ్యాచ్ మాత్రమే. ఓడినప్పుడు భావోద్వేగాలు తారాస్థాయిలో ఉండడం సహజం. ఐపీఎల్ సమయంలో జట్టులో ఉన్న ఆటగాళ్లు చాలా వికెట్లు తీశారు.. బ్యాటర్లు పరుగులు రాబట్టారు. కానీ కివీస్‌తో టి20 మ్యాచ్‌లో రాణించలేకపోయాం'' అని చెప్పుకొచ్చాడు. రాహుల్ త్రిపాఠి అయితే సుందర్ సమాధానంతో ఏకీభవించని ఒక జర్నలిస్ట్ తిక్క ప్రశ్న వేశాడు. ''మ్యాచ్‌లో ఓడిపోయారు.. టాపార్డర్ ఏమైనా మార్చాల్సిన అవసరం ఉంటుందా'' అని ప్రశ్నించాడు. అయితే సుందర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ''నిజంగా టాపార్డర్ మార్చాల్సిన అవసరం ఉందంటారా.. ఒక్క విషయం చెబతున్నా.. రెస్టారెంట్ నుంచి మనకు కావాల్సిన ఫెవరెట్ బిర్యానీ రాకపోతే.. మళ్లీ సదరు రెస్టారెంట్‌కు పూర్తిగా వెళ్లడం మానేస్తారా చెప్పండి. ఇది అలాంటిదే.. ఇది కేవలం ఒక మ్యాచ్. రోజులో ముగిసేపోయే మ్యాచ్‌లో ఏదో ఒక జట్టు మాత్రమే నెగ్గుతుంది. ఇరుజట్లు కలిపి ఒకేసారి 22 మంది ఆటగాళ్లు ఒకే రకమైన ప్రదర్శన కనబరచలేరు. రాయ్‌పూర్‌లో జరిగిన వన్డేలో న్యూజిలాండ్ 108 పరుగులకే ఆలౌట్ కావడం గమనించండి. ఒక్క మ్యాచ్‌కే టాపార్డర్ మార్చాలనడం కరెక్ట్ కాదు'' అని పేర్కొన్నాడు. ఇక అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లకు సుందర్ మద్దతు తెలిపాడు. ''అర్ష్‌దీప్ సింగ్ టీమిండియాతో పాటు ఐపీఎల్‌లోనూ చాలా వికెట్లు తీశాడు. మేం కూడా మనుషులమే. మాకు ఆడాలని ఉంటుంది. ప్రత్యర్థి జట్టు బలంగా ఉన్నప్పుడు ఆరోజు వాళ్లదే ఆట అయినప్పుడు ఎవరు ఏం చేయలేరు. 4 ఓవర్లలో 51 పరుగులిచ్చినప్పటికి వికెట్ తీశాడు. వచ్చే మ్యాచ్‌లో అర్ష్‌దీప్ నుంచి మంచి ప్రదర్శన వచ్చే అవకాశం ఉంది.'' అంటూ వెల్లడించాడు. ''గంటకు 150 కిమీ వేగంతో బంతులు విసరడం ఉమ్రాన్ మాలిక్ ప్రత్యకం. అతనిలో ఉన్న నైపుణ్యం అదే.. ఏదైనా ఎక్స్ ఫ్యాక్టర్ కావొచ్చు.. అతన్ని ప్రోత్సహించాల్సిందే . భారత్ లాంటి పిచ్‌లపై ఉమ్రాన్ మాలిక్ లాంటి బౌలర్ సేవలు అవసరం. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రానా తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. కొంత సహనం, ఓర్పు వహించాల్సిందే. మ్యాచ్ ఓడిపోయాం.. దానినే పట్టుకొని వేళాడితే కుదరదు.. ముందుకు వెళ్లాల్సిందే.'' అంటూ వివరించాడు. ''డారిల్ మిచెల్ ప్రదర్శన మా నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. ఒక దశలో న్యూజిలాండ్‌ను కట్టడి చేసినట్లే అనిపించినా.. డారిల్ మిచెల్ అద్బుత బ్యాటింగ్‌తో మెరిశాడు. కఠినంగా ఉన్న పిచ్‌పై 30 బంతుల్లో 59 పరుగులు చేసి న్యూజిలాండ్ మంచి స్కోరు సాధించడానికి తోడ్పడ్డాడు.'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఇరుజట్ల మధ్య రెండో టి20 లక్నో వేదికగా ఆదివారం(జనవరి 29న) జరగనుంది. చదవండి: ఆర్థిక సంక్షోభం.. పాక్ క్రికెటర్‌కు మంత్రి పదవి 'కోహ్లి స్థానాన్ని అప్పగించాం.. ఇలాగేనా ఔటయ్యేది' -
మా ఓటమికి ప్రధాన కారణం అదే.. అతడు మాత్రం సూపర్: హార్దిక్
India vs New Zealand, 1st T20I: టీమిండియాతో వన్డే సిరీస్‌లో ఘోర పరాభవం పాలైన న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో మాత్రం శుభారంభం చేసింది. రాంచి వేదికగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 21 పరుగులతో జయకేతనం ఎగురవేసింది. తద్వారా మిచెల్ సాంట్నర్ బృందం మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మా ఓటమికి కారణం అదే కివీస్ ఆలౌరౌండ్ ప్రతిభతో విజయం సాధించగా.. టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. తమ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. ‘‘రాంచి వికెట్ ఇలా ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇరు జట్లకు ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే, న్యూజిలాండ్ మాకంటే మెరుగ్గా ఆడింది. అందుకే అనుకున్న ఫలితం రాబట్టగలిగింది. నిజానికి కొత్త బంతి అనుకోని రీతిలో టర్న్ అవడం మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. నేను, సూర్య బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వికెట్ కాస్త మెరుగైంది. ఏదేమైనా ఈ వికెట్‌పై ప్రత్యర్థిని 176- 177 వరకు పరుగులు చేయనివ్వడం సరికాదు. మా బౌలింగ్ వైఫల్యం కారణంగానే ఇలా జరిగింది. 20-25 పరుగులు ఎక్కువగానే ఇచ్చుకున్నాం. మా జట్టులో యువకులే ఎక్కువ. ఈ ఓటమి నుంచి కచ్చితంగా పాఠాలు నేర్చుకుంటాం’’ అని పాండ్యా చెప్పుకొచ్చాడు. సుందర్ సూపర్ ఇక వాషింగ్టన్ సుందర్ ఆట తీరు గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఈరోజు న్యూజిలాండ్‌పై తను బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ చేసిన విధానం అమోఘం. మాకు ఇలాంటి వాళ్లే కావాలి. వాషింగ్టన్ సుందర్ లాంటి ఆటగాడు జట్టులో ఉంటే మా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది’’ అంటూ హార్దిక్ ప్రశంసలు కురిపించాడు. అదరగొట్టిన సుందర్ కాగా కివీస్‌తో తొలి టీ20లో 4 ఓవర్ల బౌలింగ్‌లో 22 పరుగులు మాత్రమే ఇచ్చిన వాషీ 2 వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో సూర్య(47), పాండ్యా(21) మినహా మిగతా వాళ్లంతా చేతులెత్తేసిన వేళ అర్ధ శతకంతో రాణించాడు. 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో వాషింగ్టన్ సుందర్ 50 పరుగులు సాధించాడు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ స్కోర్లు ►న్యూజిలాండ్- 176/6 (20) ►ఇండియా- 155/9 (20) ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: డారిల్ మిచెల్30 బంతుల్లో 59 పరుగులు- నాటౌట్ చదవండి: T20 WC Ind Vs Eng: ఆసీస్‌పై ఇంగ్లండ్ విజయం.. ఫైనల్లో టీమిండియాతో పోరు! చరిత్రకు అడుగు దూరంలో భారత్.. Ranji Trophy: ముంబై- మహారాష్ట్ర మ్యాచ్ డ్రా.. క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర