
లీడ్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టులో తొలిరోజు ఆట ముగిసేసమయానికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. బ్రాడ్ (2/45), లీచ్ (2/75)ల దెబ్బకు 123 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయిన కివీస్‌ను డరైల్ మిచెల్ (78 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆదుకున్నాడు.
బ్లన్‌డెల్ (45 బ్యాటింగ్; 5 ఫోర్లు)తో కలిసి అబేధ్యమైన ఆరో వికెట్‌కు 102 పరుగులు జోడించాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (31; 5 ఫోర్లు) కాస్త మెరుగనిపించాడు. మిగతా వారిలో యంగ్ (20), కాన్వే (26), నికోల్స్ (19) చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు.
చదవండి: SL vs AUS: శ్రీలంకతో టెస్టు సిరీస్.. ఐదేళ్ల తర్వాత మాక్స్‌వెల్ రీ ఎంట్రీ..!
Comments
Please login to add a commentAdd a comment