స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు టామ్ లాథమ్ సారథ్యం వహించనున్నాడు. ఇక స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తిరిగి జట్టులోకి వచ్చాడు.
గజ్జ గాయం కారణంగా ఈ కివీ స్టార్ క్రికెటర్ భారత్ టెస్టులకు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు గాయం నుంచి విలియమ్సన్ పూర్తిగా కోలుకోవడంతో ఇంగ్లీష్ జట్టుతో సిరీస్‌కు కివీస్ సెలక్టర్లు ఎంపిక చేశారు.
అదేవిధంగా బౌలింగ్ ఆల్‌రౌండర్ నాథన్ స్మిత్‌కు తొలిసారి కివీస్ టెస్టు జట్టులో చోటు దక్కింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతడికి అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. స్మిత్ 114 ఫస్ట్-క్లాస్ వికెట్లతో పాటు 1919 పరుగులు కూడా సాధించాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు.
అజాజ్ పటేల్, సోధి దూరం!
ఇక ఈ సిరీస్‌కు న్యూజిలాండ్ స్పిన్ ద్వయం అజాజ్ పటేల్, ఇష్ సోధిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. న్యూజిలాండ్‌లోని పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలిస్తాయి. దీంతో అక్కడి పరిస్థితులకు తగ్గట్టు ఐదుగురు ఫాస్ట్ బౌలర్లను సెలక్టర్లు ఎంపిక చేశారు.
జాకబ్ డఫీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. నవంబర్ 28 నుంచి క్రైస్ట్ చర్చ్ వేదికగా ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. కాగా భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను న్యూజిలాండ్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.
ఇంగ్లండ్ టెస్టులకు న్యూజిలాండ్ జట్టు
టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ (అన్ క్యాప్డ్), మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్క్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ , నాథన్ స్మిత్, టిమ్ సౌతీ, కేన్ విలియమ్సన్, విల్ యంగ్
చదవండి: IND vs AUS: ఆసీస్‌తో టెస్టు సిరీస్.. టీమిండియాకు మరో భారీ షాక్
Comments
Please login to add a commentAdd a comment