బ్యాడ్‌ లక్‌ అంటే కేన్‌ మామదే.. విచిత్రకర రీతిలో ఔట్‌! వీడియో | Kane Williamson Gets Out In Bizarre Fashion vs England | Sakshi
Sakshi News home page

NZ vs ENG: బ్యాడ్‌ లక్‌ అంటే కేన్‌ మామదే.. విచిత్రకర రీతిలో ఔట్‌! వీడియో

Published Sat, Dec 14 2024 6:39 PM | Last Updated on Sat, Dec 14 2024 7:17 PM

Kane Williamson Gets Out In Bizarre Fashion vs England

హామిల్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ను దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో విచిత్రకర రీతిలో విలియమ్సన్‌ తన వికెట్‌ను కోల్పోయాడు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌ ఆహ్హనించింది. ఈ క్రమంలో ఓపెనర్లు విల్ యంగ్‌, టామ్ లాథమ్‌ తొలి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అనంతరం యంగ్‌ ఔటయ్యాక విలియమ్సన్‌ ఫస్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు.

కేన్‌ మామ ఆచితూచి ఆడుతూ హాఫ్‌ సెంచరీకి చేరువయ్యాడు. సరిగ్గా ఇదే సమయంలో ఇంగ్లండ్‌ పేసర్‌ మాథ్యూ పోట్స్ బౌలింగ్‌లో విలియమ్సన్‌ ఊహించని విధంగా ఔటయ్యాడు.

ఏమి జరిగిందంటే?
కివీస్‌ ఇన్నింగ్స్‌ 59 ఓవర్‌ వేసిన పోట్స్‌ చివరి బంతిని విలియమ్సన్‌కు ఇన్‌స్వింగర్‌గా సంధించాడు. ఆ బంతిని కేన్‌ డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బౌన్స్‌ అయ్యి స్టంప్స్‌ వైపు వెళ్తుండగా.. విలియమ్సన్‌ కాలితో అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో కేన్‌ మామ అనుకోకుడా ఆ బంతిని స్టంప్స్‌పై కి నెట్టాడు. 

దీంతో స్టంప్స్‌ కిందపడిపోయి క్లీన్‌ బౌల్డ్‌గా విలియమ్సన్‌(44 పరుగులు) ఔటయ్యాడు. ఒక వేళ బంతిని విలియమ్సన్ కాలితో హిట్ చేయ‌కపోయింటే, అది స్టంప్‌ల మీదుగా బౌన్స్ అయ్యి ఉండే అవ‌కాశ‌ముంది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇక​ తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 9 వికెట్లకు 315 పరుగులు చేసింది

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement