క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి కేవలం 155 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులో డార్లీ మిచెల్(31 బ్యాటింగ్), నాథన్ స్మిత్(1) ఉన్నారు.
కివీస్ ప్రస్తుతం 4 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. డార్లీ మిచెల్ ఏదైనా అద్బుతం చేస్తే తప్ప కివీస్ ఇంగ్లండ్‌కు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించలేదు. న్యూజిలాండ్ బ్యాటర్లలో కేన్ విలియమ్సన్(64) మరోసారి హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్సే, క్రిస్ వోక్స్ తలా మూడు వికెట్లు సాధించారు.
అంతకుముందు అదేవిధంగా కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 499 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(171) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు కెప్టెన్ బెన్ స్టోక్స్(80), ఓలీ పోప్(77) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో ఇంగ్లండ్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో 151 పరుగుల ఆధిక్యం లభించింది.
చదవండి: IPL 2025: '23 ఏళ్లకే రూ. 40 కోట్లు సంపాదన.. అదే అతడిని దెబ్బతీసింది'
Comments
Please login to add a commentAdd a comment