
పాకిస్తాన్ క్రికెట్ జట్టు గత 18 నెలలగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. వన్డే ప్రపంచకప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో లీగ్ స్టేజీలోనే ఇంటిముఖం పట్టిన పాకిస్తాన్... ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ అదే తీరును కనబరిచింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన పాక్ జట్టు.. గ్రూపు స్టేజిలోనే తమ ప్రయాణాన్ని ముగించింది. దీంతో పాకిస్తాన్ జట్టుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ క్రమంలో టీ20 జట్టు నుంచి కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహీన్ షా అఫ్రిదిలను పీసీబీ సెలక్షన్ కమిటీ తప్పించింది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే గత ఏడాదిగా జట్టుగా దూరంగా ఉంటున్న ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్‌ను తీసుకొచ్చి ఏకంగా వైస్ కెప్టెన్సీ సెలక్టర్లు కట్టబెట్టారు. సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తప్పుబట్టాడు.
"పాక్ జట్టులోకి ఎప్పుడు ఎవరు తిరిగి వస్తారో తెలియదు. దేశవాళీ క్రికెట్‌లో షాదాబ్ ఖాన్ దారుణంగా విఫలమయ్యాడు. అతడిని తీసుకొచ్చి వైస్ కెప్టెన్‌గా చేశారు. మెరిట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోనప్పుడు జట్టు పరిస్థితి ఇలానే ఉంటుంది. ప్రస్తుతం టీ20 సెటాప్‌లో లేని వారిని కూడా తిరిగి ఎంపిక చేస్తున్నారు.
పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఈవెంట్‌కు పీసీబీ ప్రతినిధిని ఎందుకు ఆహ్వానించలేదనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. పాక్ క్రికెట్ ప్రస్తుతం ఐసీయూలో ఉంది. మేము బాగుచేయడానికి ముందుకు వస్తాము. కొత్త చైర్మన్ వచ్చిన వెంటనే, ప్రతిదీ మారుతుంది.
ప్రస్తుత క్రికెట్ బోర్డు ప్యానల్ మంచి జట్టును తయారు చేయడానికి సమయం కేటాయించడం లేదు. కెప్టెన్లు, కోచ్‌లను మార్చడంలో బీజీగా ఉంది. ప్రతీఒక్కరికి కొంతసమయమివ్వాలి. కోచ్‌లు తమ ఉద్యోగాలను కాపాడుకోవడానికి ఆటగాళ్లపై నిందిస్తారు. కాబట్టి అన్ని ఆలోచించాక ఏ నిర్ణయమైనా తీసుకోవాలని" అఫ్రిది పేర్కొన్నాడు.
చదవండి: #R Ashwin: ఛాంపియన్స్ ట్రోఫీ బెస్ట్ టీమ్.. రోహిత్ శర్మకు షాక్
Comments
Please login to add a commentAdd a comment