
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం ఆయా జట్లు ఒక్కొక్కటిగా పాకిస్తాన్‌కు చేరుకుంటున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు పాక్‌లో ఉండగా.. ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్ జట్లు శుక్రవారం అక్కడ అడుగుపెట్టే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా జట్టు మాత్రం ఆదివారం పాక్‌కు చేరుకునే అవకాశముంది.
మరోవైపు భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా ఆడనుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఈ నెల15న దుబాయ్‌లో అడుగుపెట్టనుంది. అదేవిధంగా భారత్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న బంగ్లాదేశ్ ఇప్పటికే దుబాయ్‌కు చేరుకుంది. ఫిబ్రవరి 20న బంగ్లా-భారత్ మధ్యఈ మ్యాచ్ జరగనుంది.
భద్రత్ పై డౌట్?
ఇక ఇది ఇలా ఉండగా.. పాకిస్తాన్ ఓ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వనుండడం 29 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఈ మెగా టోర్నీని విజయవంతంగా నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్‌బోర్డు భావిస్తోంది. అయితే తాజాగా కరాచీలో నకిలీ అక్రిడిటేషన్ కార్డుతో ఓ వ్యక్తి స్టేడియంలోకి చొరబడే యత్నం అక్కడి భద్రతపై సందేహాల్ని లేవనెత్తేలా చేసింది.
ఓ మీడియా ప్రతినిధిగా గుర్తింపు కార్డు, ఐసీసీ అక్రిడిటేషన్ కార్డులతో కరాచీ జాతీయ స్టేడియానికి వచ్చిన ఓ అపరిచితుడు... స్టేడియం ప్రధాన ద్వారం గుండా మైదానం లోపలికి ప్రవేశించే ప్రయత్నం చివరి నిమిషంలో భద్రతాధికారుల సమయస్ఫూర్తితో విఫలమైంది.
తదనంతర విచారణలో పాకిస్తాన్‌కు చెందిన ముజమ్మిల్ ఖురేషీగా గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి తదుపరి దర్యాప్తు చేపట్టారు. అతని వద్ద ఉన్న కెమెరామెన్, ఐసీసీ అక్రిడిటేషన్ కార్డులన్నీ నకిలీవని తమ పరిశీలనలో తేలిందని కరాచీ పోలీసులు తెలిపారు. పాక్‌లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు సన్నాహకంగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లు పాల్గొంటున్న ముక్కోణపు సిరీస్ సందర్భంగా ఈ ఉదంతం చోటుచేసుకుంది.
చదవండి: రంజీ సెమీఫైనల్ పోరుకు యశస్వి జైస్వాల్
Comments
Please login to add a commentAdd a comment