న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తన రీఎంట్రీలో సత్తా చాటాడు. క్రైస్ట్ చర్చ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ విలియమ్సన్ అద్బుత ప్రదర్శన చేశాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 93 పరుగులు చేసిన కేన్ మామ.. రెండో ఇన్నింగ్స్‌లో 61 పరుగులు చేశాడు. ఈ క్రమంలో విలియమ్సన్ టెస్టు క్రికెట్‌లో 9000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
కేన్ సాధించిన రికార్డులు ఇవే..
👉టెస్టుల్లో 9000 పరుగుల మార్క్‌ను దాటిన తొలి కివీ ఆటగాడిగా విలియమ్సన్ నిలిచాడు. ఇప్పటివరకు 103 టెస్టులు ఆడిన విలియమ్సన్.. 54.76 సగటుతో 9035* పరుగులు చేశాడు.
👉టెస్టు క్రికెట్‌లో అత్యంతవేగంగా 9000 పరుగుల మైలు రాయిని అందుకున్న మూడో క్రికెటర్‌గా యూనిస్ ఖాన్, కుమార్ సంగర్కర రికార్డును విలియమ్సన్ సమం చేశాడు. ఈ జాబితాలో ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్(99) తొలి స్ధానంలో ఉన్నాడు.
ఆ తర్వాత స్ధానంలో బ్రియన్ లారా(101 మ్యాచ్‌లు) కొనసాగుతున్నాడు. అదేవిధంగా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి(116 మ్యాచ్‌లు), జోరూట్(106)లు కంటే విలియమ్సన్ ముందున్నాడు.
చదవండి: IND vs AUS: టీమిండియాతో రెండు టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్
Comments
Please login to add a commentAdd a comment