టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ జట్టు చరిత్ర సృష్టించింది.టెస్టుల్లో 5 లక్షలు పరుగులు చేసిన తొలి జట్టుగా ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఈ అరుదైన ఘనత సాధించింది. క్రికెట్ పుట్టినిల్లుగా పేరొందిన ఇంగ్లండ్ జట్టు తమ తొలి టెస్టు మ్యాచ్ 1877లో ఆస్ట్రేలియాతో ఆడింది.
అప్పటినుంచి ఇప్పటివరకు 1082 టెస్టులు ఆడిన ఇంగ్లీష్ జట్టు 5 లక్షలకు పైగా పరుగులు చేసింది. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో ఇంగ్లండ్ తర్వాత స్ధానాల్లో ఆస్ట్రేలియా(4,28,794 ప్లస్ రన్స్), భారత్( 2,78,700 ప్లస్ రన్స్) వరుసగా ఉన్నాయి. అదేవిధంగా టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కూడా ఇంగ్లండ్ పేరిటే ఉంది. ఇప్పటి వరకు ఇంగ్లండ్ బ్యాటర్లు 929 సెంచరీలు చేశారు.
పట్టు బిగించిన ఇంగ్లండ్..
ఇక కివీస్‌తో రెండో టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించింది. రెండోరోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 378/5 స్కోరుతో ఉంది. దీంతో ఇంగ్లండ్ ప్రస్తుతం 533 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
క్రీజులో జో రూట్(73 బ్యాటింగ్), బెన్ స్టోక్స్(35 బ్యాటింగ్) ఉన్నారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ కేవలం 125 పరుగులకే ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 280 పరుగులు చేసింది. ఇక ఇప్పటికే తొలి టెస్టులో కివీస్‌ను ఇంగ్లండ్ చిత్తు చేసింది.
చదవండి: IND vs AUS:బుమ్రా మాస్టర్ మైండ్.. ట్రాప్‌లో చిక్కుకున్న స్మిత్! వీడియో
Comments
Please login to add a commentAdd a comment